Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నలుబదియవయధ్యాయము - సముద్ర మథనమందు లక్ష్మీ ప్రాదుర్భావము మార్కండేయ ఉవాచ : ఏతస్మిన్నేవ కాలేతు సాల్వస్యచ మహాత్మనః | శీర్షమాత్రావశిష్టస్తు దదృశే చాగ్రజస్యచ ||1 రాహురిత్యేవ విఖ్యాతః పూజయామాస తం నృపః | యథార్హం పూజితో రాజ్ఞా నిషణ్ణో వాక్య మబ్రవీత్ ||
2 రాహు రువాచ : నహిమే రోచతేవైరం విష్ణునా ప్రభవిష్ణునా | యస్య క్రోధా దనంగో೭హంజాతః పరబలార్దనః ||
3 ప్రసాదాచ్చ తథా యస్య గ్రహత్వముపలబ్ధవాన్ | కిమన్యైఃకీర్తితై స్తస్యకర్మభిస్తే೭సురాత్మజ ! 4 సాల్వ ఉవాచ : భగవన్ ! శ్రోతు మిచ్ఛామి కథం తేన మహాత్మనా | అనంగస్త్వం కృతో వీర ! గ్రహేశ శ్చ కథంకృతః ||
5 రాహు రువాచ : అమరత్వ మభీప్సంతః పురా దేవా స్సవాసవాః | సర్వేసమేత్యవరదం కేశవం శరణంగతాః || 6 దేవ ఊచు: భగవన్ ! దేవదేవేశ ! జగతా మార్తి నాశన ! నిర్విశేషా వయం మర్త్యై స్త్రాతా తత్రా೭స్తునో భవాన్ || 7 శ్రీ భగవానువాచ : క్షీరోద మథనే యత్నం త్రిదశాః కర్తు మర్హథ ! దానవైస్సహితా భూత్వా తతశ్శ్రేయో೭ప్యవాప్స్యథ ! 8 రాహు రువాచ : ఏవముక్తాస్సురా స్సర్వే దేవ దేవేన శాఙ్గి& ణా ! దానవై స్సహితా భూత్వా మమంథు ద్వరుణాలయమ్ || 9 సాహాయ్య మకరో త్తేషాం తత్ర కర్మణి పార్థివ ! వినా విష్ణుసహాయేన న శక్తా స్ససురాసరాః || 10 అనంత స్సతతో భూత్వా చాంశ స్సంకర్షణస్య చ | ఉత్పాట్య మందరం దోర్భ్యాం చిక్షేప పయసాంనిధౌ || 11 అకూపారే తతో భూత్వా కూర్మ రూపీ జనార్దనః | మందరం ధారయామాస క్షీరాబ్ధి గత మంజసా || 12 స్వేనైవ తేజసా నాగం తథా సంయోజ్య వాసుకిమ్ | చక్రే స నేత్రతాం తత్ర తత్ర కర్మణి దానవ ! 13 తతో మమంథుః సహసా సముద్రం దేవ దానవాః | యతో ముఖం తతో దైత్యాః యతః పుచ్ఛం తతస్సురాః || వాసుకేరభవన్దైత్యా మధ్యమానే మహోదధౌ | ముఖంచ నాగరాజస్య కరేణ ధృతవాన్ స్వయమ్ || 15 ఆకాశాభిముఖం కృత్వా దేవదేవో జనార్ధనః | ముఖే నిశ్వాస వాతేన సవిషేణ హి భూపతే !16 అన్యథా దైత్య సంఘానాం వినాశ మభవిష్యత | హిమాచలాభాః కల్లోలాః క్షీరాబ్ధేః గగన స్పృశః || 17 ఉత్పేతు ర్మథ్యమానస్య బలిభిర్దేవ దానవైః || 18 శృంగాణి నిపతన్తి స్మ మందరస్య మహోదధౌ | రత్నచిత్రాణి రమ్యాణి శతశో೭ధ సహస్రశః || 19 ద్రుమాశ్చ శతశః పేతు ర్మృగాః పేతు స్సహస్రశః | త్రైలోక్యం పూరయన్నాధై రరాస పయసాం నిధిః || 20 క్షీరకల్లోల వసనః శ్వేత మేఘ కృతాంశుకః | రాజతే మందరాద్రి స్స నానాధుతు విభూషితః || 21 చలన్ మేఘాంశుకో ఘూర్ణన్నత్యర్థం వాయుపూరితైః | గుహాముఖై స్సప్రణతం గిరిర్మత్తై రివార్ణవః || 22 నిర్ఝరాశ్రు ర్మహానాదః శృంగోచ్ఛ్రిత మహాభుజః | అనిశం స గిరిశ్రేష్ఠః స్థాన హాన్యేవ రోదితి || 23 దేవోపఖోగ్యాన్ సకలాన్ మహాంత ఇతి చింతయన్ | వాద్యత్సుదేవవాద్యేషు నృత్యతీవ సమందరః || 24 మార్కండేయుడనియె. ఇదే సమయమందు సాల్వునకు అన్న యొక్క తల మాత్రమే మిగిలిన మొండెము కనిపించెను, రాహువను పేరనది ప్రసిద్ధిమైనది. దానిని రాజు పూజించెను. రాహువనియె సర్వప్రభువైన విష్ణునితో నాకు వైరమిష్టముగాదు. ఆయన కోపము చేతనే శత్రుసైన్యమర్దనుడనైన నేను అంగహీనుడనైతిని. ఆయన దయచేతనే నేను గ్రహము కూడనైతిని. ఇక నా మరిలీలను మఱియేమి వర్ణింపవలయును. అన సాల్వుడు స్వామీ! ఆ మహాత్మునిచే నీ వంగహీనుడ వెట్లయితివో గ్రహాధిపతివెట్లయితివో వినగోరెదనన రాహువిట్లవియె. మున్నింద్రాది దేవతలమరులముగావలెనని కేశవునిట్లు స్తుతించి శరణొందిరి. భగవంతుడా ! దేవ దేవేశ్వరా ! మర్త్యులకంటె (మరణబీలురైన నరులకంటె) మేమీవిషయమున అతిశయము గలవారముగాము. కావున నీవు మాకు రక్షకుడవుగావలెనన శ్రీ విష్ణువు. పాలసముద్రమథన ప్రయత్నము సేయుడు. దానవులను గూడ యందు గూడగట్టుకొనుడు. దాన మీరు శ్రేయస్సునందగలరనియె. దేవతలిది విని దానవులతోగూడి సముద్రము మధించిరి. ఆ తఱచుటలోను విష్ణు సహాయము లేనిచో సురాసురులకది శక్యముగానిపని. గావున ఆ హరి సంకర్షణునియంశ##మైన యనంతుడై మందర పర్వతముం బాహువుల బెల్లగించి పయోధిలో బడవైచెను. ఆపైని గూడ కూర్మావతారుడై యా క్షీరసాగరమందురిగబడుచున్న నుందరగిరిని పైకెత్తెను. తన తేజస్సుతో వాసుకి మహానాగమును తఱి త్రాడుగా గూర్చెను. అటుపై మహావేగమున దేవదానవులు సముద్రమును దఱచిరి. వాసుకి ముఖము వైపున సమురుల తోకవైపు సురలు పట్టిరి. హరిచేతితో వాసుకి ముఖమువాలకుండనాకాశాభిముఖముగా బట్టుకొనెను. ఆ సర్పరాజుముఖనిశ్శ్సాసవిషవాయువుచేదైత్యులకునాశముగుననియేహరిఅట్లుచేసెను ఆతఱచు సమయమున మందగిరిశిఖరములు రమ్యములు రత్న విచిత్రములై నవిసాగరమునబడిపోయెను. చెట్లువందలకొలదిమృగములు వేలకొలదియందుగూలెను. పయోధి నాదముచేముల్లోకములం బూరించుచు రాజిల్లెను. మందరగిరి పాలతరంగము లంబరములుగా తెల్లనిమేఘములుపైవలువగా నానాధాతు విభూషితుడై దీపించెను. మేఘములే యంశుకములుగా వాయుపూరితములైన కెరటములచే గుహాముఖముల హోరుమని మిక్కిలిగ ఘూర్ణెల్లెను కొండవాగు లశ్రువులుగా మహాధ్వనితో శిఖరములపేర బాహువులు పైకెత్తి యా గిరివరము స్టానహానికట్లు రోదించుచున్నట్లుండెను. సాగర మందలి దేవతోపభోగ్యములయిన పదార్థములు గొప్పక దేవతలు మంగళవాద్యములను మ్రోయించుచుండ నా పర్వతము నృత్యము పేయుచున్నదా యన్నట్లుండెను. ఏవం హి మథ్యమానస్య క్షీరాబ్ధేః సుమహాత్మనః | ప్రాదూర్భూతం విషం ఘోరం కాలానల సమప్రభమ్ || 25 యేన ప్రోద్భూత మాత్రేణ విషణ్ణా దేవ దానవాః | తత్ పపౌ భగవాన్ శంభుః త్రైలోక్యహిత కామ్యయా || 26 విషే కంఠ మనుప్రాప్తే నీలకంఠత్వ మాగతః | ధారయామాస తత్ కంఠే శోభార్థం సురవారితః || 27 తతశ్చంద్ర కలాజాతా త్రైలోక్య సై#్యవ సుందరీ | జటాజూటేన తాం చక్రే దేవదేవో మహాశ్వరః || 28 కశ్మి జ్వాలా వలీ పుంజ విభాసిత జగత్త్రయమ్ | వైడూర్య కౌస్తుభం జాతం యం బభార హృదా హరిః || 29 వాతరంహో మహాకాయ శ్శశాంక సదృశ చ్ఛవిః | ఉచ్చైః శ్రవాహయోజాత స్సచ దేవానువాశ్రితః || 30 తత స్సురా సముత్పన్నా సాచ పీతా మహాసురైః | తతస్త్వప్సరసో జాతాః దేవరామా మనోరమాః || 31 దేవీ లక్ష్మీస్తతో జాతా రూపేణా೭ప్రతి మా శుభా || 32 యస్యా శ్శుభౌ తామరస ప్రకాశౌ పాదాంబుజౌ స్పృష్టతలాంగుళీకౌ | జంఘే శుభే రోమ వివర్జితే చ గూఢాస్థికం జానుయుగం సురమ్యమ్ || 33 సువర్ణదండ ప్రతిమౌ తథోరూ చాభోగ రమ్యం జఘనం ఘనంచ | మధ్యం సువృత్తం కులిశోదరాభం వళిత్రయం చారుశుభం దధానమ్ || 34 ఉత్తుంగ మాభోగి సమంవిశాలం స్తనద్వయం చారు సువర్ణ వర్ణమ్ | బాహూ సువృత్తా వతి కోమతౌచ కరద్వయం పద్మదళాగ్రకాన్తి || 35 కంఠశ్చ శంఖాగ్రనిభం సురమ్యం పృష్ఠంసమం చారు సిరా విహీనమ్ | కర్ణౌ శుభౌ చారు శుభ ప్రమాణౌ సంపూర్ణ చంద్రప్రతి మంచ వక్త్రమ్ | 36 కుందేందు తుల్యా దశనాస్త థోష్ఠౌ ప్రవాళకానాం ప్రతిపక్షభూతౌ | స్పష్టా చ నాసా చిబుకంచరమ్యం కపోల యుగ్మం శశితుల్య కాంతి || 37 ఉన్నిద్ర నీలోత్పల సన్నికాశం త్రివర్ణ మాకర్ణిక మక్షియుగ్మమ్ | శిరోరుహాః కుంచిత నీల దీర్ఘాః పీణవ వాణీ మథురా శుభాచ || 38 వస్త్రె సుసూక్ష్మే విమలే దధానా చంద్రాంశు తుత్యే೭తి మనో೭భిరామే | శ్రోత్ర ద్వయేనా ప్యథ కుండలేచ సంతానకానాం శిరసాచ మాలామ్ || 39 గంగా ప్రవాహ ప్రతిమంచ హారం కంఠేన శుభ్రం దధతీ సువృత్తమ్ | తథాంగదౌ రత్న సహస్ర చిత్రౌ హంస స్వనౌ చా ప్యథ నూపురౌ చ || 40 కరేణ పద్మం భ్రమరోపగీతం వైడూర్య నాళంచ శుభం గృహీత్వా | స్వరూప మూఢేషు సురాసురేషు దృష్టిం దదౌ చారు మనో೭భిరామా || 41 పా దేవ సంఘా నసురాంశ్చ దృష్ట్వా దదర్శ దేవం జగతాం ప్రధానమ్ | దేవా సురేభ్యస్త్వతిరిక్త రూపం సూర్యాయుతాభం భువనేష్వజేయమ్ || 42 ఉన్నిద్ర నీలనలిన ద్యుతి చారువర్ణం సంతప్తహాటక నిభేవసనే వసానమ్ | దృషై#్వవ జాత పులకోద్గమ మాత్ర కంపా క్షీరాబ్ధితా మదనబాణవశంజగామ || 43 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సముద్ర మథనే లక్ష్మీసముద్భవోనామ చత్వారింశత్తమో೭ధ్యాయః ఇట్లు మధింపబడిన పాల్కడలినుండి ఘోరమయిన కాలాగ్ని సమప్రభమయి విషము పుట్టెను. అది పుట్టినంతనే దేవదానవులు విషాదగ్రస్తులయిరి. జగత్త్రయహిత మొనరింప శంభుడు దానింద్రావెను. ఆ కాలకూటము కంఠమున దిగగానే యాస్వామి కాలకంఠుడయ్యెను. (ఆ విషాగ్నికి గమిరిలియాయయ్య కంఠము నల్లబడినదన్నమాట) దేవతలది మ్రింగవలదని వారించినంత తన కుత్తుకంధరించెను. అది యొక్క వింతశోభ సమకూర్చెను. ఆ మీద చంద్రరేఖ త్రిలోకసుందరి యుందయించెను. దానిని మహేశ్వరుడు తన జటాజూటమందు సంతరించుకొనెను. రశ్మిపుంజములచే ముల్లోకముల నుద్దీపింపజేయు వైడూర్యమయి కౌస్తుభ ముదయించెను. దాని హరి యురమునం గైసేసికొనెను. వాయువేగముగలది చంద్ర సమకాంతి మహాకాయమునైన యుచ్చైశ్రవమను గుఱ్ఱము జనించెను. అది దేవతల వశమయ్యెను. అవ్వల సుర(కల్లు) జనించెను. దాని సురలు ద్రావిరి. అటుమీద అప్సరసలు అను దేవతాసుందరు లుదయించిరి. అవ్వల అప్రతిమాన రూపవతి లక్ష్మీదేవి యవతరించెను. ఆమె పాదములు తామరపూల రంగుగలవి. అడుగుల వేళ్ళొకదానినొకటి యొత్తుకొనుచుండెను. నేలనాని యుండెను. (ఇది ఉత్తమ సాముద్రిక లక్షణము.) చక్కని పిక్కలు రోమరహితములు. మోకాళ్ళు గూఢాస్థికములై మిక్కిలి చక్కగనుండెను. (మోకాళ్ళ యెముకలు బయటపడక నిండుగ నున్నవన్నమాట) తొడలు నిండుదనమున సువర్ణదండములట్లుండెను. జఘనము (పిరిది భాగము) దృఢమును సువిశాలమునై యుండెను. నెన్నడుము వర్తులమై కులిశోదరమట్లు (ఇంద్రధనుస్సు నడిమి భాగమట్లు) విరసిల్లెను. స్తనద్వయమున్నతము నిండుదనమొంది సువిశాలమై సువర్ణ వర్ణమై యొప్పెను. బాహువులు మిగుల గుండ్రనై మిక్కిలి కోమలములనై యుండెనె. కర యుగము తామరరేకు తుది యెఱుపున శోభించెను. కంఠము శంఖములోలె నిండయి పరిపుష్టమై చెలువొందెను. వృష్ఠము సమమయి నరములు వెలివడక యింపుగొల్పుచుండెను. శుభలక్షణ ప్రమాణములయిన వీనులు సంపూర్ణ చంద్ర సమమయి నెమ్మోము మొల్ల మొగ్గలట్లు జాబిల్లి యట్లచ్చపుకాంతి నిచ్చు పలువరసయు పవడములకు బ్రతిపక్షములయిన పెదవులు కోటేసినట్టి ముకకు చక్కని చిబుకము (గడ్డము) చంద్రకాంతి గులుకు నిఱుచెక్కిల్లు, చక్కగ వికసించిన నల్లగలువలంబోలి ఎఱుపు తెలుపులం గలిసి మువ్వన్నెల గులుకుచు చెవిదాకన కనుగవయు, వంకరనై నల్లనై దీర్ఘములలైన శిరోరుహములు వీణవలె మధురము శోభదమునైన వాణి యుంగలిగి, చంద్రకాంతి గొని అతి మనోహరములయిన అచ్చపుజిలుగు దువ్వలువలు దాల్చి, వీనులందు స్వర్ణ మహాకుండలములు మెఱయ కల్పసుమమాలం దలదాల్చి గంగాప్రవాహమట్లు వర్తులమైన హారముం గంఠమునందు గైసేసి సహస్ర రత్న స్థిగితములైన బాజుబందులును హంసధ్వనించు నందెలుందాల్చి తుమ్మెదలు రొదసేయు వైడూర్యమణి మయనాళముగల పద్మమును గరమ్మున గైకొని యతి మనోభిరామయై తమ్ముదాముమరచిన సురాసురులవైపు చూపుం బ్రసరింపజేసెను. ఆ యింతి దేవదానవులం జగత్ప్రధానుడైన దేవుని (హరిని) దర్శించెను. అమ్మమహామహుడు దేవతలకంటె అసరులకంటె నతి శయించిన రూపుగొని పది వేలమంది సూర్యులట్లు దీపించుచుభవనముల కజేయుడై వికచోత్పల వర్ణసవర్ణుడై పుటములెట్టిన బంగారము తళుకు గులుకు వలువయుం బైవలువలయుం దాల్చియున్న పరమసుందరుం జూచినదే తడవుగ నొడలు పులకించి కంపించి యా సుందరి క్షీరాబ్ధి కన్య మదనబాణ వశంవదయయ్యెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున సముద్రమధనమందు లక్ష్మీప్రాదుర్భావము అను నలుబదియవయధ్యాయము.