Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

అరువదియైదవ అధ్యాయము - బ్రహ్మోపదేశము

శంకర ఉవాచ :

జానుతుల్యం మృదుశుభం చైలాజిన కుశోత్తరమ్‌ | శుచౌ దేశే ప్రతిష్ఠాప్యస్థిర మానస మాత్మనః || 1

చతుర్ణా మాననానాంచ బద్ధ్వాతత్రైవ మానసయ్‌ | యోగం యుంజీత విధివత్‌ యధావ దనుపూర్వశః || 2

రామ ఉవాచ :

యోగాసనాని చత్వారి భగవన్‌ ! కానిబ్రూహిమే | బాహుమేకమవస్థాయ యోగం యుంజీతమానవః || 3

శంకర ఉవాచ

స్వస్తికం సర్వతో భద్రం పర్యంకం కమలాసనం | యోగాసనానిచత్వారి తేషాంవక్ష్యామి లక్షణం || 4

శంకరుడనియె : శుచియైనచోట మోకాళ్ళత్తునందు కదలనియాసనము (పీటవేసికొని) దానిపై దర్భాసనము చర్మము వస్త్రము నొకదానిపై నొకటి పరచుకొని దాని నాల్గు యోగాసనము లందేదో యొకదాని వేసికొని యధావిధిగా యోగ మును బూనవలెను (యోగమనగా చిత్తవృత్తి నిరోధము, చిత్తవృత్తి యాగవలెనన్న ప్రాణవాయువాగ వలయుననుట ప్రాణవాయువే మనస్సు. అదియాపినంతనే సంకల్ప వికల్పములాగిపోవును. మనస్సు సంకల్పాత్మకము గావున నది యాగుటయనగా ప్రాణమాగుటయే. దానినే ప్రాణాయామమని యోగజ్ఞులు పలికినారు). యోగాసనములు నాల్గన్నారుకదా! అవియేవి? అందేదాన యోగము పూనవలెనన శంకరుడనియె. స్వస్తికము సర్వతోభద్రము పర్యంకము కమలాసనము (పద్మాసనము) అనునవి నాల్గాసనములు. వాని లక్షణము తెలిపెద.

ఆసన్నే జానునీ కృత్వా యధావత్‌ సు సమాహితః వామం కృత్వేతరే పాదే వామజం ఘోరు పీడితమ్‌ || 5

స్వస్తికం నామ తత్ర్పోక్తమాసనం ప్రథమం శుభమ్‌ | ఊరుచజానునీ జంఘే యత్రాసనగతః సమమ్‌ || 6

ఆసనం సర్వతోభద్రం తద్విద్ధి మనుజోత్తమ ! పర్యంకే యోగపట్టేన బధ్నీయాత్‌ పృష్ఠయోగతః || 7

ఆకుంచ్య జానునీ సమ్యక్పాదం కృత్వాచ బాహ్యతః | దక్షిణం వామజంఘాయాం పర్యంకా సనకారకమ్‌ || 8

ఆసనే సర్వతోభ##ద్రే యదా భవతి మానవః | ఊరుస్థోత్తాన చరణం తదాస్యాత్కమలాసనమ్‌ || 9

అసనస్థస్య కరణం నిబోధ గదతో మమ | సమానీయోరుమూలేన హస్తౌభార్గవ ! తిర్యగౌ || 10

కృత్వోత్తానౌ సమౌ విద్వాన్‌ వామస్యోపరి దక్షిణమ్‌ | అంగుళీచ్ఛాదకం విద్వానంగుళీనాంతు విన్యసేత్‌ || 11

కించి దాకుంచితాంగుష్ఠౌ కర్తవ్యౌచ తథాకరౌ | ఉరశ్చోత్థాప్య వితతం కృత్వా రామ! పరిశ్లథమ్‌ || 12

పృష్ఠమాకుంచయేత్‌ స్కంధేదేహమున్నామయేత్‌ సుధీః ||

నిష్కంపాం సుదృఢామృజ్వీం నాతి స్తబ్ధాంస కుంచితామ్‌ || 13

గ్రీవాం విధారయేత్‌ యత్నాత్‌ శిరఃకార్యం సమంసదా | సంపశ్యన్నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్‌ || 14

కించిన్నిమీలితే నేత్రే దంతై ర్దంతాన్న సంస్రృశేత్‌ |

తాలుమధ్య గతేనైవ జిహ్మాగ్రేణ సమాహితః || 15

సబద్ధ కరణో విద్వానభ్యాసా త్పవనం జయేత్‌ |

జిత్వావాయుం యధాశక్తి యోగం యుంజీత బుద్ధిమాన్‌ || 16

ఆదౌతు చింతయేత్‌ స్థూలాం భూమింపంచ గుణాన్వితామ్‌ ||

లబ్ధలక్షోమహాయోగీ భూమియోగం సముత్సృజేత్‌ || 17

తతశ్చతుర్గుణం ధ్యానం కర్తవ్య ముదకే ద్విజ | లబ్ధలక్ష అపాంయోగీ జలయోగం సముత్సృజేత్‌ || 18

తతస్తుయోగం యుంజీత త్రిగుణం ద్విజ తేజసి ! లబ్ధ లక్షశ్చ తత్రాపి వహ్నియోగం సముత్సృజేత్‌ || 19

తతస్తుయోగం యుంజీత పవనే ద్విగుణం ద్విజ | లబ్ధ లక్షశ్చ తత్రాపి వాయుయోగం స

ముత్సృజేత్‌ || 20

తతస్త్వేక గుణం యోగం యుంజీత గగనే బుధః | లబ్ధ లక్షశ్చతత్రాపి మనోయోగ గతిర్భవేత్‌ || 21

మనసశ్చంద్రమాః ప్రోక్తః ప్రధమంచంద్రమండలే | ఊర్ధ్వలక్షం బుధఃకృత్వా చంద్రమండల మధ్యగే | 22

అంగుష్ఠమాత్రే పురుషే లక్షబంధంతు కారయేత్‌ | శశాంకశత సంకాశే సర్వాలంకార భూషితే || 23

లబ్ధలక్ష్యశ్చ తత్రాపి బుద్ధియోగగతిర్భవేత్‌ | బుద్ధిశ్చ భగవాన్‌ సూర్యః ప్రతమం సూర్య మండలే || 24

సమగ్రమేవ సంపశ్యేద్ధ్యానయోగేన బుద్ధిమాన్‌ | సూర్యమండల మధ్యస్థం శతసూర్య సమ ప్రభమ్‌ || 25

అంగుష్ఠ మాత్రం పురుషం సర్వాభరణ భూషితం | చిన్తయేత్‌ ప్రయతో నామ తత్పరస్సు సమాహితః || 26

లబ్ధలక్షశ్చతత్రాపి నిత్య మాత్మాన మాత్మనా | ఆత్మస్థ మేవ సంపశ్యే ద్ధ్యానయోగేన భార్గవ ! 27

అంగుష్ఠమాత్రం పురుషం సూర్యంబింబగతం యథా | ధ్యానయోగేన సంపశ్యేత్తధా పశ్యేత్‌ తధాత్మని || 28

అధోముఖే హృత్కమలే కర్ణికాయాం భృగూత్తమ ! లబ్ధ లక్షశ్చ తత్రాపి అవ్యక్తం చింతయే త్పదమ్‌ || 29

బహిరన్తశ్చ సర్వత్ర తేజసా తత్ర చింతయేత్‌ | నైవార్కేణ న చంద్రేణ సర్వం వ్యాప్త మశేషతః || 30

లబ్ధ లక్షశ్చ తత్రాపి పురుషం చింతయేత్‌ పరమ్‌ | శూన్యంతు పురుషం ధ్యానం ప్రవదన్తి మనీషిణః || 31

సాకారే బద్ధ లక్షస్తు శూన్యం శక్నోతి చిన్తితుమ్‌ | అన్యథా తు సు కష్టం స్యాత్‌ నిరాలంబస్య చింతనమ్‌ || 32

చిత్తవృత్తి నిరోధోహి దుష్కరః ప్రతిభాతిమే | తత్ర యత్న స్సదా కార్యః విజయే పవనస్యచ || 33

చిత్తవృత్తి నిరోధేన పవనస్య జయేనచ | ఉపాసనాయాం శూన్యస్య నిష్ఫలత్వం విధీయతే || 34

అరూప గంధమనసం శబ్దస్పర్శ వివర్జితమ్‌ | సర్వేంద్రియ గుణం రామ ! సర్వస్థం సర్వగం చ యత్‌ ||

(తం ధ్యాయన్‌ పురుషం తస్య ధ్యానం శూన్యం ప్రకీర్తితమ్‌)| 35

తస్య స్వరూపం విజ్ఞాయ రామ | శూన్యముపాసతః || 36

సర్వబంధనముక్తస్య నిష్ఫలత్వం విధీయతే | అఖండకారిణ స్త్వేవం నిత్యం భృగుకులోద్వహ || 37

సంవత్సర శ##తే ప్ణూరే సత్రిభాగే మహాభుజ ! నిష్పలత్వం పరం స్థానం ధ్రువం భవతి భార్గవ | 38

రామ ఉవాచ :

సంవత్సర శతం పూర్ణం త్రిభాగసహితం విభో! అజీవతో నిష్ఫలత్వం కథం భవతి శంకర | 39

శంకర ఉవాచ :

అఖండకారీ భవతి యద్యేవ మపి జన్మని | జన్మక్రమా దవశ్యం హి రామ ! జన్మని జన్మని || 40

పూరణీయం సత్రిభాగం ధ్రువంతేన సమాశ్శతమ్‌ | అనేకజన్మ సంసిద్ధ స్తతోయాతి పరాంగతిమ్‌ || 41

అఖండకారిణోరామ | ప్రవృత్తస్య ద్విజన్మనః | అపశ్యమేవ తత్థ్సానం యద్విష్ణోః పరమం పదమ్‌ || 42

రామ ఉవాచ :

అఖండకారితా ప్రోక్తా త్వయా దేవ ! ద్విజన్మనామ్‌ | శూద్రోవా యది వా నారీ కథంస్థాన మవాప్నుయాత్‌ ||

శంకర ఉవాచ :

అఖండకారిణీ పత్నీ ప్రాప్నోతి పరమం పదమ్‌ | శూద్రః స్వకర్మ నిరతః కేశవార్పిత మానసః || 44

జాత్యన్తర మథా೭೭సాద్య భక్తి యోగేన భావితః | అఖండకారీ భవతి తతః ప్రాప్నోతి తత్పదమ్‌ || 45

మార్కండేయ ఉవాచ :

ఏతా వదు క్తందేవేన త్ర్యంబకేన మహాత్మనా | తదా తుష్టేన రామాయ రహస్య మృషిపూజితమ్‌ || 46

ఏతత్‌భక్తివిహీనాయ నతువాచ్యం యదూత్తమ | న నాస్తికాయ మూర్ఖాయ తర్కదుష్టాయ వా తధా || 47

ఏతత్తు శృణ్వతేవాచ్యం శిష్యాయచ సుతాయచ | యోవాదద్యా స్మహీం కృత్స్నాం సశైల వనకాననాం || 48

ఏతద్గుహ్యం పరం పుణ్యం పవిత్రం పాపనాశనమ్‌ | ఆయుష్యంచ యశస్యంచ కలి దుఃస్వప్ననాశనమ్‌ || 49

అధ్యేతవ్యమిదం సమ్యక్‌ వచనం శంకరస్యచ | సర్వబంధ వినిర్ముక్తః ప్రాప్నోతి పరమం పదమ్‌ || 50

ఏతావదుక్తం త్రిపురా స్తకేన తుష్టేన రామస్య మహాబలస్య |

మయా తథా తేభిహితం నరేంద్ర! ధార్యంత్వమేదం సతతం యధావత్‌ || 51

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకరగీతా సమా ప్తిర్నామ పంచషష్టితమోధ్యాయః

మోకాళ్ళు ముడుచుకొని కూర్చుండి ఎడమపాదము కుడి మోకాలుమీద తొడమీదను నానించునట్లు స్వస్తికాసనమనబడును. ఊరువులు మోకాళ్ళు పిక్కలు సమముగా బోర్లించి కూర్చుండుట సర్వతోభద్రమగును. మోకాళ్ళుముడిచి కుడిపాదమును మాత్రము ఎడమ పిక్కమీద వెలికినిలిపి కూర్చుండుట పర్యంకాసనమగును ఇందులో వృష్ఠమును ముందుపిక్కలనుగలిపి యోగపట్టము ధరింపవలసియుండును. యోగపట్టము=పటకా (బెల్ట్‌). సర్వతో భద్రాసనమువలెనే వేసి ఊరువులందు పాదములు ఉత్తానములు (అరకాళ్లు పైకి ఉండునట్లు) నిలుచుట పద్మాసనమనబడును. అసనమందున్న తరువాత చేయవలసినది (కారణము) చెప్పదనిదె తెలియుము. చేతులొకదానికొకవైపు తొడమూలను తెరచియుంచి మోచెయ్యిక్రింద రెండు చేతుల వ్రేళ్లను కలిపి బొటనవ్రేళ్లుమడిచి పట్టుకొని రొమ్ముబాగుగాలేపి మోడమీద పృష్ఠమును వంగునట్లు కదలికలేకుండ సూటిగా మిక్కిలి స్తబ్ధముగాకుండ దేహమును ముందుకుచాచి మెడనుగట్టిగా కదలకుండధరించి తలనుసమముగానుంచి, ఒరుగకుండచేసి ముక్కుకొనచూచుచు ప్రాణాయామాభ్యాసము వలన వాయువును జయింపవలెను. బుద్ధిశాలియయునసాధకుడు వాయువుజయించి యధాశక్తి దినదినము యోగమననుసంధింప వలె. (యధాశక్తియనుటవలన తొందరపాటు ఎక్కువ శ్రమపడుటయు యోగభంగకరములని తెలియవలెను) దిక్కులవంక చూడరాదు. (చూపుప్రక్కలకు పోరాదన్నమాట) కన్నులరమోడ్పుగపెట్టవలెను. నాసికాగ్రమందు చూపునిలుపవలెననుటలోనే యిది స్వభావముచేతనే యేర్పడును. దంతములొక దానితో నొకటి తాకింపరాదు-నాలుకకొన రెండు తాలుపుల (దవడలనడుమ) నుండవలెను. ఈవిధముగా బద్ధాసమడైన యోగి వాయువుంజయించును. సమాధిలో మొదట స్థూలభూమిని ఐదుగుణములు గలదానిని ధ్యానింపవలెను. దానియందు గురికుదిరినమీద భూమి యోగమువిడిచినాల్గు గుణములుగల యుదకమును గురిసేసి నిలుపవలె. అటు పైని మూడు గుణములుగల తేజస్సునందు ఆమీద రెండుగుణములుగల వాయువునందు ఆ మీద శబ్దయికగుణమైన ఆకాశమునందు గురినిల్పి అక్కడగురి కుదిరినతర్వాత మనస్సునందు నిలుపవలెను. మనసునుండి చంద్రమండలమునందు ఊర్ధ్వలక్ష్యము (పైకి గురిచేసి) చంద్రమండలమధ్యమందున్న అంగుష్ఠమాత్రుడైన పురుషునందు లక్షబంధముసేయవలెను. ఆ పురుషుని స్వరూపము వందమంది చంద్రులవంటి ప్రకాశము సర్వాలంకారభూషితమునై యున్నట్లు ధ్యానించిమనస్సునిలుపవలెను. అందుకూడ గురికుదిరిన తర్వాత బుద్ధియోగమందు గమనింపవలెను. బుద్ధియనగా సూర్యభగవానుడే. కావున తొలుత సూర్యమండలమందు ధ్యానయోగముచే సమగ్రస్వరూపుని సూర్యమండలమధ్యస్థుని నూరుగురు సూర్యలట్లు ప్రకాశించువానిని అంగుష్ఠమాత్రుని పురుషుని సర్వాభరణ భూషితుని నియతుడై ధ్యానింపవలెను. బుద్ధిఏమాత్రము చెదరకూడదు. అక్కడకూడగురి కుదిరినతర్వాత నిరంతరము ఆత్మచేత ఆత్మను ఆత్మయందున్న వానినిగా ధ్యానయోగముచే చూడవలెను. సూర్యబింబమందంగుష్ఠమాత్ర పురుషుని నెట్లుచూచుచున్నాడో అట్లే అధోముఖమైయున్న హృదయ కమలమందు నడిదుద్దులో (కర్ణికయందు) ఆ పురుషుని దర్శింపవలయును.

అక్కడగూడ గురికుదిరినమీదట అవ్యక్తమును ధ్యానింపవలెను. అక్కడ వెలుపల లోపల నెల్లయెడల కేవలజేజస్సును (అవ్యక్తరూపమున) ధ్యానింపవలెను. అక్కడ సూర్యడులేడు చంద్రుడు లేడు. సర్వము కేవలము తేజోమయము. అక్కడ గూడ లక్ష్యము సిద్ధించినమీదట పురుషుని ధ్యానింపవలెను. పురుషుని గూర్చిన ధ్యానమును శూన్యధ్యానమని జ్ఞానులందురు. సాకార ధ్యానమందు గురికుదిరినవాడు శూన్యమును ధ్యానింపగలుగును. సాకారధ్యానము సరిగా కుదరక నిరాలంబధ్యానము చాల కష్టమగును. చిత్తవృత్తులను సంకల్ప వికల్పములు నిలుపుట దుష్కరమని నాకు తోచుచున్నది. అక్కడ వాయుజయమున కెల్లప్పుడు గట్టిప్రయత్నముచేయవలెను. చిత్తవృత్తి నిరోధముచే వాయుజయము చేతను శూన్యముయొక్క ఉపాసన వలన నిష్ఫలత్వము సిద్ధించును. అరూపగంధమనస్కము శబ్దస్పర్శ వివర్జితమునైనది శూన్యోపాసన వలన గల్గు నిష్ఫలత్వసిద్ధి. అది సర్వేంద్రియగుణము గలది సర్వమందుండునది సర్వమును వ్యాపించినదియగు అఖండమునగు వస్తుధ్యానము శూన్యమని చెప్పబడినది. ఆ శూన్యరూపము తెలిసి దానిని ఉపాసించు సర్వబంధన ముక్తుడునగువానికే నిష్ఫలత్వము సిద్ధించును. ఈ విధముగ నిత్యము అఖండకారికి నుపాసన అఖండోపాసనచేయు ద్విజునికి నూరేండ్లు ఆపైని మూడోవంతు నయిన మీదట ( 133 ఏండ్ల కన్నమాట) నిష్పలత్వమగు స్థానము సిద్ధించును. అనవిని పరశురాముండు నూటముప్పదిమూడేండ్లొకవేళ జీవింపడనుకొనుడు అట్టివానికి నిష్పలత్వము కలుగుట యెట్లన శంకరుడిట్లనియె :- ఒక్క జన్మమందు అఖండకారియగునేని యా మానవుడు జన్మక్రమమున ప్రతి జన్మమందును ఆవశ్యముగ అఖండకారియయితీరును. అవిధముగ ననేక జన్మ సంలబ్ధమయిన యోగసంస్కారముచే నూటముప్పదిమేడేండ్ల చిల్లర తప్పక పూరింపబడవలసినదే అది పూర్ణముకాగానే యాతడు పరమగతిని మోక్షమునందితీరును. అఖండకారియైనవానికి అందు ప్రవృత్తుడైనవానికి ఆవిష్ణువు యొక్క స్థానము పరమపదము అవశ్యము లభించితీరును.

అనినవిని రాముడు అఖండకారిత్వమును ద్విజులకు నీవు చెప్పితివి. శూద్రుడుకాని స్త్రీ కాని యస్థానము నెట్లు పొందునని యడిగిన శంకరుడిట్లనియె :

అఖండకిరణియైన ధర్మపత్నికూడ యాపరమపద మందును. స్వకర్మనిరతుడై విష్ణునందు మనస్సర్పించిన శూద్రుడు గూడ అవ్వల జాత్యంతరముంబొంది భక్తియోగముచే భావితుడై యఖండకారియగును. అవ్వల నావిష్ణుపదమందును.

అని పరమేశ్వరుడు మహాత్ముడు రామునియెడ సంతుష్టుడై పలికిన రహస్యము ఋషులు పూజితమైన యీయంశము భక్తి హీనునికి చెప్పరాదు నాస్తికునికి మూర్ఖునకు తర్కదుష్టునికి (కుతార్కికునకు) నిది తెలిపరాదు. ఇది శుశ్రూషాపరుడైన (వినగోరు వాడన్నమాట) శిష్యునకు కొడుకునకుం దెలుపనగును. ఇది పరమగుహ్యము పుణ్యము పవిత్రము పాపనాశనము ఆయుష్యము యశస్యము కలిహరము దుఃస్వప్ననాశము. అందులోగూడ సాక్షాచ్ఛంకరుల వచనమిది చక్కగా అధ్యయనము సేయవలసినది. దీనిచే సర్వబంధవినిర్ముక్తుడై పరమపదమందును. ఇంతవరకు త్రిపురాంతకుడు సంతుష్టుడై పరశురామునకు ఉపదేశించినాడు. రాజేంద్ర ! నేను నీకు దెల్పితిని యధాతధముగా నీవిది యెల్లపుడు ధారణసేయవలసినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున శంకరగీతాసమాప్తి బ్రహ్మోపదేశమను అరువదియైదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters