Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఎనిమిదవ అధ్యాయము భారతవర్ష వర్ణనము వజ్ర ఉవాచ : భగవ& ! భారతం వర్షం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః | కర్మభూమిషు మర్త్యానాం వర్షం భార్గవ ! భారతం ||
1 మార్కండేయ ఉవాచ : భారతస్యాస్య వర్షస్య నవభేదాః ప్రకీర్తితాః | అష్టభి ర్గిరిభిశ్భన్నాః యేత్వ గమ్యాః పరస్పరమ్ ||
2 హిమాచలా దా సముద్రం గిరయ స్తే వ్యవస్థితాః | యామ్యోత్తరేణ రాజేంద్ర! నామతస్తా& నిబోధమే ||
3 స్వమాలీ హేమ మాలీచ శంభుః కార్తస్వరావరః | వైడూర్య పర్వతశ్చైవ రాజతో మణిమాన్ భవః ||
4 ఇంద్రద్యుమ్నః కరేతశ్చ తామ్రవర్ణో గభ స్తిమా& | రాగద్వేషస్తథైవాన్యో గాంధర్వ స్త్వథావారుణః ||
5 తేషాంతు నవమోమధ్యే ద్వీపోనామ్నాతు మధ్యమః | అస్మి& మన్వంతరే క్షి ప్తః సాగరెశ్చ చతుర్దిశమ్ ||
6 వైడూర్య పర్వతః పూర్వము త్తరేణ హిమాచలాత్ | పశ్చార్ధే కాంచనగిరే రుదగేవచ లావణాత్ ||
17 వేష్టిత స్సాగర స్సర్వో నానా సత్వాశ్రాయో నృప ! | హిమాలయ స్సాగరైస్తు కృతోదేశ ద్వయ స్తథా ||
8 లవణస్యోత్తరే పార్శ్వే సాగరస్య చ దక్షిణ | పురీలంకా సన్నివిష్టా యస్యాం వైరావణో హతః ||
9 వజ్రుండడుగ మార్కండేయుండు మానవుల కర్మభూములలోనిదగు భారతవర్షముంగూర్చి యిట్లనియె : ఈభారతవర్షము తొమ్మిది భాగములుగ నున్నది. వాని నెనిమిది గిరులు కప్పియున్నవి. అవి అగమ్యములు. హిమాచలము మొదలు సముద్ర పర్యంతము దక్షిణోత్తరములుగ నవి యున్నవి. అవి స్వమాలి, హేమమాలి, శంభువు, సువర్ణనిధి, వైడూర్యగిరి, రాజతగిరి (వెండికొండ), మణిమంతము, ఇంద్రద్యుమ్నము వేదేతము తామ్రవర్ణము, గభస్తిమంతము, రాగద్వేషము, గాంధర్వము వారుణము అని. వానిలో తొమ్మిదవ ద్వీపము మధ్యమమనుపేర నున్నది. ఈమన్వంతరమందు నలుదెసలకు సాగరులచే జమ్మివేయబడినది. హిమాలయమున కుత్తరముగ వైడూర్యపర్వతము కాంచనగిరికి పడమటి సగమందు లవణ సముద్రమున కుత్తరమున నున్నది. దీనికి నానాసత్వసమాశ్రయమను సాగరము చుట్టునున్నది. హిమాలయమును సాగరులు రెండుదేశములుగ విభజించిరి. ఉప్పు సముద్రము యొక్క ఉత్తరప్రక్క సాగరమునకు దక్షిణమున లంకాపురిగలదు. రావణుడందు నిహతుడయ్యెను. లవణనతు సంపృక్తః సముద్రో లవణోయతః | హిమాచలస్య యోభాగో వర్షే7స్మి& నృప ! భారతే ||
10 తత్రాస్తిశైల ప్రవరో ద్వితీయో గంధమాదనః | శ్వేతశ్చ పర్వత శ్రేష్ఠో మందరశ్చ నుహాగిరిః ||
11 ఏతేశైలవరా దృష్టాః పాండవైశ్చ మహాత్మభిః | హిమాచలస్యమధ్యేతు కైలాసోనామ పర్వతః ||
12 హిమవత్యేవ విఖ్యాతో నరనారాయణా శ్రమః యస్యసా బదరీ రమ్యా నానాశకుని సేవితా ||
13 ఉష్ణతోయ వహా గంగా శ్వేతతోయ వహా పరా | సువర్ణసికతా రాజన్ ! తాపసై రుపశోభితా ||
14 ఇత్యేతే కథితా ద్వీపాః ప్రాధాన్యేన తవా నఘ | ఏతేషామంతరే ద్వీపాః శతశోథ సహస్రశః ||
15 నతే వర్ణయితుం శక్యాః వర్షాణాంతు శ##తైరపి | వివర్జయిత్వా భరతస్య వర్షం, వర్షేషు సర్వేషు నరేంద్రసింహ ! నిరామయావీత భయా మనుష్యాః వర్ణేషు సర్వేషు తథై వచోక్తాః ||
16 ఆయుఃప్రమాణం లభ##తేహి రాజ& ! ద్వీపేషు సర్వేషు నరోమయోక్తమ్ | కృత్వాశుభం కర్మతు భారతే7స్మిన్ ద్వీపేషు సర్వేషు నరాః ప్రయాన్తి | దండశ్చ తేషాంచ న దాండికో7 స్తి సన్మార్గగా స్తేపి తథాచ రాజన్ ||
18 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే - మార్కండేయ వజ్రసంవాదే భారత వర్షవర్ణనంనామ అష్టమో7ధ్యాయః. ఈ భారతవర్షమందు హిమాలయము భాగమున సముద్రము ఉప్పుతో గూడినందున లవణ సముద్రమయ్యెను. అందుగూడ రెండవ పర్వత శ్రేష్ఠము గంధమాదనము శ్వేతము మందరమహాగిరియుంగలవు. వీనిని మహానుభావులు పాండవులు చూచిరి. హిమాచలము నడుమ కైలాసపర్వతముగలదు. హిమగిరిపైనే నరనారాయణాశ్రమము బదరియను పేర రమ్యమైన ప్రదేశమున్నది. అక్కడ గంగ వేడినీటితో అచ్చపు తెల్లని నీటితో నుండును. అందలి యిసుక సువర్ణమయము. తపస్వులచే నలంకరింపబడినట్టిది. ఇది ప్రధాన ద్వీపముల విషయము. వీనిలో సంతర్ద్వీపములు వేలకొలది యున్నవి. వానిని వర్ణింప నూరేండ్లైన శక్యముగాదు. భరత వర్షమును విడిచి మరియుంగల వర్షములందలి మనుజులు నిరామయులు (రోగరహితులు) భయరహితులు ననంబరగుదురు. భారత వర్షమందు శుభాశుభకర్మమాచరించి నరులు పురుషాయుర్దాయముంబడయుదురు. ఆయావర్షములందు జనింతురు. వృక్షము లభిమతార్థముల నొసంగును. రూపవతులు స్త్రీలును నందుదయింతురు. అక్కడ జనులు సన్మార్గగాములగుటచే దండనముగాని దండితుడుగాని వారికి లేరు. భారతవర్షము కర్మభూమి తక్కిన వర్షములు భోగభూములు (కర్మఫలానుభవము నిచ్చునవి) అన్నమాట. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున భారతవర్షవర్ణనమను నెనిమిదవ యధ్యాయము.