Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

అరువదిరెండవ అధ్యాయము - శంకరగీత-ఉపాదానకరణనిరూపణము

శంకర ఉవాచ :

భోగానా మర్జనం కార్యం తతో రామ ! స్వకర్మణా ! స్థిరాణా మస్థిరాణాంచ యథావద్భృగు నందన ! 1

ఆసనాద్యాస్తు యే భోగా కాలేనాప్యవినాశినః | స్థిరా స్తే రామ | నిర్దిష్టాః పరిశిష్టా స్తథా చరాః || 2

పుష్పం పత్రం ఫలం మూలం తథా హరితకం శుభమ్‌ | ఉదకం చార్చనీయంస్యాత్‌ తస్మిన్నహని భార్గవ ! 3

ఉపాదానాయ నిష్ర్కాన్తే కుటుంబిన్యథ సత్వరమ్‌ | కుటుంబినీ సంప్రయాతా ధౌతోపస్కర భాజనా || 4

సాధ్యానాం నామ బీజానాం పశోశ్చ సుకృతస్యచ | శాకానాం వ్యంజనానాం చ స్వర్జితానాం గతేహని || 5

శక్తిం కుర్యాత్సదా తస్య వహ్నినోపరమేన చ | దేశే శుచౌ సుప్రయాతా సునహాయగుణాన్వితా || 6

సర్వం ప్రక్షాశితం కార్యం కేశ కీటాది వర్జితమ్‌ | భూమా వనుప లిప్తాయాం స్థాప్యం రామ ! స కించన || 7

సర్వం సాధ్య మథాన్నాద్యం గంధవర్ణ రసాన్వితమ్‌ | నిత్యం పరిపచే ద్రామ! నా స్వాద్యం కేనచిత్‌ క్వచిత్‌ || 8

ఉపాదాన మధాదాయ ప్రవిశ్య చ గృహీ గృహమ్‌ | శుచౌ ప్రక్షాళితం సర్వం చోపాదాన ముపన్యసేత్‌ || 9

సు ప్రక్షాళ్య తథా భాగం పవిత్రేణ సముత్‌ క్షిపేత్‌ | ఏవం కృత్వా హ్యుపాదానం స్నాయాత్తు విధినా తతః || 10

ధౌత వాసాః సుప్రయతః స్వాచాంతః సుసమాహితః | ప్రవిశ్య దేవతా వేశ్మ ప్రాగ్వత్‌ భృగు కులోద్వహ || 11

నమస్కారాదికం సర్వం ప్రయుంజీత సమాహితః | ఉపాదానామసంధానం త్వాదానం చాప్యన న్తరమ్‌ || 12

ఇజ్యా కాలస్య ధర్మజ్ఞ | కుర్యాత్‌ ప్రయత మానసః || 13

అసన్నభోగః ప్రయతాన్తరాత్మా కుర్యాదథే జ్యాం రణచండ వేగ |

క్రోధం నియమ్యాత్మ హితే నివిష్ట స్తద్భావ భావోప హితశ్చనిత్యమ్‌ || 14

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమ ఖండే-మార్కండేయ వజ్ర సంవాదే శంకర గీతాసు ఉపాదానకరణోనామ ద్విషష్టితమోధ్యాయః

శంకరుడనియె, భృగునందన ! స్వధర్మముచే యథావిధిగ స్థిరములు అస్థిరములు నైన భోగములను అర్జింపవలయును. శయనాసనాదులు (మంచములు కుర్చీలు) మొదలయినవి ఎంతకాలమునకును నశింపనివి స్థిర భోగములు కొన్నాళ్లకు చెడిపోవునవి చరభోగములు. పత్రము (పత్రి) పుష్పము ఫలము మూలము హరితకము ఉదకమును ఆనాడర్చింపవలయును. అటుపైన నుపాదానమునకు కుటుంబి బయలుదేవవలెను. ఆయన భార్యయు (కుటుంబిని) మడి గట్టుకొని గిన్నెలు చెంబులు కడిగికొని (శుద్ధిచేసి కొని) సాధ్యములయిన బీజములయొక్కయు (పంట కుపయోగించు కందులు పెసలు మొదలయినవానియొక్క) చక్కగా నమరుపబడిన పశువుయొక్క నిన్ననేకూర్చిన ఆకుకూరలకూరలు మొదలరగువానియొక్క పాకము అగ్నిచేత ఉపదమము చేత (దంపుట రుబ్బుట మొదలయిన విధముగా) శక్తినిగావింపవలయును. (శక్తి=పచనము) ఈ వంటప్రదేశము శుచి (మడి) గా నుండ వలయును. ఆమె ఆచారవంతురాలై మంచి సహాయపడువారితో నీ వంటచేయలెను. కేశములు పురుగులు లేకుండ నంతయు కడిగి సిద్ధము చేయవలెను. అలకని యింటిలో నే కొంచెమునుంచరాదు. వండవలసిన పదార్థము అన్నాదులు సుగంధములు సువర్ణ మునై యుండవలెను. దాని నెవ్వరు నెక్కడగాని వాసనయైన చూడకుండ మూతలుపెట్టి యుంచవలెను. ఆమీద నా గృహస్థు ఉపాదానమును (ఇంటింట తిరిగి సేకరించిన పదార్థమును) తీసికొనివచ్చి యింటిలో ప్రవేశించి యావస్తువులను బ్రక్షాళించి శుచియైన చోట నుంచవలెను. అందులోభాగమును బాగుగ కడిగి పవిత్రముచే ప్రోక్షణసేయవలెను. ఉపాదానముగొనివచ్చి యధావిధి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని నియమవంతుడై నిశ్చలమతియై యచమనముచేసి దేవతార్చన గృహముంజొచ్చి సమస్కారాద్యుపచార ములు సేయవలెను. ఉపాదానమును సమకూర్చుట ఆ మీదదానిని దాసు గైకొనుట ఇజ్యాకాలమునకు వినియోగపఱుపవలెను. భోగమలు సమకూర్చుకొన్నవాడై ప్రయతాత్ముడై యామీద ఇజ్యయనబడును.) ఆ అచరణముచేయునపుడు క్రోధమునదుపులో బెట్టు కొని ఆత్మహితవునకు ఆయా మంత్ర దేవాతాత్మ ద్రవ్యాదులందు భావముంచి నిత్యమును ఇజ్యాచరణము, ఇజ్యాచరణమున బ్రవర్తింప వలెను. బ్రహ్మయజ్ఞాదులు పంచయజ్ఞములు గృహస్థునకు విహితములయినవిగావింపవలెనన్నమాట.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శంకరగీతలందు ఉపాదానకరణమను అరువదిరెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters