Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
అరువది యెనిమిదవ అధ్యాయము-అశ్మనగర దర్శనము మార్కండేయ ఉవాచ : ఏవముక్త స్తదా రామో దేవదేవేన శంభునా | ప్రణమ్య శిరసాదేవం పార్వతీం వరదాం తధా ||
1 ప్రమధైశ్చ పరిష్వక్తః సోత్కంఠే నాంతరాత్మనా | జగామాశ్రమ ముద్దిశ్య పితుః పర బలార్దనః ||
2 పో೭చిరేణౖవ సంప్రాప్య దదర్శాశ్రమమండలే | వయోవృద్ధం తపోవృద్ధం పితరం దీప్త తేజసమ్ ||
3 సో೭భివాద్య పితుః పాదౌ మాతుశ్చ పరవీరహా | భ్రాతౄనా మాను పూర్వ్యేణ ధర్మనిత్యో జితేంద్రియః ||
4 తైశ్చ మూర్ధ న్యుపాఘ్రాతః సాంత్విత స్స మహాతపాః | స మత్ప్రసాదం పృష్టశ్చేత్యుక్త్వా సర్వమశేషతః ||
5 అఖ్యాతవాన్ తతః పశ్చాత్ పాతాలగమనం తదా | ఆసన్నం దేవకార్యంచ చాపరత్నంచ వైష్ణవం ||
6 జమదగ్నిర్మహాతేజాః శ్రుత్వా రామవచ స్తదా | చాపరత్న చ రామాయ ప్రదదౌ దేవ పూజితం ||
7 దత్త్వోవాచ సతం రామం హుతాశన సమప్రభం | పశ్చిమేన సముద్రేణ ప్రవిశ్య వరుణాలయం ||
8 సంపూజ్య వరుణం రామ ! త్తసై#్యవానుమతే తదా | శక్రశత్రూన్ దురాచారాన్ పాతాలనిలయాన్ జహి ||
9 అనేన చాపరత్నేన వైష్ణవేన మహాబల | దైతేయాన్ సమరే హత్వా గత్వాచ వరుణాలయమ్ ||
10 ప్రష్దవ్యో వరుణో దేవ స్త్వయా ధర్మాన్ సనాతనాన్ | స పుత్ర ! వరుణాద్ధర్మాన్ శ్రుత్వా రామ యధావిధి ||
11 ఆగచ్ఛేధా యధాకాల మత్సమీపం మహాభుజ ! | ఏవముక్తస్తదా రామః పిత్రా ధర్మభృతాం వరః ||
12 పితరం మాతరం భ్రాతౄ నభివాద్య యధావిధి | జగామ వరుణావాసం రామో వైశ్వాసర ద్యుతిః ||
13 స ప్రవిశ్య సముద్రేణ మహాదేవప్రసాదతః | తతో೭శ్మ నగరం రామో దదర్శ పుర ముత్తమమ్ ||
14 మనో೭భిరామం స్ఫటికాశ్మచిత్రం తురంగ నాగేంద్ర కులా೭೭కులంచ | విభూషితం పన్నగ దైత్యనాథై రుద్యానవాపీశత సంకులంచ ||
15 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే రామస్యా೭೭శ్మనగరదర్శనంనామ అష్టషష్టితమో೭ధ్యాయః మార్కండేయుడనియె. శంకరుడిట్లు పలుక పరుశురాముడు మహాదేవునకు వర ప్రదాత్రియగు పార్వతికిని తలవంచి మ్రొక్కి ప్రమథగణములు గౌగలించుకొన నమితవేడుకతో దండ్రియాశ్రమునకుజనియెను. సత్వరమటయటజేరి యా యాశ్రమ మందలమున వయోవృద్ధుడుతపోవృద్ధుడై బ్రహ్మతేజస్సుతోదీపించుచున్న యాయసనుచూచెను. తల్లిదండ్రుల పాదములపై ప్రణతుడై యన్నలకును నమస్కరించి వారును శిరమ్ముబూర్కొని సుఖముగా వచ్చితివాయని బుజ్జగింప నీకు గలిగిన శివానుగ్రహ విశేషమే మని యడుగ నదియును ఆపై పాతాళగమనమును సిద్ధమైన దేవకార్యమును విష్ణుధనుస్సు వృత్తాంతమును వారికెరింగించెను. జమదగ్ని రాముని పలుకాలించి దేవతలుపూచించు విష్ణుధనుస్సు రామునకిచ్చెను. మరియు నగ్నివలె ధీపించుచున్న యాతనింగని పశ్చిమసముద్రమార్గముననేగి వరుణలోకమునకేగి వరుణుని బూజించి యాతని యభిమతము ననుసరించి పాతాళమందలి యింద్ర శత్రువుల దురాచారుల సంహరింపుము. ఈ చాపరత్నముచే సయ్యందరుడైత్యులంగూల్చి తిరిగి వరుణాలయమున కరిగి వరుణదేవుని సనాతనధర్మము లానుతిమ్మని ప్రార్థించి యధావిధిగవిని సమయానుకూలముగ తిరిగి నాయొద్దకు రమ్ము. ధార్మిక శ్రేష్ఠుడిట్లు తండ్రిచే దెలుపబడి తల్లిదండ్రులకు భ్రాతలకును నభివాదనముసేసి పరశురాముడు వైశ్యానరుడట్లు దహించుచు వరుణావాసమున కేగెను. సముద్రముదారింజని మహాదేవప్రసాదమున బ్రవేశించి నీట సామాన్యులకు దర్శింపరాని పరమసుందరము స్పటికశిలాచిత్రము గజేంద్రకులాకులము పన్నగదైత్యదానవరాజాలంకృతమైన యశ్మనగర మనెడి నగరరాజమును దర్శించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ప్రథమ ఖండమున యశ్మనగరదర్శనము నరువదిఎనిమిదవ అధ్యాయము