Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
అరువదిమూడవ అధ్యాయము - ఇజ్యాకాలవిధి శంకర ఉవాచ : పాద పీఠా న్తకం కర్మ కృత్వా ప్రా గుక్త మంజసా | నివేద్య దర్పణం దేవ ! తతో మాత్రాం నివేదయేత్ ||
1 బీజైస్తు పరిధానార్థం ప్రయత స్సు సమాహితః | తైల ముద్వర్తనం చైవ చమసీం బాప్యస స్తరమ్ ||
2 తతో నిష్పుంసనం కృత్వా దేయా న్యాచమనానిచ | రోప్రంకాలీయకం చైవ తథావై బీజపూరకం || 3 వర్ణకం తగరం చైవ ప్రియంగుం గౌర సర్షపాః | సర్వౌషధీ ర్వృక్షబీజం సర్గ గంధాంశ్చ భార్గవ ! 4 రత్నోదకంచ వివిధు స్నానీయ ముదకం తథా | స్నానీయంచ తతో రామ! సు సుగంధంచ దాపయేత్ || 5 తతస్సుషుర్మణార్థీయాః కలశాః సుమనోహరాః | స్వలంకృతాః ప్రదాతవ్యాః ఫలవల్లవ పూరితాః || 6 పుష్పగంధయుతా రామ ! పవిత్రేణ పవిత్రితాః | శుభానాం తీర్థసరితాం రామ ! పుణ్యజలైః శుభైః || 7 యథావిభవత స్తేషాం బహుత్వమపికారయేత్ | తస్మిన్‌కాలే తథాకార్యం క్ష్వేడితోత్కృష్టనిస్స్వనమ్ || 8 జయశబ్దం విపులం శంఖభేరీవిమిశ్రితమ్ | ఉదక గ్రహణార్థీయంతతో దద్యాచ్చశాటకమ్ || 9 తతోరామ ! ప్రదాతవ్యం ధౌతవాసోయగం శుభమ్ | తత స్తుపూర్ణకలశ మాసనానాం ప్రదక్షిణమ్ || 10 కృత్వారామ ! క్షిపే ద్వేద్యాం పుష్పపల్లవ శోభితమ్ | తతస్త్వాచమనీయంచ పూర్వపద్వినివేదయేత్ || 11 మంగళానిచ ముఖ్యాని తతో దద్యా ద్విచక్షణః | సత్యాసనస్థందేవేశ మర్చయిష్యామ్యతఃపరమ్ || 12 స్నానాసనాని త్యజ్యన్తా మిత్యేవం పరికీర్తయేత్ | మార్గత్రయాదథారభ్య పాదపీఠాంతకం పునః || 13 కర్తవ్యం సకలం కర్మ త్వావాహస విసర్జనమ్ | తతోసులేపనం దద్యా ద్వ్యజనేన చ వీజయేత్ || 14 తతశ్చవీటకం దద్యాత్తథా కూర్చ ప్రసాదనమ్ | వస్త్రం విభూషణంచైవ పుష్పాణి వివిధానిచ || 15 వేష్టనంచస్రజంచైవ కంకణంచమనోహరమ్ | తథా రమ్యం ప్రతిసరం సుపిష్టంచ తథాంజనమ్ || 16 దర్పణంచోపచారంచ ప్రదీపం ధూపమేవచ | తథై వాచమనీయంచ గీతవాద్యస్వనం తథా || 17 పుణ్యాహ జయశబ్దంచ స్తోత్రోదీరణమేవచ | తథైవోపానహే దేయే ఛత్రం చామరమేవచ || 18 యానంచ వాహనం చై పతాకాశ్చధ్వజానిచ | భోగానాం పూరణార్థీయాం తతోమాత్రాం నివేదయేత్ || 19 భోగానాం సర్జసం తృత్వా యథాశక్త్యా ద్విజోత్తమ | అవిద్యమానా యేభోగాః మాత్రాస్వేన ప్రకల్పయేత్ || 20 ఏవ మభ్యర్చ్య దేవేశం సర్వభోగై స్సమాహితః | అర్చయేన్మధుపర్కేణ పశుయాగో నచేద్భవేత్ || 21 పశుయాగాభి గమనే మధుపర్కో విధీయతే | అభ్యర్చ్య మధుపర్కేణ తత స్త్వన్యేన పూజయేత్ || 22 అత్రాసనాస్యపీచ్ఛన్తి కేచిదప్యపరాణి తు | అదౌ స్థాలీచ తేనాథ ప్రదద్యా దర్హణీం తతః || 23 అన్నం హరితకోపేతం భక్ష్యం వ్యంజన సంయుతం నివేద్య దర్పణం దద్యా త్తథా నిష్పుంసనం తతః || 24 కృత్వా త్వాచమనీయంతు మాత్రాంచ తదన న్తరమ్ | తతస్తు సంవిభాగార్థం దాతవ్యం త్వర్హణం తతః || 25 భూయోనివేదయే దన్నం పూర్వవత్సుసమాహితః | దర్పణంచ తతో దద్యాత్ పాద్యం నిష్పుంసనం తతః || 26 దత్వా చాచమనీయంచ శాటకంచ నివేదయేత్ | హస్త విష్పుంసనార్థాయ మాత్రాంచ తదనస్తరమ్ || 27 నివేద్య పశ్చాత్తాంబూలం దేవం వహ్నౌసమర్చయేత్ | వహ్నిసంపూజనం కృత్వా కార్యకారి సమర్పణమ్ || 28 అతిథీనాం తతఃకార్యం భర్తవ్యానాంచ భార్గవ | తతో ೭ ను యాగకాలేతు పవిత్రేణ సముత్‌క్షిపేత్ || 29 ఆసనం భోజనం చైవ స్నానం ప్రయతమానసః | ఉపవిశ్య తతః పశ్చాత్ర్పభ##వే నాప్యయేనచ || 30 ఇద మగ్నేతి మంత్రేణ ప్రాచ్యాంగ్రాసాష్టకం భ##వేత్ | తతస్తు ప్రయతో భూత్వా విశే ద్దేవగృహం తతః 31 ఇజ్యాకాలాసుసంధానం తతః కుర్యా త్సమాహితః | కుర్యాత్స్వన్యాయ కాలస్య చోపాదాన మన స్తరమ్ || 32 విసర్జనం తతః కుర్యా త్ర్పయతే నాన్తరాత్మనా | ఇజ్యాకాల విధిస్త్వేష మయాతే రామ కీర్తితః || 33 శంకరుడు పలికె : ఇంతమున్ను తెలిపిన పాదపీఠముదనుకగల యర్చసమొనరించి దేవునికి దర్పణము (అద్దము) చూపి బీజములతో (నవధాన్యాలు) చిల్లరడబ్బులు దక్షిణతో నీయవలెను. తైలము ఉద్వర్తనము (పూయుట) చమసి నిష్పుంసన మునుం జేసి యచమనముల నొసంగవలెను. రోప్రము కాలీయకము బీజపూరకమ వర్ణకము తగరము ప్రియంగువు తెల్లావాలు సర్వౌషధులు పృక్షబీజములు సర్వగంధములు రత్నోదకము సుగంధభరితములు మూడురకాల స్నానీయోదకములను సమకూర్ప వలెను. అవ్వల (సుఘర్మణార్థీయాః) చక్కని కలశాలను గంధపుష్పాదులతో పండ్లు పంచపల్లవములతో నలంకృతములయినవానిని పవిత్రముచే బవిత్రములయినవానిని నానావిధపుణ్యనదీతీర్థ పుణ్యజలములు నింపినవానిని యథావిభవవిస్తారముగ నెంత యెక్కువగా నిచ్చిన నీయవచ్చును. అటుపై శంఖభేరీ ప్రముఖ మంగళవాద్యములతో జయజయధ్వానము సేయవలెను. ఉదకముగ్రహించుట కనువుగ శాటకము = నీయవలెను. అపైని చక్కని వస్త్రయుగ్మమునొసంగువలెను. అటుపై పూర్ణకలశకు ఆసనములకు బ్రదక్షినము సేసి పుష్పపల్లవ శోభితముగ నంజలింజేసి వేదికపైకి చల్లవలెను. ముందటివలె నాచమనీయమునుగూడ నివేదింపవలెను. అమీద శ్రేష్ఠములయిన మంగళములను నీరాజనాదులను నృత్యగీతాదులను సలుపవలెను. ఇటుపై సత్యాససమధిష్ఠించియున్న దేవాధీశు నర్చింతునని స్నానపానాదులు మొదలుకొని విసర్జనముదాక సర్వోపచారములు నర్పింతునని సంకీర్తనముసేసి వాచనికోప చారముగూడ నివేదింపవలయును. మార్గత్రయముమొదలు పాదపీఠము తుదదాక ఆవాహన విసర్జనాదులతో సకలపూజావిధానము నిర్వర్తించి యామీద సుగంధానులేపనము సేసి విసనకర్రతో వీవవలయును. అటుపై వీటకము (తాంబూలము) కూర్చా సంయోజనము సేసి సమర్పింపవలయును. వస్త్రములు భూషణములు వివిధపుష్పములు వేష్టనము (తలపాగ) పూలమాల చక్కని కంకణము రమ్యమైన ప్రతిసరము సుపిష్టమైన (మెత్తనిది) అంజనము కాటుక అద్దము దీపము ధూపము అచమనీయము గీతవాద్యములు అగ్నియందర్పింపవలెను. వహ్ని సంపూజసము చేసిననే సర్వసమర్పణము కార్యకారి యగును. (సఫలమగును) అటుపై నతిథులకు భర్తవ్యులయిన భృత్యపరివారాదులకు అన్న దానాదులను చేయవలెను. ఆమీద యాగకాలముననుసరించి (తదంగమున) పవిత్రముచే ఆసనము అన్నపాత్రలు మొదలయినవానికి ప్రోక్షణము సేయవలెను. అటుపై కూర్చుండి, ప్రభవ-అప్యయ యని ప్రారంభ మగు మంత్రములచే ఇద మగ్నే అను మంత్రముచే తూర్పున నెనిమిది గ్రాసములు (అన్నపుముద్దలను) సమర్పింపవలెను. తరువాత దేవతార్చన గృహముం బ్రవేశించి ఇజ్యావేలాసు సంధానము సేయవలెను. తనకు న్యాయమైన కాలమునకు ఉపాదానమా మీదజేయవలెను. అటుపై నిశ్చలమైన యంతరాత్మతో విసర్జనము సేయవలెను. రామా ! ఇజ్యాకాలవిధానమిది నీకు వర్ణించితిని. భగవాన్ వాసుదేవస్తు దేవస్సంకర్షణ స్తతః | ప్రద్యుమ్న శ్చానిరుద్ధశ్చ ప్రభావో೭య ముదాహృతః || 34 సంకర్షణ స్తథా೭వ్యక్త ఆత్మా ప్రద్యుమ్న ఉచ్యతే | దేవస్తత్వగత స్సర్వమనిరుద్ధో మహాయశాః || 35 సనాధస్సర్వలోకానాం సృష్టిసంహారకారకః | పురోషో೭పి తథా సత్య అచ్యుతశ్చ ద్విజోత్తమ ! || 36 భగవాన్ వాసుదేవశ్చ త్వ్యయో ೭య ముదా హృతః | చత్వార ఏతే ధర్మజ్ఞ | వాసుదేవాః ప్రకీర్తితాః || 37 భగవచ్ఛబ్ద వాచ్యాశ్చ సర్వభూత భవోద్భవాః | యః పరః పురుషో రామ! వాసుదేవః ప్రకీర్తితః || 38 భగవచ్ఛబ్దవాచ్యశ్చ సర్వభూతభవోద్భవః | శేషతత్తంగత స్సర్వమనిరుద్దో మహాయశాః|| 39 స నాధ స్సర్వలోకానాం సృష్టి సంహారకారణః | తదేత త్పఠ్యతే సూర్తే పౌరుషే ద్విజసత్తమ | 40 పాదో೭స్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి | భుజః ప్రీతి స్తథైవార్చిః ప్రాణ స్తర్పణమర్హణమ్ || 41 నివేదనం చాచమన మష్టధా మంత్రనిర్ణయః | మంత్రేణ చార్హణాన్తేన ప్రదద్యా దర్హణం పునః || 42 తథై వాచమనాన్తేన దేయ మాచమనం భ##వేత్ | ప్రాశనాన్తేన మంత్రేణ తర్పణం వినివేదయేత్ || 43 ప్రతిగ్రహేషు మాత్రాసు పాదుకాసుచ దర్పణ | ఛత్రేచ వాలవ్యజనే తాలవృంతే తధై వచ || 44 ఉపానత్సు తథాయానే వాహనేషు భృగూత్తమ | అబ్ధి ధ్వజేషుచ తధా పతాకాసుచ కీర్తితాః || 45 శేషాణాం కామభోగానాం నిత్యం సంకీర్తయేత్తుమై | సర్వత్రప్రీణనం కార్యమేతావాన్ మత్ర నిర్ణయః || 46 భగవంతుడు వాసుదేవుడుసంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడుగా (చతుర్వ్యూహముగా) విష్ణుప్రభావము ఉదాహరింపబడి నది. సంకర్షణుడు అవ్యక్తము. ప్రద్యుమ్నుడు ఆత్మ సర్వతత్వములందున్న శక్తి అనిరుద్ధుడు. ఆయన సర్వలోకనాధుడు సృష్టి సంహారములు సేయువాడు పురుషుడని సత్యుడని అచ్చుతుడనియు నాతనిచే పిలుతురు. వాసుదేవుడనియు యీయనయే యుదాహృతుడు. ఈ నల్గురు కూడ వాసుదేవులనియే కీర్తింపబడిరి. భగవచ్ఛబ్ధవాచ్యులు వీరు. భగవంతుడను పేరు వీరికే సార్ధకము. సర్వభూతప్రభవులు వీరు. పరమపురుషుడనబడు వాసుదేవుడు భగవచ్ఛబ్దవాచ్యుడు. శేషతత్త్వమంది అనిరుద్ధు డన బడును. పుణ్యావాహచనము జయశబ్దము స్తోత్రపఠనము పాదుకలు ఛత్రము పట్టుట చామర వీజనము యానము వాహనము పతాకలు ధ్వజములు సమర్పించి సర్వభోగోపచార పూరణము నిమిత్తము దక్షిణగ మాత్రను (చిల్లరను) నివేదింపవలెను. యధాశక్తి సర్వ భోగోపచారములు సమాప్తిసేసి లభింపని భోగముల మాత్రలముందే కల్పింపవలెను. వాడుకలో నున్న నాణములను అనిమిత్తమ్కుగ నిలువవలెనన్నమాట. ఇట్లు దేవాధీశుని విష్ణుని శ్రద్ధతో సర్వభోగములచేర్చిరంచి పశుయాగము జరుపనియెడ తత్ర్పతనిధిగ మధుపర్క ముచే హరినర్చింపవలెను. పశుయాగఫలాధిగమనమందు మధుపర్కము శాస్త్రవిహితమై యున్నది. మధుపర్కముచే నర్చించిన మీదటనే యన్యోపచారములు సేయవలెను. ఇక్కడ విశేషవినియోగమునకు అసనాదులు కూడ యీయవలెనని కొందరందరు. ముందుస్థాలిని (కలశను) దానితో నా మీద అర్హణిని హరితకముతో నన్నము వ్యంజనములతో భక్ష్యము నివేదించి అద్దము సూపి నిష్కుంసనమామీద నీయవలెను. ఆటు పైని ఆచమించి మాత్రాసమర్పణముసేసి ఆమీద సంవిభాగార్ధముగ?( ) అర్హణమునొసంగవలెను. మఱల అన్నము ముందటియట్లు నివేదించి దర్పణమునూపి పాద్యము నిష్పుంసనమిచ్చి యచమనమిచ్చి శాటకముగూడ నివేదింపవలెను. హస్తనిష్కుంసనముకొరకు మరల మాత్రను (నాణమును) నివేదించి తాంబూలమిచ్చి ఆయన సర్వ లోకనాథుడు సృష్టిసంహారములకు హేతువు ఈ ఈ యంశము పురుషసూక్తమునందు పఠింపబడుచున్నది. ''పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతందివి'' ఈయశేషభూతములును ఈయనయొక్కపాదము. ఈయనత్రిపాద్విభూతి అమృతము. అది దివి యందున్నదని యీసూక్తముయొక్క యర్థము. భుజి (భొజనము) ప్రీతి అర్చిస్సు ప్రాణము తర్పణము అర్హణము నివేదనము ఆచమనమునని మంత్ర నిర్ణయమెనిమిదివిధములు, అర్హణాంతమైన మంత్రముచే అర్హణమీయవలెను. అచమనాంత మంత్రముచే నాచమననీయవలెను. ప్రాశనాంత మంత్రముచే తర్పణము నివేదింపవలెను. ప్రతి గ్రహములందు (దానముపట్టుసమయములందు) మాత్ర లందు పాదుకలయందు దర్పణోపచారమందు ఛత్ర మందు వాలప్యజనమందు తాలవృంము (విసనకర్రతో) వీచునపుడు పాదుకలందు యానమందు వాహనమందు అబ్ధిధ్వజములందు? ( ) పతాకలందు మిగిలిన కామభోగోపచారములందు నిత్యము వాసుదేవ సంకీర్తనము సేయవలెను. ఈ విధముగ నెల్లయెడల భగవత్ర్పీణనము కర్తవ్యము. ఇది మంత్రనిర్ణయము. దేవానాం పాదపీఠానాం కలశానాం తధైవచ | వహ్నేస్తథాసనానాంచ చతుష్ట్వం వినివర్తతే || 47 కలశాసన వహ్నీనాం సంకరంతు సకారయేత్ తధైవ పాదపీఠానాం తేషాం చిహ్నం సకారయేత్ || 48 ప్రావణ మధుపర్కేచ మాత్రాసుచ భృగూత్తమ | సుమనస్సు సదారామ! యత్నః కార్య స్సమర్చనే || 49 సౌమసస్యం పరంరామ ! దేవదేవే నివేదితమ్ | యస్మాత్తువర్తతే తస్మాత్ప్రోక్తా స్సుమనస స్సదా || 50 మాం త్రాస్యతి భయాద్ఘోరా త్తస్మాన్మాత్రా ప్రకీర్తితా | ప్రాపయిష్యతి చస్థానే నిత్యం దుఃఖవివర్జితే || 51 యస్మాత్తస్మాద్ద్విజశ్రేష్ఠ ! ప్రోక్తం ప్రాపణికం సదా | పరమం యత్పదం రామ ! మధుసంజ్ఞం తదుచ్యతే || 52 తదాప్యతే యదాతేన మధుపర్క స్తదాస్మృతః | ఇజ్యావిధానో೭య ముదీరితస్తే సమాసతో భార్గవ వంశ చంద్ర! అతఃపరం రామ! నిబోధ పుణ్యం స్వాధ్యాయ కాలం గదతో మమాద్య || 53 ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే శంకర గీతాసు ఇజ్యాకాల విధిర్నామ త్రిషష్టితమో೭ధ్యాయః || దేవతలకు పాదపీఠములకు కలశలకు అగ్నికి అసనములకు చతుష్ట్వము నివర్తించును. పాదపీఠకలశ - అసన అగ్నులకు సాంకర్యము చేయరాదు. వానిని దారుమారుసేయరాదు. అందులకు వానిపై నొక చిహ్నము (గుర్తు) పెట్టవలెను. ప్రాపణ మందు ( ) మధుపర్కమందు మాత్రలందు సుమనస్సులందు (పువ్వులందు అర్చన యెడల నెల్లతరి యత్నముసేయ వలెను. అనగా వానిని నాణమెరిగి సేకరించి పూజకుపయోగింపవలెనన్నమాట. దేవతార్చనమందు నివేదితమై సౌమనస్యమును (చక్కని మనఃప్రవృత్తిని) ఇచ్చునది కావున పువ్వులు సుమనస్సులనబడినవి. మాం = నన్ను ఘోరభయాత్ = ఘోర భయము నుండి త్రాస్యతి = రక్షించును కావున మాత్రా = అనబడినది. (చిల్లరిడబ్బు) దుఃఖ వివర్జితమయిన స్థానమునందు నన్ను ప్రాపయిష్యతి=పొందించునదికావున ప్రాపణకము ఆనబడినది. పరమమైన బ్రహ్మవస్తువు ''మధువు'' అను పేరున వేదములందు కీర్తింపబడినది. దాని నందించు ద్రవ్యముగాన తేనె దానినర్పించుట (మధువీర్యమనబడినది) ఇజ్యావిధానమిది సంగ్రహముగ దెలిపితిని. ఈమీద పరశురామా! స్వాధ్యాయకాలమును దెల్పెదవినుము. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము శంకరగీతలందు ఇజ్యాకాలవిధియను నరువది మూడవ యధ్యాయము.