Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నలుబది యేడవ అధ్యాయము - భార్గవరామ దర్శనము మార్కండేయ ఉవాచ : వహ్ని జ్వాలా గ్రవర్ణేన జటాజూటేన రాజితమ్ | గగనార్ధ మివారూఢం నిదాఘే రవిమండలమ్ ||
1 ఆధారం సర్వ దేవానాం తపసా ద్యోతిత ప్రభమ్ | సేవమాన మవసనం పీతగాత్ర మరిందమమ్ || 2 ఏక మేకా కినం వీరం సహస్రశత మండితమ్ | పిండితం సకలం ధామ బ్రహ్మక్షత్రియ తేజసామ్ || 3 కృష్ణాజినో త్తరా సంగ భ్రాజమానం బలోద్ధతమ్ | స్నిగ్ధయా రంజిత మివ ప్రాయెణ పార్వతీదృశా || 4 విరాజమానం దోర్దండ రుక్మ దండే న భాస్వతా | పరశ్వథేన తీక్షేణన విమలాకాశ వర్చసా || 5 తపస్విన మనాదృశ్యం యమకాలా న్తకోపమమ్ | కంపమానం పదన్యాసై ర్వసుథాంసకలాం తథా || 6 ముష్ణన్తం సర్వతేజాంసి ప్రభాతే రవిమండలమ్ | ప్రాంశుం కనక వర్ణాంగం సిత యజ్ఞో పవీతినమ్ | 7 గంగయాః ప్రవహేణవ మేరుశృంగం విరాజితమ్ | తేజసా దహనాకారం ప్రజా సంహార కారకమ్ || 8 విషమం ప్రమథేశస్య తృతీయమివలోచనమ్ | అప్రసహ్య మనావార్యం దుర్లంఘ్యంజీవిత ఛిదమ్ || 9 కాలేనేవ భుజం సవ్యం దైత్యహేతోః ప్రసారితమ్ | రామే దృష్టి పథం ప్రాప్తే దానవానాం సమన్తతః || 10 హాహా కారో మహా నాసీత్ తమేకం నిఘ్నతాం రణ | శస్త్ర ధారణ విభ్రష్ట బ్రాహ్మణ్యం స్వ పథా చ్చ్యుతమ్ || 11 ఘాతయధ్వం దురాచార మేన మూచుః పరస్పరమ్ | ఏవమాద్రవతాం తేషాం బహూనా మాతతాయినామ్ || 12 జగ్రాహ వేగం సర్వేషాం మరుతా మివ పర్వతః | సహన్య మానో నా రాచై స్తోమరై ర్ముసలై స్తథా || 13 గదాభి రసిభిః పాశై ర్భుశుండీభి రయోగుడైః | పట్టిశైర్భింది పాలై శ్స హుతైశ్శూలైం పరశ్వధైః || 14 న వివ్యధే హ్యమేయాత్మా ధరాధర ఇవా೭నిలైః | 15 సంవేష్టితం సర్వత ఏవ సైన్యై రదృష్టయుద్థో೭పి రణ మహాత్మా | దైత్యార్ణవం గోష్పద తుల్య మాత్ర మమన్య తా జౌ రణచండవేగః || ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే యుద్ధే భార్గవ రామదర్శనం నామ సప్త చత్వారింశ త్తమోధ్యాయః. మార్కండేయు డనియె : అగ్నిజ్వాల కొన రంగుతో వెలుగొందు జటాజూటముతో మధ్యాహ్న సూర్యమండలమట్లు వెలుగుచు సర్వదేవతలకాధారమై తపస్సుచే నద్భుత ప్రభందాల్చి దేవతలచే పూజింపబడుచు దిగంబరియై పచ్చనిమేనితో నేకైక వీరువై నూరులు వేలును నైన యలంకారములుదాల్చి ఏకాకియై బ్రహ్మక్షత్రతేజస్సులన్నియు ముద్దగట్టినట్లుండి కృష్ణాజినము పైని గప్పుకొని యమితబలుడైన వీరుడై పార్వతియొక్క ప్రేమభరితమైన చూపున మిక్కిలి శోభించుచు స్వర్ణదండమట్టి బాహుదండముతో రాజిల్లుచు నచ్చమైన యాకాశమట్లు వెలుంగు తీక్షణమైన పరశువును (గండ్రగొడ్డలిం) దాల్చి తేరిపారజూడ నలవిగాక యమకాలాంతకులట్లు దీపించు తపశ్శాలిని పాదన్యాసముచే సర్వభూమిని గంపింపజేయువానిని సర్వతేజస్సుల నాహరించుకొని ప్రభాత కాల రవి మండలమట్లు బంగారు చాయ మేన నున్నతుడై తెల్లని జందెముం దాల్చి గంగ పైనుండి పడుచున్న మేరుపర్వత శిఖర మట్లుండి తేజస్సున నగ్నిం బోలి ప్రజాసంహారకారకము (లయకారణము) విషమమునైన ప్రమదపతియొక్క (పరమశివునియొక్క) మూడవనేత్రమా అన్నట్లుండి యేరికేని సహింప వారింపను దాటను వశముగాక ప్రాణములదీయువానిని (సంహారకర్తయగువానిని) దైత్యుల నిమిత్తము కాలుడు (యముడు) చాచిన యెడమ భుజమువలెనున్న వానిని సాల్వుడెట్టయెదుటం జూచెను. అట్లు రాముడు కంటబడినంత నతనినింగొట్టుటకు రేగిన దానవులలో నాలుగడల హాహాకారమయ్యెను. కత్తిపట్టి బ్రాహ్మణ్యమునుండి దిగజారిన దురాచారిని గొట్టుడు జంపుడని దానివు లొండొరులెచ్చరికలు సేసికొనిరి. ఇట్లు పెక్కుమంది యొక్కటై పైబడు నా రాక్షసులను ఆతతాయులందరి వేగమును వాయువుల వేగమును పర్వతమట్లు పరశురాముడు తట్టుకొని నిలువబడెను. ఆతడు బాణములు బల్లెములు రోకళ్ళు గదలు కత్తులు పాశములు నినుపగుదియలు పట్టిసములు (ఒకరకము కత్తి) పాశములు భుశుండులు బిందివాలములు హుతములు శూలములు పదశ్వథములు మున్నగు నాయుధములచే గొట్టబడియు నయ్యమేయమూర్తి పెనుగాలులం జలింపని పర్వతమట్లుండి యించుకయుం బాధపడడయ్యెను. నలుమూలల సైన్యములు గ్రమ్ముకొన్నను నింతమున్నెన్నడులేని యుద్ధముం జూడని వాడయ్యు నమ్మహాత్ముడయ్యెడ రణమందు బ్రహ్మాండ వేగముంగొని దానవ సముద్రమును గోష్పదమాత్రముగ (ఆ దూడ యడుగుగ) భావించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున భార్గవరామదర్శనమను నలుబదియేడవ యధ్యాయము.