Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఎనబదిఎనిమిదవ అధ్యాయము - గ్రహనక్షత్ర మండల నిర్దేశము

వజ్ర ఉవాచ :

గ్రహాణాం భృగు శార్దూల ! నక్షత్రాణాం తధైవచ | పూననే విధిమాచక్ష్వ! తత్ర మే సంశయో మహాన్‌ ||

మార్కండేయ ఉవాచ :

గ్రహస్సాధిపతిః కార్యో నిత్యం మండలకే బుధైః | నక్షత్ర శ్చంద్రసహిత స్తధా సాధిపతి ర్నృప! 2

సంఖ్యాతా తారకా స్తస్య యధా వ న్మనుజేశర! తేషాం తారక సంఖ్యానం నిబోధ గదతో మమ || 3

రౌద్రం పుష్యం కధా త్వాష్ట్రం వాయవ్యం వారుణం తధా |

పౌష్ణంచ పార్థివ శ్రేష్ఠ! కధితం త్వేక తారకమ్‌ || 4

ద్వితారం ఫల్గునీయుగ్మం తధా భాద్రపదాద్వయమ్‌ |

ఆదిత్యంచ తదా మూలం చైంద్రాగ్నం చాశ్వినం తధా || 5

త్రితార్య భరణీ సౌమ్య మైంద్రం బ్రాహ్మం స వైష్ణవమ్‌ |

చతుసార మధాషాఢే ద్వేమైత్రం యదునందన! || 6

పంచతార స్స్మృతో హస్తః ప్రాజాపత్యం వాసవమ్‌ |

సార్పం పిత్ర్యం అధాగ్నేయం షట్‌ తారం పరికీర్తితమ్‌ || 7

ఆదిత్య మండలంకార్యం పద్మవర్ణం నరాధిప ! శ్వేతం చంద్రమనఃకార్యం రక్తంకార్యం కుజస్యచ || 8

నీలం బుధస్య కర్తవ్యం పీత వర్ణం బృహస్పతేః | శ్యేతం శుక్రస్య కర్తవ్యం కృష్ణం సౌరస్య పార్థివ! 9

ఆకాశవర్ణం తమసః కేతో ర్ధూమ ప్రభం తధా |

వజ్రుడు గహములకు నక్షత్రములకు శాంతినిమిత్తముగ జేయనగు పూజావిధితెల్పుమన మార్కండేయుడనియె. మండలమునందు గ్రహమును అధిపతిగ్రహముతో ప్రతిష్ఠింపవలెను. నక్షత్రమును చంద్రునితో నధిపతి గ్రహముతోడునిలిపి పూజింప వలెను. నక్షత్రమొక్కొక్క దానియందుగల చుక్కలసంఖ్య తెలిపెదవినుము. రౌద్రము (అర్ద్ర) పుష్యమి త్వాష్ట్రము వాయవ్యము వారుణము పౌష్ణము నను నక్షత్రము లేకతారకములు. ఒక్కటే చుక్కగా నుండునవి). పూర్వఫల్గుని (పుబ్బ) ఉత్తరఫల్గుని పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ఆదిత్యము మూల ఐంద్రము అగ్నేయము అశ్వనము (అశ్వని) రెండు చుక్కలుగలవి. మూడుచుక్కగలవి భరణి సౌమ్యము ఐంద్రము బ్రాహ్మము వైష్ణవముననునవి. నాల్గుచుక్కలవి పూర్వాషాడ ఉత్తరాషాడ అనూరాధయును. అయిదు చుక్కలవి హస్తప్రాజాపత్యము వాసవము ననునవి. అరుచుక్కలవి సార్పము (అశ్లేష) పిత్ర్యము అగ్నేయము. ఆదిత్యమండలము తామర పూవు రంగులోను చంద్రమండలము తెల్లరంగులోను కుజమండలము రక్తవర్ణములోను బుధగ్రహమండలము నీలివర్ణములో బృహస్పతిది పసుపుపచ్చగ శుక్రునిది తెల్లగ, శనిదినల్లగ, ఆకాశము రంగులో (నీలము) రహువునకు కేతువునకు పొగరంగులో నేర్పరుపవలెను.

రక్తవర్ణం కృత్తికానాం, ఫల్గునీ ద్వితయస్య చ || 10

హస్తప్య చ సపౌష్ణస్య, మైత్రస్య చ నరాధిప! పీతం పుష్యస్య కేశస్య శాక్ర బాడబయో స్తధా || 11

శ్వేతం సౌమ్యస్య రౌద్రస్య ఆప్య వారుణయో స్తధా | ఆదిత్య సార్ప పిత్ర్యాణాం బ్రాహ్మ వాయవ్యయో స్తధా ||

ప్రోష్ఠ పాదద్వయ స్యాధ శ్వేత మేవాభిధీయతే | విచిత్ర వర్ణం త్వాష్ట్రస్య వైశ్వదేవస్య చాప్యధ || 13

ఆశ్వినస్య తథాకార్యం నిత్యమేవ నరాధిప ! | కృష్ణం యామ్యస్య మూలస్య పాలాశం శ్రవణస్యచ || 14

విశాఖాయాం పీతరక్తం కర్తవ్యం నృపమండలమ్‌ || 15

యధోక్త వర్ణేన నరేంద్ర ! కృత్వా పూర్వం గ్రహస్యానఘ ! మండలం స్వం |

ఋక్షస్య వాపూజ్య తమస్య రాజన్‌ ! పూజా విధేయా తదనంతరంచ || 16

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహర్షమండల నిర్దేశోనామ అష్టాశీతితమోధ్యాయః.

ఇకనక్షత్రపూజా విధానములో నక్షత్రమండల నిర్వాణముయొక్క రంగులు. కృత్తికలకు పూర్వఫల్గుని ఉత్తర ఫల్గునులకు హస్తకు పౌష్ణ మైత్రములకు రక్తవర్ణము, పుష్యమి కేశము శాక్రము బాడబములకు పసుపుపచ్చరంగు, సౌమ్యరౌద్ర అప్య వారుణములకు ఆహిత్య సార్ప పిత్ర్యములకు బ్రాహ్మ వాయవ్యములకు ప్రోష్ఠ పాదద్వయమునకు తెల్లరంగు చెప్పబడినది. త్వాష్ట్రము వైశ్వదేవము అశ్వినిలకు విచిత్ర వర్ణము వినియోగింప వలెను. యామ్యమునకు మూలకు కృష్ణ వర్ణము శ్రవణమునకు పాలాశవర్ణము విశాఖకు పసుపు ఎరుపుకలిసినరంగులో నక్షత్ర పూజామండల మేర్పరుపవలెను. ఈ చెప్పిన రంగులలో గ్రహనక్షత్ర మండలాలంకారము సేసి పూజగావింపవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున గ్రహనక్షత్రమండల నిర్దేశమను ఎనుబదెనిమిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters