Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఆఱవ అధ్యాయము ద్వీపవిభాగము వజ్ర ఉవాచ : భూమండలస్య కృత్స్నస్య సంస్థానేన చ భార్గవ ! వదః ప్రమాణం కృత్స్నంతత్ తత్రమే సంశయో మహాన్ ||
1 మార్కండేయ ఉవాచ భూమండలస్య రాజేంద్ర ! మధ్యేమేరు ర్మహాగిరిః | యోజనానాం సహస్రాణి తస్యమధ్యే సమన్తతః ||
2 జంబూ ద్వీపస్తు పంచాశత్ప్రమాణన ప్రకీర్తితః | యోజనానాంతు నియుతం తస్యపాదం మహీపతే ||
3 లవణన సముద్రేణ తేనాసౌ పరివేష్టితః లవణ ద్విగుణనాపి శాకద్వీపేన లావణః ||
4 వేష్టిత శ్చ మహారాజ ! శాకద్వీపో నసంశయః క్షీరోదేన స్యతుల్యేన క్షీరోదో7పిచ వేష్టితః || 5 క్షీరోదద్వి గుణనాపి కుశద్వీపేన యోజనైః ఆజ్యోదేన కుశద్వీపః స్వతుల్యేస చవేష్టితః || 6 క్రౌంచద్వీపేన చాజ్యోదో ద్విగుణన చ వేష్టితః | క్రౌంచద్వీపః స్వతుల్యేన దధిమండోదకేన చ || 7 ద్వీపేన శాల్మలేనాథ ద్విగుణనచ వేష్టితః | సురోదో ద్విగుణనాధ గోమదేన చ వేష్టితః || 8 పుష్కరద్వీప మధ్యేతు ద్వీపసంస్థాన మండపః పర్వత స్సుమహాన్‌లోకే విఖ్యాతో మానసోత్తరః || 9 నియుతార్ధం యోజనానాం ప్రమాణన ప్రకీర్తితః | నానా ప్రకారశిఖర స్తావదేవ సముచ్ఛ్రితః || 10 మేరోస్తు పూర్వదిగ్భాగే మానసోత్తర మూర్ధని | పురీ శక్రస్య విఖ్యాతా నామత స్త్వమరావతీ || 11 పూర్వదక్షిణ దిగ్భాగే తధా వహ్నేః ప్రభావతీ | యమస్య దక్షిణభాగే నామ్నా సంయమనీ పురీ || 12 విరూపాక్షస్య విక్రాన్తా భాగే దక్షిణ పశ్చిమే | పశ్చిమే చ తథాభాగే వరుణస్య సుఖప్రభా || 13 శివానామ పురీ వాయో ర్భాగేవై పశ్చిమోత్తరే | విభావరీసోమ పురీఉత్తరేణ ప్రకీర్తితా || 14 వజ్రుడు సర్వభూమండలము యొక్క సంస్థానము (కూర్పు) సమగ్రప్రమాణ మానతిమ్మన మార్కండేయుండిట్లనియె. రాజేంద్రా! భూమండలమునకు నడుమ మేరుపర్వతమున్నది. జంబూద్వీపము దాని చుట్టు నేబది యోజనముల వైశాల్యము గలదియై యున్నది. దాని యొడ్డు లక్ష (నియుత) యోజనములు ఉప్పుసముద్రమావరించియున్నది. లవణ సముద్రముకు రెట్టింపగు శాక ద్వీపముచే నది యావరింపబడియున్నది. శాకద్వీపము తనతో సమానప్రమాణముగల పాలసముద్రముచే చుట్టబడినది. పాలసముద్రము తనకు రెట్టింపగు కుశద్వీపముచే వేష్టితము. కుశద్వీపము క్రౌంచద్వీపముచే నావృతమైనది. నేతిసముద్రము రెట్టింపుప్రమాణము గల క్రౌంచద్వీపము తనతో సమాన ప్రమాణముగల మీగడ సముద్రముచే నావరింపబడినది. రెట్టింపు పరిమాణముగల శాల్మల ద్వీపముచే సురాసముద్రమావరింపబడెను. సురాసముద్రము తనకు రెట్టింపైన గోమేదముచే నావరింపబడెను. పుష్కర ద్వీపమధ్యమందు ద్వీప సంస్థానమండపమట్లు మానసోత్తర మహాపర్వతమున్నది. దాని ప్రమాణము అర్ధనియుత యోజనములు. అనేక విధములయిన శిఖరములతో సంతేప్రమాణమెత్తుగల్గియున్నది. మేరువు తూర్పువైపు మానసోత్తరపర్వతము మూర్ధమందు ఇంద్ర రాజధాని అమరావతి యున్నది. ఆగ్నేయమూల అగ్ని రాజధాని ప్రభావతి. దక్షిణమందు యముని సంయమనీపురి యున్నది నిరృతి మూల విరూపాక్షుని నగరము విక్రాంతమున్నది. పడమటి దెస వరుణరాజధాని సుఖప్రభగలదు. వాయవ్య మూల వాయువు రాజధాని శివ యను పురమున్నది. ఉత్తర దిశ సోమునిపురము విభావరి గలదు. ఈశాన్యమూల శివుని శర్మదాపురి యున్నది. శర్మదాచపురీ శైవీ భాగేపూర్వోత్తరే స్మృతా | పుష్కరశ్చస్వ తుల్యేన వృతః స్వాదూదకేనచ || 15 స్వాదూదకాత్పరంక్షోణీ కార్తస్వరమయీ శుభా | యోజనానాం ప్రమాణన సహస్రాణితు వింశతిః || 16 దశచాన్యాని రాజేంద్ర ! పంచ పంచప్రకీర్తితా | సమంతత స్త్వేకశిలా సేవోద్యానేమహీ శుభా || 17 స్థితస్తాం పరివార్యోర్వీంలోకాలోకో మహీధరః | ఆయుతం యోజనానాంతు విస్తరేణోచ్ఛ్రయేనచ || 18 లోకా లోకే మహీపాల ! లోకపాలాస్త్వ మీస్మృతాః | ప్రాచ్యాదిషుమహావీర్యాః కల్ప స్థాయిన ఏవతే || 19 సుదామా శేషపాదశ్చ కేతుమాన్సు మహాబలః | హిరణ్య రోమాచ తథా విజ్ఞే యాశ్చ దిగీశ్వరాః || 20 అర్వాక్త స్యమహీధ్రస్య చంద్రార్క గ్రహతారకాః | వ్రపతన్తి మహారాజ! నతుపారే కదాచన || 21 దర్భోదక సముద్రస్తు లోకా లోకం సమన్తతః | పరివార్య స్థితో రాజన్నంధకారే మహార్ణవః || 22 ఏకషష్టి ప్రమాణన నియుతాని సమంతతః | తస్యపారే తతో రాజన్ బ్రహ్మాండస్తు సమంతతః || 23 ఊర్ధ్వే నాధశ్చ విష్కంభో యావానండస్య కీర్తితః | తావదేవ ప్రమాణన తిర్యక్షు పరివారితః || 24 మేరు మధ్యాత్స ముద్రస్య పారం గర్భోదకస్యతు | కోటిత్రయం యోజనానాం నియుతాని తథాదశ || 25 పంచాన్యాని చ రాజేంద్ర ! ప్రమాణం పరికీర్తితమ్ | తస్యరాజ ............. బ్రహ్మాండస్తు సమంతతః || 26 .......... తదధ్యర్ధం ద్వితీయస్య తథాదశ | ఏత దేవతు నిర్దిష్టం ప్రమాణం తత్త్వ చింతకైః || 27 పుష్కర ద్వీపము తన ప్రమాణముగల స్వాదూదక సముద్రముచే నావరింపబడినది. ఆ మంచినీటి సముద్రమునకవ్వల సువర్ణభూమి యున్నది. దానివైశాల్యము ముప్పదివేల యోజనములు. అదియంతయు నేకశిలామయము. అది దేవతలు విహరించు నుద్యానము. ఆ భూమిని చుట్టుకొని లోకాలోకమను పర్వతమున్నది. దాని వైశాల్యము ఎత్తును పదివేల (అయుత) యోజనములు. లోకాలోకపర్వతమందు ప్రాచ్యాదిదిక్కులందు ఈలోకపాలురున్నారు. వారు మహావీరులు. కల్పాంతజీవులు. సుదాముడు శేష పాదుడు కేతుమంతుడు (మహాబలశాలి) హిరణ్యరోముడు ననువారు. ఆ పర్వతమునకు క్రిందుగా సూర్య చంద్ర గ్రహ తారకలు పడుచుండును, వారా పర్వతము యొక్క పారము నందుకోరు. ఆపర్వతమునకు జుట్టును గర్భోదకమను సముద్రమున్నది. అది యంధకారబంధురము. దాని ప్రమాణమరువదియొక్క లక్ష (నియుతముల) యోజనములు. దాని ఆవలిప్రక్క (సరిహద్దున) చుట్టును బ్రహ్మాండమున్నది. దానిపైనుంచి యడుగునకుగల విష్కంభ##మెంతగలదో అంతే దాని యడ్డుకొలతయును. మేరు మధ్యమునుండి గర్భోదక సముద్రము యొక్క ఆవలి యొడ్డు 3 కోట్ల పదునేను నియుతములు యోజనములు, తత్త్వవేత్త లింత వరకే యీ కొలతల నిర్దేశించినారు. మేరోస్తు పూర్వ దిగ్భాగే మధ్యేతు లవణో దధేః | విష్ణులోకో మహాన్‌ప్రోక్తః సలిలాన్తర సంశ్రితమ్ || 28 స్వభాసయాత్ దేవస్య సతతం నృపః ! రాజితమ్ | తత్ర స్వపితి ఘర్మాంతే దేవదేవో జనార్ధనః || 29 లక్ష్మీసహాయః సతతం శేషపర్యం కమాశ్రితః | ఏకాదశ్యా మాషాఢస్య శుక్లపక్షే జనార్దనమ్ || 30 దేవాశ్చఋషయశ్చైవ గంధర్వా ప్సరసాంగణాః | అభిష్టువంతి తేగత్వా సతతం దినపఞ్చకమ్ || 31 ఉత్సవంచై వకుర్వన్తి గీతనృత్యసమాకులమ్ | తతస్తుచుతురో మాసాన్‌యోగ నిద్రాముపా సతే || 32 సుప్తంచతముపాసతే ఋషయో బ్రహ్మవిత్త మాః | సశరీరాణి శాస్త్రాణి భక్తాస్తందేవ మానవాః || 33 కార్తికస్యసితే పక్షేతదేవదిన పంచకమ్ | విబోధయ న్తిదేవేశం గత్వానేంద్రా దివౌకసః || 34 దేవాస్తథైవకుర్వంతి తదాపిచ మహోత్సవమ్ | మేరోస్తు పూర్వదిగ్భాగే మధ్యేక్షీరార్ణ వస్యతు || 35 క్షీరాంబు0 మధ్యగాశుభ్రాదేవస్యాన్యా తథా పురీ | లక్ష్మీసహాయస్తత్రాస్తే శేషాసనగతః ప్రభుః || 36 తత్రాపిచతురోమాసాన్ సుప్తస్తిష్ఠతి వార్షికాన్ అసై#్త్రః సకేవలైస్తత్ర దృశ్యతేశాశ్వతః ప్రభుః || 37 తస్మింస్తథై వదిగ్భాగే మధ్యేక్షీరార్ణ వస్యతు | యోజనానాం సహస్రాణి మండలః పంచవింశతిః || 38 శ్వేతద్వీపస్తు విఖ్యాతో ద్వీపః పరమశోభనః | నరాః సూర్యప్రభాస్తత్ర శీతాంశుసమ దర్శనాః || 39 తేజసాదుర్నిరీ క్ష్యాశ్చ దేవానామపియాదవ ! పంచకాల విధానజ్ఞాః పూజయంతి జనార్దనమ్ || 40 పూజాంతు తేషాంశిరసా సతుదేవః ప్రయచ్ఛతి | ఇహస్థైశ్చ కృతాం పూజాం పాదతశ్చ ప్రయచ్ఛతి || 41 మేరువు యొక్క తూర్పు దెసన ఉప్పుసముద్ర మధ్యమందు విష్ణులోకము నీళ్లలో నున్నది. అది విష్ణు తేజస్సుచే ప్రకాశించును. దేవదేవుడు జనార్దనుడు లక్ష్మీసహాయుడై శేషపర్యంకమందు ఘర్మాంతమున (వర్షాకాలమున) నిదురించును. ఆషాఢ శుక్లైకాదశినాడు మొదలయిదు రోజులాదేవుని దేవతలు ఋషులు గంధర్వాప్సరోగణము నటకేగి స్తుతింతురు. గీతనృత్యాదుల నుత్సవము గూడ నెరపుదురు. ఆమీద నాల్గు మాసములావిష్ణువు యోగనిద్రంగొనును. బ్రహ్మ సమ్మితులు (లేదా బ్రహ్మతుల్యులు) ఋషులు నిద్రనున్న యాయన నుపాసింతురు. శరరీముదాల్చి శాస్త్రములు భక్తులైన దేవమానువులు నా స్వామిని సేవింతురు. కార్తికశుక్లైకాదశి నుండి యైదురోజులాయన నింద్రాదులు మేల్కొలుపుదురు. దేవతలుకూడ మహోత్సవముసేయుదురు. మేరువు తూర్పు దెస క్షీరాబ్ధి నడుమ క్షీరోదకమునడుమ నచ్చపు తెల్లనిదా దేవుని రాజధాని యున్నది. లక్ష్మితో శ్రీహరి యక్కడ శేషతల్పమందుండును. అక్కడగూడ నాల్గు వార్షికమాసములు (వర్షఋతువంతయు) స్వామి నిదురబోవుచుండును. ఆతడు కేవల మస్త్రములతో దర్శనమిచ్చును. అదేదిక్కున పాల్కడలి నడుమ నిరువదియైదువేల యోజనముల వైశాల్యముగల మండలమున్నది. అది శ్వేతద్వీపమను విఖ్యాతినందినది. పరమశోభనము. అచటి నరులు సూర్యవర్చస్కులు చంద్ర సమదర్శనులు. వేల్పుల కేని తేరిపారజూడ వశముగాని తేజస్వులు. పంచకాల పూజావిధాన మెరింగి విష్ణువును బూజించుచుందురు. ఆదేవుడుగూడ వారికి శిరస్సుచే పూజనొసంగును. అనగా వారి పూజను ప్రతిగ్రహించునన్నమాట. ఈలోకమందున్న వారి పూజను పాదములచేత స్వీకరించును. నరులక్కడనున్న హరి నేకాంతభావమున బొందుదురు. అనన్యభావులై సేవించి యాహరి సాయుజ్యమందుదురన్నమాట. ఏకాంతభావో పగతా స్తత్ర యాంతిహరిం నరాః | తత్ర గత్వా నశోచంతి నివర్తంతేన చాప్యథ || 42 పూజయిత్వా చిరంకాలం దేవదేవం జనార్దనమ్ | ఆదిత్యమండలం భిత్త్వా బ్రహ్మణం ప్రవిశంతితే || 43 తతో7నిరుద్ధం దేవేశం ప్రద్యమ్నం చాప్యనంతరమ్ | తతః సంకర్షణం దేవం వాసుదేవం తతః పరమ్ || 44 వాసుదేవంచ సంప్రాప్య ముచ్యంతే సర్వవర్తనై ః | శ్వేతద్వీప గతాస్తస్మాన్న నివర్తన్తి కర్హిచిత్ || 45 పూర్వోత్తరేతు దిగ్భాగే మధ్యే క్షీరార్ణ వస్యతు | వైజయంత ఇతిఖ్యాతః పర్వతః సర్వకాంచనః || 46 యోజనానాం సహస్రాణి ప్రమాణన దశస్మృతః | ఆయామ విస్తరోచ్ఛ్రాయైః ప్రమాణంతస్య కీర్తితమ్ || 47 యోజనానాం సహస్రాణి పర్వతస్య గుహాస్మృతా | ఉచ్ఛ్రితాయోజన శతం తావదేవచ విస్తృతా || 48 తిమిరేణావృతాద్వారి యోజనానాం తథా శతమ్ | స్వప్రభాభరణా దివ్యా తతః పరతరం హిసా || 49 నామ్నాచలోకే విఖ్యాతా ఋషిభిస్తి మిరావతీ | తస్యాం దేవవరో విష్ణుః స్వపన్నాస్తే జనార్దనః || 50 తత్రైన ముపతిష్ఠన్తి దేవ్యస్తిస్రో మహీపతే | నిద్రాచ కాలరాత్రిశ్చ లక్ష్మీశ్చ వరవర్ణినీ || 51 ఉపాసతే చ తందేవం భృగ్వాద్యాః పరమర్షయః | శరీర ధారిభిశ్చాసై#్త్రస్త థాతత్రచసేవ్యతే || 52 తస్యసుప్తస్యవదనాన్నిః శ్వాసోచ్ఛ్వాసతః క్రమాత్ | ప్రజానాంపంక్త యోహ్యుచ్చైర్నిపతంతి పతతించ || 53 తస్యోచ్ఛ్వా సశ్చ జంతూనాం సంభవః కథితోనృప | నిఃశ్వాసకాలేచ తథా జంతూనాం మరణం స్మృతమ్ || 54 ఆ విష్ణువుం బొందినవారు శోకింపరు. పునరావృత్తి నందరు. చిరకాలమాజనార్దనునిం బూజించి ఆదిత్యమండలమును భేదించుకొని (అనగా ఆదిత్యమండలముకు తక్కిన జ్యోతిర్మండలములకు నడిమిదారిని) బ్రహ్మలో బ్రవేశింతురు. అవ్వల ననిరుద్ధుని ప్రద్యుమ్నుని ఆతర్వాత సంకర్షణుని అటుపై వాసుదేవునిం బొందుదురు. వాసుదేవునిం బొంది సర్వ (వర్తనముల) ప్రవృత్తుల నుండి ముక్తులగుదురు. నైష్కర్మ్యమందుదురన్నమాట. అదే ముక్తి, శ్వేతద్వీపమునకేగినవారటనుండి యెన్నడును దిరిగిరారు. క్షీరసముద్ర మధ్యమున పూర్వోత్తర దిగ్భాగమందు (ఈశ్యాన్యమూల) సర్వసువర్ణమయిన వైజయంతమను పర్వత మున్నది. దాని ప్రమాణము పదివేల యోజనములు. దాని పొడవు ఎత్తు వైశాల్యము గూడ నిదే ప్రమాణములో నుండును. దానిలో గుహ యైదువేల యోజనముల విరివిగలది గలదు. దాని ఎత్తు నూరుయోజనములు. దాని వైశాల్యముగూడ యంతే. ద్వారమందు నూరు యోజనముల చీకటి గ్రమ్మియుండును. ఆమీది ప్రదేశము తన దివ్యప్రభలచే వెలుగొందుచుండును. ఋషులచేనది తిమిరావతి యనుపేర ప్రఖ్యాతిగన్నది. దానియందు దేవేశుడు విష్ణువు నిదురించుచుండును. ఈయన నక్కడ ముగ్గురు దేవతలు, నిద్ర కాలరాత్రి వరవర్ణినియోన లక్ష్మియును ననువారు సన్నిధిసేసియుందురు. భృగ్వాది మహర్షు లీయన నుపాసించుచుందురు. శాస్త్రములు శరీరధారులై యీయన నట సేవించును. నిద్రలోనున్న యాయన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములనుండి క్రమముగ ప్రజల వరుసలు మీదికెగిరి క్రిందికిపడుచుండును. ఆతని యుచ్ఛ్వాసమే జంతువుల పుట్టుక యనబడును. ఆయననిశ్శ్వాసకాలమం దదేజీవుల మరణమనబడును. మధ్యేఘృత సముద్రస్యమేరోః పశ్చిమ తస్తథా | యోజనానాంతు నియుతం ద్వీపస్తు పరిమండలః || 55 తత్ర గోవర్దనస్యోక్తా వసతిః సుమహాత్మనః | దివ్యానాంతత్రధేనూనాం వసతిశ్చ తథాస్మృతా || 56 సతతం కామరూపేణ భాభిః స రమతే హరిః | మధ్యేదధి సముద్రస్య ద్వీపస్తా వత్ప్ర మాణతః || 57 హేమరూపధరో యత్ర నిత్యం వసతి కేశవః | తత్రస్థమేనం పశ్యంతి ఋషయో భూరితేజసః || 58 సురాసముద్ర మధ్యేతు ద్వీపః పరమ విస్తృతః | తత్ర సంకర్షణోదేవో విభురాస్తే సురాసురాః || 59 ఉపతిష్ఠంతి తత్త్రైనం దివ్యాస్తిస్రో మనోరమాః | కాంతిశ్చమదిరాచైవ తథాదేవీ కరీషిణీ | తత్రస్థమేనం పశ్యంతి ప్రజానాం పతయః సదా || 61 క్ష్మామండలం కృత్స్నమిదం తవోక్తమ్ క్ష్మాపాల బృందాంబర పూర్ణచంద్ర | సమాసతో వ్యాసగిరా మశక్యం వక్తుం మహేంద్రోపి నవర్షపూగైః || 62 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ద్వీపవిభాగ వర్ణనంనామ షష్ఠో7ధ్యాయః. ఘృతసముద్రము నడుమ మేరువునకు బడమట నియుత (లక్ష) యోజన పరిమాణమైన ద్వీపము (పరిమండలము)వర్తులమైనది. గలదు. అందు గోవర్ధనము యొక్క యునికి యున్నది. అది దివ్యధేనువుల కావాసము. అట నెల్లప్పుడు హరి కామరూపుడై తన దీప్తులతో విలసిల్లును. దధి సముద్రము నడుమ ఆ సముద్ర ప్రమాణమున నీట ద్వీపమున్నది. విష్ణువక్కడ స్వర్ణ రూపధారియై వసించును. మహాతేజస్వులైన ఋషు లక్కడనున్న యీతనిం జూచెదరు. సురాసముద్రమధ్యమందు (సురా=కల్లు) బహువిశాలమైన ద్వీపమున్నది. అక్కడ సంకర్షణుడనుపేర విష్ణుదేవుడు ప్రభువున్నాడు. ఆతనిని సురాసుర లుపస్థానము చేయుదురు. ముగ్గురు దేవతలు కాంతి మదిర కరీషిణి యను పేరుగలవారు పరమసుందరు లాయన సన్నిధిని వసింతురు. అటనున్న యీ స్వామిని ప్రజాపతులు చూచెదరు. సర్వభూమండలమును నరేంద్ర బృందాంబరమునం బూర్ణబింబమవైన నీకు వ్యాస వచనము సమన్వయము సేసి తెలిపితిని. దేవేంద్రుడేని యనేక సంవత్సర సముదాయముననేని వర్ణింపరానిదిది. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమ ఖండమున ద్వీపవిభాగవర్ణనము అను నారవ యధ్యాయము.