Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొమ్మిదవ అధ్యాయము

జనపద వర్ణనము

వజ్ర ఉవాచ -

శ్రోతుంజనా నిహేచ్ఛామి సాగరద్వీపవాసినః | ప్రాధాన్యేన భృగు శ్రేష్ఠ ! విస్తరాద్విస్తరోయతః || 1

మార్కండేయ ఉవాచ :

పాంచాలాః కురవో మత్స్యా ¸°ధేయా స్సవటశ్చరాః | కుంతయ శ్శూర సేనాశ్చ మధ్యదేశ జనాస్స్మృతాః || 2

వృషధ్వజాంజనాః పన్నాః సుహ్మా మాగధ చేదయః | కాశయశ్చ విదేహాశ్చ పూర్వస్యాం కోశలా స్తథా || 3

కలింగ వంగ పుండ్రాంగ వైదర్భామూలకాస్తథా | వింధ్యాన్తనిలయాః ప్రోక్తాః పూర్వదక్షిణతః స్మృతాః || 4

పుళిందాశ్మక జీమూత నరరాష్ట్ర నివాసినః | కర్ణాటకాః భోజకటా దక్షిణా పథవాసినః || 5

అంబష్ఠా ద్రవిడా నాగా కాంబోజాః స్త్రీముఖా శ్శకాః | ఆనన్త వాసిన శ్చైవ జ్ఞేయా దక్షిణ పశ్చిమే || 6

స్త్రీరాజ్యం సైంధవా వ్లుెచ్ఛా నాస్తిక్యా యవనాస్తథా | పశ్చిమేన చ విజ్ఞేయాః పటుమానౌషధైః సహ || 7

మాండవ్యా శ్చ తుషారాశ్చ మూలికాశ్చ ముఖాః ఖశాః | మహాకేశా మహానాసా వేశాస్తూత్తర పశ్చిమే || 8

లంపగా స్తాలనాగాశ్చ మరుగాంధార జాహుతాః | హిమవన్నిలయా వ్లుెచ్ఛా హ్యుదీచీం దిశమాశ్రితాః || 9

త్రిగర్త మీన కౌలూతా బ్రహ్మపుత్రా స్సతీగణాః | అభిసాదాశ్చ కాశ్మీరా శ్చోదా క్పూర్వేణ కీర్తితాః || 10

రాజేంద్ర సాగంద్వీపాః ప్రధానా వసుధాదిపాః | భవతే7హం ప్రవక్ష్యామి దిగ్దేశేన నిబోధ తత్‌ || 11

పంచాలనాథో మగదాది పశ్చ కళింగరాట్‌ భోజ కటేశ్వర శ్చ |

అనంతక సై#్సంధవక స్తుషారో మద్రేశ్వర శ్చాథ కులూతనాథః | 12

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే జనపద వర్ణనంనామ నవమో7ధ్యాయః.

వజ్రుడు సముద్రద్వీపములం దిక్కడవసించు జనులంగూర్చి సవిస్తరముగ వినవలతునన మార్కండేయుండిట్లనియె. పాంచాల కురువులు మత్స్యులు ¸°ధేయులు వటశ్చరులు కుంతులు శూరసేనులు ననువారు మధ్యదేశ జనులు. వృషధ్వజులు అంజనులు పన్నులు సుహ్ములు మాగధులు చేదిదేశమువారు కాశులు విదేహులు కోనలులు తూర్పుదేశమువారు. కలింగులు వంగులు పుండ్రులు అంగులు వైదర్భులు మూలకులు వింధ్య పర్వతముచివర ఆగ్నేయదిశయందు నుండువారు. పులిందులు అశ్మకులు జీమూతులు నరరాష్ట్రవాసులు కర్ణాటకులు భోజకటులు దక్షిణాపథవాసులు. అంబష్ఠులు ద్రావిడులు నాగులు కాంభోజులు స్త్రీముఖులు శకులు అనంతవాసులు ననువారు దక్షిణ పశ్చిమ నిరృతి మూలనుండువారు. స్త్రీరాజ్యము సైంధవులు వ్లుెచ్ఛులు నాస్తికులు యవనులు పటుములు నైషధులు పడమటి దిసనివసించువారు. మాండవ్యులు తుషారులు మూలికులు ముఖులు ఖశులు మహాకోశులు మహావాసులు ఉత్తర పశ్చిమ (వాయవ్యమూల) వాసులు. లంపగులు తాళులు నాగులు మరుగాంధార జాహుతులు హిమన్నివాసులు. వ్లుెచ్ఛులుత్తరదేశమునాశ్రయించిరి. త్రిగర్త మీన కౌలూతులు బ్రహ్మపుత్రులు సతీగణులు అభిసారులు కాశ్మీరులు ఈశాన్యవాసులు. సాగరము, ద్వీపములు ప్రధానముగా గలరాజుల నెఱింగించెద వినుము; పాంచాలరాజు మగధాధిపుడు కలింగరాజు భోజకట ప్రభువు అనంతకుడు సైంధవకుడు తుషారుడు మద్రేశ్వరుడు లూతరాజు ననువారు వీరు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున జనపదవర్ణనమను తొమ్మిదవయధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters