Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
డెబ్బది నాలుగవ అధ్యాయము - యుగాంతవర్ణనము వజ్ర ఉవాచ : యదేత దుక్తం రామస్య వరుణన మహాత్మనా | ఏతచ్ర్ఛుత్వాతు మేజాత స్సంశయో భృగునందన ! ||
1 అస్మింస్తు భరతే వర్షే పరిక్షీణ యుగే తథా | అవస్థాయా భ##వేత్ బ్రహ్మన్ ! తన్మే వ్యాఖ్యాతు మర్హసి ||
2 మార్కండేయ ఉవాచ : యుగేయుగే పరీక్షీణ వర్షే యాదవ ! భారతే ! సంగ్రామేణ వినశ్యన్తి ప్రాయో వర్ణోత్తమా జనాః ||
3 వజ్ర ఉవాచ : అస్మా చ్చతుర్యుగా ద్ర్బహ్మస్ | యదతీతం యు గత్రయం | తేష్వహం శ్రోతు మిచ్ఛామి సంగ్రామం భృగునందన ! ||
4 మార్కండేయ ఉవాచ : అసీ త్కృత యుగ స్యాన్తే విప్రాణాం క్షత్త్రియైస్సహ | వైశ్యానాంచ సశూద్రాణాం యుద్ధం పరమ దారుణమ్ ||
5 వర్ణత్రయం తత్ర రణ క్షత్రియై ర్వినిపాతితమ్ | (తతశ్చ బ్రాహ్మణాః కేచిత్ క్షత్రియానేవ మబ్రువన్ || 6 ఆల్పైర్భవద్భిః కార్యేణ వయంకేన వినిర్జితాః ) తానబ్రువన్ మహాభాగాః క్షత్రియా స్సత్యసంగరాః || 7 ఏకో7స్మాకం ద్విజశ్శ్రేష్ఠ స్సేనానీ రితి విశ్రుతః | సర్వశాస్త్రాస్త్ర కుశలో వయం తస్య మతే స్థితాః || 8 భవతాం బహుచి త్తత్వా ద్వయం తస్మాత్పదేవదే | జయామో విపులం సైన్యం నాత్ర కార్యా విచారణా || 9 క్షత్రియై రేవముక్తాస్తే బ్రాహ్మణా స్సంశిత ప్రతాః | శశాంకం శరణం జగ్ముః ద్విజేశం సోమ మంజసా || 10 సంతా నువాచ ధర్మాత్మా సోమో రాజా ద్విజో త్తమాన్ | ప్రయాగే భార్గవో విద్వాన్ బ్రాహ్మణ స్సంశిత వ్రతః || 11 శూరఇత్యేవ విఖ్యాతో నిత్యం వసతి ధార్మికః | ప్రమతిర్నామ తస్యాస్తి పుత్రో ధర్మభృతాం పరః || 12 సర్వశాస్త్రార్థ కుశలో ధనుర్వేద పరాయణః | విష్ణుర్మానుష్య మాపన్నో యుష్మత్కార్యార్థ సిద్ధయే || 13 కృత్వా సేనా ప్రణతారం తంతు కృష్ణాజిన ధ్వజమ్ | నిర్మర్యాదాన్రణ సర్వాన్ క్షత్రియాన్ తాన్విజేష్యథ || 14 సోమస్య వచనం సర్వైరేవ ముక్తేర్ద్విజైః కృతమ్ | ప్రాయః క్షత్రియ హీనేయం లఘ్వీ వసుమతీ కృతా || 15 ఆదౌ కృతా క్షత్రబలైర్విట్చూద్ర ద్విజ వర్జితా | ఏవం కృత యుగస్యా న్తే యుద్ధమాసీత్సు దారుణమ్ || 16 తథా త్రేతా యుగస్యాన్తే రాక్షసై ర్యుద్ధ కర్కశైః | రాష్ట్రం రాష్ట్ర మధా77సాద్యపార్థివా స్సగణా హతాః || 17 రాజా భీమరథో నామ విష్ణుర్మానుష్య రూపధృక్ | దివో దాసాన్వయే జాతో నిజఘా నాథ రాక్షసాన్ || 18 ఏవం త్రేతాయుగస్యాన్తే మహావిజయ కాంక్షిభిః | రాక్షసైః క్షత్రియా యుద్ధే కేశ##వేనచ తే హతాః || 19 తధైవ ద్వాపర స్యాన్తే వాసుదేవార్జునౌ రణ | చక్రతు ర్వసుధాం లఘ్వీం నర నారాయణౌ నృప ! || 20 ద్వాపరే ద్వాపరే రాజన్ ! తధైవ మధుసూదనః | ఏక మేవ యజుర్వేదం చతుర్దా వ్యభజత్పునః || 21 ద్వాపరే7స్మిన్ నృపాతీతే వసిష్ఠ కులవర్ధనః | పారాశర సుతః శ్రీమాన్ విష్ణుద్వైపాయన స్స్మతః || 22 ప్రకాశో జనితో యేన లోకే భారత చంద్రమాః | పరీక్షిత్ పుత్రం రాజ్యస్థం రాజానం జనమేజయం || 23 వైశంపాయన ఇత్యేవ శిష్యో వ్యాసస్య విశ్రుతః | అఖ్యాస్యతి మహాఖ్యానం సర్వపాప భయాపహమ్ || 24 ధర్మే చార్థేచ కామేచ మోక్షేచ యదునందన ! ప్రదీపభూతం సర్వస్య బుధ బుద్ధి వివర్ధసమ్ || 25 యత్రవిష్ణుకధాం దేవ్యాః శ్రుతయశ్చ సనాతనాః | తచ్ఛ్రో తవ్యం మనుష్యేణ పరంపద మభీప్సతా || 26 భారతాత్పారణం ప్రాప్య నరకంతు స గచ్ఛతి | న చేత్స్యా ద్యది భూపాల ! మహాపాతక సంయుతః || 27 దశభిః పారణౖస్థ్సానం ప్రాప్నోతి జగతః పతేః | కేశవస్య మహాభాగ ! నిర్మితం యేన భారతమ్ || 28 వ్యస్య వేదం చతుర్థాతు విష్ణుర్ద్వైపాయనో మునిః | శిష్యా నధ్యాపయామాస నామతస్తాన్ నిబోధమే || 29 ఋగ్వేద మథపైలంతు సామవేదం తు జైమినిమ్ | ఆధర్వణం సమస్తుంతు యజుర్వేదం మహామునిమ్ || అధ్యాపయామాస తదా వైశంపాయన సంజ్ఞకమ్ | వాకోవాక్యం పురాణంచ సూతం భారతమేవచ || 31 అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః | ధర్మశాస్త్రం పురాణంచ విద్యా స్త్వేతా శ్చతుర్దశ || 32 శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం జ్యోతిషాం గతిమ్ | ఛన్దో విశేష ష్షష్ఠశ్చషడంగో వేద ఉచ్యతే || 33 సాంఖ్యంయోగం పంచరాత్రం శైవం పాశుపతమ్ తథా | కృతాంత పంచకం విద్ది బ్రహ్మణః పరి మార్గణ || 34 సంసారక్షయ హేత్వర్థే భావోపకరణ షు చ | సోత్తరా వైష్ణవా ధర్మా స్సారమేత త్ర్పకీర్తితమ్ || 35 ఏతావా నేవ సకలో విద్యాగ్రామ స్తవేరితః | విద్యాః ప్రశస్తా శ్చైతాభ్యః శతశో7థ సహస్రశః || 36 యో7సౌ వ్యాసస్య శిష్యో భూ దారణయ స్సుత శ్శుకః | తేసై వ దేవదేవేన విష్ణునా ప్రభవిష్ణునా || 37 త్రేతాయుగే చతుర్వింశే భృగువంశోద్భవేన తు | వాల్మీకినాతు రచితం స్వమేవ చరితం శుభమ్ || 38 రామాఖ్యానం మహాపుణ్యం శ్రోతౄణాం విష్ణులోకదం | వర్తమానే కలియుగే క్షీణ నృపతిసత్తమ ! 39 వజ్రుడనియె పరశురామునికి పరుణుడు తెల్పిన యీ యంశములు విని నాకు సంశయమై యడుగుచున్నాను. ఈ భారత వర్షమందు యుగము క్షీణమయినప్పుడుండుస్థితి యెట్లుండునోయెరింగిపుమన మార్కండేయుడు ఓయాదవ! భారతమందప్పుడు రణమొనరించి యందరుత్తమ వర్ణములవారు నశింతురన వజ్రుండు గడచిన మూడుయుగాలలో నట్లుజరిగినే యుద్ధవృత్తాంతము వినగోరుదునన మార్కండేయుండిట్లనియె. కృతయుగముతుద విప్రులకు క్షత్రియులకును వైశ్యులకు శూద్రులకు పరమదారుణయుద్ధములు జరిగి యందు మూడువర్ణములవారు క్షత్రియులవలన నశించిరి. అంతట క్షత్రియులంగని బ్రాహ్మణులు మీరల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకులనెట్లు గెలిచిరనియడిగిరి. వారు సత్యప్రతిజ్ఞులనిరి. మాకొక్క బ్రాహ్మణుడు సేనానియనుపేర సర్వశాస్త్రకుశలుడు నాయకుడై యుండెను. అయునయభిప్రాయమునకు గట్టువడినిలిచినారము. మీరు బహుమనుస్కులు. (బ్రాహ్మణానామనేకత్వం - బ్రహ్మ ణులందరునొక యాలోచనకు గట్టుబడరు) కావున యడుగడుగున మీసైన్యమెంత విపులమయియున్నను మేమేగెలిచితిమి. ఇందు విమర్శింపబనిలేదన బ్రాహ్మణులు తీవ్ర వతపరాయణులయి చంద్రుడు ద్విజరాజుగావున యతనిశరణందిరి. అధక్యాత్ముడు సోమ రాజువారింగని, ప్రయాగక్షేత్రమందువిద్వాంసుడు వ్రతనిష్ఠుడుశూరుడను బ్రాహ్మణుడుధర్మపరుడుగలడు. అతనికుమారుడు ధార్మిక శ్రేష్ఠుడు ప్రమతియున్నాడు. అతడు సర్వశాస్త్రార్థకుశలుడు ధనుర్వేద పారగుడు మీకొరకు మనుష్యరూపముందాల్చివచ్చిన విష్ణువే యాతడు. అతనిని కృష్ణాజిన మనిలో పతాకచిహ్నముగా గొనినవానిని సేనాపతింగావించికొని సర్వక్షత్రియులను మీరు గెలువుడు. అన సోమని పలుకాలించి యట్లకావించిరి. కృతయుగమునందు బ్రాహ్మణ వైశ్య శూద్రులు తప్ప క్షత్రియులచే నీ విశ్వంభర భారమెల్లం దలంగెను. అట్లే త్రేతాయుగాంతమున రాక్షసులు యుద్ధకర్కశులై ప్రతిరాష్ట్ర మాక్రమించి పార్థివులను సపరివారముగ నిర్జంచిరి. అప్పుడు విష్ణువు మనుషరూపియై భీమరథుండను రాజు దివోదాసుని వంశమునం దుదయించి రాక్షసులం బరిమార్చెను. ఇట్లు త్రేతాయుగము చివర రాజులు వియజకాంక్షులైన రాక్షసులచేతను శ్రీహరి చేతను మడిసిరి. అట్లే ద్వాపరము చివర వాసుదేవార్జునులు నరనారాయణమూర్తులు వసుధబారము హరించరి. ప్రతి ద్వాపరమందు మధుసూదనుడొకే గ్రంధమయియున్న యజుర్వేదమును నాల్గుగా విభజించెను. ఈ ద్వాపరము గడువ వశిష్ఠవంశవర్థనుడు పరాశరసూనుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడనుపేర సాక్షాద్విష్ణువే భారతమను చంద్రుని ప్రకాశమునకుం గొనివచ్చెను. ఆయన శిష్యుడు వైశంపాయనుడు, పరీక్షిత్సుతుడు జనమేజయుడు రాజ్యమేలుతరి నాతని కీ మహాభారతేతిహాసమును జెప్పగలడు. అది సర్వపాపహరమగు గ్రంథము. ధర్మాది పురుషార్థములనది దీపమువలె ప్రకాశింపజేయునది. పండితులకు బుద్ధివర్థకము. దానియందు విష్ణు కథలు దేవీమహిమలు సనాతన శ్రుతులు వివరింపబడినవి. పరమపదముగోరు మనుష్యుడు దానిం దప్పక వినవలయును. భారతము పారాయణముసేసి పరమపుణ్య మందినవాడు మహాపాతకములు సేసినవాడుగాడేని నరకముం బొందడు. పది భారత పారణములు సేసినవాడు విష్ణుసాలోక్య మందును. దాని నిర్మించిన ద్వైపాయనముని నాల్గుగ వేదమును విభజించి వేదవ్యాసుడను పేరందెను. ఆయన పైలుని ఋగ్వేదమును జైమినిని సామవేదమును సుమంతుని అధర్వణమును నైశంపాయనుని యజుర్వేదమును అధ్యయనింపజేసెను. సూతుని వాకో వాక్యము పురాణము భారతమునుం జదివించెను. వేదాంగములు, నాల్గు వేదములు మీమాంస న్యాయవిస్తరము (న్యాయవైశేషికములు ధర్మశాస్త్రము పురాణమునను నివి చతుర్దశ విద్యలు, శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము జ్యోతిశ్శాస్త్రము ఛందస్సు నను నీ యారంగములచే వేదము షడంగమనబడును. సాంఖ్యము యోగము పాంచరాత్రము శైవము పాశుపతము నను విని పరబ్రహ్మ నన్వేషించుటందు కృతాంతవంచకమనబడు ప్రస్థానములు. (సిద్ధింతపచకము లన్నమాట) సంసారక్షయ నిమిత్తముగ భావోపకరణములందు సధర్మోత్తర విష్ణుపురాణ మిదియునుం గీర్తింపబడినది. సకలవిద్యాగ్రామమిది యింతవరకే యని నీకు దెల్పితిని. వీని నుండి వందలు వేలుగ ప్రశస్తములయిన విద్య లెన్నో యావిర్భవించినవి. వ్యాసుని పుత్రుడు శుకాచార్యులు. ఆయన శిష్యుడైయారణీయుడను పేరందెను. సర్వజగత్ర్పభవిష్ణువైన యవ్విష్ణువే యిరువదినాల్గవ త్రేతాయుగమందు భృగువంవమందు వాల్మీకి రూపమున నవతరించి తానే మహాపుణ్యము విష్ణుపాలోక్య ప్రదము నైన రామాఖ్యానము (రామాయణము) రచించెను. కల్కీ విష్ణుయశోనామ భవిష్యతి జగత్పతిః | ఘాతయిష్యతి సర్వాన్స వ్లుెచ్ఛాన్ పరబలార్దనః || 40 వ్లుెచ్ఛాక్రాంతాం వసుమతీం కృత్వా వ్లుెచ్ఛ వివర్జితాం ! ధర్మ సంస్థాపనం కృత్వా స్వస్థాన ముపయాస్యతి || ప్రజాసు ధర్మయు క్తాసు తతస్సంపత్స్యతే కృతం ! ఇత్యేవం భగవాన్ విష్ణుః యుగే క్షీణ೭భిజాయతే || 42 ధర్మ సంస్థాపనార్థాయ నిత్యమేవ యదూద్వహ | ప్రాదుద్భావ సహస్రాణి సమతీతా న్యనేకశః || 43 భవిష్యతి తథా తస్య యేషాం సంఖ్యాన విద్యతే || 44 ఏత త్తవో క్తం హి నరేంద్ర చంద్ర ! క్షీణయుగే యద్భవతీహ లోకే | అతః పరం ధర్మభృతాం పరిష్ఠ ! ప్రబ్రూహి కింతే కధయామి రాజన్ ! || 45 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రతమఖండే మార్కండేయ వజ్రసంవాదే యుగాన్త వర్ణనం నామ చతుస్సప్తతి తయోధ్యాయః. ఇప్పుడు జరుగుచున్న కలియుగము క్షీణించినతరి కల్కిమూర్తి విష్ణుయశుండను పేర రాజగును. అరిబలమర్దనుడాతడు సర్వవ్లుెచ్ఛక్రాంతమయిన యీ వసుమతిని వ్లుెచ్ఛవిముక్తి గావించి ధర్మసంస్థాపనముసేసి స్వస్థానము నలంకరించును. అటుపై ప్రజలు ధర్మయుక్తులుకాగా కృతయుగ మారంభమగును. విష్ణుభగవానుడిట్లు యుగక్షీణదశయందు ధర్మసంస్థాపనము సేయుట కవతరించుచుండును. అనేక వేల యవతారములు గడచినవి. రానున్నవి. వాని లెక్క యింతయని లేదు, ఓ నరేంద్రచంద్ర? ఈ లోక మందు యుగక్షీణదశలో నేమగునో తెల్పితి నీపయి నింకేమి తెలుపవలయు నది పలుకుము. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున యుగాంతవర్ణనమను డెబ్బది నాల్గవ యధ్యాయము.