Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఏబది మూడవ యధ్యాయము - నరవరాహావతారము హిరణ్యాక్షవధ రామ ఉవాచ : వరాహం నరసింహంచ వామనం చ మహేశ్వర ! |
త్వత్తో೭హం శ్రోతుమిచ్ఛామి ప్రాదుర్భావాన్ మహాత్మనః || 1 శంకర ఉవాచ: అదితిశ్చ దితిశ్చైవ ద్వేభార్యే కశ్యపస్యచ | అదితి ర్జనయామాస దేవానింద్ర పురోగమా& || 2 దితిశ్చజనయామాస ద్వౌపుత్రౌ భీమవిక్రమౌ | హిరణ్యాక్షం దురాధర్షం హిరణ్యకశిపుం తథా || 3 తతో೭భిషి క్తవా& శక్రం దేవరాజ్యే ప్రజాపతిః | దానవానాం తథా రాజ్యే హిరణ్యాక్షం బలోత్కటమ్ || 4 అభిషిచ్య తయోఃప్రాదాత్ స్వర్గం పాతాళ##మేవచ | పాతాళం శాసతి తథా హిరణ్యాక్షే మహాసురే || 5 ధారాధరా ధరాం త్యక్త్వా ఖ ముత్పేతూ రయాత్పురా | పక్షవంతో మహాభాగ | నూనం భావ్యర్థ చోదితాః || 6 ధారాధర పరిత్వక్తా ధరా చలనిబంధనా | యదాతదా దైత్యపురం సకలం వ్యాప్త మంభసా || 7 దృష్ట్వైవ స్వపురం వ్యాప్త మంభసా దితిజోత్తమః | సైన్యముద్యోజయామాస జాతశంకః సురాన్‌ప్రతి || 8 ఉద్యుక్తేన స సై న్యేవ దైత్యానాం చతురంగిణా | విజిత్య త్రిదశా& జన్యే ఆజహార త్రివిష్టపమ్ || 9 హృతాధికారా స్త్రిదశాః జగ్ముశ్శరణ మంజసా | దేవరాజం పురస్కృత్య వాసుదేవ మజం విభుమ్ || 10 త్రిదశృ& శరణం ప్రాప్తాన్ హిరణ్యాక్ష వివాసితాన్ | సంయోజ్యాభయ దానేన విససర్జ జనార్దనః || 11 విసృజ్య త్రిదశాన్ సర్వాన్ చింతయామాసకేశవః | కిన్నురూప మహంకృత్వా ఘాతయిప్యే సురార్దనమ్ || 12 తిర్యజ్ మనుష్య దేవానాం అవధ్యస్ససురాంతకః | బ్రహ్మణోవరదానేన తస్మాత్తస్య వధేప్సయా || 13 నృవరాహో భవిష్యామి న దేవో నచ మానుషః | తిర్యగ్రూపేణ చైవాహం ఘాతయిష్యామి తం తతః || 14 ఏతావదుక్త్వా సంగేన నృవరాహో೭భవత్ ప్రభుః | చూర్ణితా೭ంజన శైలాభ స్తప్త జాంబూనదాంబరః || 15 యమునావర్త కృష్ణాంగ స్తదావ ర్త తనూరుహః | తదోఘఇవ దుర్వార్య స్తత్పిత్రాతేజసా సమః || 16 తత్ప్రవాహ ఇవాక్షోభ్య స్తత్ర్పవాహ ఇవౌఘవాన్ | తత్ర్పవాహామలతను స్తత్ర్పవాహ మనోహరః || 17 సజలాంజన కృష్ణాంగః సజలాంబుద సచ్చవిః | పీతా వాస్తా స్తదా భాతి సవిద్యుదివ తోయదః || 18 ఉరసాధారయన్ హారం శశాంక సదృళచ్ఛవిః | శుశుభే సర్వభూతాత్మా సబలాక ఇవాంబుదః || 19 శశాంక లేఖా విమలే దంష్ట్రే తస్య విరేజతుః | మేఘాంతరిత బింబస్య ద్వౌ భాగౌ శశినో యథా || 20 కరాభ్యాం ధారయ& భాతి శంఖచక్రే జనార్దనః | చంద్రార్క సదృశే రామ ! పాదచారీవ పర్వతః || 21 మహాజీమూత సంకాశో మహాజీమూత సన్నిభః | సహాజీమూత వద్వేగీ మహాబల పరాక్రమః || 22 దానవేంద్ర వధాకాంక్షీ హిరణ్యాక్షసభాం య¸° | హిరణ్యాక్షో೭పి తం దృష్ట్వా నృవరాహం జనార్దనమ్ || 23 పరుశురాముడు, భగవంతుని వరాహ నరసింహ వామనుల యవతారములం గూర్చి నీ వలన వినగోరెదనన శంకరుండిట్లనియె. ఆదితి యింద్రాదులను దేవతలం గనెను. దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టిరి. బ్రహ్మయింద్రుని దేవరాజ్యమందు దానవరాజ్యమందు హిరణ్వాక్షు నభిషేకించి స్వర్గరాజ్యమును పాతాళమును వారికిచ్చెను. ధరాధరములు ఱక్కలుగొని ధరణిని విడిచి రయమున కాబోవు విధి ననుసరించి మీది కెగసినవి. పర్వతములు విడిచిపోవ భూమి పట్టువదలినంత దానవరాజ్యము జలమయమయ్యెను. హిరణ్యాక్షుడది చూచి సురలవలననిది జరిగెనని శంకించి వారిపై సేనలతో దండెత్తెను. చతురంగబలముచే వేల్పులం గెలిచి స్వర్గరాజ్యముం గైకొనెను. అధికారము హరింపబడిన దేవతలింద్రునితో వాసుదేవుని శరణుజొచ్చిరి. హిరణ్యాక్షునిచే వివాసితులయిన సురల నభయదానముచే సంఘటపరచి విష్ణువిపుడేమి రూపముదాల్చి యా రాక్షసుం జంపుదునని యాలోచనసేసెను. బ్రహ్మవరమున వాడు పశుపక్ష్యాదుల కవధ్యుడని తలంచి దేవుడుగాదు మానవుడుగాదు తిర్యగ్రూపముచేతనే వానింజంపెదనని నృవరాహమయ్యెను. గుండగొట్టిన కాటుక కొండవలెనై బంగారురంగు వలువదాల్చి యమునానది సుడివలె నల్లనైన మేనొంది యదేనుడి రంగుగల రోమములతో నీటితోడి కాటుక కాంతిగొని పసుపుపచ్చని వస్త్రముందాల్చి మెరుపుతోడి మేఘమట్లుండెను ఉరమున హారముందాల్చి చంద్రునికాంతి నెనసి బెగ్గురు పక్షులతోడి మేఘమట్లు సర్వభూతమయుడయిన హరిశోభించెను. సూర్యచంద్రులకీడయిన శంఖచక్రములను దాల్చి పాదచారియగు పర్వతమట్లు పెద్దమేఘమట్టి రూపము వేగము గలవాడై మహాబలపరాక్రమమున దానవేంద్రుని వధింపగోరి హిరణ్యాక్షుని సభ##కేగెను. దానవాన్ చోదయామాస తిర్యగ్జాత మపూర్వకమ్ | గృహ్యతాం వధ్యతాం చైవ క్రీడార్థం స్థాప్యతాం తథా || 24 ఇత్యేవముక్త స్సంరబ్ధః పాశహస్తాంస్తు దానవా& | జిఘృక్షమాణాం శ్చక్రేణ జఘాన శతశో రణ || 25 హన్యమానేషు దైత్యేషు హిరణ్యాక్షో೭థ దానవా& | చోదయామాస సంరబ్ధా& వరాహాధిక కారణాత్ || 26 చోదితా దానవేంద్రేణ దానవాశ్శస్త్ర పాణయః | ప్రవవర్షు స్తథా దేవం శస్త్రవర్షేణ కేశవమ్ || 27 దైత్యాశ్శస్త్రనిపాతేన దేవదేవస్య చ్రకిణః | నైవశేకు ర్వృధాం కర్తుం యత్నవంతో೭పి నిర్భయాః || 28 హన్యమానో೭పి దై త్యేంద్రైర్దానవాన్ మధుసూదనః | జఘాన చక్రేణ తదా శతశో೭థ సహస్రశః || 29 హన్యమానేషు సై న్యేషు హిరణ్యాక్ష స్స్వయం తతః | ఉత్థాయ ధసుషా దేవం ప్రవవర్ష సురోత్తమమ్ || 30 హిరణ్యాక్షస్తుతాన్ దృష్ట్వా విఫలాంశ్చ శిలీముఖాన్ | శిలీముఖాభాన్ సంపశ్య& సమపశ్యత్ మహద్భయమ్ || 31 తతో೭సై#్ర ర్యుయుధే తేన దేవదేవేన చక్రిణా | తాన్యస్య ఫల హీనాని చకార భగవా& స్వయమ్ || 32 తతో గదాం కాంచన పట్టనద్ధాం విభూషితాం కింకిణిజాల సంఘైః | చిక్షేప దైత్యాధిపతి స్సఘోరాం తాంచాపి దేవోవిఫలీచకార || 33 శక్తింతతః పట్టపినద్ధమధ్యా ముల్కానలాభాం తసనీయ చిత్రామ్ | చిక్షేపదైత్య స్సవరాహకాయే హుంకార దగ్ధా నిపపాత సాచ || 34 తతస్త్రిశూలం జ్వలితాగ్రశూలం సశీఘ్రం దేవగణస్య సంఖ్యే | దైత్యాధిప స్తస్య ససర్జ వేగా దవేక్షితః సో೭పిజగామ భూమిమ్ ||35 శంఖస్వనేనా೭పి జనార్దనశ్చ విద్రావ్య దైత్యాన్సకలా న్మహాత్మా| సకుండలం దైత్యగణాధిపస్య చిఛేద చక్రేణ శిరః ప్రసహ్య || 36 నిపాతితే దైత్యపతౌ స దేవ స్సంపూజిత శ్శక్ర పితామహాభ్యామ్ | మయాచ సర్వైస్త్రిదశై స్సమేతైర్జగామ కాష్ఠాం మనసా త్వభీష్టామ్ || 37 శక్రో೭పి లబ్ధ్వా త్రిదివం మహాత్మా చిఛేద పక్షా& ధరణీ ధరాణాం | రరక్షచేమాం సకలం త్రిలోకీం ధర్మేణ ధర్మజ్ఞభృతాం వరిష్ఠః || 38 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకరగీతాను నృవరాహ ప్రాదుర్భావే హిరణ్యాక్షవధోనామ త్రిపంచాశత్తమో೭ధ్యాయః. హిరణ్యాక్షుడా నృవరాహమూర్తింగని కనివినయెరుంగని యాజంతువుంబట్టడు కొట్టుడనియు క్రీడార్థముగ నిలుపుడనియునని సంరంభించి పాశహస్తులైన దానవులం బ్రేరేపించెను. దానవేంద్ర చోదితులై రాక్షసులు శస్త్రపాణులై హరిపై శస్త్రవర్షముం గురిపించిరి. కాని చక్రాయుధుని శస్త్రసాతము వమ్మొనరింప నేరరైరి. దైత్యులలచే గొట్టబడుచుండియు వెనుదివియక చక్రాయుధముచే వందలువేలుగ రాక్షసులం గొట్టెను. అంతట హిరణ్యాక్షుడు తన వారితో విజృంభించి విల్లుగొని యమ్ములను వర్షించెను. అవి యన్నియు విఫలములగుట గని తుమ్మెదలట్టివయి విఫలములగతిగని పెద్ద భయముగొని జవైతుండ నస్త్రములం బోరెను. భగవంతుడు వానిని విఫలము సేసెను. అవ్వల దైత్యుల బంగారు పట్టము చిఱుగంటలుం గల ఘోరమయిన గదగొని విసరెను. హరి దానిని వమ్మొనరించెను. నడుమ పట్టబద్ధమై ఉల్కాగ్నివలె జ్వలించు స్వర్ణచిత్రమయిన శక్తియను నాయుధము నావరాహము మేనిపై విసరెను. అదియును నావరాహము హుంకారమున దగ్ధమై పడిపోయెను. గగనమందు త్రిశైలమును శీఘ్రగమయిన దానిని దేవసైన్య మధ్యమున వదలెను. అదియు జూచిన మాత్రన భూమిందూరెను. విష్ణువు శంఖధ్వనిమాత్రమున సరవ్వదానవులం రరిమి యమ్మహాత్ముడు చక్రముచే దైత్యరాజు శిరమును నరకెను. దానవుడు కూలగానే యా విష్ణువు బ్రహ్మేంద్రులచే జక్కగ బూజింపబడి శంకరునితో నెల్లదేవతలతో తనయిచ్చవచ్చిన దెసకుంజనెను. ఇంద్రుడు త్రిదివ సామ్రాజ్యముం బొంది పర్వతముల రెక్కలనరకి ధర్మజ్ఞవరిష్ఠుడు గావున ధర్మముచే సర్వభువనత్రయమును రక్షించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శంకరగీతలందు నరవరాహావతారము హిరణ్యాక్షవధయను నేబదిమూడవ యధ్యాయము.