Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
అరువదియేడవ అధ్యాయము - వైష్ణవధనుఃప్రాదుర్భావము రామ ఉవాచ : వైష్ణవం చాపరత్నంతత్ కిమర్థం భవతా కరే | స్యస్తంచ తన్మే భగవన్ | చాపరత్నంచ కీదృశమ్ ||
1 శంకర ఉవాచ : మాయాహి వైష్ణవీ రామ ! యయా సంయోహితాః పురా | దేవాశ్చ ఋషయశ్చైవ గత్వాంతః ప్రణతాః స్థితాః || యజతాం పరమాధారం దేవం కమల సంభవమ్ | భూతభవ్యభవిష్యస్య ప్రభుం లోక సమస్కృతమ్ ||
3 దేవా ఊచుః : వాసుదేవస్య దేవస్య మహాదేవస్య చాప్యథ | అంతరం జ్ఞాతు మిచ్ఛామః కః కస్మా దతిరిచ్యతే ||
4 శంకర ఉవాచ : ఏవముక్త స్సురైః సర్వే ఋషిభిశ్చ పితామహైః | విహస్యోవాచ తాన్ సర్వాం స్తయో ర్గత్వా పరస్పరమ్ || 5 బ్రహ్మోవాచ : జనయధ్వం సురాస్సర్వే విరోధ మృషిభిస్సహ | విరోధేతు సముత్పన్నే తయోర్యుద్ధ ఉపస్థితే ||
6 జ్ఞాస్యధ్వ మంతరం దేవా స్తయో ర్నాస్త్యత్ర సంశయః | శంకర ఉవాచ : ఏవ ముక్తా స్సురా స్సర్వే సార్ధ మృషిగణౖస్తదా || 7 అవయోర్జనయామాసు ర్విరోధం భృగునందన ! విష్ణోరాధిక్యమన్విచ్ఛన్ తస్య మాయా విమోహితాః || 8 కృతవానస్మి దేవేన దేవవాక్యేన విగ్రహమ్ | ప్రభావదర్శనార్థాయ త్వావయోర్విగ్రహే తదా || 9 ఆసన్న మభపద్యుద్ధం సర్వ సత్వ భయంకరమ్ | ఆవయోర్భృగుశార్దూల ! తదా యుద్ధే ఉపస్థితే || 10 ఆజగామాథ తందేశం బ్రహ్మా శుభ చతుర్ముఖః | దేవా బ్రహ్మర్షయశ్చైవ తధా రాజర్షయో೭మలాః || 11 సర్వేషాం సమవేతానామావయో ర్యుద్ధ సంగరే | ఉవాచ వచనం బ్రహ్మా సర్వలోక సమస్కృతః || 12 పరుశురాముడు స్వామీ ! వైష్ణవ చాపరత్నమును నీవు మా తండ్రి హస్తమందెందుకుంచితివి ? ఆ ధనూరత్న మేలాటిదని యడుగ శంకరుండనియె : వైష్టవీమాయకు (విష్ణుమాయ) మునుపు దేవతలు ఋషులుగూడ మోహితులై ప్రజలకు బరమాధారమైన కమలసంభవుని భూతభవ్యభవిష్యములకు బ్రభువైనవాని లోకనమస్కృతు దరికేగి ప్రణతులై నిలిచి, వాసుదేవునికి (విష్ణువునకు) మహాదేవునికి (శివునికి) గల యంతరమేమో తెలియగోరుచున్నాము. ఇందెవ్వడెవ్వనికంటె గోప్పవాడు? అని యడుగ శంకరుండల్లన నవ్వి బ్రహ్మ యిట్లనియె : ఓ దేవతలార ! మీరందరు ఋషులతో గలిసి వారిర్వురుకు వైరము వెట్టుడు. దాన వారిద్దరకు యుద్ధము జరుగును. అప్పుడు వారి యంతరము మీరు దెలిసికొందురు. అని పలుక నురలందరు ఋషులతోగూడి విష్ణువు యొక్క యాధిక్యమాశించి విష్ణుమాయావశులై మాయిద్దరకు విరోధము గల్పించిరి. దేవతల మాట విని నేను విష్ణుదేవునితో తగవుపెట్టుకొంటిని. మాయిద్దరి ప్రభావము చూపుటకు ప్రవృతమైన యా తగవులో సర్వసత్త్వ భయంకరమైన యుద్ధము తటస్థించినది. ఆసమయమున బ్రహ్మ యచటికేతెంచెను. దేవతలు బ్రహ్మర్షులు రాజర్షులందరిముందు మాకు యుద్ధము జరుగుచుండ సర్వలోకవంద్యుడగు బ్రహ్మ యిట్లనియె : బ్రహ్రోవాచ : నకర్తవ్యం జగన్నాధౌ యుద్ధం పరమదారుణం | యుష్మద్యుద్ధేన సకలం సశ్యతీదం జగత్త్రయమ్ || 13 గృహీతం చాపరత్నం యత్ స్వయం దేవేన చక్రిణా | తదారోపయతాం శూలీ శూలి చాపం జనార్దనః || 14 జ్ఞాస్యామి చాంతరం దేవౌ చాపారోపణ కర్మణా | శంకర ఉవాచ : ఏవముక్తే మమ కరాత్ ధనుర్జగ్రాహ కేశవః || 15 ఆరోపితుం న మే శక్తిః సర్వయత్నేన చాభవత్ | తతశ్చ గతమోహేన మయాజ్ఞాతో మహేశ్వరః | జ్ఞాత్వా విస్పష్టచాపేన స్తుతశ్చ భగవాం స్తదా || 16 జగన్నాధులు మీరిద్దరును బరమదారుణ మీయుద్ధము సేయవలదు. మీయిద్దరి పోరాటముచే నీముల్లోకములు నశించును. చక్రాయుద్ధుడు చేపట్టిన చాపరత్నమును శూలి ( శంకరుడు) ఎక్కిడుంగాక ! ఆయన ధనుస్సును విస్ణు వెక్కువెట్టుగాక ! అప్పుడు వీరి యంతరము నేను తెలిసికొందునని బ్రహ్మయన నా చేతినుంచి విల్లును హరి గైకొనెను. విష్ణువది చేకొని దీని నెక్కిడుట కేనుచాలననియె. అంతలో విష్ణువు మోహము సడలి నా కీశ్వరుడెవ్వడో తెలిసినదని యా ధనుస్సును వదలి విష్ణుని బరమేశ్వరు డిట్లు స్తుతించెను. నమో೭స్తుతే దేవ వరా ప్రమేయ ! నమో೭స్తుతే సర్వగుణా స్తరాయ | నమో೭స్తుతే దేవగణార్చితాయ నమో೭స్తుతే సర్వగుణోత్తరాయ || 17 ఉన్మేషమాత్రేణ తవ అప్రమేయ ! దినం సమగ్రం ప్రపితామహస్య | నిమేషమాత్రేణ నిశా ప్రదిష్టా యస్యాం సమాదాయ జగత్సశేతే || 18 న కారణం వేద్మి తవేశ సృష్టౌ సంహార కార్యంచ తథా న వేద్మి | ఆద్యం న మధ్యం న తధైవ చాన్తం త్వమేవ ఈశః పురుషః పురాణః || 19 సర్వేషు భూతేషు తథా స్థిత స్త్వం సర్వాణి భూతాని తథా తవేశ ! | భూతాంతరస్థో೭పి సభూతసంస్థ ఆశ్చ్యం మేత న్మమ దేవ దేవ ! 20 భూతాంతరస్థో7పి న భూతనాధః భూతార్జితైః కర్మభి రాప్యసే త్వం| కర్మాణి సర్వాణి జగత్త్రయస్య థర్మే సదా యన్మహదధ్బుతం తత్ | 21 గంధః పృథీవ్యాంచ రసో೭స్తు దేవ ! వా¸° యధా స్పర్శగుణ స్త్వదీయః | రూపం తధాగ్నౌ గగనేచ శబ్దో గుణా స్సమగ్రాస్తవ భూత సంఘే || 22 మనోగతస్త్వంచ తధా వితర్కో బుద్ధౌగత స్త్వంచ వినిశ్చయో೭త్ర | చిద్రూప మాత్మన్యథ దేవదేవ ! అవ్యక్త సంస్థస్య గుణత్రయ స్త్వమ్ || 23 త్వమేవ భూతానిచ తద్గుణాశ్చ మూర్తేర్విభిన్నో೭సి న భూత భిన్నః | తత్త్వాని సర్వాణిచ తద్వ్యతీతః త్వమేవ దేవః పురుషః ప్రదిష్టః || 24 తవేచ్ఛయాస్యాత్ సకలాత్రిలోకీ తవేచ్ఛయా దేవ ! తధా వినశ్యేత్ | ఇత్థం విధస్యానఘ! కర్మణస్తే స్తుతిః కథం స్యాత్ పరమస్య ధామ్నః || 25 ఏవం స్తుతో దేవ వరో మయా೭సా వువాచ మాం దేవగణస్య మధ్యే | యో೭హం స దేవః పరమేశ్వర స్త్వం యో೭హం సదేవః ప్రపితామహశ్చ || 26 వందసమయ్య దేవ వర ! వందన మీశ గుణాంతరాయ ! పౌ రందర లోకవందిత ! పరాత్పర సర్వగుణోత్తరా ! జగ ద్బృందము సృష్టి యేల యొనరింతువొ దాని లయింపజేయుటీ వెందులకో యెఱుంగcదుది యీవ మొద ల్నడుమేని యింతకున్ నీకనువిచ్చినంతనది నీరజగర్బునకున్ దినమ్ము స్వా మీకనుమూతువేని యదియేకద రేయి యటన్‌శయించునీ లోకమశేష మీవొకడ లోవెలినుంటివి భూతకోటికిన్ గాకట నంటియుండ విది నాకు మహాద్భూత మీశ్వరేశ్వరా ! భూతములందు నుండియు భూతములన్ మఱిరక్షసేయుదా యాతొలిజన్మ కర్మమున నయ్యనిపొందు ఫలమ్మునీవయీ భూతజగత్తు కర్మములcబొందుఫలమ్మది ధర్మరూప, మీ రీతియిటుండ చిత్రమరరే ! నినుగర్తవటంటయేనియున్ నేలనుగంధ మారసము నీటను స్పర్శగుణమ్ము గాలిలోన్ గ్రాలెడు రూపమగ్ని గగనంబున శబ్దగుణమ్ము పెక్కుచం దాల మనస్సునందగు వితర్కము బుద్ధిందనర్చు నిశ్చయ మ్మోలిని దెల్వియాత్మగల దొక్కడవీవె గుణ త్రయమ్మునున్ భూతములీవ దానిగుణముల్ మఱినీవ విభిన్న మూర్తివై తోతువు నీవు భూతములతో నెడమొందవు సర్వతత్త్వముల్ నీతెరగయిన వానిపయినిన్ బురుషుండనిచెప్పబడ్డదే దో తొలివస్తువయ్యదియు నోపరమేశ్వర ! నీవయీశ్వరా ! నీయిచ్చన్ గలుగున్ జగత్త్రయమహో ! నిశ్శేషమైపోవనం తాయీలాటి విచిత్రచర్యుని బరంధామున్ స్తుతింపంగనౌ నేయన్నంతన నన్ను జూచియనెనయ్యీశండు మందస్మిత శ్రీయింపొంద నిలింపబృందమునినన్ శ్రీవిష్ణువానందియై. అశ్రిత్య మూర్తిత్రితయం మయేదం కర్మత్రయం శంకర ! సాధ్యతేవై | ఉత్చత్తి నాశౌ పరిపాలనంచ కాలత్రయే శంకర ! దేవ కార్యాత్ || 27 మూర్తిర్మమోగ్రా జగతాం తవేయం సంహార కార్యార్థముదీర్ణ దర్పా | ప్రభుర్బవః కారణకారణానాం పూజ్యశ్చ సర్వేశ్వర ! సర్వదేవైః || 28 యే త్వాం నమస్యంతి జగత్ర్పధానం భక్తిం పరం యేచ వహన్తి తుభ్యమ్ | భక్త్యా చ నిత్యం తవ పూజయ న్తి స్థానం హి తేషాం సులభం మదీయమ్ || 29 మదీయ మేతద్భువి చాపరత్నం ప్రదీయతాం భార్గవ నందనాయ | ఋచీక పుత్రాయ గుణాధికాయ తస్మా త్సమా దాస్యతి తస్య పుత్రః || 30 సతేన చాపేన నిహత్య శత్రూన్ కృత్వా చ లఘ్వీం వసుధాం సురేశ ! | తచ్చాపరత్నం భువి రాఘవాయ ప్రదాస్యతే రామ ఇతి శ్రుతాయ || 31 కృత్వా స రామో೭పి హి తేన కర్మ ప్రదాస్యతే తద్వరుణాయ చాపం | తస్మా త్సమా దాస్యతి ఫాల్గునో೭పి దేవార్థ కార్యైక రతి ర్మహాత్మా || 32 స్వం చాపరత్నం జానకాయ దేహి ! నిమీతి నామ్నా భువి శబ్దితాయ | తేనాపిచాపేన స తత్ర్పసూతో రాజా మహత్కర్మ కరిస్యతీతి || 33 ఏతావ దుక్త్వా భగవాన్ మహాత్మా జగామ కాష్ఠాం మనసస్త్వభీష్టామ్ || మయా తధాతే భువి చాపరత్నే ద్విప్రధాన క్షితిపేఘదత్తే || 34 యద్వైష్ణవం చాపపరం పితు స్తే న్య స్తంకరే వాసుకి తుల్యరూపం | తదైవ కార్యేణ వినా స శక్యం కేనా ప్యధిజ్యం యుధిరామ కర్తుమ్ || 35 అజ్ఞాతు వస్తుదురితం సురకార్యదక్షం గోవింద బాహువిటపాశ్రయలబ్ధమానమ్ | న్యస్తం పురా పితృకరే తవ యుద్ధశౌండ ! చేత్థం మయా హరివచః ప్రసమీక్ష్య రామ ! 36 ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే-మార్కండేయ వజ్ర సంవాదే వైష్ణవధనుః ప్రాదుర్భావోనామ సప్తషష్టితమో೭ధ్యాయః. పరమేశ్వరుడనంబడు దేవుడనేను ప్రపితామహుండనంబడు నీవును నేనే. శంకరా ! మూడు రూపములాశ్రయించి మూడు రకముల కర్మములను సాధించుచున్న దొక్కడే. దేవతలపనికై ఉత్పత్తినాశములు పాలనమునను మూడు పనులు మూడుకాలములందు నాచే జరుపబడుచుండను. జగముల సంహార కార్యమున విజృంభించు నీయొక్క యీఉగ్రమూర్తి నాదే. కారణములకు గారణములయిన వానికి ప్రభువు భవుడు (భవంతి జగంత్యస్మాదితిభవః =జగత్తులేయననుండి ప్రభవించును. గాన భవుడనినిర్వచనము) సర్వదేవతలకు బూజ్యడగుటచే సర్వేశ్వరుడనబడును. జగత్త్రయవానులగు నీకెవ్వరు మ్రొక్కదురు నీ యెడపరమ భక్తిపూనుదురు భక్తితో నీస్థానమును (క్షేత్రమును) పూజింతురు వారికి నాస్థానము సులభము. ఇదిగో యీనా చాపరత్నమును భార్గవనందనునకిమ్ము. అతడు ఋచీకకుమారుడు గుణాధికుడు. అతనికుమారుడాతనినుండి దానింగైకొనును. దానితో నతడు శత్రుసంహారముసేసి వసుంధరా భారమును హరించును. ఆధనుఃశ్శ్రేష్ఠము రాముడని వినబడు నతనికీయబడును. ఆ రాముడును దానిచే భూభారముహరించి వరుణునకీయగలడు. అతనినుండి ఫాల్గునుడును (అర్జునుడును) దానింబడసి దేవాకర్యైక నిష్ఠుడగును. శంకరా ! నీచాపమును నిమియను పేర నవనింబిలువబడు జనకునకిమ్ము. అతని కొడుకుదానితో నద్భుతకార్యము సేయ గలడు అని యింతదాక పలికి భగవంతుడు తనకభీష్టమైన దెసకుంజనెను. నేనారెండు ధనుస్సుల రాజులకిచ్చితిని. వైష్ణవధనువు మీత్రండి హస్తమునందు న్యాసముసేసితిని. (జాగ్రత్తపరుపుమని దాచనికిచ్చితినన్నమాట) పరశురామా! విష్ణువచనము ననుసరించి యేదోయొక తెలియని పదార్థముచేగూర్చబడినది సురకార్య నిర్వహణసమర్దమైనది గోవింద బాహుశాఖ్గాలంబన మొందు టచే సద్భుతగౌరవముంగొన్న దియునునగు నీవైష్ణవచాపము నీతండ్రిచేతిలో నుంచబడినది. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున వైష్ణవధనుఃప్రాదుర్భావమను నరువదియేడవయధ్యాయము.