Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఎనుబది తొమ్మిదవ అధ్యాయము - నక్షత్రస్నానము మారర్కండేయ ఉవాచః శకృన్మూత్రంతు సంగృహ్య శేతస్య పృషభస్యచ | శ్వేతగోః పయసా సార్దం స్నాతవ్యం కుశవారిణా ||
1 జన్మనక్షత్ర పీడాయాం తస్మాద్దోషా ద్విముచ్యతే | శిరీషచందనా శ్వత్థ తాటనాగాంబుభి ర్నరః ||
2 స్నాత శ్చేన్మానసే తప్తేతస్మా ద్దోషో విముచ్యతే | సిద్ధార్ధకాన్ ప్రియంగుంచ శతపుష్పాం శతావరీమ్ ||
3 స్నాతవ్య మంభసి క్షిప్త్వా కర్మర్షే నృప! పీడితే | ప్రియంగు బిల్ల సిద్ధార్ధ యవాశ్వత్థ సురాహ్వయాన్ || 4 చందనోదక సంయుక్తే స్నానే సాంఘాతికే హతే | సర్వగంధోదకై స్స్నానం తధా సిద్ధార్థకై శ్శుభైః || 5 పీడితే సాముదాయర్షే పుంసాం కల్మష నాశనమ్ | పృష శృంగోద్ధృత మృదా తధా బిల్వోదకై శ్శుభైః || 6 శతపుష్పా ససోమాహ్వైః స్నానం వైనాశికే భ##వేత్ | పీడితే చాభిషేకర్షే సర్వ రత్నోదకై స్తధా || 7 పీడితే దేశనక్షత్రే మృద్భి స్స్నానం విశధీయతే | మృతికాశ్చ ప్రవక్ష్యామి గదత శ్శృణుమే నృప | 8 నదీకూలద్వయా న్మధ్యాత్సంగమా త్సరసస్తటాత్ | అశ్వస్థానా ద్గజస్థానా ద్గోస్థానా ద్గిరి మస్తకాత్ || 9 సర్పస్థానాత్సవల్మీకా ద్రాజస్థానా ద్వరాలయాత్ | గజ శృంగోద్ధృతాంచైవ పృషశృంగోద్ధృతాం తధా || 10 సర్వబీజోదకస్నాతో జాతి నక్షత్ర పీడనే | ముచ్యతే కిల్బిషా ద్రాజన్ ! నాత్ర కార్యా విచారణా || 11 ఇద మాపః ప్రవహతః స్నాన మంత్రాః ప్రకీర్తితాః || 12 స్నాత స్తధైవం వృపచంద్ర! పశ్చాత్స్నానం ప్రకుర్వీత గ్రహోపదిష్టమ్ | పీడా కరస్యాథ తతస్తు కార్యం నక్షత్రయాగాభిహితం యధావత్ || 13 పూజాగ్రహేంద్ర స్యనరేంద్రచంద్ర! పీడాకంస్యాథ తత స్తుకార్యా | తం పూజయే చ్చాప్యథ చంద్రయుక్తం తతస్స దోషాన్సకలాన్ జహాతి || 14 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే నక్షత్ర స్నానం నామ ఏకోన నవతి తమో೭ధ్యాయః మార్కండేయుడనియె తెల్ణాపుపాలతో తెల్లయెద్దుపేడ మూత్రము గైకొని కుశోదకముతో స్నానముచేయవలెను. దీనివలన జన్మనక్షత్రపీడ శాంతించును. శిరీషము (లొద్దుగ) చందనము రావి తాట నాగోదకములచే స్నానము సేసిన మానసనక్షత్రపీడ తొలగును. అవాలు ప్రియంగువు శతపుష్చ శతావరి (పిల్లికచర) అనువానిని స్నానోదకములందుంచి స్నానముచేసిన కర్మనక్షత్ర పీడ పోవును. ఎద్దుకొమ్ముచేత పెల్లగించిన మట్టితో బిల్వోదకములతో శతపుష్పా సోమలతలతో గలిపిచేసిన స్నానము వైనాశిక నక్షత్రశాంతి కూర్చును. అభిషేక నక్షత్రము పీడితమైనపుడు రాజు సర్వరత్నోదకముతో స్నానముచేయుట దోషశాంతికరము. దేశనక్షత్రపీడగల్గినపుడు మృత్తికాస్నానము శ్రేష్ఠము. మత్తికలలో విశేషమిదెల్పెదవినుము. నదీకూలములు దోషశాంతికరము. దేశనక్షత్రపీడగల్గినపుడు మృత్తికాస్నానము శ్రేష్టము. మత్తికలలో విశేషమిదెల్పెతాదవినసవసస. నదీకూలములు రెండింటను నదీమధ్యమందును నదీసంగమమందును. సరస్సు తీరమునందు అశ్వగజగోస్తానములందు పర్వత శిఖరములందు పుట్లటలతోనున్న సర్వస్థానమందు రాజస్థానమునందు ఆలయమునందుగల ఏనుగు ఎద్దు దంతముతోపెల్లగించిన మృత్తికతో సర్వబీజోదక ములతో (నవధ్యాన్యాలు కలిపినీరు) స్నానముచేసిన జాతినక్షశత్రపీడనుంచి ముక్తికల్లును. ఇందేమాత్రము నాలోచింపవలసినపనిలేదు. స్నానమంత్రములు: ''ఇదమాపః ప్రవహతః'' అనుటతో నారంభ##మైనవి. వానితో తొలుత స్నానముసేసి ఆమీద గ్రహశాంతికి దెల్పినవి ఆమీద నక్షత్రయాగమునందు జెప్పిన విధానముతో యధావిధిగ స్నానముసేయవలెను. ఆమీద పీడాకరమైన గ్రహములకు చంద్రయుక్తముగ నక్షత్రదేవతలకు బూజసేయలలెను. దీనిచే సర్వదోషములును దొలుగును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము నందు ప్రథమఖండమున నక్షత్రస్నానమన ఎనుబదితొమ్మిదవ అధ్యాయము