Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ముప్పదియేడవ యధ్యాయము - ఉత్పాత వర్ణనము మార్కండేయ ఉవాచ : ఏతస్మిన్నేవ కాలేతు కాష్ఠోదర్కాస్సుదారుణాః | బభూవు స్సుమహోత్పాతాః సైంహికేయ నివేశ##నే ||
1 చచాల శబ్దం కుర్వాణా మహీ సవన కాననా | పపాత మహతీ చోల్కా మద్యే నాదిత్య మండలాత్ ||
2 అపర్వణి శశాంకార్కౌసంఛన్నౌ తమసా తథా | ప్రవృష్టాశ్చ తథా రక్తం భూరి మేఘా భయా వహమ్ ||
3 శస్త్రాణిముముచుః ధూమ మసకృ దశ్రువాహనాః | ఇంద్రచాప సవర్ణేన పరివేషేణ భాస్కరః |
| 4 పరివిష్ట ఉభే సంధ్యే చంద్రశ్చ సకలాం నిశమ్ | సైంహికేయో విపత్న్యో೭పి సాల్వస్య సుమహాత్మనః ||
5 ఆక్రమ్య జన్మనక్షత్రం కేతుస్తస్థౌ మహాగ్రహః | వవుః తీక్షాః మహావాతాః క్షోభయన్తో దిశోదశ ||
6 భాను శ్చాసీత్ కబంధాంకో మృగాశ్చాసన్ నస స్వనాః | న్యలీయన్త ధ్వజాగ్రేషు దానవానాం దురాత్మనామ్ ||
7 క్రవ్యాద పక్షి సంఘాతాః హ్యపసవ్యం భయానకాః | శుష్కేంధన సమృద్ధో೭పి న జజ్వాల హుతాశనః ||
8 వపూంషి దానవేంద్రాణాం నప్రాకాశన్త యాదవ ! ఉష్ణశీత విపర్యాసః ఋతూనా మప్యదృశ్యత ||
9 ప్రసుస్రువుః ద్రుమాః రక్తం వ్యశీర్యన్తచ భూషణాః | ఖరా గోషు వ్యజాయన్త మార్జారా మూషికాసు చ || 10 అకాలే పుష్పితా వృక్షాః ఆకాలే ఫలితా ద్రుమాః | వినా వర్షం మహానద్యః ప్రతీపం జగ్ము రోజసా || 11 భయానకాన్ జాత భయః సుఘోరానుత్పాత సంఘాన్ప్రసమీక్ష్య రాజా | సాల్వస్సమాహుయ భృగోస్తనూజం దైత్యై స్సమేతో೭థ చకార మంత్రమ్ || 12 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఔత్పాతికం నామ సప్తత్రింశత్తమో೭ధ్యాయః మార్కండేయుడనియె : సైంహికేయగృహమందతి దారుణములైన కాష్ఠోయుత్పాతము లిదేసమయమందు గోచరించినవి (దర్కాః=దిక్కులందు గోచరించిన) వనములతో (తోపులు) కాననములతో కారడవులతో గూడిన భూమి పెటపెట ధ్వనిసేయుచు గంపించెను. ఆదిత్యమండలము నుండి పెద్ద కొఱవిపడెను. పూర్ణిమ అమావాస్యలందేకాక యితర సమయములందును సూర్య చంద్రుల చీకటులలుముకొనెను. మేఘములు భయంకరమగు రక్తమును ధారాపాతముగ వర్షించెను. శస్త్రములు పొగను జిమ్మెను. గుఱ్ఱములు (వాహములు) నిరంతరము కన్నీళ్ళుగార్చినవి. సూర్యడింద్రధనుస్సుంబోలిన పరివేషముచే నుభయసంధ్యలందు జుట్టు కొనెను. సూర్యుని జుట్టు గుడికట్టెనన్నమాట. చంద్రుడు రేయెల్ల పరివేషావృతుండయ్యెను. అప్పుడు రాజైయున్న సాల్వుని జన్మ నక్షత్రమును సింహికా తనయుడగు సవతికొడుకయ్యు రాహువును కేతువు నతిక్రిమించి యుండెను. పదిదెసలను క్షోభింపజేయుచు తీక్షణములైన పెనుగాలులు వీచెను. సూర్యునందు మొండెముల గుర్తులు గోచరించెను మృగములు దుస్స్వనముల జేసెను. రాక్షసుల టెక్కెములందు క్రూరజంతువులు పక్షులు నపసవ్యముగ నెగిరి క్రమ్ముకొన్నవి. ఎండుకట్టెలు సమృద్ధముగ నున్నను యగ్ని జ్వలింపదయ్యెను. దానవపతుల శరీరములు ప్రకాశహీనములయ్యెను. ఋతువుల చలువవేడి స్వభావము తారుమారయ్యెను చెట్ల నుండి రక్తము స్రవించెను. భూషణములు తెగవిడిపోయినవి. గోవులకు గాడిదలు, ఎలుకలకు పిల్లులు పుట్టెను. చెట్లకాలమున పుష్పించెను. ఫలించెను. వర్షములేకయే నదు లెదురుగ పారినవి సాల్వరాజా విపరీతములు భయంకరములయిన యుత్పాతములం జూచి శుక్రాచార్యుల రావించి దైత్యులతో గూడియు నాలోచనమొనరించెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ఉత్పాతవర్ణనమను ముప్పదియేడవ యధ్యాయము.