Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఎనుబదవ అధ్యాయము - యానకాలవ్ణరనము

వజ్ర ఉవాచ :

బ్రహ్మణోస్య సముత్పత్తి మారభ్యసుమహాద్యుతే !

కాలస్య గతి మిచ్ఛామి శ్రోతుం భృగుకులో ద్వహ! || 1

మార్కండేయ ఉవాచ :

స్వేనాహో రాత్రమానేన బ్రహ్మణోస్య జగత్పతేః | సమాష్టకం గతం రాజన్‌ ! పంచ మాసాస్తధ్తే వచ || 2

అహోరాత్ర చతుష్కంచ వర్తమాన దినాద్గతమ్‌ | అతఃపరం ప్రవక్ష్యామి తన్మేనిగదతః శృణు! || 3

మనవః షడ్గతాః సప్త సంధయశ్చ తధా గతాః | సప్తవింశద్వ్యతీతాశ్చ తధై వచ చతుర్యుగాః || 4

యుగత్రయం తధాతీతం వర్తమాన చతుర్యుగాత్‌ | సంవత్సరాణాం దశకం తధా కలియుగాద్గతమ్‌ || 5

వాతాశ్వమేఘ కాలేస్మిన్‌ సహయక్షేణ యాదవ | భవిష్యాణా మతీతానాం బ్రహ్మణాం భూరిదక్షిణ! || 6

అనాది మత్వా త్కాలస్య సంఖ్యా వక్తుం స శక్యతే | గంగాయా స్సికతా ధారా యదా వర్షతి వాసవః || 7

శక్యాగణయితుం రాజన్‌ ! న వ్యతీతాః పితామహాః | ఆస్తవత్తాం బుధా బుద్ధ్వా సర్వస్య జగతీ పతే ! || 8

తన్మార్గం పరిమార్గన్తే యద్విష్ణోః పరమం పదమ్‌ ||

వజ్రఉవాచ- కియత్కాల పరీమాణం మయాశాస్యా వసుంధరా || 9

వజ్రుడు ఈ బ్రహ్మ పుట్టుక మొదలుకొని యైన కాలముయొక్క గతి వినవలయు దెల్పుమన మార్కండేయుడనియె. జగత్పతియగు ఈ బ్రహ్మకు ఆయన షూనముప్రకారము ఎనిమిది సంవత్సరాలయైదుమాసములమీద నాల్గు అహోరాత్రములు నేటితో జరిగినవి. ఇటుపై లెక్క తెలిపెదవినుము. ఆరుగురు మనువులు. ఏడుసంధులు ఇరువదియేడు మహాయుగములు మూడుయుగములు గడచినవి. ఇపుడు నాల్గవయుగమారంభమగుచున్నది. ఈ కలియుగంలోగూడ పదిసంవత్సరాలు వెళ్లినవి. ఓ భూరిదక్షిణ! దక్షిణలు నిండుగ నిచ్చి యజ్ఞములు సేసిన ఓ వజ్రమహారాజా ! ఈ యక్షునితో గూడిన వాతాశ్వ మేఘకాలమందు జరిగిన జరుగబోవు బ్రహ్మలయొక్క లెక్క కాలము మొదలుతుదయులేనిది కావున తెలుపుటకు శక్యముగాదు. గంగానదిలోని యిసుకరేణువులు ఇంద్రుడు గురిపించు వర్షధారలు నెన్నోలెక్కింప వలనుపడును. కాని గడచిన బ్రహ్మలను గణనసేయుట శక్యముగాదు. మొత్తమిదియంతయు నంతవంతమే (నశించునదే) యనితెలిసి యావిష్ణువుయొక్క పరమపదమార్గమును బుధులు వెదకు చుందురు.

పరీక్షితాచ ధర్మజ్ఞ ! తన్మే బ్రూహి ! భృగూత్తమ |

మార్కండేయ ఉవాచ - అద్య ప్రభృతి రాజేంద్ర ! సమాపంచాశ##తే గతే || 10

పరీక్షితి మహారాజే దివం ప్రాప్తే కురూద్వహె | పరీక్షిద్దీనలోకేస్మిన్‌ ప్రాణితుం త్వంతు శక్యసే || 11

మహాప్రస్థాన మావిశ్య నాగలోకం గమిష్యసి | స్వర్గతే త్వయి రాజేంద్ర ! పరీక్షితి తధానృపే || 12

రాజా నాగపురే భావీ పరీక్షిజ్ఞనమేజయః | మధురాయాంతధా భావీ తవ పుత్రోచలో నృపః || 13

నగరం ఖాండవపురం భయాది వినివర్జితం | పాలయిష్యతి ధర్మాత్మా పుత్రస్తే భీమ విక్రమః || 14

దానవేంద్రో మయః పూర్వం ఫాల్గునేన ప్రయాస్యతా |

మహాప్రస్థాన గోరాజన్‌ ! త్వత్ర్పియంకర్తుకామ్యయా || 15

యావద్వజ్రో మహీం భుంక్తే ఖాండవ ప్రస్థమాశ్రితః | తావత్సఖేయం సంరక్ష్యా త్వయా మదుపరోధతః || 16

సేయం సంరక్ష్యతే ..... ప్రతిజ్ఞాయ ధనంజయే | త్వయినాక మసుప్రాప్తే సభేయం మయశాసనాత్‌ || 17

హిమాచలం తు సేష్యన్తి యత్ర బిందు నరః నరః | రాక్షసాః కింకరా .... యత్తస్మా న్నిర్మితా పురా || 18

ఉక్తం హి తే కాలగతం మయైత దాయుః ప్రమాణంచతధా తవోక్తం |

అతఃపరం ధర్మభృతాం వరిష్ఠ! వ దస్వకింతే కధయామి రాజన్‌! || 19

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్ర సంవాదే యానకాల వర్ణనం నామ ఆశీతి తమోధ్యాయః ||

అనవిని వజ్రుడు నేనీభూమినెంతకాలము పాలింప వలసియుండును? పరీక్షిత్తు ఎన్నాళ్లుపాలించు నది యానతిమ్మన మార్కండేయుడనియె. రాజుఇప్పటినుంచి యైదువందలసంవత్సరములు గడువ పరీక్షిన్మహారాజుకూడ యీలోక మువదలి వెళ్లినతరువాత గూడ ఈలోకమందీపు ప్రాణధారణము సేయగలవు. అప్పుడు మహాప్రస్థానముంగొని నాగలోక మునకేగెదవు. నీవుస్వర్ణమందిన తరువాత నాగపురమందు (హస్తినాపురమందు) పరిరక్షిత్తుకుమారుడు జనమేజయుడు రాజగును. భాండవప్రస్థమను నగరమును భయరహితముగ నీకొడుకు భీమవిక్రముడు ధర్మాత్ముడైపాలించును. నీకొడుకు అచలుడు రాజగును. భాండప్రస్థమను నగరమును భయరహితముగ నీకొడుకు భీమవిక్రముడు ధర్మాత్ముడై పాలించును. అర్జునుడు మహా ప్రస్థానము సేయుచు మయుడను దానవేంద్రునితో నీ ప్రియమొనరించుటకు-వజ్రుడు మహారాజ్యభోగము ననుభవించుదాక ఖాండవ ప్రస్థమందీవుండి ఈమహాసభగాపాడవలసినది. ఇదినాయాజ్ఞయని యానతిచ్చును. ఆతడు ధనంజయునకు నట్లేయని మాటయిచ్చి దీనిని రక్షంచును. నీవు స్వర్గమందగనే యీమయసభను మయుని యానతిచే యాతనినౌకరులు హిమాలయమందలి బిందు సరస్సునకు గొంపోదురు. అబిందుసరముకూడ మయుని నిర్మాణమే. నీకుకాలగతిని నాయుఃప్రమాణమునుగూడ దెల్పితిని. మరి యేమి చెప్పవలయు నది యడుగుమనియె.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమందు యానకాలవర్ణనమను నెనుబదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters