Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఏబదియొకటవ యధ్యాయము - శంకరగీతలందు పరశురామప్రశ్న

మార్కండేయ ఉవాచ:

కైలాసశిఖరే రమ్యే నానా ధాతు విచిత్రితే | నానా ద్రుమలతా కీర్ణే నానా పక్షి నినాదితే || 1

గంగా నిర్ఘర సంజాతే సతతం నారు నిస్స్వనే | దేవదేవం మహాదేవం పర్యపృచ్ఛత భార్గవ ః || 2

రామ ఉవాచ:

దేవదేవ !మహాదేవ! గంగాలులిత మూర్ధజ | శశాంక లేఖా సంయుక్త జటా భారాతి భాసుర ! || 3

పార్వతీ దత్త దేహార్ధ ! కామకాలాంగ నాశన ! | భగనేత్రాంతకాచింత్య ! పూష్ణోదశన శాతన ! || 4

త్వత్తః పరతరం దేవం నాన్యం పశ్యామి కంచన | పూజయన్తి సదా లింగం తత్ర దేవా స్సవాసవాః || 5

స్తువన్తి త్వా మృషిగణాః ధ్యాయన్తి చ ముహుర్ముహుః | పూజయన్తి తథా భక్త్యా వరదం పరమేశ్వర ! || 6

జగతోస్య సముత్పత్తి స్థితి సంహార పాలనే | త్వామేకం కారణం మన్యే త్వయి సర్వం ప్రచిష్ఠితమ్‌ || 7

కం త్వం ధ్యాయసి దేశేశ ! తత్రమే సంశయో మహాన్‌ | ఆచక్ష్వ తన్మే భగవన్‌ | యద్యనుగ్రాహ్వతా మయి || 8

ప్రసాద సాంముఖ్య తయా మయైతత్‌ విస్రంభమాసార్య జగత్ర్పధాన |

భవన్త మీద్యం ప్రణిపత్య మూర్ధ్నా పృఛ్ఛామి సంజాత కుతూహలాత్మా || 9

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పరశురామోపాభ్యానే శంకరగీతాసు రామ ప్రశ్నోనామ ఏకపంచాశ త్తమోధ్యాయః

మార్కండేయుడనియె : నానాధాతు చిత్రము రమ్యము నానాతరులతాకీర్ణమునానావక్షినినాదితముగంగానదదీ నిర్ఝర సంపాతమున జక్కగ ధ్వనించు కైలాసశిఖరమున పరుశురాముడు మహాదేవునిట్లు ప్రశ్నించెను. దేవదేవా! మహాదేవా! గంగాలంకృత జటాజూట! చంద్రకలాకలిత జటాభార! అతిభాస్వర ! పార్వతికి సామేనిచ్చిన మహానుభావ కాముని కాలుని గడతేర్చినవాడ! భగనేత్రాంతకా ! అచింత్యా ! పూషదంతముల రాల్చినవాడ! నిన్ను మించిన దైవమింకొకనిం గానను. ఇంద్రాది దేవతలు నీ లింగము నే వేళనర్చింతురు. ఋషి గణములు నిన్ను స్తుతించును. మాట మాటికి వరదుడవైననిన్ను భక్తితో పూజింతురు. ఈ జగత్తుయొక్క పుట్టుట పెఠుగట గిట్టుటయు పాలించుట వీనికి నీవొక్కడవు కారణమని తలంతును. నీయందే సర్వము ప్రతిష్టితము. నీవెవ్వనిని ధ్యానించుచున్నావు? అందు నాకు పెద్ద సందేహమేర్పడినది. నేను అనుగ్రాహ్యుడనేని యది నాకు జెప్పుము. ప్రసాదసమ్ము ఖుడవైనకతన విస్రంభముచే (చనవుచే) నేను తలవంచి నమస్కరించి కుతూహలము పొడమి భగవంతుడు పరమ స్తుత్యుడవగు నిన్నడుగు చున్నాను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున శంకరగీతలందు పరశురామప్రశ్నయను నేబదియొకటవయధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters