Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఏబదిరెండవ యధ్యాయము - శంకరగీతలందు ధ్యేయనిర్థేశము త్వదుక్తో೭య మనుప్రశ్నో రామ ! రాజీవలోచన ! త్వమేకః శ్రోతుమ ర్హో೭సిమత్తో భృగుకులోద్వహ! || 1 యత్త త్పరమకం ధామ మమ భార్గవనందన ! యత్తదక్షర మవ్యక్తం పరం యస్మాన్న విద్యతే | జ్ఞాన జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వ స్సచాశ్రితమ్ || 2 త్వా మహం పుండరీకాక్షం చిన్తయామి జనార్దనమ్ | ఏతద్రామ ! రహస్యంతే యధావత్ కథితం వచః || 3 యే భక్తాస్తమజం దేవం న తే యా న్తి పరాభవమ్ | త మీశ మజ మవ్యక్తం సర్వభూత పరాయణమ్ || 4 నారాయణ మనిర్దేశ్యం జగత్కారణ కారణమ్ | సర్వతః పాణిపాదం తత్ సర్వతో೭క్షి శిరోముఖమ్ || 5 సర్వతః శ్రుతిమాన్‌లోకే సర్వ మావృత్య తిష్ఠతి | సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమ్ || 6 అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ ! బహిరన్తశ్చ భూతానాం అచరంచర ఏవచ || 7 సూక్ష్మత్వా త్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికంచతత్ | అవిభక్తం విభ క్తేషు విభ క్త మివచ స్థితమ్ || 8 భూతవర్తిచ తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభవిష్ణుచ | జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే || 9 అనాది మత్పరంబ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే | ప్రకృతి ర్వికృతిర్యో೭సౌ జగతాం భూతభావనః || 10 యస్మా త్పర తరం నాస్తి తం దేవం చిన్తయామ్యహమ్ | ఇచ్ఛామాత్ర మిదం సర్వం త్రైలోక్యం సచరాచరం || 11 యస్య దేవాది దేవస్య తం దేవం చి న్తయామ్యహమ్ | యస్మిన్ సర్వం యతస్సర్వం యస్సర్వం సర్వతశ్చయః || 12 యశ్చ సర్వమయో నిత్యః తం దేవం చిన్తయామ్యహమ్ | యోగీశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిమ్ || 13 జగన్నాథం విశాలాక్షం చింతయామి జగద్గురుమ్ | శుచిం శుచిపదం హంసం తత్పరం పరమేష్ఠినమ్ || 14 యుక్త్వా సర్వాత్మనాత్మానం తం ప్రపద్యే ప్రజాపతిమ్ |యస్మిన్ విశ్వాని భూతాని తిష్ఠన్తి చ విశన్తి చ 15 గుణ భూతాని భూతేశే సూత్రే మణి గణా ఇవ | యస్మిన్ని త్యే తతే తన్తౌ దృష్టే స్రగివ తిష్ఠతి || 16 సదసద్గ్రధితం విశ్వం విశ్వాంగే విశ్వకర్మణి | హరిం సహస్ర శిరసం సహస్ర చరణక్షణం || 17 ప్రాహు ర్నారాయణం దేవం యం విశ్వస్య పరాయణం | అణీయసా మణీయాంసం స్థవిష్ఠం చ స్థవీయసామ్ 18 గరీయసాం గరిష్ఠంచ శ్రేష్ఠంచ శ్రేయసామపి | వాకేష్వనువాకేషు నిషత్సూప నిషత్స్వపి || 19 గృణన్తి సత్యకర్మాణం సత్యం సత్యేషు సామసు | చతుర్భి శ్చతురాత్మానం స త్త్వస్థం సాత్త్వతాం పతిమ్ || 20 యం దివ్యై ర్దేవ మర్చన్తి గుహ్యైః పరమనామభిః | య మనన్యో వ్యపేతాశీ రాత్మానం వీత కల్మషమ్ 21 ఇష్ట్వా నన్త్యాయ గోవిందంపశ్య త్యాత్మ న్యవస్థితం | పురాణః పురుషః ప్రోక్తో బ్రహ్మ ప్రోక్తో యుగాదిషు || 22 క్షయే సంకర్షణః ప్రోక్త స్తముపాస్య ముపాస్మహే | య మేకం బహుధాత్మానం ప్రాదుర్భూత మధోక్షజమ్ || 23 నాన్య భక్తాః క్రియావన్తో యజ న్తే సర్వకామదమ్ ! య మాహు ర్జగతాం కోశం యస్మిన్ సన్నిహితాః ప్రజాః || 24 యస్మిన్ లోకాః స్ఫుర న్తీమే జాలే శకునయో యధా | ఋత మేకాక్షరం బ్రహ్మ యత్తత్ సదసతః పరమ్ || 25 అనాది మధ్య పర్యన్తం నదేవా నర్షయో విదుః | యం సురానుర గంధర్వా ససిద్ధర్షి మహోరగాః || 26 ప్రయతా నిత్యమర్చన్తి పరమం దుఃఖ భేషజం | అనాది నిధనం దేవ మాత్మయోనిం సనాతనమ్ || 27 ఆప్రతర్క్య మవిజ్ఞేయం హరిం నారాయణం ప్రభుం | అతి వాయ్వింద్ర కర్మాణం బాలసూర్యాగ్ని తేజసమ్ || 28 అతి బుద్ధీంద్రియ గ్రామం తం ప్రపద్యే ప్రజాపతిమ్ | యం వై విశ్వస్య కర్తారం జగత స్తస్థుషాం పతిమ్ || వద న్తి జగతో೭ధ్యక్ష మక్షరం పరమం పదమ్ | యస్యా గ్ని రాస్యం ద్యౌ ర్మూర్థా ఖం నాభి శ్చరణౌక్షితిః || చంద్రాదిత్యౌ చ నయనే తం దేవం చిన్తయామ్యహమ్ || యస్య త్రిలోకీ జఠరే యస్య కాష్ఠాశ్చ వాహనాః || 31 యస్య శ్వాసశ్చ పవన స్తందేవం చింతయామ్యహం | విషయే వర్తమానానాం యం తం వై శేషి కైర్గుణౖః || 32 ప్రాహు ర్విషయ గోప్తారం తం దేవం చి న్తయామ్యహం | పరః కాలా త్పరో యజ్ఞాత్పర స్సదసతశ్చ యః || 33 అనాది రాదిర్విశ్వస్య తం దేవం ఛింతయామ్యహమ్ | పద్భ్యాం యస్య క్షితి ర్జాతా శ్రోత్రాభ్యాంచ తధా దిశః || 34 పూర్వభాగే దివం యస్య తందేవం చి న్తయామ్యహమ్ | నాభ్యాం యస్యా న్తరిక్షస్య నాసాభ్యాం పవనస్యచ || ప్రస్వేదా దంభసాం జన్మ తం దేవం చింతయామ్యహమ్ || 36 వరాహ శీర్షం నరసింహ రూపం దేవేశ్వరం వామనరూపరూపం | త్రైలోక్యనాధం వరదం వరేణ్యం తం రామ ! నిత్యం మనసా೭೭నతో೭స్మి || 37 వక్త్రా ద్యస్య బ్రాహ్మణా స్సంప్రసూతాః యద్వక్షసః క్షత్రియాస్సం ప్రసూతాః | యస్సోరుయుగ్మాచ్చ తథై వవైశ్యాః పద్భ్యాం తథా యస్య శూద్రాః ప్రసూతాః || 38 వ్యాప్తం తధా యేన జగత్సమగ్రం విభూతిఖిః భూత భవోద్భవేన | దేవాధి నాధం వరదం వరేణ్యం తం రామ ! నిత్యం మనసా నతో೭ స్మి || 39 ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమ ఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రీ భార్గవరామ ప్రశ్నే శంకర గీతాసు ధ్యేయ నిర్ధేశోనామ ద్విపంచాశత్తమోధ్యాయః. శంకరుడనియె : రామా ! రాజీవలోచనా ! నీవడిగిన ఈ ప్రశ్న ముం గూర్చి నా సమాధానము నీవొక్కడవే విననర్హుడవు. నా పరమధామము (నివాసము లేదా తేజస్సు) అక్షరము అవ్యక్తము పరాత్పరము. జ్ఞానముచే దెలియదగినది జ్ఞానముచే బొందనయినది. అందరి హృదయనుందున్నది. అట్టి నిన్ను బుండరీకాక్షుడు హరిమునుంగా ధ్యానించుచున్నాను. ఈ సత్యమునున్నదున్నట్లు నీ కెఱింగించితిని ఆ పరమదైవము నెడభక్తిగలవారు పరాభవము పొందరు. ఆ ఈశ్వరుని పుట్టువులేనివాని అవ్యక్తుని సర్వ భూతముల కందవలసిన పరమలక్ష్యమును అనిర్ధేశ్యుని నారాయణుని జగత్కారణముకు గారణమైనవానిని అంతట కాలుసేతులుగల వానిని అంతట కన్నులు శిరస్సు ముఖము గలవానిని అంతట చెవులున్న వానిని లోకమందంతట నావరించియున్న వానిని అన్ని యింద్రియ గుణములందు (శబ్దామలందు) తెలివియై భాసించుచు వానిని ఇంద్రియ వర్జితుని అసంగిని నిర్గుణుని గుణానుభవము గలవానిని భూతముల వెలిలోననున్న వానిని చరము అచరము నైనవానిని అతి సూక్ష్మమగుటనే నెరుగరాని వానిని దూరగుని సమీపగుని అవిభక్తుడయ్యు విభక్త పధార్థములందు విభక్తుడైనట్లుండు వానిని భూతములందు వర్తించువాని గ్రసించువాని ప్రభవించువానిని వెల్గులకెల్ల వెల్గయిన వానిని పెంజికటులకెల్ల నవ్వల వెలుంగువానిని ఆదిలేని వానిని సత్తుగా అ సత్తునని పేర్కొనరాని వానిని జగత్తుకు ప్రకృతి (మూలపదార్థము) అయినవానిని వికృతి గూడ తానేయైనివానిని భూతములతో(భూమ్యాదులతో ప్రాణులతో) భావనగల వానిని తాదాత్మ్యము పోందినవానినిని తనకు మించి యింకొకటి లేనివానిని నా దేవుని నేను ధ్యానించుచున్నాను. ఈ చరాచర జగత్తు ఎవ్వని సంకల్పమాత్రమో యాదేవు నేను దలంచుచున్నాను. ఎవ్వనియందంతయు నున్నదో నెవ్వడంతయునో అంతటి నుండి యెవడగునో యెవడు సర్వమయుడో నిత్యుడో ఆ దేవునిధ్యానించెదను. యోగీశ్వరుడు పద్మనాభుడు విష్ణువు జిష్ణువు జగత్పతి జగన్నాధుడు విశాలాక్షుడు జగద్గురువు శుచి శుచిస్థానము పరమహంస పరమేష్టియునైన వానిం జింతచుచున్నాను. తనచే దన్ను సంయోజించికొని యా ప్రజాపతిని శరణందెద. గుణరూపములయిన విశ్వభూతములు(అన్ని ప్రాణులు) నిత్యుడై వ్యాపకుడైన యెవ్వనియందు దారమందు మణులవలె నుండును. సదరత్తులందు గ్రువ్వబడి విశ్వమే విశ్వాంగునియందు విశ్వకర్ముని యుందున్నది. అట్టి హరి సహస్ర శిరస్కు సహస్రపాదుని సహస్రనయనుని విశ్వమునకు పరమావధియైన వానిని నారాయణుండన బడువానిని అణీయసములన్నిటింటె నణియసుని (అణువుకంటె నణువువను) స్థవీయసముల కంటె స్థవిష్టుని స్థూలమైన వానిని (మహ త్పదార్థముల కంటే మహత్తైనవానిని) గరీయసములకంటె గరిష్ఠుని (బరువైనవానిని) శ్రేయసములకంటె శ్రేష్ఠుని వాకములందు (శ్రుతులందు) అనువాకమలందు పేర్కొనబడు వానిని(అనువాకమనగా వేదములోని భాగములు) అష్టకము ప్రశ్న (పన్నము) అధ్యాయము(అనువాకము) అనుపేర వేదమలందలి భాగములు పేర్కొనబడును. కొన్ని అనువాకములు గలిసి ప్రపాఠకమనబడును. సత్యకర్ముడు సత్యుడునని సత్యములయిన సామములందు గీర్తింపబడు వానిని నాల్గింట నాలుగు రూపులయిన వానిని సత్త్వగుణమందుండు వానిని సాత్త్వతులకు(విష్ణుభక్తులకు) అధినాధుడైనవానిని గుహ్యములు దివ్యములు పరమములు(ఉత్తమమలు)నైన నామములచే నర్చింతురు. అనన్యుడై (మఱియొక దైవమని లేనివాడై) వ్యపేతాశిషుడై ( ఏ వాంఛలు లేనివాడై) ఎవ్వని నాత్మ రూపుని కల్మష రహితుని ఆనంత్యము కొరకు(అనంతభావము కొరకు ముక్తికొరకు) గోవిందుని తనయందున్న వానిని జూతురో ఎవ్వడు పురాణుడు పురుషుడు యుగము నాదియందు(సృష్ఠిలో) బ్రహ్మగను క్షయమందు(లయయందు) సంకర్షణుడుగను బేర్కొందురట్టి పరము నుపాసింతుము. ఒక్కడైన యెవ్వని బహువిధాత్ముడుగా ప్రాదుర్భవించిన వానినిగా అథోక్షజుడని (సర్వేంద్రియములచే దెలిసికొనబడినివాడు. అథోక్షజుడు - అక్షముల కింద్రియముల కవ్వల బొదమువాడు గోచరించువాడన్నమాట) అనన్య భక్తులు(భావాద్వైతము క్రియాద్వైతము లేనివారు) క్రియావంతులు (కర్మఠులు) సర్వకామదుని యజింతురో ప్రజలందరు నెవ్వని జగత్కోశముగా బేర్కొందురు. (జగద్గర్భుడన్నమాట) ఎవ్వని యందీలోకములు వలలో పక్షులట్లు స్ఫురించును. అట్టి ఋతము ఏకాక్షరము(ఓంకారము) బ్రహ్మ అనాది మధ్యనిధనము ఆత్మ యోని సనాతనుని అప్రతర్క్యము (తర్కింపవలనుగాని) అవిజ్ఞేయమునైన హరిని నారాయణుని ప్రభువును దేవర్షులుగూడ నెఱుంగ జాలరెవ్వని సురాసుర గంధర్వ సిద్ధర్షి పన్నగులు శుధ్ధులై దుఃఖౌషధముగ నిత్యమర్చింతురు. అట్టి బుద్ధికి నింద్రియ గ్రామమునకు నందని వానిని విశ్వకర్తను విశ్వహ ర్తను చరాచర జగత్పతిగా బేర్కొనబడు వానిని నే ధ్యానించుచున్నాను. ఎవని జఠరమందు ముల్లోకములున్నవి, యెవ్వనికి దిక్కులు వాహనములో ఎవ్వని శ్వాస వాయువో అట్టి దేవుని ధ్యనింతును. పరుడు కాలముకంటె పరుడు యజ్ఞముకంటె పరుడు అనాది విశ్వమున కాదియు నగు నా స్వామిని ధ్యానింతును. ఎవ్వని పాదములనుండి క్షితి జనించెను. వీనులనుండి దిక్కులు పుట్టినవి. యెవ్వనికి పూర్వభాగమున దివమున్నది యిట్టి దేవుని దలంచెద. ఎవని నాభినుండి యంతరిక్షము నాసికలనుండి వాయువు చెమటనుండి నీళ్ళు పుట్టినవో యా దేవుని భావించెదను. వరాహ నరసింహ వామన రూపుని వరదుని వరేణ్యుని త్రైలోక్యనాధుని నిత్యుని రామా! యాతని మనసుచే నమస్కరించెదను. ఎవ్వని వక్త్రమునుండి బ్రాహ్మణులు వక్షమునుండి క్షత్రియులు ఊరువులనుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు జనించిరో భవ హేతువైన ఎవ్వని విధూతులచే సమగ్ర జగత్తు వ్యాప్తమో అట్టి దేవాధినాధుని వరేణ్యుని నిత్యము మనసార నతుడయ్యెదను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున శంకరగీతలందు ధ్యేయనిర్దేశమను నేబదిరెండవ యధ్యాయము. ೭&