Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఎనుబదియొకటవ అధ్యాయము - కల్పసాదృశ్యము వజ్ర ఉవాచ : త్వయోదితానాం సర్వేషాం సమాసేన పృధక్ పృధక్ | కాలస్యావయవానాం చశ్రోతు మిచ్ఛామి దేవతాః ||
1 మార్కండేయ ఉవాచ :- పౌరుషం యదహోరాత్రం శ్రుతవానసి యాదవ ! కాలాత్మా పురుష స్తస్య సర్వ భూత పతిః ప్రభుః ||
2 కల్పస్య దైవతం బ్రహ్మా యస్యేదం సకలం జగత్ | క్రమా న్మన్వంతరాణాంతు మనవస్తు చతుర్దశ ||
3 స్వాయంభువస్తు ప్రధమోమను స్స్వారోచిష స్తథా | వైవస్వంతో 7థ సావర్ణిః బ్రహ్మపుత్ర స్తథైవ చ ||
4 ధర్మపుత్రో రుద్రపుత్రో దక్షపుత్ర శ్చ యాదవ | రౌచ్యో భౌత్యశ్చ విశ్వాత్మా మనవస్తు చతుర్దశ ||
5 వజ్ర ఉవాచ :- య ఏతే భవతా ప్రోక్తా మనవ శ్చ చతుర్దశ | నిత్యం బ్రాహ్మే దినే ప్రాప్తే ఏత ఏవక్రమాద్ద్విజ ! ||
6 భవన్త్యుతా7 న్యేధర్మజ్ఞ ! ఏతన్మే ఛిన్ది సంశయమ్ | అథవా వర్తమానే7స్మిన్ భవతా మమకీర్తితాః
7 మార్కండేయ ఉవాచ :- ఏత ఏవ మహారాజ ! మనవస్తు చతుర్దశ | కల్పే కల్పే త్వయా జ్ఞేయానా7త్ర కార్యా విచారణా || 8 ఏకరూపా స్త్రయః కల్పాః జ్ఞాతవ్యా స్సర్వ ఏవ హి | క్వచి త్కించి ద్విభిన్నాశ్చ మాయయా పరమేష్ఠినః || 9 జ్ఞాతవ్య మేక రూపత్వ మబ్దానాంచ తథా త్వయా | కల్పే కల్పే మహారాజ ! మనూనాంచ విశేపతః || 10 వజ్ర ఉవాచ :- కల్పానాం జనసాదృశ్యే యుక్తిర్నైవోప పద్యతే | కదా చిదపి ధర్మజ్ఞ ! తత్రపశ్యామి కారణమ్ || 11 ఏతస్మిన్నంతరే ముక్తిం కల్పే కల్పే గతే ద్విజ ! | ప్రభవిష్యజ్జగచ్ఛూన్య కాలస్యాదేరభావతః || 12 మార్కండేయ ఉవాచ :- జీవస్యా7న్యస్య సర్గేణ నరేముక్తి ముపాగతే | అచిస్త్యశక్తి ర్భగవాన్ జగ త్పూరయతే సదా || 13 బ్రహ్మణా సహ ముచ్యన్తే బ్రహ్మలోక ముపాగతాః | సృజ న్తేచ మహాకల్పే తద్విధా శ్చాపరే జనాః || 14 తే ప్రాప్తాః పరమంస్థానం యేషాం జన్మ న విద్యతే | సమజీవ ప్రమాణాశ్చ సర్వే కల్పా స్తధా నృప || బ్రహ్మలోకే విష్ణులోకే రుద్రలోకే చ యే గతాః | 15 విష్ణులోకా స్సు బహవో రుద్రలోకా స్తధైవచ | శ్వేతద్వీప గతా యే చ తేషాం జన్మ నవిద్యతే || 16 స తు సర్వేషు రాజేంద్ర ! తేషు ముక్తిః ప్రకీర్తితా || బ్రహ్మలోకో పరిష్టచ్చ యే లోకా రౌద్రవైష్ణపాః || 17 మయోదితా స్తయో ర్గత్వా పునర్జన్మ సవిద్యతే | మహా కల్పక్షయే జీవాః సర్వే తం పరమేశ్వరమ్ || 18 ప్రాప్యా7పి వినివర్తన్తే వినా జ్ఞానేన యాదవ ! | భూయ ఏవ త్పలోకాన్ సర్గే సృజతి తాన్ భ్రుః || 19 కల్ప మధ్యేతు. కల్పాన్తే జ్ఞానోజ్ఘిత కలే బరాః | ప్రాప్నువన్తి పరం స్థానం తద్విష్ణోః పరమం పదమ్ || 20 జీవ బీజాన్య సర్గేణ తత్థ్సానం పరమేశ్వరః | ప్రపూరయతి ధర్మజ్ఞ రాజన్ ! కేనాపి హేతునా || 21 వజ్ర ఉవాచ : కల్పానాం సతి సాదృశ్యే యోభేదౌ భృగునందన | తమహంశ్రోతు మిచ్ఛామి తత్రమే కౌతుకం మహత్ || 22 మార్కండేయ ఉవాచ :- కల్పానాం సతి సాదృశ్యే శృణు భేదం నరాధిప ! | సమతీతే తధా కల్పే షష్ఠే మన్వంతరే గతే || 23 సప్తమస్య చతుర్వింశే రాజన్ ! త్రేతాయుగే తదా | యదా రామేణ సమరే సగణో రావణో హతః || 24 రామేణౖవ తదా రాజన్ ! కుంభకర్ణో నిపాతితః | వర్తమానే తు యద్వృత్తం కల్పే యదుకులోద్వహ ! || 25 రామస్య చరితం బద్ధం తదా వాల్మీకినా శుభమ్ | అతీత కల్పే యద్వృత్తం మయా తత్కామ్యకే వనే || 26 యుధిష్ఠిరాయ కధితం ధర్మపుత్రాయ పార్ధివ ! కల్పానాం సతి సాదృశ్యే భేద ఏష తవేరితః || 27 తేషాం స్వరూపంచ తధా, తథా రాజ న్ననుక్రమమ్ | బ్రహ్మ జన్మని సర్గాశ్చ తథా తస్య పృథ గ్విధాః || 28 కార్తికేయస్య లక్ష్మ్యాశ్చ తథా దేవస్య శూలినః | ఏవమాద్యాః ప్రభేదాస్తు త్వయా జ్ఞేయాః ను పార్థివ ! || కల్పాదీనాం మహారాజ ! చాన్యత్రా7పి యదూద్వహ ! || 29 సాదృశ్య భేదావిహ భూమిపాల ! కల్పస్య కల్పస్య మయోదితౌ తే | యుగాది భిన్నస్య చ దైవతాని వక్ష్యామ్యత స్తాని నిబోధ రాజన్ ! || 30 ఇతి శ్రీ ధర్మోత్తరే ప్రధమ ఖండే మార్కండేయ వజ్ర సంవాదే కల్పసాదృశ్యం నామ ఏకాశీతి తమో7ధ్యాయః కాలావయవములం గూర్చి కాలావయవ దేవతలం గూర్చి వినవలతునని వజ్రుడన మార్కండేయుడిట్లనియె. పౌరుషమయిన యహోరాత్రముం గూర్చి వింటివి. కాలపురుషునికి సర్వభూలేశ్వరుడు ప్రభువు. ఈ జగమెల్ల యెవ్వనిదో ఆ బ్రహ్మ కల్పమునకు దైవతము. మన్వంతరములకు మనువులు పదునల్గురు. వారు స్వాయంభువు మొదలయినవారు. వారు స్వాయంభువుడు, స్వారోచిషుడు, వైవస్వతుడు, సావర్ణి, బ్రహ్మపుత్రుడు, ధర్మపుత్రుడు, రుద్రపుత్రుడు, దక్షపుత్రడు, రౌచ్యుడు, భౌత్యుడు, విశ్వాత్మ, అనవిని వజ్రుడు నీ చెప్పిన యీ మనువులు పదునాల్గురు బ్రహ్మదినము నందెప్పుడును వీరే మనువులగుదురా ? లేక యిప్పుడున్న వారు మాత్రమే వీరా? ఈ సందియము వారింపుమన మార్కండేయుడు వీరేప్రతికల్పమందు మనువులగుదురు. ఇచట విమద్శింపబనిలేదు. మూడు కల్పము లేక రూపములు. పరమేష్ఠిమాయచే కొంచెము కొంచెము మార్పునందుచుండును. అట్లే అబ్దములు (సంవత్సరములు) గూడనేక రూపములే అన వజ్రుండు ఆయా కల్పములందలి జనుల పోలికల విషయములో మాత్రము కల్పములట్లేక రూపములుగుటకు వలను పడదు. అందులకు కారణమొకటి నే గమనించుచున్నాను. ఒకని మన్వంతర మందొక మనువు ప్రతి కల్పమునందు ముక్తిపొందును. అక్కడ కాలమునకాది లేనందున రాబోవు జగత్తు శూన్యమగును. అననరుడింకొక జీవుని సంసర్గమున ముక్తినందగా, అచ్యుత శక్తియైన జీవుడు మరల క్రొత్త జీవులతో జగత్తును నింపుచునేయుండును. బ్రహ్మలోకగాములు బ్రహ్మతోపాటు ముక్తినందుదురు. మహాకల్పమందు మఱల వారివంటి వారు సృష్టికావింపబడుదురు. ఎవరు పరమపదము నందుదురో వారికి మాత్రము మఱి జన్మములేదు. ఆ విధముగా సర్వ కల్పము లందు సమాన జీవప్రమాణములే కాని అందు హెచ్చుతగ్గులులేవు. విస్ణులోకము నందినవారు రుద్రలోకగతులు శ్వేతద్వీపమున కేగినవారు మాత్రము పునర్జన్మము నందరు. రౌద్ర వైష్ణవ లోకములు బ్రహ్మ లోకమునకు మీదనున్నవి. అందేగినవారు మరి పుట్టరు. మహా కల్పము చివర జీవులందరు నా పరమేశ్వరుని బొందికూడ జ్ఞానములేనిచో మరలివత్తురు. ప్రభువు వారిని తరువాత కల్పమునందు మరల బుట్టించును. కల్పము మద్యమందు కల్పాంతమున జ్ఞానముచే నుపాధిని విదిచినవారు ఆ విష్ణువుయొక్క పరమ స్థానముం బడయుదురు. జీవ బీజము యొక్క సంసర్గముచే నీశ్వరుడొక నిర్వచింపరాని కారణమున జగత్తు నా జీవులచే బూరించును. అనవిని వజ్రుడు కల్పములోక దానినొకటి పోలినవే గదా : అట్టియెడ వానిలో జీవులకేర్పడు భేదమదియేమి? అది యెందులకేర్పడును? తెలుపుమన మార్కండేయుడు వినుమిది వివరించెద. గడచిన కల్పమందాఱవ మన్వంతరము గడచిన తర్వాత నేడవ మన్వంతరమున నిరువది నాల్గవ త్రేతాయుగమందు రామునిచే రావణుడు, రాముని చేతనే కుంభకర్ణుడునూ హతుడయ్యెను. వర్తమాన కల్పము ననుసరించి వాల్మీకి రామయణమును రచించెను. అతీత కల్పమందు జరిగిన కథ నేను కౌమ్యకవనమందు యుధిష్ఠిరునికి దెల్పితిని. కల్పములొకదానితో నొకదానికి పోలికయున్నను భేదమున్నదని నీకే జెప్పితిని. వాని వాని భేదములిక్కడనేకాడు మరి యెందైన నిట్లేయున్నవి. కార్తికేయకల్పము, లక్ష్మీకల్పము, రుద్రకల్పము, నాయా కల్పములందు నీ భేదము కానవచ్చును. ఇది నేను నీనెఱింగించితిని. యుగాదులందు భేదముపొందు నీజగత్తునందు గలుగు దైవతభేదమును గూడతెల్పెదనిది తెలిసికొనుము. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున కల్పసాదృశనమను నెనుబదియొకటవ యధ్యాయము.