Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

డెబ్బది రెండవ అధ్యాయము - సూర్యాధిమాస వర్ణనము

రామ ఉవాచ :

స్నిగ్ధవై డూర్య సంకాశ ! యాదోగణ జలేశ్వర! | త్వత్తోహం శ్రోతుమిచ్ఛామి కాలసంస్థాం మహాభుజ ! || 1

వరుణ ఉవాచ :

అనాది నిధనః కాలోరుద్ర స్సంకర్షణ స్స్మృతః | సర్వభూత సమత్వాచ్చ సతురుద్రః ప్రకీర్తితః || 2

అనాది నిధనత్వేన స మహాన్‌ పరమేశ్వరః | నిమేషాదపి సూక్ష్మత్వాత్‌ సూక్ష్మ తరోహ్యతి || 3

తస్య సూక్ష్మాతి సూక్ష్మస్య కాలస్య పరమేష్ఠినః | దుర్విభావ్యా మహాభాగ ! యోగినామపి సూక్ష్మతా || 4

పద్మత్ర సహస్రంతు సూచ్యావై భిద్యతే యదా | సమకాలంతు తద్భిన్నమబుధో మన్యతే జనః || 5

కాలక్రమేణ తద్భిన్నం సాతస్య ద్విజ ! సూక్ష్మతా ! తస్య సూక్ష్మాతి సూక్షస్య నచాతి సహతే ద్విజ ! || 6

నామ సంఖ్యా బుధైజ్ఞేయా గ్రహగత్యను సారతః | తత్రతారాగ్రహాః పంచద్వౌచ జ్ఞేయా మహాగ్రహౌ || 7

ఉవగ్రహౌచ ద్వౌజ్ఞే¸° ఏవంప్రోక్తా నవగ్రహాః | భౌమ జ్ఞజీవ భృగుజ సౌరా స్తారాగ్రహా స్స్మృతాః || 8

చంద్రాదిత్యా తధారామ ! విజ్ఞే¸° ద్వౌమహాగ్రహౌ | ఉపగ్రహౌచ ద్వౌజ్ఞే¸° రాహుః కేతుశ్చ భార్గవ ! || 9

చండార్కగత్యా కాలస్య పరిఛేద ముఖో యదా | తదా తయోః ప్రవక్ష్యామి గతిమాశ్రిత్య భార్గవ ! || 10

స్నిగ్ధవైడూర్యమణిప్రభా ! ఓ వరుణదేవా ! కాలసంస్థను గూర్చి నీవలన దెలియగోరెద తెలుపుమన వరుణుడిట్లానతీయం దొడంగె. పరశురామా ! కాలము అంతము లేనిది, రుద్రుడు సంకర్షణుడని పేర్కొనబడినది. సర్వభూతముల యెడ సముడుగావున రుద్రుడనబడెను. అనాదినాధుడగుట మహాపరమేశ్వరపాచ్యుడు. నిమేషముకంటెను మిక్కిలి సూక్ష్మము గావున నతి సూక్ష్మ సూక్ష్మతరుడు. అట్టి కాలరూప బ్రహ్మయొక్క సూక్ష్మభావము యోగులకేని భావింపతరముగానిది. తామరరేకులు వేయింట నొక్క సూదిమొన గ్రుచ్చునపుడుగల భేదమును అపండితుడు గ్రహింపజాలడు. దానిలోకూడగల కాలముయొక్క సూక్ష్మభావము అతి సూక్ష్మ మగుటచే సామాన్య మానవుడు గణింపజాలడు. గ్రహములగతి ననుసరించి కాలము యొక్క నామము సంఖ్యామానమును పండితులు తెలియవలెను. ఆ గ్రహములలో తారాగ్రహములైదు, మహాగ్రహములు రెండు. ఉపగ్రహములు రెండు. మొత్త మివి నవ (తొమ్మిది) గ్రహములు, కుజ-బుధ-గురు-శుక్ర-సౌరి (శని) గ్రహములు. తారా గ్రహములు. సూర్యచంద్రులు రెండు మహాగ్రహములు. రాహుకేతువులు రెండునుపగ్రహములు. చంద్ర సూర్యుల గతి ననుసరించి కాలమానము చెప్పబడును. ఇదే వినుము.

భగణన సమగ్రేణ జ్ఞేయా ద్వాదశ రాశయః | త్రింశాంశ్చ తథా రాశే ర్భాగ ఇత్యభిధీయతే || 11

ఆదిత్యాత్‌ విప్రకృష్టస్తు భాగే ద్వాదశ##కే తధా | చంద్రమాస్స్యా త్తదారామ ! మసార్ధేన న సంశయః || 12

భాగ ద్వాదశ##కేనైవ తిధ్యాం క్రమేణతు | చంద్రమాః కృష్ణ పక్షాన్తే సూర్యేణ సహ యుజ్యతే '|| 13

సన్నికార్షా దథారభ్య సన్నికర్షా మధాపరమ్‌ | చండార్కమో ర్భుధైర్మాసః చాంద్ర ఇత్య భిధీయతే || 14

సావనేచ తదామాసి త్రింశత్సూర్యోదయాః స్మృతాః | ఆదిత్యరాశి భోగేన సౌరోమాసః ప్రకీర్తితః || 15

సర్వర్‌క్ష పరివర్తైశ్చ నాక్షత్రో మాస ఉచ్యతే | తిధినై కేన దివసః చాంద్రమానే ప్రకీర్తితః || 16

అహోరాత్రేణ చైకేన సావనో దివస స్స్మృతః |ఆదిత్య భాగ భోగేన సౌరో దివస ఉచ్యతే||17

చంద్ర నక్షత్ర భోగన నాక్షత్రో దివస స్స్మృతః| మానే మానస్తు నాక్షత్రః సప్తవింశతి బిర్దినైః || 18

పరిశేషేషు మానేషు మానస్త్రింశుద్దినః స్మృతః | సౌరేణాబ్దస్తు మాసేన యధాభవతి భార్గవ ! || 19

సావనేన మాసేన దివసం కేన పూర్యతే | ఊనరాత్రాశ్చ తేరామ ! ప్రోక్తా సంవత్సరేణ షట్‌ || 20

సౌరసంవత్సర స్యాన్తే మానేన శశిజేనతు | ఏకాదశాతి రిచ్య న్తే దినాని భృగునందన || 21

సమాద్వయే సాష్టమాసే దినషోడశికాన్వితే | నాడీచతుష్టయాన్తేతు తస్మాన్మాసోతిరిచ్యతే || 22

స చాధి మాసకః ప్రోక్తః కామ్యకర్మసు గర్హితః | యదా చాన్ద్రేణ మానెన పూర్ణస్సంవత్సరో భ##వేత్‌ || 23

తదా నాక్షత్ర మానేన సమాసో వార్షికో భ##వేత్‌ | ఏవం కాలస్య సూక్ష్మస్య ప్రోక్తం మాస చతుష్టయమ్‌ || 24

యేన యేనచ మానేన యద్యత్కార్యం నిబోధ తత్‌ || 25

ఆబ్దాయనం గ్రహచార కర్మ సౌరేణ మానేన సదా వ్యవస్యేత్‌ |

సత్రాణ్యుపాస్యా న్యథ సావనేన లోకేచ యత్‌స్యా ద్వ్యవహార కర్మ || 26

స్యాత్పూర్వ కాలక్షయ పూరణాభ్యాం చాంద్రేన మానేన యుగంచ రాహోః |

నక్షత్ర సత్రాణ్యయనాని చేందోః మానేన కుర్యాద్భగణాత్మకేన || 27

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వరుణం ప్రతి పరశురామ ప్రశ్నేర్కాది మాస వర్ణనం నామ ద్విస ప్తతి తమోధ్యాయః.

సమగ్ర భగణము (27 నక్షత్రములు) పండ్రెండు రాశులుగా విభక్తము. ఆ రాశిలో ముప్పదవయం శము రాశి యొక్క భాగము. సూర్యునినుండి పండ్రెండవయంశమున చంద్రుడు నెలసగముచే (15 రోజులకు) ఉండును. ప్రతి తిథియందు క్రమముగా బండ్రెండవ యంశమునందాతడు సంచరించి కృష్ణపక్షము చివర సూర్యునితో సంగమించును. ఆ మహాగ్రహములు రెండింటి సన్నికర్షమును (సంగమమును) ఆరంభించి క్రమముగామరియొక సన్నికర్షము వరకునగు మాసము చాంద్ర మాసమని పిలువబడును. అట్లే సావనమాసమునందు సూర్యోదయములు ముప్పదియుండును. రాశిభోగముననుసరించి సౌరమాసమని పిలువబడును. సర్వనక్షత్ర పరివర్తనము ననుసరించి యగు మాసము నాక్షత్రము. చాంద్ర మాసమందు ఒకే తిథి ననుసరించిన దినము సావనమున ఒక అహోరాత్రము ననుసరించిన దినము ఆదిత్యభాగ భుక్తి ననుసరించి సౌరదివసమనియు, చంద్ర నక్షత్ర భోగము ననుసరించి నాక్షత్ర దివసమనియు పేర్కొనుట జరుగును. నాక్షత్రమాస మిరువది యేడు రోజులకు పూర్తియగును. ఇతర మాసములందు నెలకు ముప్పది రోజులు. సౌర మాసములు ననుసరించి యబ్దము (ఒక్క సంవత్సరము) అగుసరికి సావనమాస ముచే దిన సంఖ్య దేనిచే బూర్తియగును? అన్నచో అట్లు ఊనములయిన (తక్కువ వచ్చిన) రాత్రులు సంవత్సరమునను ఆరు రాత్రులు వచ్చును. అవి ఊన రాత్రములని పిలువబడును. చాంద్రమసముంబట్టి యవి సౌర సంవత్సరము పూర్తయగుసరికి బందునొక్కడడ్రెండింటికి మించియుండును. రెండు సంవత్సరముల యెనిమిది మాసాల పదునారు రోజుల నాలుగు నాడులు (నాడీ =ఘటక) అగుసరికి యొక్క మాస మధికమాసమగును. (అదే అధికసమమని చాంద్రమాసమని పిలువబడును. అది కామ్యకర్మ నిషిద్ధము. చాంద్ర మానముననుసరించి సంవత్సరము పూర్తియగుసరి నాక్షత్రమానము ననుసరించి యది వార్షికమగును.

ఇట్లు సూక్ష్మకాలము యొక్క నాల్గుమాసముల యేర్పాటు దెల్పితిని. ఏ మాసముంబట్టి యే యే కార్యము సేయనగునో యిదె తెలియుము. అబ్దము యొక్క లెక్క గ్రహచారకర్మ సౌరమాసము ననుసరించి చేయవలెను. సావన మాసముచే సత్రములు (యాగములు) ఉపాసింపవలసినది. చంద్ర క్షయ వృద్ధుల ననుసరించి లోకవ్యవహార కర్మలు యావత్తు రాహుయుగము గూడ చేయనగునను. క్షత్ర సత్రాదులు భగణాత్మకమైన చాంద్రమాసము ననుసరించియే చేయనగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున సూర్యాదిమాసవర్ణనము అను డెబ్బదిరెండవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters