Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ముప్పది తొమ్మిదవ యధ్యాయము - స్వప్నాధ్యాయము

మార్కండేయ ఉవాచ :

ఏవముక్త్వాగతే శుక్రే గవిష్ఠోవాక్య మబ్రవీత్‌ | రాజ& ! శుక్రస్యవచనం క్రియతా మవిచారయ& || 1

స్వప్నాహి సుమహాఘోరా దృశ్యన్తే భయవర్ధనాః | భవతాం హి వినాశాయ రాత్ర్యన్తే సతతం విభో ! 2

భవా& స్వప్నే మయాదృష్టో రక్తస్రగనులేపనః | ఉష్ట్రేణ శిశుమారేణ వరాహేణ తథా వ్రజ& ! 3

తైలాక్తా శ్చాపరే దైత్యాః ఖరయాన ముపాశ్రితాః | పతన్తః పర్వతాదృష్టా రాజ&! తే భయకారణమ్‌ || 4

కేచిత్‌ కృష్ణాంబరధరాః కేచిత్‌ కృసర భోజినః | కేచిత్‌ పంకగతా దృష్టాః కేచిత్‌ భస్మశయా గతాః || 5

కేచిత్‌ వివస్త్రయా నార్యా కృష్యన్తే దక్షిణాం దిశమ్‌ | కాచిద్రక్తాంబరా నారీ నీయతే దక్షీణాం దిశమ్‌ || 6

కేచిన్నృత్యన్తి భూపాలాః హసన్తిచ తథాపరే | కేచిన్ముండాః మయా దృష్టా కేచిత్‌ కాషాయ వాససః || 7

చండాల స్కంధగాః కేచిత్‌ కేచిత్‌ కింశుక సంస్థితాః | గజాశ్వపత్తిసై న్యేన సర్వేణచ భవా& యుతః || 8

వాపీం సుకలుషాం ప్రాప్యనిమగ్నో గోమయే హ్రదే | రాజశ్రీశ్చ మయా దృష్టా శక్రాలింగన తత్పరా || 9

తస్యమే రోచతే సంధిస్తవ శ##క్రేణ పార్థివ ! | ప్రాణా& రక్షత ! భో రాజ& ! జీవ& భద్రాణ్యుపాశ్నుతే || 10

సాల్వ ఉవాచ :

యదైవ భగవా& విష్ణుః శ్రుత శ్శత్రుర్మయానఘ! |

తత్రైవ దేవ ! తచ్ఛ్రుత్వా రాజ్యం త్యక్తం తథా మయా || 11

ఇష్టం యజ్ఞై స్తపస్తప్తం రాజ్య కృత మకంటకమ్‌ | మూర్ధ్నిస్థిత మమిత్రాణాం సుహృదః పరిపాలితాః || 12

ధృతో భృత్యజన స్సర్వః కృత కృత్యా స్తతో వయమ్‌ |

గోవిందా న్మరణం ప్రాప్య భూయోరాజ్యం భవిష్యతి || 13

మార్కండేయ ఉవాచ :

ఇత్యేవ వాక్యంతు నిశమ్య రాజ్ఞో మేనే తదాయుక్తతమం గవిష్ఠః |

తూష్ణీం బభూవాథ సునిశ్చతాత్మా మేనే చ దైత్యా& సమరేవినష్టా& || 14

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే స్వప్నాధ్యాయో నామ ఏకోనచత్వారింశత్తమోధ్యాయః

మార్కండేయుడనియె : శుక్రుడు ఇట్లుపలికి చనగా గవిష్ఠుడనియె. ''రాజా! శుక్రుని మాట మరి విమర్శించకుండా కావింపుము. ఘోరమైన స్వప్నములు భయంకరములై కనిపించుచున్నవి. ఇవి వేకువ వేళ అగుటచే మీయొక్క వినాశము త్వరలో నున్నట్లు తెలియుచున్నది. నీవు ఎర్రని పూలమాలలను ధరించి గంధము పూపికొని ఒంటెమీద, మొసలిమీద, పందిమీద నెక్కి వెళ్లుచుంటివి. మరియు దైత్యులు నూనె పూసుకొని గాడిదల నెక్కినట్లు పర్వతములు క్రిందకు పడునట్లు కనిపించినవి. ఇది నీకు భయమును సూచించుచున్నది. కొందరు నల్లని వస్త్రములు ధరించిరి. కొందరు బురదలో కొందరు బూడిదలో దించుకొని పోయిరి. కొందరు దిగంబర స్త్రీచే దక్షిణ దిశకు ఈడవబడుచున్నారు. ఎర్రని చీర కట్టుకొనిన ఒక యాడుది యమదిశకు గొంపోవుబడుచున్నది. కొందరు రాజులు గంతులు వేయుచు, కొందరు నవ్వుచు కనిపించిరి. కొందరు తలబోడులు కొందరు కాషాయ ధారులు. చండాలుర మూపునకెక్కినవారు కొందరు. మోదుగ చెట్లపైనున్నారు కొందరు. చతురంగ సైన్యముతో నీవు. ఆవుపేడతో నిండిన మడుగున కల్మషమైన నూతిలో మునిగినట్లు కనిపించినావు. నీ రాజ్యలక్ష్మి ఇంద్రుని కౌగలించుకొనుచు కనపడినది. కావున ఇంద్రునితో నీవు సంధిచేసుకొనుట నా అభిమతము. ప్రాణములను రక్షించుకొనుడు. బ్రతికియుండిన భద్రములను బడయవచ్చును.

అనవిని సాల్వుడిట్లనియె. భగవంతుడు విష్ణువు శత్రువని వినిబడిన ఆ క్షణమే నేను రాజ్యమును వదలుకొంటిని. యజ్ఞము లెన్నో చేసితిని. తపస్సు చేసితిని. నిష్కంటకముగా రాజ్యమేలితిని. శత్రువుల నడితల నిలచితిని. మిత్రులను పాలించితిని. భృత్యులను భరించితిని. గోవిందుని వలన మరణమొంది మేము కృతార్ధులమయ్యెదము. తిరిగి రాజ్య మదే రాగలదు. అన మార్కండేయుడిట్లనియె.

గవిష్ఠుడీ రాజుమాటను విని అదే బాగున్నదనుకొని దైత్యులు సమరమందు చచ్చినవారేయని నిశ్చయించి యూరకుండెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున స్వప్నాధ్యాయమను ముపై#్పతొమ్మిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters