Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
అరువదవ యధ్యాయము - శంకరగీతలందు ఉపవాసవిధి రామ ఉవాచ : ఉపవాసా సమర్థానాం కిం స్యాదేక
ముపోషితమ్ | మహాఫలం
మహాదేవ ! తత్సమాచక్ష్వ ! పృచ్ఛతః ||
1 శంకర ఉవాచ : యా రామ! శ్రవణోపేతా ద్వాదశీ మహతీచసా | తస్యా ముపోషితః స్నాత పూజయిత్వా జనార్దనమ్ ||
2 ప్రాప్నో త్యయత్నా ద్ధర్మజ్ఞ ! ద్వాదశద్వాదశీ ఫలమ్ | దధ్యోదనయుతం తస్యాం జలపూర్ణం ఘటం ద్విజే || 3 వస్త్ర సంవేష్ఠితం దత్వా ఛత్రోపానహ మేవచ | న దుర్గతి మవాప్నోతి గతి మన్యాంచ విందతి || 4 అక్షయ్యం స్థాన మాప్నోతి నాత్ర కార్యా విచారణా | శ్రవణ ద్వాదశీయోగే బుధవారో భ##వేద్యది || 5 అత్యన్తం మహతీ నామ ద్వాదశీ సా ప్రకీర్తితా | స్నానం జప్యం తధా దానం హోమం శ్రాద్ధం నురార్చనమ్ || 6 సర్వ మక్షయ్య మాప్నోతి తస్య భృగు కులోద్వహ ! | తస్మిన్దినే తథాస్నాతో యత్ర క్వచన సంగమే || 7 స క్రతుస్నానజం పుణ్యం ఫల మాప్నో త్యసంశయం | శ్రవణ సంగమాస్సర్వే ఫలపుష్టి ప్రదా స్సదా || 8 విశేషా ద్వాదశీయుక్తే బుధయుక్తే విశేషతః | యధైవ ద్వాదశీ ప్రోక్తా బుధ శ్రవణ సంయుతా || 9 తృతీయాచ తథా జ్ఞేయా సర్వాకామ సమన్వితా | యథా తృతీయా ధర్మజ్ఞ ! తథా పంచదశీ శుభా || 10 త్ర్యహః స్చృశే೭పి దివసే చోపవాసే మహాఫలః | కేశవా೭భ్యర్చనే రామ ! దాన జప్యాది కేషుచ || 11 ఉపవాసముసేయ నసమర్థులగువారి కేయొక్కయుపవాసము మహాఫల ప్రదమో తెలుపుమని రాముడడుగ శంకరు డిట్లనియె - శ్రవణా నక్షత్రముతోడి ద్వాదశి చాలా గొప్పది. అందుస్నానముచేసి యుపవసించి జనార్దను నర్చించిన యాపుణ్యుడు ద్వాదశ ద్వాదశీఫలమునందును. ఆనాడు దధ్యోవనముతోబాటు జలపూర్ణకుంభమును నూత్న వస్త్రముపైనగప్పి బ్రాహ్మణునకిచ్చిగొడుగు పాదుకలును గూడ దానముచేయునాతడు దుర్గతిపాలుగాడు. ఉత్తమగతినందును. మఱియు నక్షయ్య పుణ్యస్థానమందును. ఇందాలో చింపవలసినది లేదు. శ్రవణద్వాదశితో బాటు బుధవారము గూడ యోగించెనేని యది అత్యంత మహాద్వాదశి యనబడును. నాడు చేసిన స్నానము జప దాన హోమములు శ్రార్ధము సురార్చనము నక్షయ్య మగును. ఆనాడేదోయొక నదీసంగమ తీర్థమందు స్నానము చేసిన యాతడు నిస్సంశయముగ క్రతుస్నాన పుణ్యము (అవబృథస్నాన కృతము) నందును. శ్రవణా నక్షత్రముతో గూడిన తిథులన్నియు ఫల పుష్టినిచ్చునవే. అందులో ద్వాదశి తదియ పూర్ణిమ బుధవారమును గలియుట విశేషము. ద్వాదశి బుధవారము శ్రవణనక్షత్రముతో గలిసిన సర్వకామదము ఒకతిథి త్రిద్యుస్పృక్కు (మూడురోజులు కలిసినది) యగునేని నాడుపవాసము మహాఫలదము కేశవార్చనము దానము జపము మొదలయినవాని కది అత్యుత్తమము. రామ ఉవాచ : త్ర్యహః స్పృగ్దివసఃకీదృక్ కదాభవతి వా ప్రభో ! | తస్యమే సంశయం బ్రూహి ! దేవదేవ ! వృషధ్వజ ! || శంకర ఉవాచ : దివా వినిర్గతా యత్ర వ్యతీతాస్యాత్తిధి ర్ద్విజ ! రాత్రిశేషే తథావేశ్య భవిష్యా స్పృశతీ తిథిః || 13 తిథి త్రితయ సంస్పర్శా దహోరాత్రే భృగూత్తమ ! త్ర్యహ స్పృక్ స వినిర్దిష్ఠః పుణ్యః పరమపావనః || 14 తత్రో పోష్య శిరస్స్నాతైః కర్తవ్యం దేవతార్చనమ్ | జపం హోమం తథా దానం కామయద్భిర్మహత్ఫలమ్ || 15 కర్మణాం పరిశేషాణా మకర్మణ్యం హి తద్దినమ్ | భోజ్యం త్రిమధురం (పాలు, చక్కెర, తేనె) రామ ! బ్రాహ్మణాన్ తత్ర భోజయేత్ || 16 అనవిని రాముడు త్ర్యహః స్పృక్కు అనగా నెట్టిది? అది యెప్పుడువచ్చును? ఈనాసంశయము వారింపుమన శంకరుం డనియె. గతరాత్రి శేషమందు ప్రవేశించిరాబోవురోజున తథినిగూడ స్పృశించునేని అహోరాత్రములందది తిధిత్రయ సంస్పర్శము నంది త్ర్యహః స్పృక్కు అని పిలువబడును. అది పుణ్యము పరమ పావనము అట శిరస్నానముచేసి యుపవసించిదేవతార్చనము జపము హోమము దానము సేయవలయును, అది మహాపలదము, చేయకుండ మిగిలిన కర్మముల కతిథిత్రయ స్పృక్కు అకర్మణ్యము ఆకర్మములు చేయనక్కరలేకుండనే చేసినఫలమిచ్చునది యగు నన్నమాట అపుణ్య దినమున త్రిమధుర మును (పాలు పంచదారతేనె) సేవింపనగును. బ్రాహ్మణ సంతర్పణముగూడ నాడు సేయవలెను. మహత్పూర్ణా భవత్యేకా పౌర్ణమాసీ ద్విజోత్తమ | ప్రతి సంవత్సరం తస్యాం సోపవాసో జనార్దనమ్ || 17 యః పూజయతి ధర్మజ్ఞ | తేన సంవత్సరం హరిః | పూజితః పౌర్ణమాసీషు భవతీతిహి నిశ్చయః || 18 తస్యాం దానం స్వల్పమపి మహద్భవతి భార్గవ | దానం జప్యం తతో హోమో యచ్చాస్య త్సుకృతం భ##వేత్ || 19 రామ ఉవాచ : సంవత్సరే పౌర్ణమాసీ మహత్పూర్వా వృషధ్వజ ! కధం ! జ్ఞేయా జగన్నాధ ! తన్మమాచక్ష్వ ! పృచ్ఛతః || 20 శంకర ఉవాచ : యస్యాంపూర్ణేందునా యోగం యాయాజ్జీవో మహాబలః | పౌర్ణ మాసీతుసాజ్ఞేయా మహత్పూర్వా ద్విజోత్తమ ! || 21 ఆదిత్య గ్రహణ రామా ! గ్రహణవానిశాభృతః | 22 ఉపవాసా దవాప్నోతి సర్వకిల్బిష నాశనమ్ || స్నానం దాసం తథాజప్యం చాక్షయ్యం పరికీర్తితమ్ | శ్రాద్ధంచ భార్గవశ్రేష్ఠ | వహ్ని సంపూజనం తధా || 23 ప్రతి సంవత్సరము మహాపూర్ణిమ యగుఒక పర్వము నెట్లు తెలిసికొన వలెనో స్వామీ ! తెల్పుమన రామునకు శంకరుడిట్లనియె. ఏపూర్ణిమనాడు గురువు మహాబలుడు యోగించునో యది మహాపూర్ణిమ. జపదాన హోమాదులు మరి మంచిపనులేవైన నానాడనంత ఫలదముము. సూర్యచంద్ర గ్రహణములందు ఉపవాసము సర్వపాపహరము. స్నాన దాసజపాదు లక్షయ్య ఫలదములు శ్రాద్ధము అగ్నియుపాసనమును నట్టివే. రామ ఉవాచ : నక్షత్రం దేవదేవేశ ! తిథించాత్ర వినిర్గతాం | దృష్ట్వా యధావత్కర్తవ్యం తిథిం శంకర ! జానతా || 24 శంకర ఉవాచ : సా తిథి స్తదహోరాత్రం యస్యా మేవోదితో రవిః | తయాకర్మాణి కుర్వీత హ్రాసవృద్ధి ర్నకారణమ్ || 25 శుక్లపక్షే తిథిర్‌జ్ఞేయా యస్యా మభ్యుదితో రవిః | ఉషోషితవ్యం నక్షత్రం యేనాస్తం యాతి భాస్కరః || 26 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకరగీతాసు ఉపవాస విధిర్నామ షష్టితమో೭ధ్యాయః. అన విని పరుశురాముడు. ఇక్కడ నక్షత్రమును గడచిన తిథిని నెఱిగి యధావిధి నాచరింప వలయు నన శంకరుడు, ఏనాడు రవి యేతిథియందుదయించునో ఏది అహోరాత్రలుండునో దానితో నారోజు కర్మాచరణము సేయవలయును. అవిధియొక్క హ్రాసముతో (తగ్గుదలతో) వృద్ధితో పెరుగడలతో దానికి సంబంధములేదు. (తిథిరౌదయికీ గ్రాహ్యా = సూర్యోదయ సమయ తిధినే గ్రహింప దలయునన్నమాట) శుక్లపక్షమందు సూర్యోదయ తిథిని గ్రహింపవలయును. సూర్యుడెందస్తమించు నానక్షత్రము నుపవాసమునకు గ్రహింప వలెను. లేదా నడిరేయి యే నక్షత్రము చంద్రునితో నున్నదో యదియును నుపవాసమందు గ్రాహ్యము. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శంకరగీతలందు ఉపవాసవిధియను నఱువదియవ యధ్యాయము