Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదిమూడవ అధ్యాయము - గ్రహపూజావిధానము

వజ్ర ఉవాచ :

విస్తరాచ్ఛ్రోతు మిచ్ఛామి గ్రహనక్షత్ర పూజనమ్‌ | త్వత్తోహం భార్గవశ్రేష్ఠ! తన్మమాచక్ష్వ పృచ్ఛతః ||

మార్కండేయ ఉవాచ :

కల్పితే మండలే స్నాతః ప్రాక్తంత్రేచ తధా కృతే |

మండలస్య తు శౌచార్థం పంచ గవ్యం ప్రకల్పయేత్‌ || 2

పయః కాంచన వర్ణాయాః, నీలాయాశ్చ తధా ఘృతమ్‌ |

దధివై కృష్ణవర్ణాయాః శ్వేతాయాశ్చైవ గోమయమ్‌ || 3

గోమూత్రం తామ్రవర్ణాయాః పంచగవ్యం ప్రకల్పయేత్‌ |

అధై తాని సమస్తాని కపిలాయా స్సమాహరేత్‌ || 4

గాయత్ర్యా గృహ్య గోమూత్రం రధే అక్షేతి గోమయమ్‌ |

ఆప్యాయస్తేతి చ క్షీరం దధి క్రావ్ణేతి పై దధి || 5

తేజోపి శుక్ర మిత్యాజ్యం సావిత్రేణ కుళోదకమ్‌ | అఘ మర్షణ మంత్రేణ సంయోజ్య ప్రణవేన తు || 6

మండలాభ్యుక్షణం కార్యం సావిత్ర్యా తదనస్తరమ్‌ | పూర్ణం క్షీరాక్షతోపేతం సర్షపా తండులై ర్యుతమ్‌ | 7

శంఖే రజతే తామ్రేవా కుర్యా దర్ఘ్యం విచక్షణః | రథే అక్షేతి మంత్రేణ ద్రవిణన తధైవ చ || 8

పాద్యస్య కల్పనా కార్యా ద్రుపదాయా స్తధైవచ | హిరణ్య వర్ణేత్యారభ్య ఋక్త్రయేణ తధై వచ || 9

అపో హిష్ఠేతి తిసృభిః శన్నో దేవీతి పార్థివ! | జీవ దానం తతో రేయం మండలే నృప పుంగవ | 10

ఆర్ఘ్యోదకం పవిత్రేణ తత్ర మంత్రః ప్రకీర్తితః | ఆగ్నేరాయి రసీత్యేవ మనువాకం నరాధిప ! 11

జీవస్యావాహనం కార్యంతం చ పక్ష్యా మ్యతః పరమ్‌ |

ఓమ్‌-ఆవాహయామ్యహం దేవం జీవం సర్వగతం విభుమ్‌ || 12

పంచధావస్థితం దేహం పంచధావస్థితం పునః | పంచధావస్థితం భూయః పంచధావస్థితం తతః || 13

వాయవ్యేనతు భావేన పంచధావస్థిత స్సదా | అగ్నేయేనతు భావేన పంచధావస్థిత స్తధా || 14

భూతాత్మకేనతు తధా పంచధావ స్థితం ప్రభుమ్‌ | వారుణన చ భావేన పంచధావ స్థితం ప్రభుమ్‌ | 15

మండలేస్మి న్నదృశ్య స్త్వం ప్రవిశాద్య నమోస్తుతే |

జీవస్యావాహనం కృత్వా యథావ త్పార్థివోత్తమ ||

వక్ష్యా మ్యావాహనాధ్యాయాన్‌ పూజ్యస్యావాసానం భ##వేత్‌ |

తద్విష్ణోః పర మిత్యేవ మర్ఘ్యం దేయం నరాధిప ! || 17

ధ్రువా ద్యౌదితి మంత్రేణ హ్యాసనం వినివేదయేత్‌ | అపోహిష్ఠేతి తిసృభిః పాద్యం చ వినివేదయేత్‌ || 18

ఆర్ఘ్యోదకా దాచమనం గాయత్ర్యా వినివేదయేత్‌ | దధి క్షౌద్రం ఘృతం చైవ మధుపర్కం నివేదయేత్‌ || 19

తత్ర మంత్ర త్రయం జ్ఞేయం దధి క్రస్ణేతి పార్థివ! | తేజోసి శుక్ర మిత్యేవ మధువాతా ఋతాయతే || 20

మధుపర్కిక మశ్వత్థం తతో మాత్రాం నివేదయేత్‌ | సహిరణ్యం బీజపాత్రం ద్రవిణనసదై వతు || 21

పశుః కలౌ న కర్తవ్య ఇత్యాహ భగవాన్‌ భృగుః | రథే అక్షేతి మంత్రేణ దాతవ్య మనులేపనమ్‌ || 22

విభూషణం చ తేనై వ తతః పరతరం నృప! | యజ్ఞోప వీతం తు నవం తధా ప్రతిసరం శుభమ్‌ || 23

వస్త్రం పతాకాం చ తధా సావిత్రేణ నివేదయేత్‌ | పుష్పం పుష్పవతీత్యేవ ధూపం ధూరసి చాప్యథ || 24

ధూప మంత్ర మిదం చాన్యం నిబోధ గదతో మమ | వనస్పతి రసో దివ్యో గంధఢ్యో గంధ ఉత్తమః || 25

ఆహ్వానం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్‌ |

తేజోసి శుక్ర మిత్యేవ దీపం దద్యా న్మహీపతే || 26

హిరణ్యగర్భే త్వష్టర్చం దేయం సర్వం నివేదయేత్‌ | నిబోధ గదతో మంత్ర మన్నపాన నివేదనే || 27

తుష్టిపుష్టికరం హృద్యమహారం సర్వదేహినామ్‌ |

గృహాణ! వర దాచిన్త్య! పానం భక్త్యా మయోదితమ్‌ || 28

పానే నానేన పరమా తృప్తిరస్తు తవానఘ! | తృప్తస్తర్పయ కామైస్తు యజమానం నమోస్తుతే || 29

అనుక్త మంత్రం శ్రుత్వాద గ్రహేభ్యో యః ప్రయచ్ఛతి |

సావిత్రం తస్య నిర్దిష్టం మంత్రం పార్థివ సత్తమ! || 30

వజ్రుడు గ్రహనక్షత్ర పూజావిధానము తెలుపుమన మార్కండేయుడనియె. పూజామండల మేర్పరచిస్నానముసేసి ప్రాక్తంత్రమొనరించిన తర్వాత శుచిత్వసంపాదనకు పంచగవ్యమనగా; బంగారురంగులో నున్న గోవుయొక్క పాలు, నీలవర్ణముననున్న ఆవుయొక్కనెయ్యి, నల్లావుయొక్క పెరుగు, తెల్లాపుయొక్క గొమయము, రాగిరంగుగోవుయొక్కమూత్రము, లేదా కపిలగోవుయొక్క యీయైందు పదార్థములు సమకూర్చుకొనవలెను. గాయత్రీ మంత్రముతో గోమూత్రము ''రథేఅక్ష'' అనుమంత్రముతో గోమయము ''అప్యాయస్వ'' అనుదాన పాలు, దధిక్రావ్ణ అనుదానపెరుగు తేజోసిశుక్ర'' మని నెయ్యి సావిత్ర మంత్రముతో కుశౌదకము అఘమర్షణమంత్రముతోకలిపి ప్రణపముతో మండలాభ్యుక్షణముసేయవలెను. మండలమందు జల్లవలెనన్న మాట, అటుపై సావిత్రీమంత్రముతో క్షీరాక్షతలు ఆవాలు తందులములతో పూర్తి చేయవలెను. శంఖమందు రజత (వెండి) గిన్నెలో రాగిగిన్నెలోగాని. అర్ఘ్యమునుంచవలెను. ''రథేఅక్ష'' అనుఘంత్రము ''ద్రవిణన'' ''ద్రువదాయా'' అనుమంత్రములచేత పాద్యము కల్పింపవలయును. ''హిరణ్యవర్ణ'' అనుమంత్రము మొదలుకొని మూడు ఋక్కులతో ''అపోహిష్ఠ'' అను మూడుమంత్రములతో ''శన్నోదేవీ'' అనుమంత్రముతో మండలమందు జీవదానము సేయవలెను ''అగ్నేరాయురసి|| అను ననువాకముతో జీవాహ్వానముసేయనగును. అజీవాహ్వారీతి చెప్పెద. ప్రణవపూర్వకముగా నీశ్లోకములు పఠించవలెను. వానిబావము. నేను సర్వగతమై యున్న విభువైన జీవుని అవాహనము చేయుచున్నాను. అయిదు విధాలుగానున్న దేహమును వాయవ్య భావముతో అగ్నేయ భావముతో భూతాత్మక భావముతో వారుణ భావముతో ఈమండలమందు నీవు అదృశ్యుడవై (కనబడకుండ) ప్రవేశింపునట్టి నీకు నమస్కారము. అని జీవావాహనముచేయవలెను. అవాహనాధ్యాయము చెప్పెద. పూజ్యమైన వానికి అవాహనముండును. ''తద్విష్ణోః పరమమ్‌'' అను మంత్రముతో అర్ఘ్యమీయవలెను. ''ధ్రువాద్యౌః'' అను మంత్రముతో అసనము, ''దధిక్రాష్ణ'' తేజోcసి మధువాతాబుతాయతే అను మూడు మంత్రములతో మధుపర్కము సమర్పించి మాత్ర (చిల్లర డబ్బులు) దక్షిణ నీయవలెను. బంగారముతోడి బీజపాత్రను (నవధాన్య పాత్రను) ''ద్రవిణ'' యను మంత్రముతో నీయవలెను. కలిలో పశువును వేయకూడదని భృగు మహర్షి చెప్పినారు. ''రధే అక్ష'' అను మంత్రముతో అనులేపనము (గంధము) అభరణము గూడ సమర్పింపవలెను. యజ్ఞోపవీతము వ్రతిసరము (మాల) నవమైనది వస్త్రము పతాకయుంగూడ సావిత్ర మంత్రముతో నీయవలెను. ''పుష్పపతి'' అను మంత్రముతో పుష్పము ''ధూరసి'' అను మంత్రముతో ధూపము నీయవలెను. ''వనస్పతి అనునీశ్లోకరూప మంత్రము సంపుట పరచి ధూపమీయవలెను.

''తేజోసి శుక్రమసి'' అను మంత్రముతో దీపమునీయవలెను. ''హిరణ్యగర్భ'' అను నెనిమిది ఋక్కుల సంపుటితో సర్వము నివేదింపవలెను. అన్న పానముల నివేదించుటకు ''తుష్టి పుష్టి కరమ్‌'' అను నీ (28వ) శ్లోక రూపమయిన మంత్రముతో పా నేనా నేన అను 29వ శ్లోక మంత్రముతో పానము(మంచితీర్థము) నొసంగవలెను. గ్రహములకు చేయునుపచారములందు మంత్రమేదేని చెప్పబడనపుడు సావిత్ర మంత్రము సంపుటి చేయవలెను.

తతోగ్నిహవనం కృత్వా దత్వా రాజేంద్ర! దక్షిణామ్‌ |

సావిత్రేణ తు మంత్రేణ తతః కార్యం విసర్జనమ్‌ || 31

ఇమాం పూజాం సమాదాయ మయా భక్త్యా నివేదితామ్‌ |

పునరాగమనాయేహ ప్రజధ్వం నాక ముత్తమమ్‌ || 32

ఆధయో వ్యాధయ శ్చైవ ప్రశమం యాన్తు సర్వశః |

రక్షా చాస్తు శివం చాస్తు యజమానస్య సర్వతః || 33

గవాం శివం చాస్తు తధాద్విజానాం రాజ్ఞాం శివం చాస్తు తధా ప్రజానాం |

ఆతంగ హీనం జగదస్తు సర్వం దోషాః ప్రణాశం సకలాః ప్రయాన్తు || 34

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహ పూజా విధానం నామ త్రినవతి తమోధ్యాయః

అమీద అగ్ని హవనము సేసి దక్షిన యిచ్చి సావిత్ర మంత్రముతో విసర్జనము సేయవలెను. ఈ నా చెప్పిన భక్తితో నివేదితమైన పూజను (పూజాఫలము) చేకొని ఇచటికి తిరిగి వచ్చుటకు ఉత్తమ స్వర్గమునకు వెళ్ళుము. ఆధులు (మానసిక క్ష్రోభలు) (స్థూలశరీర రోగములు) వ్యాధులుపశమించుగాక యజమానునికి రక్షణ శివము (శుభము) గలుగుగాక. గోవులకు శివమగుగాక ద్విజులకు రాజులకు భద్రమగుగాక ప్రజలకు మంగళమగుగాక. జగత్తు నిరాతంకమగుత అనగా అభ్యంతరములు విఘ్నములు లేనిదగు గాక! సకల దోషములు ప్రశమించుగాక !

ఇది శ్రీవిష్ణుధర్మౌత్తర మహాపురాణము ప్రథమఖండమున గ్రహ పూజావిధానమను తొంబదిమూడవ యథ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters