Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదినాల్గవ అధ్యాయము - సర్వగ్రహ పూజామండల కల్పనము

వజ్ర ఉవాచ :

ఏకైకస్యేద ముక్తంతే విధానం ద్విజ! పూజనే ! సర్వగ్రహాణాం యజనే విధాన మమ కీర్తయ! || 1

మార్కండేయ ఉవాచ :

ఏకైక స్యేద ముక్తంతే విధానం రాజసత్తమ ! సర్వగ్రహాణాం యజనే మండలస్య విధిం శృణు || 2

ఆదా వేవ సర వ్యాఘ్ర! యాగం వక్ష్యా మ్యతః పరమ్‌ |

ప్రాగాయతం తు కర్తవ్య మాదౌ లేఖా ద్వయం నృప! 3

తస్యోపరి తధా కార్య మపరం తూత్తరాయతమ్‌ | ఏవం కృతే సంభవతి భగణం ద్వాదశక్షయమ్‌ || 4

తతోగ్రహేభ్యః కర్తవ్యం తధా లేఖా చతుష్టయమ్‌ |

(తచ్ఛక్తిభ్యః ప్రకర్తవ్యం తధా రేఖ్యా చతుష్టయమ్‌)

ఏవం కృతే సంభవతి భగణం ద్వాదశక్షయమ్‌ ||

త్రయోదశం తధా తస్య ధ్రువస్థానం తు మధ్యమం || 6

ప్రాచ్యాం దిశి మహీనాధ! మేషంతు పరికల్పయేత్‌ | తదా ద్యా గణనా కార్యా పరిశేషేషు రాశిషు || 7

రేఖావిధానం ద్విగుణం శోభార్థం పరికల్పయేత్‌ | రాశిస్థానాని సర్వాణి రాశివర్ణేన రంజయేత్‌ || 8

రాశివర్ణా న్యధో వక్ష్యే యధావ దను పూర్వశః | అరుణ శ్చ సిత శ్చైవ హరితః పాటల స్తధా || 9

ఆపాండు శ్చ విచిత్రశ్చ కృష్ణశ్చ కపిల స్తధా | పింగళః కర్బురో బభ్రుర్మ లిన శ్చ యధాక్రమమ్‌ || 10

మేషాదీనాం వినిర్దిష్టా వర్ణాః పార్థివ సత్తమ! | అకాశ వర్నం కర్తవ్యం ధ్రువస్థానం తధైవచ || 11

ధ్రువ స్థానే మహీనాథ! దేవతా స ప్తకం న్యసేత్‌ | మండలై శ్శుక్లవర్ణెస్తు దిగ్విభాగం నిబోధమే || 12

ధ్రువస్య మండలం మధ్యే ప్రాగ్భాగే మండల త్రయమ్‌ |

మండలం గగన స్యాత్ర భాగే ప్రాగుత్తరే భ##వేత్‌ || 13

ప్రాగ్భాగే చ తధా రాజన్‌ ! మండలం బ్రహ్మణ స్స్మృతమ్‌ ||

ప్రాగ్దక్షిణ తధా భాగే దిశం పూర్వీం ప్రకల్పయేత్‌ || 14

భాగేవై నైరృతే కార్యం భువో భూపాల! మండలమ్‌ |

శేషస్య చ తదా కార్యం ప్రతీచ్యాం దిశి మండలమ్‌ || 15

దిగధస్తా త్తధా తస్య మండలం పశ్చియోత్తరే | గ్రహశ్చారవశా ద్రాజన్‌ ! యస్మిన్రాశౌ వ్యవస్థితః || 16

మండలం తస్య కర్తవ్యం తస్మిన్నేవ యధావిధి |

న్యాసం కార్యం గ్రహేంద్రాణాం దేవతాభి స్సహా೭#ಿఘ! 17

ఆదిత్యా త్సప్తమే రాశౌ కేతోః కార్యంతు మండలమ్‌ |

రాశౌ సవర్ణే తద్వర్ణం యస్య స్యా న్మండులం నృప ! 18

ఉత్పాద్యః పరిధి స్తస్య రంగేనాన్యేన పార్థివ! | గంధ చూర్ణయుతా రంగాః కర్తవ్యా భూతి మిచ్ఛతా || 19

రాశిచక్రం సమగ్రంతు రేఖయా పరివారయేత్‌ | నక్షత్రాణాం తతః కార్యో న్యాసః పార్థివసత్తమ! 20

రాశౌ రాశౌ యథాస్థానం రేఖయా పరివారితమ్‌ | రాశౌ రాశౌ వతో వక్ష్యే నక్షత్రాణాం సమాశ్రయం || 21

అశ్వినీ భరణీ చైవ కృత్తికాంశం చతుర్థకమ్‌ | మేషరాశౌ వినిర్దిష్టం నిత్యం పార్థివసత్తమ! 22

పాదత్రయం కృత్తికానాం రోహిణీ సకలా తధా | ఇల్వలానాం తధైవార్ధం జ్ఞేయం పృషసమాశ్రయమ్‌ || 23

ఇల్వాలార్థం తధై వార్ద్రా హ్యాదిత్యా శ్చరణ త్రయం |

నిత్య మేవ సముద్దిష్టం మిధునస్య సమాశ్రయమ్‌ || 24

పాదం పునర్వసోః పుష్యం సార్పం కర్కటకాశ్రయమ్‌ |

పిత్ర్యం భాగ్యం తధార్యవ్ణుం ప్రథమం చరణం తథా || 25

సింహరాశౌ వినిర్ది ష్టం నిత్యం పార్థివ సత్తమ! | పాద త్రయ మధార్యవ్ణుం హస్త శ్చిత్రార్ధమేవచ || 26

కన్యారాశౌ వినిర్దిష్టం నిత్యం పార్థివసత్తమ ! చిత్రార్ధ మధ వాయవ్యం విశాఖా చరణత్రయమ్‌ || 27

తులా రాశౌ వినిర్దిస్టం మునిభిస్తత్వ దర్శిభిః | విశాఖా చరణం మైత్రం శాక్రం పృశ్చిక భే స్మృతమ్‌ || 28

మూల మాప్యం తధా పాదం వైశ్వదేవస్య ధన్విని | పాద త్రయం వైశ్వదేవా ద్రాజన్‌! వైష్ణవమేవచ || 29

ధనిష్ఠార్ధం చ మకరే నిత్యమేవ ప్రకీర్తితమ్‌ | ధనిష్ఠార్ధం శతభిష గజపా చ్చరణ త్రయమ్‌ || 30

కుంభరాశౌ వినిర్దిష్టం సతతం పార్థివో త్తమ! | పాద మాజస్య సకలం చాహిర్బుధ్న్యం నరాధిప ! 31

పౌష్ణంతు కధితం మీనే మునిభిస్తత్వ దర్శిభిః | భచక్ర పూజనే రాజన్‌! నక్షత్రస్య పృధక్‌ పృధక్‌ || 32

తాశి చక్రస్య బాహ్యే తు హ్యేకై కం తారకం న్యసేత్‌ |

ప్రాగు క్త వర్ణై ర్భూపాల! న్యాసః కార్యోయధావిధి || 33

తారా చక్రస్య విన్యాసం రేఖయా పరివార్య తమ్‌ | నక్షత్ర దైవత న్యాసం బహిఃకార్యం సమన్తతః || 34

యధా నక్షత్ర స్వామీ స్యా దృక్షువర్ణైః పృధక్‌ పృధక్‌ |

తస్యాపి రేఖా కర్తవ్యా వృత్తా చా ప్యను మండలమ్‌ || 35

రేఖా బాహ్యేన విన్యాసం దిగీశానాంతు కారయేత్‌ | దిశశ్చ పార్థివ శ్రేష్ఠ! యధా వ దను పూర్వశః || 36

స్వాశ్రమ ర్ష సమం వర్ణం దిగీశానాంతు కారయేత్‌ | ఉత్తరాయాంచ కర్తవ్యం ధనదస్యచ మండలమ్‌ || 37

రుక్మ వర్ణం ప్రయత్నేన దిశోవర్ణ మత శ్శృణు! | ఉత్తరాతు భ##వే చ్ఛుక్లా రక్తా ప్రాచీ ప్రకీర్తితా || 38

దక్షిణా పీతవర్ణాస్యాత్‌ కృష్ణా జ్ఞేయాచ పశ్చిమా | పద్మ వర్ణా తధాజ్ఞేయా తామ్రాస్యాత్‌ పూర్వ దక్షిణా || 39

పాలాశా చ వినిర్దిష్టా తధా దక్షిణ పశ్చిమా | నీలోత్పల సవర్ణాతు వాయవ్యా పరికీర్తి తా || 40

శుక్లవర్ణ తధా జ్ఞేయా చైశానీ తత్త్వతర్భిభిః | దిజ్మండలం తు తద్విద్వాన్‌ లేఖయా పరివారయేత్‌ || 41

వృత్తయా వేష్టయే ద్వృత్తాం లేఖయా చతుర న్రయా |

తన్మధ్యం శంఖ పద్మాద్యైః మంగళై రుప శోభ##యేత్‌ || 42

లేఖా విధానం ద్విగుణం సర్వత్రైవ ప్రకల్పయేత్‌ |

మండల స్య తు కోణషు హ్యుద కుంభా న్నవాన్‌ దృఢాన్‌ || 43

ఫల పల్లవ సంఛాన్నాన్‌ గంధ పుష్పాది సంయుతాన్‌ | చతురో విస్యసే ద్విద్వా న్నిత్యమేవ విచక్షణః || 44

లేఖాసు విన్యసే ద్రాజన్‌ ! పతాకాశ్చ ధ్వజాం స్తధా |

ఛత్రాణి చ సవర్ణాని గ్రహేంద్రాణాం పృధక్‌ పృధక్‌ || 45

స్థానం తు విజ్ఞాయ యధావదత్ర కార్యం యధా మండలక ప్రమాణమ్‌ |

యధా మహత్తా నృప ! మండలస్య తధా తధా వృద్ధి ముపై తి కర్తా || 46

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే మండల కల్పనా నామ చతుర్ననతి తమోధ్యాయః

వజ్రుడొక్కొక్క గ్రహపూ విషయము సెప్పితివి. సర్వగ్రహ (సమష్టి) పూజావిధి ఆనతిమ్మన మార్కంటేయుడనియె. సర్వగ్రహ పూజా విధానమునందు మండల నిర్వాణము వినుము. మొదట తూర్పుగా రెండు లేఖనములు సేయవలెను. దర్భలతో రెండు గీతలు గీయవలెనన్నమాట. దానిపై నుత్తర 'దిగాయతముగ నొక గీత గీయవలెను. ఇట్లు సేయగా నడుమ చతురస్రము (నలు చదరము) గ మండలమేర్పడును. ఆమీద నాల్గురేఖలు కోష్టాంరమున గీయవలెను. ఇట్లు చేయగా బండెండ్రు స్థానములుగల భగణమేర్పడును. దాని మధ్యస్థానము పదమూడవది ధ్రువస్థానము. తూద్పున మేషము మొదలుకొని పండ్రెండు గదులను పండ్రెండు రాసులుగా పరిగణించ వలెను. ఆమీద రెట్టింపు రేఖా విధానము శోభకొరకు (అందముకొరకు) సేయవలెను. అనగా ఒకే గీత ప్రక్కన యింకొక రేఖ గీయవలెనన్నమాబ. ఆ యా రాసుల స్థానములను ఆ యా రాసులకు జెప్పబడిన రంగులతో నలంకరింపవలెను. రాశి వర్ణములు తెలిపెద. అరుణము (యెరుపు) సితము (తెలుపు) హరితము (పసుపు పచ్చ) పాటలము (లేత ఎరుపు) ఆ పాండువు(నిండు తెలుపు) విచిత్రము (రంగు రంగుల కలయిక) నలుపు. కపిలవర్ణము పింగళము కడ్బురము బభ్రువు మలినము ఇట్లు మేషాది రాసులకు రంగులు క్రమముగ చెప్పబడినవి. ధ్రువస్థాన మాకాశము రంగులో కల్పింపవలెను. ధ్రువస్థానమందు దేవతాసప్తకమును న్యాసము సేయవలెను. తెలుపు రంగుగల మండలములచే దిగ్విభాగము సేయవలెను. నడును ధ్రువమండలము. తూర్పున మూడు మండలములు ఏర్పడును. ప్రాగుత్తర భాగమున (ఈశాన్య మూల) గగన మండలము మేర్పడును తూర్పుదిక్కున బ్రహ్మకు మండల మేర్పరుప వలెను. ప్రాద్దక్షిణ భాగమందు అగ్నేయమున తూర్పు దిక్కునకు స్థానము నైరృతి మూల భూమండల స్థానము. పడమట దిక్కున పశ్చిమోత్తర (వాయవ్య) దిక్కునందు శేషునకు మండలము నేర్పరుప వలెను. చారవశమున నేగ్రహ మేరాశిలో నప్పుడున్నదో యారాశిలో నాగ్రహమునకు మండలము నేర్పరుప వలెను.

ఆ మీద దేవతా ప్రత్యధి దేవతలలో గూడ సూర్యాదిగ్రహన్యానము సేయవలెను. సూర్యునికి సప్తమ రాశియందు కేతు మండలము. ఏగ్రహము రంగేదో యారంగులోనే యాగ్రహమునకు మండలము నేర్పరుపవలెను. గంధచూర్ణముతో రంగముల (రంగులు) తోరంగు నాకుండలమునకు పరిధి నేర్పరుప వలెను. అరంగుల పరిధి వలన నాజిమానునకు భూతి (ఐశ్వర్యము) గల్గును ఆ సంపూర్ణ రాశి చక్రము చుట్టును గీతగీయ వలెను. అటుపై నక్షత్ర న్యాసము సేయవలెను.

ని 4 పాదములు భరణి 4 పాదములు కృత్తిక 1 పాదము - వీనిని మేష రాశియందు న్యాసను సేయవలెను. ఆ నక్షత్ర పాదములు వాని రాశులు ప్రసిద్ధముగా గిలిసినవే. అవి తెలిసిన్యాసము సేయవలెను. రాశి చక్రము యొక్క వెలుపల నొక్కొక్క నక్షత్రమును ఇంతకుమున్ను వానివానికి చెప్పిన రంగులలో నలంకరింప వలెను. ఆ తారాచక్ర (నక్షత్ర మండల) విన్యాసమును గీతతో జుట్టి దాని వెలుపల నక్షత్ర దేవతాన్యాశము సేయవలెను. ఆయా నక్షత్రాధిపతి నక్షత్రముల యొక్క రంగులతో వేరు వేరుగా కనిపించునట్లు ఆయా గ్రహముల చుట్టును గుండ్రని రేఖ గీయవలెను. ఆ రేఖకు వెలుపల దిక్పతుల వ్యాసము సేయవలెను. దిక్కులకు ఆయా దిక్కులందున్న నక్షత్రముల రంగునే వాడవలెను. ఉత్తరదిక్కున కుబేరమండలము బంగారు రంగులో జేయవలెను దిక్కుల రంగులుదెల్పెద వినుము : ఉత్తరదిక్కు తెలుపు. తూర్పు ఎఱుపు దక్షిణము పసుపుపచ్చ మడమర నలుపు, అగ్నేయము తామరపూవు రంగు (ఎరుపు), నైరృతిమూల పాలాశ వర్ణము (ఆకుపచ్చ) వాయవ్యమూల నల్లగులువ రంగు, ఈశాన్యమూల తెలుపు, ఆదిజ్మండలమును చుట్టుగీతతో కప్పవలెను. చతురస్రరేఖతో నావర్తులాకార మండల మధ్యమును శంఖ పద్మాది మంగళ ద్రావ్యములచే నలంకరింప వలెను. ఎక్కడనైన రేఖలు గీసినపుడు రెండేసి రేఖలు గీయవలెను. మండలము యొక్క కోణములందు జల పూర్ణ కుంభములను నాల్గింటిని పండ్లు చిగుళ్ళతో గంధ పుష్పాదులతో నింపినవి కదలకుండ నిలుపవలెను. ఆ యా రేఖలందు పతాక ధ్వజ ఛత్రములను నా యా గ్రహాధీశ్వరులను వారి వారి రంగులలో విన్యాసము సేయవలెను. ఆ యా గ్రహముల స్ధానములు తెలిసి యధావిధిగ మండల ప్రమాణము నేర్పరుప వలెను. ఆ మండలమెంతెంత గొప్పదగునో యా యజమాని యంతంత విజ్ఞాన సంపన్నుడగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గ్రహనక్షత్రపూజావిధానమందు మండలకల్పనమను తొంబదినాల్గవయధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters