Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నలుబది మూడవ యధ్యాయము - దేవ దానవ యుద్ధము రాహురువాచ : బలిబాణ మహాకూర్మం శంబరావర్త భీషణమ్ | అనుహ్రాద మహాగ్రాహం కాలకేయ మహాజలమ్ ||
1 హిరణ్యాక్ష మహారత్నం ప్రహ్లాదాచల నిశ్చలమ్ | తథా నముచి కల్లోలం హ్రాద సంహ్రాద శబ్దవత్ ||
2 హిరణ్య కశిపూద్యోతం కాలనేమి బలాహకమ్ | అమృతా హరణక్షుబ్ధం తదా దైత్య మహావర్ణవమ్ ||
3 క్షుబ్ధం దైత్యార్ణవం శ్రుత్వా నిర్గతం సమరాయ చ | నిర్యయు స్త్రిదశాః సర్వే సన్నద్ధా యుద్ధకాంక్షిణః || 4 తతఃప్రవర్తతే యుద్ధం ఘోరం భీరు భయంకరమ్ | దేవానాం దానవానాంచ నరస్పర వధైషిణామ్ || 5 పాత్య మానేషు శ##స్త్రేషు కవచేషు మహాత్మనామ్ | దేవానాం దానవానాంచ హ్యుత్పేతు ర్జ్వలనార్చిషః || 6 గజవాజి ఖురక్షుణ్ణ ముత్తస్థౌ సుమహద్రజః | యుగాన్తానల ధూమాభం త్రైలోక్యస్యేవ దహ్యతః || 7 తస్యిన్ ప్రవృత్తే రజసి ఘోరే భీరు భయంకరే | నిర్మర్యాద మభూ ద్యుద్ధం దేవానాం దానవై స్సహ || 8 తతోదైత్య సముత్థేన తథా దేవో ద్భవేన చ | రుధిరేణ మహీవ్యాప్తా ప్రశాంతంచ రజః క్షణాత్ || 9 ధ్వజే చ్ఛత్రే రధే నాగు చామరే వ్యజనే హయే | సర్వత్ర దృశ్యతే దైత్యరక్తం లాక్షారస ప్రభమ్ || 10 తస్మిన్ యుద్ధే మహారౌద్రే దైత్య దానవ నాశ##నే | బధ్రముఃకుంజరా మత్తాః మహామాత్ర ప్రచోదితాః || 11 హతై ర్వీరై స్తథైవాన్యైః కుంజరాః పర్వతోపమాః | కుర్వంతః స్వాన్యనీకాని దృశ్యన్తే శతశోరణ || 12 ఛిన్న దన్తా భిన్న ధ్వజాః విహస్తచరణా స్తథా | శైలాభా పతితా స్తత్ర శోభయన్తో రణాజిరమ్ || 13 బభ్రముః సాదిభర్హీనాః హయాః సూర్యహయోపమాః | మృతాశ్చ శతశస్తత్ర దృశ్యన్తే వికృతాననాః || 14 ఆగుల్ఫ మవసీదన్తి దైత్యాః శోణిత కర్దేమే | రథిభిర్నిహతాః నాగాః నాగైశ్చ నిహతా రథాః || 15 హయాశ్చ విద్ధా నాగైస్తుసాదిభిః కుంజరా హతాః' రథసాది గజారోహైర్నిహతాశ్చ పదాతయః || 16 పత్తినా మహతా సాదీ కుంజరో రథ ఏవచ | తతఃప్రావర్తత నదీ రుధి రౌఘ తరంగణీ || 17 అస్త్ర గ్రాహా థనుర్మీనా చక్రకూర్మా మహా స్వరా | ఛత్రహంసా నాగవతీ కేశ##శైవల శాద్వలా || 18 దైత్య శీర్షోపలా రౌద్రా తథా భీరు భయా వహా | బాహుసర్పా మహావర్తా శూరాణాం హర్ష వర్థినీ || 19 అపారగమ్యా పత్తీనాం ఫేనపుంజ సమాకులా | తస్మిన్ యుద్ధే మహాఘోరే తుములే లోమహర్షణ || 20 ఆకీర్ణా వసుధా భాతి వదనైః కమలోపమైః | వివృత్తైశ్చ మహా దంష్ట్రైర్దానవానాం మహాత్మనామ్ || 21 బాహుభిశ్చాంగదై శ్చైవ రక్తచందన రూషితైః | హస్తిహసై#్త ర్మహా ప్రాసై రసిభిశ్చ మహాఘనైః | 22 తాలవృంతై స్తథా ఛత్రై శ్చామరై ర్యష్టభిస్తథా | ముకుటైః కుండలైశ్చైవ శుశుభే భూ ర్విభూషితా || 23 రాహువనియె : అయ్యెడ రాక్షససేన యొక మహాసముద్రమట్లేర్పడెను. అందులో బలి బాణాసురులుతాబేళ్ళు. శంబరుడొక పెనుసుడి. అనుహ్రాదుడొక పెద్దమొసలి. కాలకేయుడు నీరు. హిరణ్యాక్షుడు రత్నము. ప్రహ్లాదుడొక యచంచలమైన పర్వతము. నముచి కల్లోలము. (తరంగము) హ్లాదుడు సంహ్లాదుడునను వాండ్రు పెద్ద ధ్వని. హిరణ్య కశిపుడు వెలుగు. కాలనేమి కారుమబ్బు. తరచి యమృతము గైకొనుటచే నత్యంత క్షుబ్దమైన దానవసముద్రము సంక్షుబ్దమై యుద్ధమునకు బయలుదేరినట్లు విని వేల్పులెల్లరు యుద్ధకాంక్షగొని సన్నద్ధులై బయలుదేరిరి. అతి భయంకర సమరమారంభ##మై దేవదానవులొండొరులపై నాయుధములు విసరుకొనుచున్నంత నందుండి భీషణములయిన నిప్పురవ్వలు లేచినవి. ఏనుగుల గుఱ్ఱముల యుడుగుల తాకిడిం బెనుధూళిలేచెను. ప్రళయకాలగ్నిచే ముల్లోకములు తగలబడినంతగ పెద్ద పొగ గ్రమ్మెను. ఆ పెనుధూళి యతిభయంకరమై నంతట నందయ్యుభయులకు నతి భీషణము హద్దుపద్దులేని యుద్ధమయ్యెను. అవ్వల దేవదానవులు తెగి తెరలిన రక్తమవనియెల్ల గ్రమ్ముకొని నా రేగిన ధూళి క్షణములో నడగిపోయెను. ధ్వజమందు (జెండాపై) గొడుగుపై రథముపై నేనుగుపై చామరముపై గుఱ్ఱముపై నెక్కడ జూచిన నక్కడ దైత్యరక్తము లత్తుకవోలె నత్తుకొనెను. డైత్యదానవు లిట్లు నమ్మహాసమరమున మావటిండ్రదలింప నడలిపోయి మదపు టేనుగులు నలుదెసలకు బరువులెత్తెను. వీరులందరు నిహతులైనంత వందలువేలు దామేనుగులు మావటివానిచే చోదితములై గుంపులుగ నేర్పడి గాననయినవి. దంతములు విరిగినవి. ధ్వజభంగమయినవి తొండములుకాళ్ళుం దెగినవియునగునేనుగులారనాంగణమునకు నందముం గూర్చుచు గూలిపడెను. ఱౌతులు వోయిన గుఱ్ఱములు సూర్యరధాశ్వము లట్టట్లు వెర్రిపర్వులు వెట్టి వెట్టి గిట్టి మారుమెడలు వైచి పడిపోయి కానంబడెను. ఆ రక్తపు రొంపిలో దైత్యులు మడమలదాక దిగబడి బెగడొందిరి. రథికులేన్గులను ఏన్గులు రథములం గూల్చెను. గుఱ్ఱము లేన్గులచే రౌతులచే నేన్గులం గూల్చబడెను. గుఱ్ఱపు రౌతులచే మావటీండ్రచే కాల్బలములు గూల్పబడెను. పదాతిచే రౌతు నేనుంగు నరదముం గూల్పబడెను. రక్తప్రవాహము కెరటములుగొని యువ్వెత్తుగ నేరైపారెను. అందస్త్రములు పెనుమొసళ్ళు చాపములుచేపలు చక్రములు తాబేళ్ళు గొడుగులు హంసలు నాగవతి నాగములు (ఏనుగుల) (కొండలు) గలది. జుట్టుచే నాచు శాద్వలము (పచ్చికబైలు) గలది, దైత్యుల తలకాయలు రాతిబండలుగ బాహువులు పాములుగ నతి రౌద్రమై భయానకమై నయ్యుద్ధభూమి సుళ్ళుగలదై శూరుల కానందముం బెంచుచు పదాతి సైన్యముల కడుగుల నవ్వలికేగరానిదై నురుగుల గ్రమ్ముకొని యుండెను. మహాఘోరము తుములము నొడలు గగురపాటుగూర్చుచు నయ్యుద్థము జరుగ యుద్ధభూమి దానవుల కమలములట్టి మొగలములతో తెగిన దంతములతో ఎర్రచందనము పూసుకొన్న బాహువులతో బాహుపురులతో నేన్గుతొండములతో ప్రాసఖడ్గాదులతో (ప్రాసము=ఒకరకము కత్తి) కత్తులతో తాళవృంతములతో (విసనకర్రలతో) ఛత్రములతో చామరములతో కర్రలతో కిరీటములతో కుండలములతో సింగారించుకొని కానసయ్యెను. తతస్తే దానవాః క్రుద్ధాః స్వయుద్ధేన దివేప్సవః | అభిద్రవన్తి దేవేశం సహస్రాక్షం పురందరమ్ || 24 దైత్యానాం పతతాం దృష్ట్వా ప్రహ్లాదం దేవ సూదనమ్ | ప్రత్యుద్య¸° గజేనా೭೭జౌ దేవరాజో మహాబలః || 25 హుతాశనో೭సి నముచి మనుహ్రాదం తథా శశీ | వరుణశ్చ తథా బాణం యమో దేవ స్తథా బలిమ్ || 26 హిరణ్య కశిపుం రుద్రో వాయు ర్వృత్రా సురం రణ | విరూపాక్షం తథా శంభుః హిరణ్యాక్షం ధనేశ్వరః || 27 అన్యేచ దైత్యాః శతశః సంయుక్తాః దేవతా గుణౖః | ద్వంద్వయుద్ధ సహస్రేషు తేష్వవర్తత దానవైః || 28 ప్రాయశో విజితా దేవాః యయుర్భగ్నాః దిశోదశ | దానవాశ్చ జయంలబ్ధ్వా దేవా నను యయుర్బలాత్ || 29 తే భగ్నాః త్రిదశాః సర్వే దానవై శ్చా ప్యభిద్రుతాః | త్రాణార్థమథ సంప్రాప్తాః నరనారాయణాశ్రమమ్ || 30 దేవానా మభయం దత్వా నరనారాయణౌ తదా | శంఖ చక్రాయుధధరౌ యుద్ధాయ సమవస్థితౌ || 31 నరనారాయణౌ దృష్ట్వా తత్ క్షుబ్ధం దైత్యసాగరమ్ | నర్వాయుధ విసర్గేణ తయోర్యుద్ధం వ్యవస్థితమ్ || 32 గజా೭భ్ర జాలసంఛన్నం శరధారౌఘ వర్షణమ్ | చలత్ ఖడ్గలతా విద్యుద్దైత్య దుర్దిన మా బభౌ || 33 అవ్వల నాదానవులుడుకుమోతులై తమ పోరున స్వర్గమాక్రమింపగోరి వేయిగన్నులవాని వేల్పు ఱని పురందరు నెదిరింపపైబడిరి. అట్లు పైబడుచున్న వారింగని యింద్రుడై రావతమున బ్రహ్లాదుని కెదురేగెను. ఆగ్ని నముచిని చంద్రుడు అనుహ్లాదుని వరుణుడు బాణుని యముడు బలిని రుద్రుడు హిరణ్యకశిపుని వాయువు వృత్రాసురుని శంభువు విరూపాక్షుని ధనదుడు (కుబేరుడు) హిరణ్యాక్షుని మరియితర దైత్యు లితర దేవతలను వందలకొలదిగ దారసిల్లి ద్వంద్వయుద్ధమవిరామముగ గావించిరి. దేవత లించు మించందరు నోడి పదిదిక్కులకుం బారిరి. దానవులు గెలుపొంది వారిని వెన్నంటి తరిమిరి. దానంబెండువడి పారి వేల్పుదొరలు రక్షణకొరకు నరనారాయణాశ్రమముం జొచ్చిరి. నరనారాయణులు సురలకభయమిచ్చి శంఖచక్రాయుధములూని యుద్థసన్నద్ధులైరి. వారినిగని దైత్యసమరసాగరము సంక్షుబ్ధమాయెను. సర్వాయుధ విక్షేపముగ వారలకు పోరుజరిగెను. అంతట నట దైత్యుదుర్దినము గోచరించెను. రాక్షసులకు పాడురోజు వచ్చినదని యొక యర్థము. వారి పాలిట మేఘచ్ఛన్నమయిన (మబ్బుగ్రమ్మిన) రోజట్లయ్యెనని రెండవ యర్ధము. అందు ఏనుగులు మబ్బులుగను, బాణపరంపర వర్షము, చలించుచున్న ఖడ్గలతలు మెరుపులు. తతశ్శరై రుక్మవిభూషితాగ్రై స్సునేత్ర పుంఖైర్జ్వలనార్కవర్ణైః | బిభేద గాత్రాణి నరో రిపూణాం జహార శీర్షాణి సకుండలాని || 34 నారాయణో೭ప్యుత్తమ వీర్య తేజా శ్చక్రేణ చక్రం దితినందనానామ్ | విదారయామాస మహానుభావ స్తస్మిన్ రణ ఘోరతరే తదానీమ్ || 35 వీర్యంతయో రప్రతిమం నిరీక్ష్యతేదానవా భగ్ననికృత్త యోధాః | హృతా మృతా జీవిత మాత్ర శేషాః వేగేన యాతా వరుణాధివాసమ్ || 36 లబ్ధ్వా జయం దేవపతి ర్మహాత్మా ప్రహ్లాద మాజౌ చ తథా విజిత్య | సంపూజయామాస మహానుభావౌ ధర్మాత్మజౌ తాపస సంఘముఖ్యౌ || 37 సంపూజ్యతౌ ధర్మసు తౌ జితారిర్దేవైః ప్రహృష్టై రనుయాస్యమానః | జగామ నాకం త్రిదశ ప్రధానః సుఖీ బభూవాధ గతజ్వరశ్చ || 38 ఏవం ప్రభావో భగవాన్ స విష్ణు ర్వైరం నమేరోచతి తేన నిత్యం || సంధింకురుష్వాత్మ హితాయ రాజన్ ! శ##క్రేణ తేనారినిషూదనేన || 39 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే-ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే రాహువాక్యేన దేవదానవ యుద్ధవర్ణనం నామ త్రిచత్వారింశ త్తమో೭ధ్యాయః. అవ్వల బంగారపు కొనలు అగ్ని సూర్యులట్లు దీపించు పుంఖములు (పుంఖము=బాణము క్రిందిచివర, పింజ) గల బాణములచే నరు డరుల మేనులం పగిలించి కుండలములతోడి తలలం గూల్చెను. నారాయణుడు నుత్తమ బలప్రతాపముల జక్రాయుధముచే నసురుల సముదాయము నా ఘోరసంగ్రామమునచీల్చెను. దానవులాయిద్దరి యప్రతిమవీర్యముంగని యోధులుగూలితెగిపడి చావనమృతము హరింపబడి ప్రాణమాత్రావశిష్టులై వేగముగ వరుణలోకమునకేగిరి. దేవేంద్రుడుగెలుపొంది ప్రహ్లాదు నయ్యుద్ధమందట్లోడించి మహానుభావులు ధర్మాత్మజులు తాపసముఖ్యులునగు నానరనారాయణుల బూజించెను. అరులంగెల్చి అమరులతో వెంబడింపబడి యా త్రిదశ ప్రధానుడు బాధలందలింగి నాకముసని సుఖముండెను. ఆ శ్రీమహావిష్ణువిట్టి ప్రభావముగలవాడు. అతనితో నెన్న డునుంబగగొనుట నాకు రుచింపదు. ఆత్మ హితముగోరి ఓ రాజా ! నీవాతనితో నింద్రునితో సంధిసేసికొనుము. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున దేవదానవయుద్ధవర్ణనమను నలుబదిమూడవ యధ్యాయము.