Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఎనుబదిఏడవ అధ్యాయము - ప్రతిపురుష శుభాశుభనిర్దేశము వజ్ర ఉవాచ : శుభా೭శుభ పరిజ్ఞానం భగవన్ ! పురుషం ప్రతి | త్వత్తో೭హం శ్రోతుమిచ్ఛామి తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1 మార్కండేయ ఉవాచ : జన్మాశ్రిత స్త్రిషష్ఠశ్చ స ప్తమో దశమ స్తధా | ఏకాదశే శ్శశీయేషాం తదా తేషాం శుభం భ##వేత్ || 2 జన్మ న్యధ చతుర్థే చ సాష్టమే దశ##మే తధా | ఏకాదశే బుదో యేషాం తేషామపి శుభం వదేత్ || 3 ద్వి పంచమ గతో జీవ స్సప్తమో నవమ స్తధా | ఏకాదశ స్తధా హ్యేషాం తేషా మపి శుభం వదేత్ || 4 షష్ఠ సప్తమ గ శ్శుక్రో దశ##మే నచశోభనః | ద్వాదశ శ్చ తధా హ్యేషాం తేషాం పీడాం వినిర్దిశేత్ || 5 తృతీయే దిశ##మే షష్ఠే తధాచై కాదశే శుభాః | సారార తీక్‌ణ్ష కిరణాః యేషాం తేషాం శుభం వదేత్ || 6 యస్మిన్ హి జననం యస్య జన్మర్షం తస్య తత్ స్మృతమ్ | చతుర్దం మానసం తస్మా ద్దశమం కర్మ సంజ్ఞితమ్ || 7 సంగాతకం షోడశం స్యా ద్వింశం స్యా త్సాముదాయికమ్ | వైనాశకం తు నక్షత్రం కర్మర్షం యత్తయోదశమ్ || 8 షణ్ణక్ష త్రస్తు పురుష స్సర్వః ప్రోక్తో మహీపతే! | రాజా చ నవ నక్షత్రో నక్షత్ర త్రితయం శృణు || 9 నిత్య మభ్యధికం షడ్భ్యః పార్థివస్య నృపోత్తమ ! | దేశాభిషేక నక్షత్రౌ జాతి నక్షత్ర మేవచ || 10 జాత్యాశ్రితాని పక్ష్యామి నక్షత్రాణి తవా೭నఘ! | పూర్వాత్రయ మధాగ్నేయ బ్రాహ్మణానాం ప్రకీర్తితమ్ || ఉత్తరా త్రితయం పుష్యం క్షత్రియాణాం ప్రకీర్తితమ్ | పౌష్ణం మైత్రం తధా పిత్ర్యం ప్రాజాపత్యం విశాం స్మృతమ్ || 12 ఆదిత్య మాశ్వినం హస్తః శూద్రాణా మభిచిత్తధా | సార్పం విశాఖా యామ్యంచ వైష్ణవంచ నరాధిప | 13 ప్రతిలోమ భవానాంచ సర్వేషాం పరికీర్తితమ్ | ఈహాదే హ్యర్థహాని స్స్యా జ్జన్మర్షే చోపతాపితే || 14 కర్మర్షే కర్మణాం హానిః పీడా మనసి మానసే | మూర్తి ద్రవిణ బంధూనాం హాని స్సాంఘాతికే హతే || 15 సంతప్తే సాయుదాయర్షే మిత్ర భృత్యార్థ సంక్షయః | వైనాశికే వినాశస్స్యా ద్దేహ ద్రవిణ సంపదామ్ || 16 పీడితే చాభిషేకర్షే రాజ్యభ్రంశం వినిర్దిశేత్ | దేశ##ర్షే పీడితే పీడాం దేశస్యచ పురస్య చ || 17 పీడితే జాతి నక్షత్రే రాజ్ఞో వ్యాధిం వినిర్దిశేత్ || 18 గ్రహర్ష జాతాం సమవాప్య పీడాం పూజాతు కార్యా విధి నా స్వకేన | తతశ్శుభం విందతి రాజసింహ! విధూత పాపః పురుష స్సదైవ || 19 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ప్రతి పురుష శుభా೭శుభ నిర్దేశోనామ సప్తాశీతితమో೭ధ్యాయః వజ్రుడిట్లడిగెను : దేవా ! నీ వలన ప్రతిపురుషునకు కలుగు శుభాశుభముల వినగోరుచున్నాను. మార్కండేయుడనియె : జన్మలగ్నమందు మూము అఱుసప్తమశమ ఏకాదశ స్థానములందు చంద్రుడున్న శుభము కల్గును. జన్మ చతుర్థ అష్టమ దశమ ఏకాదశములందు బుధుడున్న శుభమగును. రెండు అయిదు సప్తమము తొమ్మిది పదునొకండు స్థానములందు గురుడున్నచో శుభమగును. ఆరింట సప్తముందు దశమ మందు శుక్రుడు శుభప్రదుడుగాదు. ద్వాదశమందున్నచో పీడకల్గించును. మూడుపది ఆరు పదునొక్కండు స్థానములందు శని అర=సూర్యులున్నచో శుభమునెప్పవలెను. ఏనక్షత్రమందు జననమగునో యదియా తనికి జన్మర్షమగును. దానికి నాల్గవది మానసము పదియవనక్షత్రము కర్మసంజ్ఞకము. పదునారవది సంగాతక మనబడును, ఇరువదియవది సాముదాయికము వైనాశకము పదమూడవది. ఆరవనక్షత్రము సర్వపురుషము తొమ్మిదవది రాజనబడును. ఇకమూడు నక్షత్రములను గురించివినుము. రాజునకు నిత్యనక్షత్రము బహునక్షత్రమునకు అరింటికిపైది సప్తమ నక్షత్ర మన్నమాట. దేశాభిషేక నక్షత్రము జాతినక్షత్రమునకునవి ముఖ్యఫలము చెప్పుటలో వీనినిగమనింప వలెనన్నమాట. జాత్యాశ్రిత నక్షత్రములు పూర్వాత్రయము=పుబ్బ (పూర్వఫల్గుని) పూర్వాషాఢ పూర్వాభాద్ర కృత్తిక (ఆగ్నేయము), బ్రాహ్మణనక్షత్రములు ఉత్తర ఉత్తరాభాద్ర పుష్యమి, క్షత్రియజాతినక్షత్రములు పౌష్ణము మైత్రము (అనూరాధ) పిత్ర్యము=ప్రాజాపత్యము, వైశ్యజాతి నక్షత్రములు ఆదిత్యము అశ్వినము హస్త, శూద్రజాతి నక్షత్రములు అభిజిత్తు సార్వము (ఆశ్లేష) విశాఖ యామ్యము=వైష్ణవము ప్రతిలోనుజాతులకుజెందినవి. జన్మనక్షత్రము పతాపితమైనపుడు (పీడపొందినపుడు) అర్థహాని యగును. కర్మనక్షత్రము (పదియవది) ఉతపతాపితమయినచో కర్మహాని మానసనక్షత్ర పీడవలన మనస్సునకుపీడ, సఘాతికమునకు (నాల్గవదానికి) పౌడవలన మూర్తికి (శరీరమునకు) ధనమునకు బంధువులకు హానికల్గును. సాముదాయికము (ఇరువది) సంతప్తమైనచో మిత్రులకు భృతులకు అర్థమునకు సంక్షయము. వైనాశిక నక్షత్రము సంతప్తమైనను దేహ ద్రవ్య సంపదలకుహాని. అభిషేక నక్షత్రము తప్తమైనచో రాజ్యభ్రంశమగును. దేశనక్షత్రము పీడితమైనచో దేశపీడ పురపీడగల్గును. జాతినక్షత్రము పీడితమైనచో రాజునకువ్యాధి పీడగల్గును. గ్రహనక్షత్రములకు పీడగల్గినతరి తనజాతి కుచితమైనరీతి పూజ చేయవలెను. దానివలన పాపముకై మానవుడు శుభమునందును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ప్రథమఖండమున ప్రతిపురుష శుభాశుభనిర్ధేశమను ఎనుబదిఏడవ అధ్యాయము.