Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఎనుబదిఆరవ అధ్యాయము - ప్రదేశపీడానిర్దేశము వజ్ర ఉవాచ : ప్రతిదేశం మహాభాగ! కధం ప్రాప్తముపద్రవమ్ | విజ్ఞాయతే ద్విశ్రేష్ఠ! తన్మమాచక్ష్వ పృచ్ఛతః ||
1 మార్కండేయ ఉవాచ : కృత్తికాం రోహి ణీం సౌమ్యం మధ్యదేశస్య నిర్ధిశేత్ | పీడితే త్రితయే తస్మిన్ మధ్యదేశః ప్రపీడ్యతే ||
2 ఆర్ద్రాం పునర్వసుం పుష్యం పూర్వదేశస్య నిర్దిశేత్ | పీడితే త్రితయే తస్మిన్ పూర్వదేశః ప్రపీడ్యతే ||
3 అళ్లేషాంచ మఘాం పూర్వాం చాగ్నేయ్యాం దిశి నిర్దిశేత్ | పీడితే త్రితయే తస్మిన్ ఆగ్నేయీ పీడ్యతే೭ధ దిక్ || 4 అర్యమ మధ హస్తంచ త్వాష్ట్రం స్యాద్దిశి దక్షిణ | పీడితే త్రితయే తస్మిన్ పీడ్యతే దక్షిణాచ దిక్ || 5 స్వాతిం విశాఖాం మైత్రంచ నైరృత్యాం దిశి నిర్దిశేత్ | పీడితే త్రితయే తస్మిన్ పీడ్యతే నైరృతీ చ దిక్ || 6 వాయవ్యాం దిశి నిర్దిష్టా వైశ్వ వైష్ణవవాసవాః | పీడితే త్రితయే తస్మిన్ వాయవీ పీడ్యతే చ దిక్ || 7 వారుణం చాజ దైవత్యం చాహిర్బధ్న్యం తధోత్తరే | పీడితే త్రితయే తస్మిన్ ఉత్తరా దిక్ ప్రపీడ్యతే || 8 రేవతీ చాశ్వినీ యామ్య మైశానీ దిక్ ప్రపీడితా | పీడితే త్రితయే తస్మిన్ ఐశానీ దిక్ ప్రపీడ్యతే || 9 ఆదిత్యో భృగుజో భౌమో రాహు స్సారో నిశాకరః | బుధో బృహస్పతి శ్చైవ ప్రాచ్యాదీశాః ప్రకీర్తితాః || 10 విధ్వస్త వపుషస్తేతు గ్రహయుద్ధే పరాజితాః | నీలాః పితృగృహస్థాశ్చ స్వాం దిశం పీడయన్తితే || 11 వజ్ర ఉవాచ : స్వదేశపీడనం కుర్యా న్నక్షత్రః పీడితః కధం | సర్వమేత న్మమాచక్ష్వ సర్వ ధర్మ భృతాం వర ! 12 వజ్రుడు ప్రతి దేశము నుపద్రవమెందువలన పొందును? అదేశోపద్రవము తెలియుట యెట్లో యానతిమ్మన మార్కండేయుడిట్లనియె. కృత్తిక రోహిణి (సౌమ్యము) మృగశిర యనునవి మధ్యప్రదేశమునకు సంబంధించిన నక్షత్రములు. ఆ మూడింటికి పీడకలిగిన మధ్యదేశమునకు పీడకల్గును. అట్లే ఆర్ద్ర పునర్వసు పుష్యమియు తూర్పుదేశ నక్షత్రములు. వానికి పీడకలిగిన తూర్పుదేశమునకు పీడకలుగును. ఆశ్లేష మఘ పుబ్భ అగ్నేయీదిక్సంబంధములు. వానికి పీడకలిగిన ఆ అగ్నేయ దిక్కు పీడిత మగును. ఉత్తర, హస్త, త్వాష్ట్రము దక్షిణ దిక్కునకు సంబంధించినవి. వీనికి పీడనకల్గినయెడల ఆదిక్కునకు పీడకల్గును. స్వాతి, విశాఖ, అనూరాధ నైరృతి దిక్కునకు సంబంధించినవి. ఇవి పీడితములైనచో ఆదిక్కునకు పీడకల్గును. వైశ్వ (జేష్ఠ) వైష్ణవ (మూల) పూర్వాషాఢ (వాసపము) అనునవి వాయువ్య సంబంధులు. వీనికి పీడకల్గిన ఆ దిక్కు పీడితమగును. అజము అహిర్బధ్న్యము వారుణము ఉత్తర దిక్సంబంధులు. వీనికి పీడకల్గిన ఆ దిక్కు పీడితమగును. ఆ దిక్కు పీడితమగును. అజము అహిర్బుధ్న్యము వారుణము ఉత్తర దిక్సంబంధులు. వీనికి పీడకల్గిన ఆ దిక్కు పీడితమగును. రేవతి, అశ్విని, భరణి ఈశానదిక్సంబంధులు. వీనికి పీడకల్గిన ఆదిక్కునకు పీడకల్గును. సూర్యుడు శుక్రుడు కుజుడు రాహువు శని చంద్రుడు బుధుడు బృహస్పతి వరుసగా తూర్పు మొదలుగ గల 8 దిక్కుల కధిపతులు. ఈ గ్రహములు శరీరధ్వంసము గ్రహయుద్ధమందు పరా జయము నీచస్థితి పితృ గృహమందుండుట అను వానికి లోనైనపుడు తమ తమ దిక్కులకు పీడ కలిగింతురు. వజ్రండు నక్షత్రము పీడితమై తన దేశమునకు పీడాకరమగుట యెప్పుడెట్లు జరుగునో తెల్పుమన మార్కండేయుండిట్లనియె. మార్కండేయ ఉవాచ: శ##నై శ్చరార్కౌ చారేణ వక్రేణాంగారకో గ్రహః | ఉపరాగేణ రాహుశ్చ కేతుశ్చాధూమనోదయైః || 13 ఉదయాస్తమయాభ్యాంచ జీవశుక్ర శశాంకజాః | సంభాదనేన చ శశీ హ్యగస్త్య శ్చైవ యోగతః || 14 తధా యస్మింశ్చ నక్షత్రే దివ్య పార్థివా నాభసాః | దృశ్య న్తే తు మహో త్పాతాః స్వాందిశం సంప్రపీడయేత్ || 15 దేశేషు సర్వేషు మయేరితం తే శుభాశుభం యాదవ ముఖ్యనాధ !| అతః పరం ధర్మభృతాం పరిష్ఠ! వదస్త! కింతే కధయామి రాజన్ ! || 16 ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్ర సంవాదే ప్రతిదేశ పీడావర్ణసం నామ షడశీతితమో೭ధ్యాయః శనిరవులు చారముచేతను కుజుడు వక్రించుటచేత గ్రహణములచే రాహువు ధూమనోదయము (పొగ క్రమ్మట) లచే కేతువు, ఉదయాస్తమయములచే గురు శుక్రలు, హజుడు యోగముచే, అగస్త్యుడు గప్పబడుటచే, చంద్రుడునేయేక్షత్రములందున్న నాయా దిశలందు దివ్యములు పార్థివము (భౌమములు) నాభసములు (ఆకాశమునకు సంబంధించినవి) అగు నుత్పాతములు గల్గును. వారు తమ దిశలకు పీడ కల్గింతురు. ఇంకేమి వినదలతు వడుగుము. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమ ఖండమున ప్రతిదేశ పీడా వర్ణనమను నెనుబది యారవ యధ్యాయము.