Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నలుబది ఒటవ యధ్యాయము - లక్ష్మీ స్థాన నిరూపణము రాహు రువాచ : సా కామబాణాభిహతా సమీక్ష్య మధుసూదనమ్ | స్వయం వృతవతీ నాథం భర్తార మపరాజితమ్ ||
1 ప్రకృతి స్సా వినిర్దిష్టా పురుషః పురుషోత్తమః | తయా వియుజ్యేతే నా೭సౌ కదా చి ద పి శత్రుహా ||
2 శంకరః పురుషః ప్రోక్తః ప్రకృతిః పార్వతీ స్మృతా | పురుషః పాకహా ప్రోక్తః ప్రకృతిశ్చ తథా శచీ || 3 హుతాశన శ్చపురుషః స్వాహాచ ప్రకృతి స్స్మృతా | యమశ్చ పురుషః ప్రోక్తో ధూమ్రోర్ణా ప్రకృతి స్స్మృతా ||
4 విరూపాక్ష శ్చ పురుషః ప్రకృతి ర్నిరృతి స్స్మృతా | వరుణః పురుషః ప్రోక్తో గౌరీచ స్తథా ||
5 వాయుశ్చ పురుషోజ్ఞేయః ప్రకృతిశ్చ తథా శివా | పురుషశ్చ ధర్మో వృక్షః తద్విశ్వ ప్రకృతిః స్మృతా |
6 చంద్ర మా పురుషః ప్రోక్తో జ్యోత్స్నా చ ప్రకృతి స్తథా || ధర్మశ్చ పురుషః పోక్తః ప్రకృతిశ్చ కరీషిణీ || యజ్ఞశ్చ పురుషః ప్రోక్తో దక్షిణా ప్రకృతి స్తథా | దివసః పురుషఃప్రోక్తః ప్రకృతిశ్చ తథా నిశా |
8 ఆకాశః పురుషః ప్రోక్తో ప్రకృతిశ్చ తథా మహీ | ఓంకారః పురుషః ప్రోక్త స్సావిత్రీ ప్రకృతిః స్మృతా ||
9 ప్రకృతి స్సా శుభాలక్ష్మీః విష్ణుః పురుష ఉచ్యతే | సా సదేహా విదేహా సా సగుణా నిర్గుణా చ సా ||
10 తయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరా చరమ్ | సా కాన్తి స్సా ధృతిస్సా శ్రీస్సా ప్రభాచ సనాతనీ ||
11 సానిద్రా సా శుభా వాణీ సాచదేవీ సరస్వతీ | రతిః ప్రీతిః క్షితిః ద్యౌశ్చ సా గంగా సా సరస్వతీ ||
12 తుష్టిః పుష్టి ర్వపుః ప్రజ్ఞా స్వధా మేధా సరన్వతీ | సై వనద్యః శుభా సర్వాః సైవదేవీ వవస్పతీ ||
13 సావాస్తు దేవతా దీక్షా సా శక్తి ర్వైష్ణవీ స్మృతా | బుద్ధి ర్లజ్జా ధృతి శ్శాన్తిః సుధాశోభా జయా త్విరా || 14 సినీవాలీ కుహూ రాకా త్వేవం చానుమతి శ్శుభా | కాత్యాయనీ భద్రకాళీ సుప్రభా విజయా తధా || 15 అదితిర్దితిః దనుః కాలా స్నాయుః సింహికామునిః | కద్రూః క్రోధా త్విరా ప్రావా వినతా సురభిః ఖగా || 16 కీర్తి ర్లక్ష్మీ ర్ధృతి ర్మేథా క్షమా శ్రద్ధా క్రియా రతిః | అనసూయా సతీ భూతిః విభూతి ర్వారుణీ తథా || 17 ఆరుంధతీ వసుర్జామీ లోభా భాను రరుంధతీ సంకల్పా చ ముహూర్తాచ సాధ్యా విశ్వా తథైవచ | 18 మృగా చ మృగమందాచ హరిభద్రా యువా త్విడా | భూతాచ కపిలా దంష్ట్రీ సురమా సరమా తథా | 19 రాజశ్రీః భూమి పాలానాం బ్రహ్మశ్రీ స్తద్విదాం శుభా | పుష్పశ్రీః కాననా నాం సా జయశ్రీర్జయినాం రణ || 20 స్వర్గశ్రీః స్వర్గతానాం సా దీక్షాసాయజ్ఞ యాజినామ్ | బుద్ధి ర్బుద్ధి మతాం దేవీ క్షమా దేవీ క్షమావతామ్ || 21 శిఖా వహ్నౌ ప్రభా సూర్యే జ్యోత్స్నా చంద్రే ప్రకీర్తితా | కాన్తిస్తారా గణస్యోక్తా సా సిద్ధిః సర్వకర్మణామ్ || 22 సహస్ర నేత్రజా దృష్టిః సహస్ర నయనస్య సా | ఉపత్యకా పర్వతానాం ఫలశ్రీః సా చ శాఖినామ్ || 23 మహోదధేశ్చ సా వేలా నక్షత్రాణాంచ కృత్తికా | ధనుర్లతాచ మంత్రాణాం హేతీనాం నాప్యసేర్లతా || 24 గాంధారీ సర్వవిద్యానాం వృష్టి స్సా జగతీ తలే | కర్షకాణాం తథా సీతా సస్యశోభా మహీతలే 25 మదలేఖచ నాగానాం భోగినాం చ ఫణావళీ | రత్నావళీ చ శేషస్య ధృతి ర్భూమండలస్య సా || 26 సాస్థితా సతతం చంద్రే బిల్వే నీలోత్పలే వృషే | కుంజరే తురగే సింహే ఖడ్గేచ విమలే శుభే || 27 చామరే వ్యజనే ఛత్రే భృంగారే గోమయే వనే | సహస్రకిరణ సూర్యే శ##క్రే వైశ్రవణయమే || 28 కమలే రజతే హేమ్ని శంఖే భద్రాసనే శుభే | గోమూత్రే సర్పిషి క్షిరే దధ్ని క్షీర ఫలేషు చ || 29 వరుణ చ జలాధ్యక్షే సముద్రేషు జలేషు చ | కుసుమేషు చ శుక్లేషు ప్రాసాదేషు సితేషు చ || 30 హుతాశ##నే ప్రజ్వలితే పార్థివే చారు శోఖితే | రత్నేషు చ విచిత్రేషు తథైవా೭೭మల కేషుచ ||31 యథా వ్యాప్తం జగ త్సర్వం దేవదేవేన శార్గిణా | తథావ్యాప్తం జగత్సర్వం రాజన్ ! క్షీరాబ్ధి కన్యయా || 32 రాహువనియె : కామబాణవశ##యై యాలక్ష్మి మధుసూదరునిల గని ఎదురులేని యా స్వామిని దన స్వామింగా వరించెను. ఆ శ్రీదేవి ప్రకృతి=చిచ్ఛక్తి పురుషోత్తముడు (విష్ణువు) పురుషుడు (ఆత్మ, చిత్తు) ఆమెతో నెన్నడు నీ మరి యెడబడడు. వారి యవినాభావ సంబంధమట్టిది. శంకరుడు పురుషుడు పార్వతి ప్రకృతి, ఇంద్రుడు-శచి, అగ్ని-స్వాహాదేవి, యముడు-ధూమ్రోర్ణ, విరూపాక్షుడు-నిరృతి, వరుణుడు-గౌరి, వాయువు-శివ, ధర్మవృక్షము-విశ్వప్రకృతి, చంద్రుడు-జ్యోత్స్న (వెన్నెల), ధర్మడు-కరీషిణి, యజ్ఞము-దక్షిణ, దివసము-నిశ, ఆకాశము-మహి, ఓంకారము-సావిత్రి, విష్ణువు-లక్ష్మి, ఆమె సదేహ, విధేహ, సగుణ, నిర్గుణ ఈ విధముగ నీ చరాచర ప్రపంచమా ప్రకృతిచే వ్యాప్తమై యున్నది. ఆమెయే కాంతి ధృతి (ధైర్యము) శ్రీ ప్రభ (సనాతని) నిద్ర వాణి (శుభ) సరస్వతీదేవి. ప్రీతి క్షితి ద్యౌఃదివి=ఆకాశము గంగ సరస్వతీనది తుష్టి పుష్టి వపువు (శరీరము) ప్రజ్ఞ స్వధ మేధ సరస్వతి సర్వనదులు వనస్పతి వాస్తుదేవత దీక్ష వైష్ణవి శక్తి బుద్ధి లజ్జ ధృతి శాంతి సుధ శోభ జపయ ఇరా సినీవాలి కుహు చంద్రకళకానవచ్చెడి అమవాస్య. చంద్రకళకానరాని అమవాస్య రాక, (పూర్ణిమ) అనుమితి కాత్యాయిని భద్రకాళి సుప్రభ విజయ కశ్యపుని భార్యలగు అదితి దితి దనువు కాల, స్నాయువు, సింహిక, ముని, కద్రువు, క్రోధ, ఇర (కశ్యపుని యొకభార్య వృక్షలతాతృణ జాతింగన్నది) ప్రావ వినత సురభి ఖగ కీర్తి లక్ష్మీ ధృత మేధ క్షమ శ్రద్ధ క్రియ రతి అనుసూయ సతి భూతి విభూతి వారుణి అరుంధతి వసువు జామి లోభ భానువు అరుంధతి సంకల్ప ముహూర్త సాధ్య విశ్వ మృగ మృగమంద హరిభద్ర యువ ఇడ భూత కపిల దంష్ట్రి సరమ సురమ రాజుల రాజ్యలక్ష్మి బ్రహ్మవేత్తల బ్రహ్మశ్రీ కాననముల కామె పుష్పశ్రీ జయశీలురకూ యుద్ధమందు జయశ్రీ స్వర్గవాసులకు స్వర్గశ్రీ యజ్ఞకర్తలకు దీక్ష బుద్ధిమంతులకు బుద్ధి క్షమావంతులకు క్షమ(ఓరిమి) అగ్ని యందు శిఖ(జ్వాల) సూర్యునియందు ప్రభ చంద్రునందు జ్యోత్స్న తారాగణమునకు (నక్షత్ర పుంజమునకు) కాంతి. సర్వకర్మములకు సిద్ధి సహస్ర నయనునికి (ఇంద్రునికి) సహస్ర నయనములనుండి ప్రసరించు దృష్టి యామెయే. పర్వతములకు ఉపత్యక (పర్వతప్రాంత భూమి) వృక్షములకు ఫలశ్రీ మహాసముద్రమునకు వేల (చెలియలుగట్ట) నక్షత్రములకు కృత్తిక మంత్రములకు ధనుర్లత ఆయుధములకు ఖడ్గంత సర్వవిద్యలకు గాంధారి భూతలమందు వృష్టి (వర్షము) కర్షకులకు సీత(నాగలి చాలు) వసుంధర యందు సస్యశోభ ఏన్గులకు మదరేఖ భోగులకు (సర్పములకు) ఫణావళి (పడగల వరుస) శేషునికి రత్నావళి భూమండలమునకు ధృతి (ధారణశక్తి) ఆమె చంద్రునందు బిల్వమందు (మారేడునందు) నల్లగలువయందు వృషభమందు ఏన్గునందు గుఱ్ఱమునందు స్వచ్ఛమై శుభకరమైన ఖడ్గమునందు చామరమందు విసనకఱ్ఱయందు గొడుగునందు భృంగారమందు గోమయమందు వనమందు సహస్ర కిరణుడైన సూర్యునందు శక్రునందు (ఇంద్రునందు) వైశ్రవణునందు (కుబేరునందు) యమునియందు నామెయున్నది. కమలమందు వెండియందు బంగారమందు శంఖమందు భద్రాసనమునందు (సింహాసనమందు) గోమూత్రమందు నేతియందు పాలయందు పెరుగునందు పాలపండ్లయందు జలములకధినేతయయిన వరుణునియందు సముద్రములందు నీళ్ళలో తెల్లనిపువ్వులలో ప్రాసాదములయందు (సౌధములందు సున్నపు పూతచే తెల్లగనుండు మేడలందు) ప్రజ్వలించు నగ్ని యందు చక్కని శుభలక్షణములచే రాణించు రాజు నందు విచిత్రరత్నమువలన ఉసిరికాయలందు (ఆమలకములందు) జగత్తు అంతయు విష్ణువుచే వ్యాప్తమైనట్లు ప్రపంచమంతయు క్షీరాబ్ధికన్యచే వ్యాప్తమైనది. స్వాయం భువాస్తరే దేవీ భృగో స్సా దుహితా స్మృతా | స్వారోచిషే తథాజాతా సై వదేవీ హుతాశనాత్ || 33 ఔత్తమస్యాంతరే జాతా సలిలా ద్విమలా చ్ఛుభా | తామస స్యాంతరే రాజన్ ! భూతలా త్సా సముత్థితా || 34 బిల్వా త్సముత్థితా దేవీ రైవత స్యాంతరే తథా | ఉత్ఫుల్ల కమలోద్భూతా చాక్షుషే೭పి తథాంతరే || 35 వైవస్వతే೭న్తరే జాతా తథై వామృత మంథనాత్ | క్షీరాబ్ధి జాతాం తాం ప్రాప్య హృదయేన జనార్ధనః || 36 దధార దుర్ధరాందేవీం త్రైలోక్యే త మృతే ప్రభుమ్ | ఆదాయ సా೭మృతం శుద్ధం శుభ మర్క కమండలుమ్ || 37 ఏతస్మి న్నంతరేజాతో వైద్యో ధన్వంతరి స్తథా | అమృతే జాత మాత్రేతు దైత్య సంఘాః సమాకులాః || 38 ధన్వంతరి మథోన్మధ్య పరిభూయచ దేవతాః | అమృతం చ సమాదాయ జగ్ముర్దైత్యా నివేశనమ్ || 39 హృతా మృతాన్ దేవగణాన్ విపానానాశ్వాస్య దేవో భువనస్య గోప్తా | 40 స్థానే చ విన్యస్య గిరీంద్ర ముఖ్యం జగామ దేవో೭సురనాథ వేశ్మ || 41 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే మహా పురాణ-ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే అమృత మథనం నామ ఏకచత్వారింశత్తమో೭ధ్యాయః. స్వాయంభువమన్వంతరమం దాలక్ష్మీదేవి భృగుకన్య యయ్యెను (భార్గవియనం బేరొందెను. స్వారోచిషమన్వంతరమం దావిడ హుతాశనునినుండి (అగ్ని నుండి) యుదయించెను. ఔత్తమమన్వంతరమందు స్వచ్ఛమైన సలిలమునుండి యవతరించెను. తామసమన్వంతరమందామే భూతలమునుండి యుద్భవించినది. రైవత మన్వంతరమున బిల్వమునుండి, చాక్షుష మన్వంతరమున వికసించిన కమలమునుండి (వేయిరేకులుగల తామరపువ్వునుండి) ఆవిర్భవించినది. వైవస్వతమన్వంతరమందు అమృతమథనమున పాల్కడలినుండి యవతరించెను. క్షీరాబ్ధియందుదయించిన యామెను విష్ణువు హృదయముతో ముల్లోకములందాప్రభువుగాక ఇతరులకు దుర్ధర యగు (ధరింప వశముగాని) ఆ దేవిని ధరించెను. ఆమె ఈలోన సుధాపూర్ణమైన అర్కకమండలువుంగొనెను. వైద్యశేఖరుడు ధన్వంతరి యావిర్భవించెను. అమృతము పుట్టినదే తడవుగ దైత్యసంఘములాకులించి ధన్వంతరిం దోరించి దేవతలం బరాభవించి అమృతముంగొని యింటిమొగము వట్టిరి. అమృతముంగోల్పోయి అది త్రావక యట్టె చెగడొందు బృందారకులను భువన రక్షకుడుగు హరి యోదార్చి మందరగిరినిదాని తావున నునిచి యసురపతి గృహమున కేగెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అమృతప్రాప్తియను నలుబదియొకటవ యధ్యాయము