Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఏబదియెనిమిదవ అధ్యాయము - భక్తిలక్షణము శంకర ఉవాచ : అహింసా సత్యవచనం దయా భూతేష్వనుగ్రహః | యసై#్యతాని సదారామ | తస్య తుష్యతి కేశవః ||
1 మాతా పితృ గురూణాంచ య స్సమ్య గిహ వర్తతే | వర్జకో మధు మాంసస్య తస్య తుష్యతి కేశవః ||
2 వరాహమత్స్య మాంసాని యోనాత్తి భృగునందన | విరతో మద్యపానాచ్చ తస్య తుష్యతి కేశవః ||
3 న ధారయతి నిర్మాల్య మన్య దేవోద్ధృతం తు యః | భుంక్తే సచాన్య నైవేద్యం తస్య తుష్యతి కేశవః ||
4 అషైష్ణవే దేవధృతం నిర్మాల్యం యః ప్రయచ్ఛతి | నైవేద్యం వా మహాభాగ | తస్య తుష్యతి కేశవః ||
5 బిభర్తి మూర్ధ్ని నిర్మాల్యం కేశవార్చధృతం తు యః | అవివేద్య న చాశ్నాతి తస్య తుష్యతి కేశవః ||
6 పరపీడాకరం కర్మ యస్య నా೭స్తి మహాత్మనః | సంవిభాగీచ భూతానాం తస్య తుష్యతి కేశవః ||
7 శృణుతే సర్వధర్మాంశ్చ సర్వాన్ దేవాన్ సమస్యతి | అనసూయ ర్జితక్రోధ స్తస్య తుష్యతి కేశవః ||
8 తీర్థోపవాససేవీచ ద్విజాతిగణ సేవకః | పూజకో విష్ణు భక్తానాం తస్యతుష్యతి కేశవః
9 పంచరాత్ర విదో ముఖ్యావ్ యస్తు సంపూజయే త్సదా | దేవవద్భృగు శార్దూల | తస్యతుష్యతి కేశవః ||
10 పితృ దేవార్చన రతః స్వదార నిరత స్సదా | ఋతుకాలాఖిగామీచ తస్య తుష్యతి కేశవః ||
11 నామ్నాం సహస్రేణ తధా యశ్చగాయతి తన్మనాః | సతతం కల్య ముత్థాయ తస్యతుష్యతి కేశవః ||
12 పౌరుషేణ చ సూక్తేన జప్య హోమాదికం సదా | యః కరో త్యమిత ప్రజ్ఞ న్తస్య తుష్యతి కేశవః ||
13 మిత్రస్వామిగురుద్రోహో యస్యనా೭స్తి మహాత్మనః | పరదార ధనేచ్ఛాన తస్య తుష్యతి కేశవః ||
14 రాజా శాస్త్రోపదేశేన రాజ్యం యశ్చ ప్రశాపతి రాజధర్మరతి ర్నిత్యం తస్య తుష్యతి కేశవః ||
15 యాతు నారీ పతిప్రాణా పతిభక్తా పతివ్రతా | తస్యా స్సుతోషో భగవాన్ తోష మాయాతి కేశవః ||
16 అగ్నిహోత్ర పరో విద్వాన్ యజ్ఞైర్నిత్య మతంద్రితః || యస్తు తర్పయతే దేవాన్ తస్య తుష్యతి కేశవః ||
17 స్వవర్ణాశ్రమధర్మస్థః పూజయన్ మధుసూదనమ్ | కాలం నయతి యో బ్రహ్మన్ ! తస్య తుష్యతి కేశవః ||
18 సోపవాసస్తు పక్షాన్తే ద్వాదశ్యాం వా భృగూత్తమ | బౌధే೭హ్ని శ్రవణర్షేవా తృతీయాయాంతు వాపునః || సోపవాసో೭ర్చయతి యస్తస్య తుష్యతి కేశవః ||
19 పుష్పం వినా హరిం ప్రాప్య ఫలీ రత్నం క్షుమాంచనా | నివేదయతి యః కృష్ణే తస్య తుష్యతి కేపవః ||
20 కృష్ణె పశ్యతి యత్సర్వం కృష్ణం సర్వత్ర పశ్యతి | మహాత్మా బుద్ధి సంపన్న స్తస్య తుష్యతి కేశనః ||
21 తత్కథాయాంచ రమతే తత్కథాం యఃకరోతిచ | తన్మనా స్తద్గతప్రాణ స్తస్య తుష్యతి కేశవః ||
22 సర్వభూత హితే యుక్త సర్వభూతహితే రతః | సర్వ భూతాను కంపీచ తస్య తుష్యతి కేశవః ||
23 అప్రణమ్య క్రియాంకాంచి ద్యస్తునా೭೭రభ##తే హరిమ్ | అసంభిన్నార్థ మర్యాద స్తస్య తుష్యతి కేశవః ||
24 నామ సంకీర్తనం నిత్యం క్షుత ప్రస్ఖలనాదిషు | యః కరోతి మహాబాగ స్తస్య తుష్యతి కేశవః ||
25 నవం పత్రం ఫలం పుష్పం నివేద్య మధుసూదనే |పశ్చాద్భుం క్తేస్వయం యశ్చ తస్య తుష్యతి కేశవః || 26 ఆపద్యపిచ కష్టాయాం దేవేశ శపథం నరః | న కరోతి హి యోబ్రహ్మ&! తస్య తుష్యతి కేశవః || 27 అపద్యపిచ కష్టాయాం దేవేశ శపథం నరః | స కరోతి హి యోబ్రహ్మ& ! తస్య తుష్యతి కేశవః || 27 దేవాదుధ్ధృత్య నిర్మాల్యం ఛాయాం నాక్రమతేచయః | ధూపా೭గ్ని భస్మ చ తథా తస్య తుష్యతి కేశవః || 28 దృష్ట్వా సంపూజితా మర్చాంయశ్చ భక్త్యా೭భినందతి | స్వయం సంపూజయే ద్యస్తు తస్య తుష్యతి కేశవః ||
29 నిత్యం సంపూజయే ద్యస్తు దేవదేవస్య భక్తితః | యధాశక్త్యా మహాభాగ | తస్య తుష్యతి కేశవః ||
30 స రామ వివిధైర్దానైః న రత్న ధన సంచయైః | తోష మాయాతి దే వేశో భక్త్యా తుష్యతి కేశవః ||
31 దానైర్భృగుశ్రేష్ఠ | బహుప్రకారై స్తీర్థోపవాస వ్రత దర్శనైశ్చ | తథా సతోషం భగవాన్ ప్రయాతి భక్త్యా యధా తద్గత మానసానామ్ ||
32 ఏతావదుక్తం తవ రామ | గుహ్యం న దేయ మేతద్భువి మత్సరాణామ్ | స తర్క శాస్త్రాకుల మానసానాం నా೭వైష్ణవానాం నచ నాస్తికానామ్ ||
33 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయవజ్రసంవాదే భక్తిలక్షణోనామ అష్ట పంచాశత్తమో೭ధ్యాయః. శంకరుడనియె : అహింస సత్యము దయ భూతములపై అనుగ్రహము గలవాడు మాతాపితృ గురువులయెడ మంచిగా వర్తించువాడు మధుమాసంముల వర్జించినవాడు వీరియెడ కేశవుడు తుష్టుడగును. పంది, చేపలమాంసము తిననివాడు కల్లుత్రాగనివాడు ఇతరదేవతానిర్మాల్యమును ఇతర దేవతానివేదితప్రసాదమును దీసికొననివాడు నగువారియెడ హరిప్రసన్నుడగును. విష్ణుభక్తుడుకానివానికి నిర్మాల్యమును ప్రసాదమునిచ్చినవానియెడ నారాయణుడు హర్షించును. హరికి నాహారమునివేదించి సేవించువానియెడ హరి సంతుష్టుడగును. ఏమహానుభావుడు పరులకు బాధకల్గించుపనిసేయడో భూతకోటికి తాను గైకొను నాహారాదులను గొంతు విభజించియిచ్చు వాని యెడ హరి తృప్తుడగును, సర్వధర్మములు వినుచు సర్వదేవతలకు నమస్కరించు నసూయలేని కోపములేని వానియెడ కేశవుడు సంతోషించును. తీర్థసేవసేయు వాడు ద్విజసమూహ సేవకుడు, విష్ణు భక్తపూజకుడు, పాంచరాత్రాగమము తెలిసిన యుత్తముల దేవునట్లు సంపూజించువాడు పితృదేవతార్చన సేయువాడు స్వదారనిరతుడు ఋతుకాలమందే భార్యంబొందువాడు నిరంతరము వేకువనులేచి విష్ణునామ సంకీర్తనసేయువాడు పురుషసూక్తము జపించి హోమము సేయువాడు మిత్ర గురు స్వామి ద్రోహము సేయనివాడు పరదారధనాదులు గోరనివాడు శాస్త్రోపదేశానుసారము రాజ్యపాలన సేయువాడు రాజధర్మాసక్తుడు నైన వాని యెడ విష్ణువు సంప్రీతుడగును. ఏ స్త్రీ పతియే ప్రాణమనుకొని పతిభక్తికలదై పతివ్రతయగునో యామెయెడ హరి సంతుష్టు డగును. ఎవడు విద్వాంసుడై (జ్ఞానియై) లేక కర్మాచరణ విధానము మంతార్థము దేవతా స్వరూపాదులు తెలిసినవాడై యజ్ఞములు సేసి నిత్యమును దొందరపాటులేక దేవతలకు దృప్తినొందించునో వానియెడ హరిసంతుష్టుడగును. తన వర్ణాశ్రమ ధర్మముల గావించుకొనుచు హరి పూజనము సేయుచు కాలము వెళ్లించునతనికి విష్ణువు సంతోషించును. ఏకాదశినాడు పక్షము చివర నుపవాసముండి ద్వాదశినాడు బుధవారం నాడు శ్రవణ నక్షత్రమందు తదియనాడు హరినర్చించిన వానియెడ మాధవుడు ప్రసన్నుడగును. పూవులేకుండ హరిసన్నిధికేగి ప్రియంగువును క్షుమాం = అవిసెపువ్వును (కూరవండి) నివేదించిన వానియెడ హరి సంతోషించును. ఏమానవుడు కృష్ణునియందు సర్వమును సర్వమునందు కృష్ణునింజూచునో అమహాత్మునియెడ బుద్ధిమంతుని యెడ హరి ప్రసన్నుడగును. హరియందు మనసుంచి హరియే తన ప్రాణమనుకొని హరికథలను విని యానందించుచు శ్రీపతి కథలను జెప్పునాతనియెడ నారాయణుడు సంతుష్టుడగును. సర్వ భూతహీతాభిరతుడై సర్వభూతానుకంపియైన వానికి హరి సంతుష్టిసెందును హరికి మ్రొక్కకుండ హరినుద్దేశించి హరిసమర్చనము మొదలుగ గృహకృత్యమేది కాని యెవ్వడారంభింపడో తానుజేయు కర్మాచరణ ముందువినియుక్తమగు మంత్రము యొక్క యర్థము దానికి క్రియకు గల సంబంధము దానివలన కలుగు ఫల స్వరూపము తెలిసి శాస్త్రమర్యాద దాటకుండ నెవ్వడాచరించునో యతనియెడ శ్రీపతి సంతుష్టుడగును. తుమ్ము మొదలయినవి జరిగిన తరి నిత్యము మంత్రము క్రియపొరబడినపుడు గోవింద గోవింద కృష్ణ కృష్ణయను నామ కీర్తనముసేయు మహానుభావునియెడ హరి సంతోసించును. నూతనమైన పత్రము (తులసి మొదలయిన పత్రి) పండుపువ్వు మధుసూదనునకు నివేదించి యావల నాస్వామి నుండి నిర్మాల్యముగ దానింగైకొని యెవ్వడు తాననుభవించునో వానియెడ కేశవుడానంద భరితుడగును. అదేవదేవునెడ భక్తితో యధాశక్తి నిత్యార్చనము సేయు నాతని యెడ హరి సంప్రీతుడగును. రామా! వివిధ దానములచేత రత్న ధనరాసులచేత దేవేశుడు సంతోషింపడు భక్తికి సంతోషిచును ఓభృగువంశాభవణా! పలురీతులగు దానములు తీర్థాటనములు ఉపవాసములు వ్రతములు దర్శనములు చేయువానిచే తదేకాగ్ర మనస్కుల భక్తిచేత సంతోషించినంతగ సంతోషింపడు. గోప్యమైన విషయమిది యిందాక రామా! నీకు తెల్పితిని. భువిలో దీనిని మాత్సర్యముగల వారికి తర్కశాస్త్రములచే వికలమైన మనస్సుగలవాండ్రకు విష్ణుభక్తులుకాని వాండ్రకు నాస్తికులకును నీ యుపదేశ మీయదగదు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున శంకరగీతలందు భక్తిలక్షణమను నేబది ఎనిమిదవయధ్యాయము