Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఏబదిఐదవ యధ్యాయము - వామనావతారము శంకర ఉవాచ: హతే హిరణ్యకశిపౌ దానవే దేవకంటకే | హతశేషాస్తుదైతేయాః పాతాళతలమాశ్రితాః || 1 పాతాళతల సంస్థేషు దానవేషు మహాయశాః | ప్రహ్లాద పౌత్రో ధర్మాత్మా విరోచనసుతో బలిః || 2 ఆరాధ్య తపసోగ్రేణ వరంలేభే పితామహాత్ | అవధ్వత్వ మజేయత్వం సమరేషు సురాసురై ః || 3 వరలబ్ధం బలిం జ్ఞాత్వా పునశ్చక్రుర్దితే స్సుతాః | ప్రహృష్టా దైత్యరాజానం ప్రహ్లాదానుమతే ర్బలిమ్ || 4 సంప్రాప్య దైత్యరాజ్యంతు బలేన చతురంగిణా | జిత్వా దేవేశ్వరం శక్ర మాజహారా೭మరావతీమ్ || 5 స్థానభ్రష్టో మహేంద్రో೭పి కశ్యపం శరణం గతః | కశ్యపేన తదా సార్ధం బ్రహ్మాణం శరణంగతః || 6 బ్రహ్మణా೭భిహితో దేవం జగామ శరణం హరిమ్ | అమృతా ధ్మాతమేఘాభం శంఖచక్రగదాధరమ్ || 7 దేవో೭ప్యభయదానేన సంయోజ్య బలసూదనమ్ | ఉవాచ వచనం కాలే మేఘ గంభీరయా గిరా || 8 దేవకంటకుడగు హిరణ్యకశిపుడు హతుడైన నంత హతశేషులగు దైతేయులు పాతాళతలముం జేరిరి. అయ్యెడ మహాకీర్తిశాలి ప్రహ్లాదుని మనుమడు విరోచనుని కొడుకు బలి యుగ్రతపమున సేవించి బ్రహ్మవలన ఏరికిగాని యవధ్యుడు సురాసురుల కజయ్యుడుంగా వరముంబడసెను. అది తెలిపి దితిసంతానము (దైత్యులు) ప్రహర్షమొంది ప్రహ్లాదుననుమతిని బలిని దైత్యరాజుంగావించిరి. బలి బలిమియై చతురంగా బలమున నెత్తిచని దేవేశ్వరులం గెలిచి యమరావతిని స్వాధీన మొనరించికొనెను. ఇంద్రుడు స్థానభ్రష్టుడై కశ్యపుని శరణొందెను. అతనితోగూడ బ్రహ్మను శరణుసొచ్చెకు. బ్రహ్మతెలుప నమృతపూరిత మేఘమట్లున్న శంఖచక్రగదలను దాల్చియున్న హరిని శరణందెను. ఆ దేవుండును బలారికి సభయదానము చేసి కాలమేఘ గంభీరముగ నిట్లు పలికెను. శ్రీ భగవానువాచ : గఛ్ఛ!శక్ర ! భవిష్యామి త్రాతాతే బలసూదన ! | దేవరూపధరో భూత్వా పంచయష్యామి తం బలిమ్ || 9 శంకర ఉవాచ: ఏవముక్తస్తదా శక్రః ప్రయ¸° కశ్యపాశ్రమమ్ | ఆది దేశాదితేర్గర్భం చాంశేనా థచ సర్వధా || 10 గర్భస్థ ఏవ తేజాంసి దానవేభ్యః స ఆదదే | తతః కాలేన సుషువే అదితి ర్వామనాకృతిమ్ || 11 యస్మిన్ జాతే సురగణాః ప్రహర్షమతులం గతాః | ఋషయశ్చ మహాభాగా సై#్రకాల్యామలదర్శినః || 12 శక్రా ! నీ వేగుము. నీ కేను రక్షకుండనయ్యెదను. దేవరూపము ధరించు యాబలిని పంచించెదనని హరియన విని యింద్రుడు కశ్యపు నాశ్రమమున కేగెను. హరి స్వాంశమున నదితిగర్భముం జొచ్చి యందుండియే దానవులతేజస్సులనాచికొనెను. అవ్వల నదితి వామనమూర్తింగనెను. అత డవతరింపత్రైకాల్యవర్తనము స్పష్టముగ జూడగల నురగణముల మితానందమందిరి. ఏతస్మిన్నేవ కాలేతు హయమేధాయ దీక్షితః | బలిర్దైత్యపతి శ్శ్రీమాన్ స్పాలిగ్రామముపాశ్రితః || 13 వామస్కన్ధే తమాదాయ తస్య యజ్ఞే బృహస్పతిః | అనయద్భృగు శార్దూల ! నూనం తసై#్యవ మాయమా || 14 యజ్ఞవాటం స సంప్రాస్య యజ్ఞం తుష్టావ వామనః | ఆత్మాన మాత్మనా బ్రహ్మన్ ! భస్మచ్ఛన్న ఇవానలః || 15 ప్రవేశయామాస చ తం బలి ర్ధర్మభృతాం వరః | దదర్శచ మహాభాగం వామనం సుమనోహరమ్ || 16 సంయుక్త సర్వావయవైః పీనై స్సంక్షిప్త పర్వభిః | కృష్ణాజిన జటాదండ కమండలువిరాజితమ్ || 17 విక్రష్యన్ యథా వ్యాఘ్రోలీయతిస్మ స్వవిగ్రహే | విక్రమిష్యన్ తథై వోర్వీం లీనగాత్రః స్వవిగ్రహే || 18 తస్మాత్తు ప్రార్థయ ద్రాజన్ ! దేహి మహ్యం క్రమత్రయమ్ || 19 ఇదే సమయమున బలి అశ్వమేధ దీక్షితుడయ్యెను. శ్రీమంతుడు బలి స్పాలిగ్రావమందుండి యజ్ఞారంభమొనరించెను బృహస్పతి ఈచిన్ని వడుగుం దనమూపుపై నెక్కించుకొని యావిష్ణుమాయనుంబట్టయే బనియొక్క యజ్ఞవాబమునకుం గొంపోయెను. వామనుడట జేరి నివురుగప్పిననిప్పట్లుండి యయ్యజ్ఞమును దనస్వరూపమయిదానిం దాన పొగడెను. ధర్మశీలురలో నుత్తముడగు బలియా వడుగును లోనికిం బ్రవేశింపజేసెను. మఱియు నా మనోహరమూర్తి మహాభాగుని యన్నియవయవములు పుష్టికొని యొండొంటి నొదుగుకొనియున్నవి. కృష్ణాజినము జడలు దండకమండలు పులుందాల్చియున్నాడు. విక్రమింపబోవుబెబ్బులియట్లు దన విగ్రహమును దాన కుంచించుకొని ఉర్వీమండలమెల్ల నాక్రమింపనుండియు తన విగ్రహమందు దానుదాగి యున్నాడు. అట్టి వామనునిం బలి దర్శించెను. వామనమూర్తి, ఓ రాజా ! నాకు మూడడుగుల మేర యిమ్మని బలిని ప్రార్థించెను. ఏవ ముక్తస్తు దేవేన బలి ర్ద్యైత్యగణాధిపః | ప్రదదా వుదకం తస్య పావయ స్వేతి చాబ్రవీత్ || 20 అన్యచ్చ యదఖీష్టన్తే తద్గృహోణ ద్విజోత్తమ ! | ప్రతి జగ్రాహచ జలం ప్రవాత్యేవ తదాహరిః || 21 ఉద్ఙ్మఖై ర్ద్యైత్యవరై ర్వీక్ష్యమాణ ఇవాంబుదః | ఆక్రమంస్తు హరిర్లోకాన్ దానవా శ్శస్త్రపాణయ ః || 22 అది విని బలిచక్రవర్తి యా వటువునకు పాద్యార్ఘ్యములిచ్చి. నన్నుపావనుంజేయుమనెను. మఱియేదేని కోరిక గలదేవి యదియుం గైకొనుమనెను. వామనుడు సుడిగాలివోలె ఆ ప్రతిగ్రహ జలమును గ్రహించి లోకములను ఆక్రమించుచున్న మేఘమువలెనున్న యాహరిని నుదజ్ముఖులయిన రాక్షసశ్రేష్ఠులు జూచుచుండిరి. ఆభిద్రవన్తి వేగేన నానా శస్త్రశిరోధరాః | గరుడాననాః ఖడ్గముఖాః మయూర వదనా స్తధా || 23 ఘోరా మకరవక్త్రాశ్చ క్రోష్టువక్త్రాశ్చ దానవాః| ఆఖు దర్ధర వక్త్రాశ్చ ఘోరా పృకముఖాస్తథా || 24 మార్జారశశవక్త్రాశ్చ హంస కాకాననా స్తథా | గోధా శల్యక వక్త్రాశ్చ ఆజావి మహిషాననాః | 25 సింహ వ్యాఘ్ర శృగాలానాం ద్వీపివానరపక్షిణామ్ | హ స్త్యశ్వగోఖరోరాష్ట్రాణాం భుజగానాం నమాననాః || 26 ప్రతిగ్రహజలం ప్రాప్య వ్వవర్ధత తదా హరిః | ఉదఙ్ముఖై ర్దేవగణౖరీక్ష్యమాణ ఇవాంబుదః || 27 విక్రమన్తం హరిం లోకాన్ దానవాశ్శస్త్ర పాణయః |మత్స్య కచ్ఛప వక్త్రాణాం దర్ధురాణాం నమాననాః || 28 స్థూల దన్తా వివృతాక్షా లంబోష్ఠజఠరా స్తథా | పింగళాక్షాః వివృత్తాస్యాః నానా బాహు శిరోధరాః || 29 స్థూలగ్రనాసాశ్చిపిటా మహా హనుకపాలినః | చీనాంశుకోత్తరాసంగాః కేచిత్ కృష్ణాజినాం೭బరాః || 30 భుజంగభూషణా శ్చాన్యే కేచిన్ముకుట భూషితాః | సకుండలా స్సకటకా స్సశిరస్త్రాణమ స్తకాః 31 ధనుర్బాణ ధరాశ్చాన్యె తథాతోమరపాణయః ! | ఖడ్గచర్మధరాశ్చ೭న్యే తథాతోమర పాణయః || 32 శతఘ్నీచక్రహస్తాశ్చ గదా ముసలపాణయః | అశ్మయంత్రాయుధోపేతా ఖిండిపాలాయుధా స్తథా || 33 శూలోలూఖల హస్తాశ్చపరశ్వధ ధరా స్తధా | మహావృక్ష ప్రవహణాః మహాపర్వత యోధినః || 34 క్రమమాణం హృషీ కేశముపావర్తన్త సర్వశః | స తాన్ మమర్ద సర్వాత్మా తన్ముఖాన్ దేవదానవాన్ || 35 సరసీవ మహాపద్మా& మహాహస్తీవ దానవా& | ప్రమధ్య సర్వా& దైతేయా& దైతేయా& హస్తపాదతలై స్తతః || 36 రూపం కృత్వా మహాభీమ మాజహారాశు మేదినీమ్ | తస్యవిక్రమతో భూమిం చంద్రాదిత్యౌ స్తనాంతరే || 37 పరం ప్రక్రమమాణస్య నాభిదేశే వ్యవస్థితౌ | తతః ప్రక్రమమాణస్య జాసుదేశే వ్యవస్థితా || 38 తతో೭సి ప్రమమాణస్య పద్భ్యాందేవౌ వ్యవస్థితౌ | జిత్వాస మేదినీది కృత్స్నాంహత్వాచాసుర పుంగవా& || 39 దదౌ శక్రాయ వసుధాం విష్ణుఃబృవతాం వరః | స్వంరూపంచ తథా೭೭సాద్య దానవేంద్ర మభాషత || 40 శ్రీ భగవానువాచ : యజ్ఞవాటే త్వదీయే೭స్మి& స్పాలిగ్రామే మహాసుర | మయా నివిష్టపాదేన మాపితేయం వసుంధరా || 41 చిత్రవిచిత్రముఖులయిన రాక్షసులు ఆయుధ పాణులై యెదుర్కొనిరి. ప్రతిగ్రహ జలమును స్వీకరించి వామనుడు పెంపొందెను. పెరుగుచున్న హృషీకేశుని వివిధాయుధ ధరులై రాక్షసులు చుట్టుముట్టడించిరి. అయ్యెడ నతి వేగమున రాక్షసులు పరువులువారిరి. వారు నానా ముఖ నానాకంఠములవారు. గరుడముఖులు ఖడ్గముఖులు నెమలిముఖుమువారు, నక్క ఎలుక కప్ప తోడేలు పిల్లి కుందేలు హంస కాకి ఉడుము శల్యకము (ఒకరకము ముత్యపు చిప్పవంటి ముండ్లతో గూడినది) మేక గొఱ్ర దున్నపోతు సింహ వ్యాఘ్ర = శృగాలములు (నక్క) ధ్వీపి - చిరుత పులి కోతి పక్షులు ఏనుగు గుఱ్ఱము గోవు గాడిద ఒంటె పాములు అనువాని ముఖములుగలవా రయ్యెడకేగిరి. ప్రతిగ్రహజలము (దానధార) గైకొని హరి ఉత్తరాభిముఖులై దేవతలు చూచుచుండ మేఘమట్లు పెరుగనారంభించెను. లోకముల నాక్రమించు హరింగని దానవులాయుధహస్తులై చేపలు తాబేళ్లు కప్పలవంటి మొగములతో స్థూలదంతులై బాగాతెఱచుకొన్న కండ్లతో వ్రేలాడు పెదవులు కడుపులతో ఎఱ్ఱగృడ్లతో నోర్లుతెఱచుకొని నానా భాహుశిరోధరాలై (శిరోధరము=మెడ) బొర్రముక్కులు నడ్డిముక్కలు గొని పెద్ద దవడలు తల పుఱ్ఱలు గలవారై చీనాంబరోత్తరీయులై కొందఱు కొందఱు కృష్ణాజిరధారులై పాములంగై సేసి కిరీటకూడలములు పెట్టుకొని కడియములూని పాగలు దాల్చి విల్లమ్ములు తోమరములు = చిల్లకోలిలు కత్తులు డాలులు లాటీలు శతఘ్ని (నాల్గుమూరలు యినుపముండ్లకర్ర) చక్రములు గద ముసలము (రోకలి) ఆశ్మయంత్రము( ఇనుపయంత్రము) బండిపాలము (ఇనుప గుదియు) శూలము ఉలూఖలము పరశ్వధము = గండ్రగొడ్డలి మున్నగు నాయుధసామగ్రిని జేతబట్టుకొని పెనుమ్రాకులు కొండలు పూని మూడడుగులాక్రమించు హృషికేశుని గ్రమ్ముకొనిరి. ఆతడాయందఱకు సరస్సు నందున్న పెద్దతామర పూలను గజమట్లు మర్దించెను. అరచేతులంబాదతలములం జావగొట్టి మహాభయంకర రూపములగొని భూమింగైకొనెను. భూమి నాక్రమించునాతనికి చంద్రసూర్యులు స్తనాంతరమునకు వచ్చిరి. ఇరికసు నెదుగ నాభికి వచ్చిరి ఇంక నింతింతయగు చున్నవటువునకు మోకాళ్లదరికివచ్చిరి. అపైనికూడ సంతంతగ చెరుగుచున్న యీ పొట్టివాని యడుగుల కడకువచ్చిరి. మేదిని నెల్లగెలిచి అసుర ప్రధానుల గూల్చి యీ విష్ణువు ఇంద్రునకు వసుధ నిచ్చెను. అట్లు నిజరూపము నొంది దానవేంద్రుని కడకుజని ఓమహాసురా! స్పాలిగ్రామమన నీయీ యజ్ఞవాటియందు నాయడుగునుంచి యీ భూమినెల్ల కొలచికొంటిని. ప్రథమంతు పదంజాతం నౌర్భంధ శిఖరే మమ | ద్వితీయం మేరుశిఖరే తృతీయం నా೭భవత్ క్వచిత్ || 42 తన్మేవరయ దైత్యేంద్ర యన్మయా೭೭ప్తం ప్రతిగ్రహమ్ | బలిరువాచ : యావతీ వసుధాదేవ ! త్వయైవ పరినిర్మితా || 43 తాపతీతేన సంపూర్ణా దేవదేవ | క్రమత్రయమ్ | సకృతం యత్త్వయా దేవ ! కుతస్తన్మే మహేశ్వర ! || 44 నచ తద్విద్యతే దేవ ! తధైవా೭న్యస్య కన్యచిత్ | శ్రీభగవానువాచ : నమే త్వయా పూర్యతే మే దానవేంద్ర ! యధాశ్రుతమ్ || 45 సుతలం నామ పాతాలం వస ! తత్ర సుసంయతః | మయైవ నిర్మితా తత్ర మనసా శోభనాపురీ || 46 జ్ఞాతిభి స్సహ ధర్మిష్ఠై ర్వస తత్ర యథాసుఖమ్ | తత్రత్వం భోక్ష్యసే భోగా& విశిష్టాన్ బలసూదనాత్ || 47 అవాప్స్యసి తథా భోగా& లోకా ద్విది విపర్జితా& | ప్రాకామ్యయు క్తర్చతథా లోకేషు విహరిష్యసి || 48 మన్వంతరే ద్వితీయేచ మహేంద్రత్వం కరిష్యసి | తేజసా చ మదీయేన శక్రత్వే యోక్ష్యసే బలే || 49 తపశత్రుగణా& సర్వా& ఘాతషాయ్యి మ్యహం తదా | బ్రహ్మణ్యస్త్వం శరణ్యస్త్వం యజ్ఞశీలః ప్రియంవదః || 50 తపస్వీ దానశీలశ్చ వేదవేదాంగ పారగః | తస్మా ద్యశో೭భివృద్ధ్యర్థం మయాత్వమభిసంధితః || 51 దేవరాజాధికా& భోగా& పాతాలస్థో೭పి భోక్ష్యసే | సన్నిధానంచ తత్రాహం కరిష్యా మ్యసురాధిప || 52 మయాచ రంస్యసే సార్ధం స్పృహణీయ స్సురైరపి | శక్రత్వంచ తథా కృత్వా భావ్యే సాపర్ణికేంతరే || 53 సర్వసంధి వినిర్ముక్తో మయైవ సహ రంస్యసే || 54 శంకర ఉవాచ : ఇత్యేప ముక్త్వా సజలాంబుదాభః ప్రత ప్తచామీకరధౌతవస్త్రః | అదర్శనం దేవవరో జాగామ శక్రశ్చ లేభే సకలాం త్రిలోకీమ్ || 55 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయవజ్రసంవాదే శంకరగీతామ వామనప్రాదుర్భావోనామ పంచ పంచాశ త్తమోధ్యాయః. మొదటి యడుగు నౌర్బంధమగుశిఖరమునందుండినది. రెండవ యడుగు వేరపుశిఖరమందున్నది. మూడవయడు గుంచుటకు మేర కనిపింపదు. కావున నాకైకొన్న దానము పూర్తచేయు వలయును. అది యెట్లు సేయవలయునో కోరుము. అనబలి దేవా! నీచేతనేయెంత వసుధ నిర్మింపబడెనదిది యంతయు, నీకు సరిపోలేదు. నీకు లభింపని కడమ భూమి నాకెక్కిడిది? నాకులేదు సరిగదా వాదియింకొయించుకమేర లేదు. అన విని భగవంతుడు వాగ్ధానము చేసినది చేసినట్లు నీవునాకు చెల్లింపలేదు కావున నీవు సుతలమను పాతాళమున వసింపుము. నేనే యక్కడ శోభనమైన పురము మనస్సుచే నిర్మించితిని. నీజ్ఞాతులతో ధర్మిష్ఠులతో నీవచట సుఖముండుము. అక్కడ నీవు బలారికంటె నెక్కుడు భోగముల ననుభవింతువు. విధి విహితములుగాని యపూర్వ భోగముల నటనొందెదవు. ప్రాకామ్యముతో (సర్వ వాంఛాసాఫల్య సమృద్ధితో) నీవు లోకములందు విహరింతువు. రెండవ మన్వతరమందు నీ వింద్రత్వముంజేయుదువు. నీ యింద్రత్వమునందు నా తేజస్సు కూడ సంయోజింపబడును. నీ శత్రుగనములనందరి నేను తుదముట్టింతును. నీవు బ్రహ్మణ్యుడవు యజ్ఞశీలుడవు ప్రియంపదుడవు తపస్విని దాతవు వేదవేదాంగపారగుడవు. అందుచే నీకెనలేని కీర్తి కలుగగోరి నేను నీతో సమావేశము చేసితిని. దేవేంద్రుని మించిన భోగముల నీవు పాతాళమున ననుభవింతువు. అచ్చట నేనును సన్నిధానమొనరింతును. నాతోగూడ దేవతలును ముచ్చటపడునట్లు రాబోవుసానర్ణికమన్యంతరమున నింద్రత్వమును నిర్వహింతువు. సర్వసంధిముక్తుడవై నాతోగూడ క్రీడింతువు. అని సజల జలద కాంతియు జాంబూనదసచ్చాయాంబరుడునగు విష్ణు పంతర్ధానమొందను. ఇంద్రుడను సకల త్రిలోక సామ్రాజ్యముం బొందెను. ఇది వామనావతారమను నేబది యైదవ అధ్యాయము