Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
అరువది తొమ్మిదవఅధ్యాయము - రామకృతవరుణాది సందర్శనము మార్కండేయ ఉవాచ : తస్మిన్పురవరే రమ్యే రత్నచిత్ర సభాగతం | రత్నాసన గతం వీరం చారుకుండల లోచనమ్ ||
1 స్నిగ్ధ వైడూర్య సంకాశం శుక్లాంబర విభూషితం | హారభారార్పిత తనుం చారుకేయూర ధారిణం ||
2 ప్రవాళమణి ముక్తాఢ్యం గంభీరం భుజగాశ్రయమ్ | కీరీటోత్తంస సంఛన్నం యాదోగణ సమాశ్రయాం ||
3 ఆదిత్య ముదకావాస మంభసాం పతి మూర్జితం | లోకనాధం మహద్భూతం భక్తానా మభయప్రదమ్ ||
4 విష్ణోర్భాగం విశాలాంసం విశాలాక్షం మహాభుజం | సేవ్యమానం మహాభాగై స్త్రిదశై ర్ర్బాహ్మణౖ స్తథా ||
5 దైతేయైశ్చ మహాభాగై ర్భీమై ర్భీమపరాక్రమైః | సుందోప సుంద శక్రాక్ష శంబ రామర కంటకైః ||
6 హయగ్రీవ మహాగ్రీవ దశగ్రీవ సురాంతకైః | భీమ భీమాక్ష నరక వికటోత్కట మారణౖః ||
7 అతికాయ మహాకాయ భీమకాయ బలోద్ధతైః | నాగైశ్చ సుమహాకాయై మహాభోగై ర్జద్ధితైః ||
8 నాగరాజ్ఞా వాసుకినా శంఖేనకురుణా తథా | (మహా పద్మేన పద్మేన కర్మోటక ధనంజయైః ||
9 ఐరావతేన నాగేన తక్షకేణ బలేన చ | కంబలా శ్వతరాభ్యాంచ హ్యార్యకేణ మహాత్మనా) ||
10 వాలవ్యజన హస్తాస్త ముపవీజ న్తి నిమ్నగాః | గంగా చ సరయూ రాజన్ ! వితస్తా యమునా తధా ||
11 ఇరావతీ చంద్రభాగా నర్మదాచ మహానదీ | పయోష్ణీ బ్రాహ్మణీ గౌరీ విపాశౌ దేవికా తధా |7
12 శతద్రుః కంపనా వంధు స్తధా చాన్యా స్సహస్రశః | సేవ్యమాన స్తధా కూపై స్తడాగైశ్చ సవిగ్రహైః ||
13 సరోవరై స్సాగరైశ్చ సముద్రైశ్చ యదూ త్తమ ! | మార్కండేయుడనియె. పరుశురాముడట్లు వరుణనగరముం బ్రవేశించియందు రత్నచిత్ర సభామండపమునందు, రత్నా ననలంకరించి కుండలరత్న కాంతుల నుద్దీపించు సయనములతో స్నిగ్ధవైడూర్య మణిప్రభాభరితమైనమేన తెలిపట్టుపుట్టములందాల్చి రతనాలహారములతూగ భుజకీర్తులద్భుతస్ఫూర్తినింప పవడములు మణులు ముత్యములు నిండమెఱయ గంభీరుడై నాగులగొలువకిరీట సంఛన్నుడై తిమింగిలాది నానావిధజలజంతుసమాశ్రయుడై జలములందున్న యాదిత్యుడాయన్నట్లు జలములన్నిటికేలిక యగుటయేకాదు లోకములకు నధినాధుడైన భూతపంచక ప్రధానాధినేత భక్తాభయప్రదుడు విష్ణువుయొక్క యంశమూర్తి వెడదయైన మూపును లోచనములు బాహువులుంగలవాడు మహానుభావులైన నాగులచేత్రిదశులచే (వేల్పులచే) బ్రాహ్మణులచే భయంకరరూపము పరాక్రముంగల సుందోప సుంద శక్రాక్ష శంబరాదులగు సమరకంటకులచే హయగ్రీవ మహాగ్రవ దశగ్రీవ దేవాంతకులచే భీమ భీమాక్ష నరక వికటోత్కట మారణులచే అతికాయ మహాకాయ భీమకాయ బలోద్ధతులచే మహాకాయులు మహాబోగులు (పెద్దపడగలుగల) జగత్తు నకు హితముసేయు నాగులచే నాగరాజు వాసుకి శంఖుడు కురుపు పద్ముడు మహాపద్ముడు కర్కోటకుడు ధనంజయుడునను నాగులచే ఐరావతనాగుడు తక్షకుడు బలుడు కంబలుడు అశ్వతరుడు అర్యకుడునను నాగులచే సేవింపబడువాడు నగు వరుణుని రాముడు దర్శించెను. నాలుకలల్లార్చుచున్న వానిని జూచిరి. రసాధినేతను వాలవ్యజములుపూని యిరువంకల నిలిచి వీచుచు గంగ సరయు వితస్తయమున ఇరావతి చంద్రభాగ నర్మద మహానది వయోష్టి బ్రాహ్మణీగౌరి విపాశ##దేవిక శతద్రువు కంపనసింధువు మున్నగు మరిపెక్కునదులు దేవతామూర్తులంధరించి గొలుచుచుండెను. చెరువులు కూపములు సరోవరములు సాగరములు సముద్రములు మున్నగు సర్వజలాశయములు విగ్రహధారులై (మూర్తిగొని) యాపశ్చిమ దిశాధినాథుని గొలుచుచుండెను. తం దృష్ట్వా వరుణం రాజన్ ! స వ వందే భృగూత్తమః ||
14 పూజయామాసచ తధా వరుణో೭పి భృగూత్తమమ్ | పాద్యార్ఘ్యాచమనీయాద్యైరాసనే నోదకేనచ ||
15 ఆశీనశ్చ తదా రామో దై తేయానాంచ వధేవృతః | మహాదేవ వచ స్సర్వం వరుణాయ న్యవేదయత్ ||
16 స చ తేనా೭భ్యనుజ్ఞాతో య¸° దైత్యపురం మహత్ | షరుణో೭పి మహాతేజాః రామ వాక్యేన యాదవ !
17 సంవాదయామాస తదా రామం రణృత క్షణమ్ | తదా వరుణ దూతేభ్యో దైతేయా శ్శ్రుత విస్తరాః ||
18 నిష్క్రమ్య నగరా ద్రాజన్ ! చతురంగ బలాన్వితాః | సుసన్నద్ధాః ప్రతీక్షన్తో రామ మద్భుత విక్రమమ్ ||
19 ద దృశు శ్చ మహాబాగం వరచాప ధరం తదా | మృత్యో ర్భుజ మివోదగ్రం లోకాకర్షణ తేజసమ్ ||
20 దీప్తాంశు జాలం రణచండ వేగం ధనుర్ధరం కాల భుజ ప్రకాశమ్ | మహానుభావం సమరేష్వజేయం తేలిహ్యమాసం భుజగేంద్రబాహుం ||
21 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వరుణాది దర్శనం నామ ఏకోన సప్తతితమో೭ధ్యాయః యాదవేశ్వరా వినుము భృగూత్తముడు(పరశురాముడు) ఆవరుణునికి వందనముగావించెను. అతడును పాద్యార్ఘ్యాచమనీ యాద్యుపచారముల బరశురామునర్చించెను. మరియు నాతడుంచిన యాసనమందు గూరుచుండి దైతేయులవధ విషయమునదాను గోరబడినట్లును పరమేశ్వరుడందులకు బలికిన పలుకులును వరుణునకు నివేదించెను. ఆతని యనుమతమొంది దైత్యపురముననేగెను. రాముడు యుద్ధము వేడుకగొని వచ్చినాడని వరుణుడు దూతలచే చాటింపజేసెను. దైత్యులును చతురంగబలముతో యుద్ధసన్నద్ధులై నగరువెడలి యద్భుత విక్రముండగు రాముని కెదురుసూచుచుండిరి. అద్భుతధనుర్ధారినాతనిని మృత్యుదేవతయెత్తి నహస్తమట్లున్న వానిని లోక సంహారతత్పరుని రణచండవేగుని మిఱుమిట్లుగొల్పు వానిని కాలదేవత భుజమన్నట్లున్న ధనువుందాల్చిన మహానుభావుని అజన్ముని నాలుకనల్లార్చుచున్న వానిని జూచిరి. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు రామకృత వరుణాదిసందర్శనమను అరువదితొమ్మిదవ అధ్యాయము.