Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
తొంబదిరెండవ అధ్యాయము - అగ్నికార్య ప్రాక్తంత్రోత్తర తంత్రవిధి వజ్ర ఉవాచ : ప్రాక్తంత్రోత్తర తంత్రౌ ద్వౌ సర్వేషామగ్ని కర్మణామ్ | త్వత్తో೭హం శ్రోతుమిచ్ఛామి సర్వధర్మ భృతాం వర! ||
1 మార్కండేయ ఉవాచ : ఉద్ధృత్వోర్యీ మయీం శుద్ధే దేశే వేదిం చ కారయేత్ | ప్రాగుదక్ర్పవణాం శుద్ధా మాయామా త్పదస ప్తకమ్ ||
2 పూర్వభాగే చ విజ్ఞేయా విస్తరా త్పద పంచకమ్ | పశ్చిమే చ తధా భాగే విస్తరా త్స్యా చ్చతుష్టయమ్ ||
3 ఆగార దేశే చ తధా విస్తృతా సా పాదత్రయమ్ | పూర్వభాగా దతిక్రమ్య పశ్చా త్పద చతుష్టయమ్ ||
4 యామ్యే నోత్తరత శ్చైవ విజ్ఞేయంతు పదం పదమ్ | ఆగారా త్వశ్చిమే భాగే వేదీ జ్ఞేయా పదద్వయమ్ ||
5 వేది మేవం విధాం కృత్వా స్నాత్వాచమ్య ప్రయత్నతః | సౌవర్ణాన్ రాజతాన్ తామ్రాన్ అధవా೭పి మహీమయాన్ || 6 సూత్రార్ఘ్య మాల్యై ర్గంధై శ్చ ప ఫలైః పల్లపైర్యుతాన్ | పూర్ణోద కుంభాంశ్చతురో విదిక్షు సుదృఢం న్యసేత్ || 7 వజ్రునృపతి అగ్ని కార్యములందు ప్రాక్తంత్రము ఉత్తర తంత్రము నను రెండు విధానములంగూర్చి మీవలన వినగోరుదునన మార్కండేయుడిట్లనియె. శుచిప్రదేశమందు. భూమిని ఉద్ధరించి (త్రవ్వి) వేదినిగావింపవలెను. ఆవేది తూర్పు ఉత్తరదిశల వైపు వాటముగల్గి యేడడుగులు పోడవుండవలెను. పూర్వభాగమందు ఐదడుగులు వైశాల్యము గలదిగను పడమటి భాగనందు నాల్గడుగులు నుండవలెను. అగ్న్యగార ప్రదేశమందు (అగ్నిహోత్రగృహమందు) అవేది మూడడుగుల వైశాల్యము గల్గియుండవలెను. పూర్వభాగమును దాటిన తర్వాతనాల్గడుగులుండవలెను. దక్షిణమునకు ఉత్తరమునకు అడుగడుగుండవలెను. అగ్నిశాలకు పడమటి భాగమందు వేది రెండడుగులుండవలెను. ఇట్లు వేది నేర్పరచి స్నానముసేసి అచమనముచేసి, బంగారము వెండి రాగి లేక మృణ్యయము లైన నాల్గు పూర్ణకుంభములను నాల్గుమూలలందు కదలకుండ నుంచవలెను. వేద్యా ముల్లిఖనం కార్య మైంద్రీభి ర్నృపసత్తమ! | ఉదుంబరస్య శాఖాభిః ప్రాగగ్రాభి స్సమంతతః || 8 శుష్కేంధన సమృద్ధస్తు తతఃకార్యోహుతాశనః | న ధమే త్తాలవృంతేనన శూర్పేణ న వాససా || 9 ముఖేనో పధమే దగ్నిం ముఖా దగ్ని రజాయత | పరి సమూహ్య పర్యుక్ష్య పరిషిచ్య పరిస్తరేత్ || 10 హుతాశనం బోధయిత్వా భూయ శ్చావాహయే ద్బుధః | పక్ష్యామి బోభ##నె మంత్రం తధా చా వాహనె నృప ! || 11 అమీద వేదికయందు ఇంద్రదేవతాకమంత్రములతో-మేడికొమ్మలు(మండలు) ప్రాగగ్రములయిన వానితో (తూర్పుకొసలు గలవానిని జేకొని) ఉల్లేఖనము చేయవలెను. ఆమీద నగ్నినెండిన సమిధలచే ప్రజ్వలింపజేయవలెను. తాటాకు విసనకఱ్ఱతోగాని చెటతో గాని వస్త్రముతోగాని అగ్నిని విసరరాదు. విరాటపురుషుని ముఖమునుండి అగ్ని జనించినది గావున ముఖముతోనే అగ్నిని ధమని (గొట్టము) ద్వారా ఊద ప్రజ్వలింప జేయవలెను. పరిసమూహన-పర్యక్ష్రణ పరిషేచనములు చుట్టుమంత్రముతో అగ్నిని పరిస్తరింపి వలెను. అగ్నిని ఉద్భోధింపజేసి యవ్వల నావాహనము సేయవలెను. బోధనమునందు నావాహనమునందు బ్రయోగింపదగు మంత్రమిదె దెల్పుచున్నాను. ఉద్భుధ్యాగ్నే బోధయన్తి దేవతాస్తా స్సవాసవాః | బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కన్థో వై శ్రవణో యమః || 12 వరుణో వాయు రాకాశం చంద్రాదిత్యౌ ప్రభాకర | ఋషయశ్చ మహాభాగా సై#్త్రలోక్యామల దర్శనాః || 13 వేదాశ్చ వేదమాతా చ సావిత్రీ పాపనాశినీ | ఓషధ్యో೭థ వషట్కారో మంత్రాశ్చ వివిధా స్తధా || 14 కాలస్యావయవా స్సర్వే దేశశ్చ విదిశ స్తధా | ఉద్బుధ్య యజమానస్య సర్వాన్ కామాన్ ప్రయచ్ఛవై || (ఓం) ఆవాహయా మ్యహం దేవం దేవదేవం హుతాశనమ్ | జగతో೭స్య సముత్పత్తి స్థితి సంహారకారకమ్ || 16 వేదమూర్తిం తదాధారం సర్వదేవముఖం విభుమ్ | పింగేక్షణం పింగజటం ధూమకేతుం విభావసుం || 17 శుక యాన గమం దేవం సర్వాభరణ భూషితమ్ | సర్వగం వరదం భానుం జఠరస్ఠంచ దేహినామ్ || 18 తేజోమూర్తిం దురాధర్షం సప్తజిహ్వం మహాబలమ్ | సప్తార్చిషం సప్తర్షికం సమిత్సప్తక మచ్యుతమ్ || విష్ణోరంశ మనిర్దేశ్యం భావనం జాత వేదసమ్ | పావనం పుష్టిదం సౌమ్యం భక్తానాం భూతి వర్ధనమ్ || 20 తద్దత్త మాహుతి సంప్రతీచ్ఛ జగద్గురో! తేన భావయ! దేవేశ! యధా೭హం దేవతా గణాన్ || 21 యాజకం యజమానంచ పుష్ట్య విభజ! సర్వశః | ఇద మర్ఘ్య మిదం పాద్యం ధూపం దీపం ప్రగృహ్యతామ్ || 22 అగ్నీ : మేల్కొనుము. ఇంద్రాది దేవతలు బ్రహ్మవిష్ణురుద్రులు స్కందుడు దిక్పాలురు సూర్యాది నవగ్రహదేవతలు కాలావయవ దేవతలు దిక్కులు విదిక్కులు (మూలలు) నిన్ను మేల్కొల్పుచున్నారు. మేల్కొని యజమానుని సర్వకామములు నిమ్ము. దేవుని దేవదేవుని నిన్నాహ్వానించున్నాము. నీవు సృష్టి స్థితి లయకారకుడవు వేదమూర్తివి వేదాధారుడవు సర్వదేవతల ముఖమయిన వాడవు. తేనెరంగుకన్నులు జడలు కలబాడవు ధూమకేతువవు విభావనువవు. చిలుక వాహనమున నేగువాడవు సర్వాభరుణుడవు సర్వ వ్యాపకుడవు. జఠరాగ్ని గానున్న వాడవు. తేజోమూర్తివి. ఏవమావాహనం కృత్వా పాద్యార్ఘ్యం వినివేదయేత్ | వేద్యా మేవ న తౌ దే¸°వహ్నౌ యదుకులోద్వహ! || 23 గంధ పుష్పాదికం దేయం సకలం జాతవేదసి | ధూపం దీపం సనైవేద్యం వేద్యామేవ నివేదయేత్ || 24 BÈýÁV Ëݵ³R…µy¥¦¦¦*ƒ«sª«sVVÌÁV}qszqs FyµR…ùª«sVV ƒ«sLçRiQùª«sVV ¬ds¸R…Vª«sÛÍÁƒ«sV. ®ªs[µj…ÍÜ[ ƒ«sgjiõÍÜ[ ¬dsFyµyùQLçRiQùª«sVV ÖdÁ¸R…VLSµR…V. gRiLiµ³R… xmsouyöµR…VÌÁV µ³R…Wxmsª«sVV µk…xmsª«sVV \®ƒs®ªs[µR…ùª«sVV ®ªs[µj…¸R…VLi®µ…[ ¬s®ªs[µj…Lixmsª«sÛÍÁƒ«sV. తతస్తు ప్రస్తరే ద్వేదిమక్షతాగ్రైః కుశైర్ద్విజ! | ఉపమూలా దధోలూనైః ప్రాగగ్రైః ప్రయత శ్శుచిః || 25 పూర్వేచ ప్రాగ్దక్షిణతః పశ్చాచ్చైవా ప సవ్యతః | ఉత్తరేణ తతఃకుర్యాత్ ప్రస్తరస్య సమాపనమ్ || 26 మూలఛిన్నంతు దాతవ్యం ప్రస్తరే భూభృతాం వర! ఓషధ్యః ఫలవన్తశ్చ పర్వపత్య స్తధైవచ || 27 దర్భాభావే ప్రశంసన్తి తిస్ర స్తత్ర చ వర్జయేత్ | రాజసీర వరూకం చ పరిబాధ మథోత్కటమ్ || 28 విష్ణు ర్మనసా పూతే స్తో మంత్రేణానేన సువ్రత! | దార్భం పనిత్ర ముత్సృజ్య తాభ్యం చ తదన స్తరమ్ || 29 దేవోవ ఇత్యధై తేన ఉత్పూయ ముదకం శుచి | స్రుక్సృవా వధ పాలాశౌ శమీన్యగ్రోధ సంభవౌ || 30 ఉదుంబర మ¸° తామ్రే రూప్య రుక్మమ¸° తధా | ఆజ్యస్థాలీ చ కర్తవ్యా తైజస ద్రవ్య సంభవా || 31 మాహేయీ వాపి భూపాల! నిత్యం సర్వాగ్ని కర్మసు | హస్తమాత్రః స్రువః కార్యస్రువ బాహుసమం తధా || 32 అంగుష్ఠ మధ్య ప్రతిమం హోమస్థానం స్రువస్యతు | అజ్యస్థాల్యాః పయోత్పూతం పంచానా మితి పంచకమ్ || 33 అజ్యస్థాల్యాః ప్రమాణంతు యధాకామంతు కారయేత్ | గ్రామం పృశ్చాపయోసీతి మంత్రేణాజ్యం నరాధిప ! ఆజ్యస్థాల్యాః పయోత్పూతం పంచానా మితి పంచకమ్ || పఠన్ గృహ్ణీత! రాజేంద్ర! అర్జేత్యగ్నా వధిశ్రయేత్ | ఆజ్యస్యాథ పవిత్రేణ కార్యత్ల్పవనం ద్విజ ! 35 అగ్ని ర్జహ్వేతి సతతం హవి రస్యుత్పవ నాన్తరం | అక్షీణన్తు న కర్తవ్యం నతతం పార్థివో త్తమ ! 36 శుభా భ్యాం స్రుక్ స్రువౌ రాజన్! ప్రత్యుష్టమితి భావయ! పవిత్రస్యాగ్ర దర్భేణ ఆయురిత్యేవ మాసద ! 37 ప్రతిమార్షి స్రువం పశ్చా చ్చక్షురిత్యేవ పార్థివ! | ప్రతిమార్షి స్రువం తాంశ్చదర్భాన్ వహ్నా వధోత్సృజేత్ || 38 దర్భోత్సర్గే పఠేన్మంత్ర మిమం పార్థివ సత్తమ! | దివి శిల్పమవతతం పృథివ్యాః కక్షిభిశ్శ్రితమ్ || 39 తేన సహస్రకాండేన ద్విషన్తం తాపయామసి | ద్విషన్త స్తప్యతాం చోక్త్వా క్షిపేద్దర్భాన్ హుతాశ##నే || 40 ఇధ్మ ద్వయం తతో దేయం యజ్ఞియ ద్రుమ సంభవమ్ | పలాశః ఖదిరో బిల్వః శమ్యశ్వత్థవటా స్తధా || ఉదుంబర మపామార్గః ఫల్గుశ్చ క్రముక స్తధా | చందనం దేవదారుశ్చ ద్రుమా ద్వాదశ యజ్ఞియాః || 42 చతుర్గృహీతం విన్యస్య స్రుచి పూర్వం విచక్షణః | ఇధ్మద్వయే ప్రజ్జ్వలితే సౌమ్యభాగే నరాధిప! || 43 ప్రజానాంపతయే త్వాదా వాహుతిం మనసాన్యసేత్ | చతుర్గృహీతే మృద్ధేతి దేయా దక్షిణతో భ##వేత్ || 44 యుక్తః పరస్తా దిత్యాది పంచకం జుహుయా త్తతః | సన్తతీశ్చ జయాద్యాస్తా స్తథా రాష్ట్రభ్భతో నృప! 45 వార్త్రఫ°్న చాజ్యభాగౌచ దాతవ్యౌ పార్థివో త్తమ | అధౌదుంబర పత్రాణాం వేదౌ దక్షిణతో నృప! 46 సంచయే పద్మపత్రాణా మథవాపి మహీపతే | ఆవాహనం తు కర్తవ్యం దేవస్య పరమేష్ఠినః || 47 అవాహ యామ్యహం దేవం బ్రహ్మాణం పరమేష్ఠినం | జగతో೭స్య సముత్పత్తిస్థితిసంహారకారకమ్ || 48 చతుర్వేదం చతుర్వక్త్రం చాతుర్వర్ణ్యప్రభుం ప్రభుమ్ | చతురాశ్రమ గోప్తారం వరదం భూతభావనమ్ || 49 పద్మయోనాం జగద్యోనిం యజ్ఞయోనిం జగత్పతిమ్ || ఆత్మయోని మనా ధృష్యం యజ్ఞవాహం జగత్పతిమ్ || 50 యజ్ఞేశం యజ్ఞమూర్తించ త్రైలోక్యసై#్యక కారణమ్ | సర్వగం వరదం సౌమ్యం పరమం పరమేశ్వరమ్ || 51 భూత భవ్య భవం నాథం యోగజ్ఞేయం సనాతనమ్ | ఆగ చ్ఛ భగవన్! బ్రహ్మన్! యజమానస్య వృద్ధయే || 52 ఇద మర్ఘ్య మిదం పాద్యం ధూపం చేదం ప్రగృహ్యతామ్ | బ్రహ్మ లింగాం స్తతో మంత్రాన్ జపే ద్భక్త్యా సమాహితః || 53 అపోహిష్ఠేతి మంత్రేణ బ్రహ్మణ೭ర్ఘ్యం నివేదయేత్ | శన్నో దేవీతి పాద్యంచ ప్రయత స్సునమాహితః || 54 హిరణ్య గర్భేతి తధా దద్యాదాచమనం బుధః | ధ్రువా ద్యౌరితి మంత్రేణ హ్యాసనం వినివేదయేత్ || 55 గంధం పుష్పమలంకారం వస్త్రం ధూపం సదీపకమ్ | నైవేద్యం చ తధా దేయం సావిత్రేణ నరాధిప! 56 ప్రాక్తస్త్రమేత దుక్తంతే తే మయా సర్వాగ్ని కర్మసు | పాక్తస్త్రేతు కృతే కార్యం హోమ మన్త్ర మయాసకమ్ || 57 ఏవం కార్యం మహీనాధ! సర్వే ష్వేవాగ్ని కర్మసు | హోమస్య విహితస్యా న్తే తన్త్రం కార్య మధో త్తరమ్ | పిమ్మట భిన్నమగు ఆగ్రములుకానిదియు, మొదట కోయబడిన దర్భలతో వేదిచుట్టు తూర్పు, దక్షణము, పడమర, ఉత్తరసమాప్తిగ ప్రస్తరణములు వేయవలెను. దర్భలు దొరకనపుడు ఫలవంతములగు ఓషధులను వేయవచ్చును. అందు మూడు మూలికలు మాత్రము పనికిరావు (1) రాజసీరవరూకము పరిచాధమ ఉత్కటము=నీటిరెట్లు ''విష్ణుర్మనసా, పూతేస్తో'' అను రెండు మంత్రములచే దర్భలతో జేసిన పవిత్రము విడిచి దేవోప అను నీమంత్రముతో శుచియైన యుదకమును ఉత్పకనము గావింపవలెను. అటుపై పాలాశ పత్రముతో మోదుగాకులతో జేసిన వేనజిమ్మికర్రతో మేడికర్ర-రాగి వెండి బంగారముతో జేసిన స్రుక్ర్సువములను గ్రహింప వలెను. అజ్యస్థాలి తైజనములయిన ద్రవ్యములతో దయారు చేయబడవలెను. తైజసములు =వెండి బంగారముతో జేసిన స్రుక్ర్సువములను గ్రహింప వలెను. అజ్యస్థాలి తైజనములయిన ద్రవ్యములతో దయారు చేయబడవలెను. తైజసములు=వెండి బంగారము లేదా అగ్నికార్యములందన్నిటను మాహేయి=మట్టిపాత్ర ప్రశస్తము. స్రుపము హస్తమాత్రముగా నుండవలెను. మూరెడు పొడవు వుండవలెనన్నమట. స్రుపము బారెడుండవలె. స్రుపముయొక్క లోతు బోటన వ్రేలు మథ్యమంత ధృవము గుంటయందు పరిచానా అని మంత్రముతో నైదుసార్లు అజ్యమించి గ్రహింతురు. (ఉత్మూతముపడినపాలు) ఆజ్యఅని మంత్రముతో కాచవలెను. పసిత్రముతో నేతినుత్పవింపవలెను ఆ ఉత్పవనమందు ''అగ్నిర్జిహ్వా'' అను మంత్రముతో నది క్షీణము కానట్లు చేయవలెను. శుభాభ్యామను మంత్రముతోను ప్రత్యుష్టమనియు న్రుక్ర్సువములు భావనచేయవలెను. పవిత్రముయొక్క మీదిదర్భతో ఆయురని మంత్రముతో స్రువమును దుడువవలెను. ఆపైని చక్షురసు మంప్రముతో దుడిచి యారెండు దద్భలను నగ్నియందు వేయవలెను. అటుపై రెండు ఇధ్మములను యజ్ఞియ వృక్షములతో జేసినవానిని అగ్నికి సమర్పింపవలెను. యజ్ఞియ వృక్షములు (యజ్ఞమున నుపయోగింపదగినవి) పండ్రెండు 1. పలాశము=మోదుగ 2. ఖదిరము=చండ్ర 3. బిల్వము=మాలేడు 4. శమీ=జమ్మి 5. అశ్వత్థము=రావి 6. వటము=మఱ్ఱి 7. ఉదుంబరము=మేడి 8. అపామార్గః = ఉత్తరేణు 9. ఫల్గువు= 10. క్రమకము=పోక 11. చందనము=మంచిగంధము 12. దేవదారువు. తొలుత స్రుక్కునందు నాల్గుసారులు గ్రహించిన హవిస్సును ప్రజ్వలితమయిన (అంటుకొన్న) ఇధ్మమధ్యమందు సౌమ్యభాగమందు ఉత్తరమందు తొలియాహుతి మనస్సుతో (మౌనంతో) ప్రజాపతికీయవలెను. చతుర్గృహీతమును ''మ్రుద్ధా|| అను మంత్రాముతో దక్షణము వైపున నీయనగును. ''యుక్తః పరస్తాత్|| ఇత్యాది మంత్రములతో నైదాహుతులీయవలెను. సంతతులను జయాదులను రాష్ట్ర భృక్తుతుల వార్త్రమ్నుము లను మంత్రములతో రెండాజ్య భాగములతో నైదాహుతులీయవలెను. సంతతులను రాష్ట్ర భృక్తుతుల వర్త్రమ్నుము లను మంత్రులతో రెండాజ్య భాగములను వరుసగా నీయవలెను. ఆ పైని వేదియందు దక్షణ దిశని మేడియాకుల ప్రోగుమీద లేదా తామరాకులమీద పరమేష్ఠియొక్క (బ్రహ్మ) ఆవాహనము గావింపవలెను. బ్రహ్మాదేవానాం అను మంత్రములయిదింటిలో ఇదిగో అర్ఘ్యుము ఇదే పాద్యము గ్రహింపుమని బ్రహ్మలింగమంత్రములను జపించవలెను. 'అపోహిష్ఠా'' అను మంత్రముతో బ్రహ్మ కర్ఘ్యమును ''శంనోదేవీ'' అని పాద్యమును ''హిరణ్యగర్భ'' అను మంత్రముతో నాచమనము ''ధ్రువాద్యౌరమ'' మంత్రముతో ఆసనము సావిత్రమంత్రముతో గంధ పుష్పాలంకార వస్త్ర ధూప దేప నైవేద్య ములీయవలెను| ఇది ప్రాక్తంత్రము. నీకు తెల్పితినిక నుత్తర తంత్రమును వినుము. ప్రక్తంత్రమయిన తర్వాత ''అయాశ్చగ్నే'' అనే మంత్రముతో ఒక్కపర్యాయముహోము చేయాలి. మహాకల్పస్య కల్పస్య తధా మన్వంతరస్యచ || 59 యుగస్యాధ సమాయాశ్చాయనస్యహి తధైవచ | ఋతోర్మానస్య పక్షస్య గ్రహ నక్షత్రయోస్తధా || 60 తిథేశ్చ కిరణస్యాధ ముహూర్తస్యచ పార్థివ! | వర్తమానస్య సర్వస్య దేయస్యాధిపతి ర్భవేత్ || 61 ఇహగావ ఆయం యజ్ఞ ఆనః ప్రజాస్తధైవ చ | ధూర్తించైవో ప ధూర్తించ ఇహాభాగం తధైవచ || 62 దేయం చతుర్గృహీతేన హోమ ద్రవ్యేణ పార్థివ! | త్వన్నో అగ్నే! వరుణస్య స త్వంనో అగ్న ఏవ చ || 63 అయాశ్చాగ్నే స్తధైవేతి తథా వ్యాహృతయో నృప! | త్వం నో అగ్నేతి చ తతో హోతవ్య మృక్ త్రయం పునః || 64 న్యూనం తతేతి రిక్తేతి న్యూనే చైవాతి రిక్తకమ్ | సమం సమే తధా హుత్వా హోతవ్య మృక్త్రయం తతః || 65 ఆనాజ్ఞాతం యదాజ్ఞాతం స్విష్టి శ్చాప్యథ పార్థివ ! మనోర్జ్యోతి స్తధైవాత్ర త్రయస్త్రింశ త్తధైవ చ || 66 యన్మే చ మనసా ఛిద్రం విశ్వకర్మా తధై వచ | అయా శ్చాగ్నే స్తథా రాజన్! త్వన్నో అగ్నే తధైవచ | స త్వన్నో అగ్నే ఇత్యేవం హుత్వా పార్థివ సత్తమ ! || 67 ఆశ్రావితేతి మంత్రేణ దేయా పూర్ణాహుతి ర్భవేత్ || 68 ఇష్టోహి యజ్ఞో భృగుభి ర్మంత్రేణానేన పార్థివ! | ఆజ్యస్థాలీం స్రుక్ స్రువౌ చ దర్బైస్తు పరిమార్జయేత్ || 69 తాంశ్చ దర్ఖాన్ క్షిపే ద్వహ్నొ ప్రయత స్సుసమాహితః | పూర్ణ మిత్యేవ చ స్రువా కార్యం సంవీక్షణం తతః || 70 యథా దిశం భూమిపాల! తథా తుర్యా ద్విమోచనమ్ | తతో విసర్జనం కార్యం బ్రహ్మణః పరమేష్ఠినః || 71 వర్తమాన (ఇప్పుడు జరుగుచున్న) మహాకల్పము, కల్పము, మన్వంతరము యుగము సంవత్సరము అయనము ఋతువు మాసము పక్షము గ్రహ నక్షత్రములు తిధి కరణము ముహూర్తము అనువాని యధిపతులను వేర్వేర నాహ్వానింపవలెను. ఇహగావ, ఆయంతుజ్ఠః అనః ప్రజాః ధూర్తి ఉపధూర్తి ఇహభాగము అని నాల్లుసార్లు గ్రహించి హోమద్రవ్యమును--- ''త్వంనో అగ్నే వరుణస్యసత్వంనో అగ్న ఏవచ అయాశ్చాగ్నే స్తథైవ'' అని ఆహుతులిచ్చి ''త్వంనో అగ్నే'' అని మూడుఋక్కులతో తిరిగి హోమము సేయవలెను. ''న్యూనంతతా రిక్తా'' అని న్యూనమందును అతిరిక్తమును ''సమయమును సమయమందును ఋక్త్రయముతో హోమము సేయవలెను. అవాజ్ఞాతం యదాజ్ఞాతమని స్విష్టియని మనోజ్యతిం త్రయస్త్రింశత్ యన్మేమనసా ఛిద్రం విశ్వకర్మా అయాశ్చాగ్నేః త్వన్నో అగ్నే'' ''సత్వంనో అగ్నే'' అనుమంత్రముల సంపుటితో హోమములసేసి ''అశ్రావిత'' అనుమంత్రముతో పూర్ణాహుతి గావింపవలెను. ''ఇష్టొహియజ్జోభృగుభిః'' అను మంత్రముతో అజ్యఎ్థాలిని (నేతిగిన్నెను) స్రుక్స్రువములను దర్భలతో పరిమార్జంప వలెను. (తుడప వలెను) అదర్భలను శుచియై శ్రద్ధతో నగ్నియందు వేయవలెను. పూర్ణకును మంత్రముతో స్రువముతో సంవీక్షణము సేయవలెను--దిశానుసారముగవిమోచనముసేయవలెను. ఆమీదపరమేష్ఠియగు బ్రహ్మకు విసర్జనము సేయవలెను. భగవన్! దేవ దేవేశ! జగతా మార్తి నాశన! | ప్రజస్వ పూజా మాదాయ పున రాగమనాయచ || 72 యజమానస్య శాన్త్యర్థం సర్వస్య జగత స్తధా | ఆరోగ్య ధనధాన్యేన యజమానంచ వర్ధయ! 73 హుతాశనస్య కర్తవ్యం తతో రాజన్! విసర్జనమ్ | ద్రవ్యభు క్త్వం వరేణ్యస్త్వం ప్రణతార్తి వినాశనః || 74 ప్రజస్వ పూజా మాదాయ పున రాగమనాయచ | శాన్త్యర్థం యజమానస్య రాష్ట్రస్య చ వివృద్ధయే || 75 గోబ్రాహ్మణ హితార్ధాయ జయాయ చ మహీపతేః | పూర్ణపాత్ర మథా೭೭దాయ వాచ్యం స్వస్త్వయనం తతః || 76 తతస్తు దక్షిణా దేయా యథా ప్రోక్తా మయాపురా! ఏ తదు త్తర తస్త్రంతు ప్రోక్తం సర్వాగ్ని కర్మణామ్ || విధాన మేత త్కధితం తవార్య సర్వాగ్నికర్మ స్వనఘోపయోగి | అతః పరం కిం కథయామి రాజన్ ! తన్మేవదస్వాయత లోహితాక్ష ! 78 ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్ర సంవాదే అగ్నికార్యే ప్రాక్తనోత్తరత స్త్రవిధిర్నామ ద్వినవతి తమో೭ధ్యాయః ప్రార్థనామంత్రము యజమానికి సర్వజగత్తునకు శాంతికలుగుటకు జపింపవలెను. ఆరోగ్య ధన ధాన్యములతో యజమానుని నభివృద్ధిపరుపుమని ప్రార్థింపవలెను. ఆ మీద నగ్ని హోత్రునికి విసర్జనము గావింపవలెను. దానిమంత్రమిది---దాని అర్ధం ద్రవ్యభోక్తవు నీవు. నీవు వరేణ్యుడవు ప్రణతుల అర్తిని బాపువాడవు. పూజకొని తిరిగి రాకకొరకు దయసేయుము. యజమానికి రాష్ట్రమునకు సుఖశాంతుల సమృద్ధికి గో బ్రాహ్మణ హితముకొరకు తిరిగిరాకకు దయసేయుమని పూర్ణపాత్రను చేతబట్టుకొని స్వస్తి పలుకవలెను. రాజా! రక్తాంతదీర్ఘనేత్ర! ఈపైనింకేమి వచింతునది తెలుపుము. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మళాపురాభము ప్రథమ ఖండమున అగ్నికార్యమందు ప్రాక్తంన్త్రోత్తర తంత్రవిధి అను తొంబదింరెండవ అధ్యాయము.