Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదియైదవ అధ్యాయము - గ్రహనక్షత్రావాహనమంత్రాధ్యాయము

మార్కండేయ ఉవాచ :

అవాహనా న్యతో పక్ష్యే సర్వేషాం పార్థి వోత్తమ! | సర్వస్యావాహన స్యాన్తేశ్లోకోయం పరికీర్త్యతే || 1

మండలేసంప్రవిశ్యాస్మిన్‌మయాభక్త్యా నివేదితమ్‌ | ఇదమర్ఘ్యమిదం పాద్యంధూపోయం ప్రతిగృహ్యతామ్‌ || 2

ధ్రువ మావాహయిష్యామి సర్వగ్రహ గణ శ్వరమ్‌ | నిరుద్ధం భ్రామ్యతే యేన భ చక్రం వాత రజ్జుభిః || 3

ఏహి మే ధ్రువ! దేవేశ! కేశవాచింత్య విక్రమ! | సర్వగ్రహ గణాధ్యక్ష! సర్వలోక నమస్కృత ! 4

ఆవాహయిష్యామ్యాకాశం విమాన శత మండితమ్‌ | తృతీయం దేవ దేవస్య పదం విష్ణోర్మహాత్మనః || 5

ఏహి! మే భగవన్‌! సౌమ్య! నిరాలంబ! సభ స్థల! | అప్రమేయాతి గంభీర! నక్షత్రగ్రహ మండిత! 6

ఆవాహయా మ్యహం దేవం బ్రహ్మాణం జగతాంపతిమ్‌ | జగతోస్య సముత్పత్తి స్థితి సంహారకారకమ్‌ || 7

ఏహి! సర్వ ప్రజాధ్యక్ష! పద్మయోనె చతుర్ముఖ! వేదమూర్తే! తదాధార! కాల నిర్మాణ తత్పర! || 8

ఊర్థ్వ మవాహయిష్యామి హ్యసన్తాం మహతీం దిశమ్‌ |

అప్రమేయాం నిరాలంబాం చంద్రసూర్యాంశు వర్జితామ్‌ || 9

ఆగచ్ఛేహ మహాభాగే సతతం సిద్ధసేవితే! | అనన్తే! విపులే! దేవి! నిర్మలే! హితకారిణి || 10

పృథ్వీ మావాహ యిష్యామి సర్వ సత్త్వ హితే రతామ్‌ |

ధరాం భూమిం క్షమాం క్షోణీం వరదాం భూతధారిణీమ్‌ || 11

ఏహి! మే వసుధే దేవి వారాహేణ సముద్ధృతే! | సర్వ బీజ ధరే భ##ద్రే!సర్వభూతాపహారిణి! 12

శేష మావాహయిష్యామి మహీ మండల ధారణమ్‌ | ఫణావలీ రత్నజాల మరీచి వికసోజ్జ్వలమ్‌ || 13

ఏహి ! శేష! మహాభాగ! ఏహ్యనన్తాది కేశవ! | ఆహేయీ త్వం తనుస్తస్య విష్ణో రమిత తేజసః || 14

ఆవాహయా మ్యధస్తాత్తు దిశం శేషేణ పాలితామ్‌ | నాగదై త్యోరగ గణౖ స్సతతం చ నిషేవితామ్‌ || 15

ఏహిమే రత్నబాహుల్యే! నిత్యం శేషేణ పాలితే! గంభీరే! విపులే భీమే బహు స్థానాభి మండితే! 16

ఆవాహయిష్యే వరదం దేవేశం జాతవేదసం | వేదమూర్తిం తదాధారం దేవదేవం హుతాశనమ్‌ || 17

ఏ హ్యగ్నే! సర్వదేవేశ! సర్వదేవముఖా చ్యుత | సర్వత్రస్థ మహాభాగ! సర్వభూత హితే రత! 18

ఆవాహయిష్యే వరదం సహస్రాంశుం దివాకరమ్‌ | తేజోమూర్తిం దురాధర్షం భక్తానా మభయప్రదమ్‌ || 19

ఏహి దేవ! జగన్నాథ! ఋక్‌ సామ యజుషాం పతే! త్రైలోక్య మండల ద్వీప సర్వ వ్యాధి వినాశన! || 20

ఆవాయమా మ్యహం దేవ మాదిత్య ముదకే శయమ్‌ |

స్నిగ్ద వైడూర్య సంకాశం వరుణం సు మహాద్యుతిమ్‌ || 21

ఏహి దేవ! జలాధ్యక్ష! యాదోగణ మహేశ్వర | నాగ దైత్యోరగ గణౖ స్సతతం సేవితాచ్యుత! 22

ఆవాహయా మ్యహం చంద్రం శీతాంశుమమృత ప్రభమ్‌ | ఓషధీశం ద్విజాధ్యక్షం నయనానంద కారకమ్‌ || 23

ఏహి! మే భగవన్‌ చంద్ర! ఏహి మే మృగలాంఛన! | భక్తానుకంపిన్‌! సతతం సర్వనక్షత్ర పూజిత! || 24

స్కంద మావాయిష్యామి షణ్ముఖం వరదం శిశుమ్‌ |

దేవారి సేనామథనం పార్వత్యా నంద వర్థనమ్‌ || 25

ఏహి! దేవ సమారాధ్య! మహిషాసుర తస్కర | కార్తికేయ జగన్నాథ ! మయూర వర వాహన! 26

భౌమ మావాహ యిష్యామి తేజోమూర్తిం దురాసదమ్‌ | రుద్రమూర్తి మనిర్దేశ్య వక్త్రం రుధిర సప్రభమ్‌ || 27

ఏహి మే భగవన్‌! భౌమ! అంగారక! మహాప్రభ !

త్వయి సర్వం సమాయత్తం భూతలేస్మిన్‌ శుభాశుభమ్‌ || 28

విష్ణు మావాహ యిష్యామి శంఖ చక్ర గదా ధరమ్‌ | అతసీ కుసుమ శ్యామం పీత వాసన మచ్యుతమ్‌ || 29

ఏహి! మే దేవ దేవేశ! ప్రజా నిర్మాణ కారక | నారాయణ! సుదుష్పార! మహా శాజ్గ9 ధనుర్ధర! 30

బుధ మావాహయిష్యామి బోధకం జగదీశ్వరమ్‌ |

చాంద్రిం గ్రహ గణాధ్యక్షం తేజోమూర్తిం దురాసదమ్‌ || 31

ఏహి! శీతాంశుజాచిన్త్య! జగజ్జిష్ణో జనార్దన! మహాబల! మహాసత్వ! మహాబాహో! మహాద్యుతే! 32

శక్ర మావాహయిష్యామి దేవం సురగణశ్వరమ్‌ |

వజ్రపాణిం మహాబాహుం గోమ్రాహ్మణ హితేరతమ్‌ || 33

ఏహి! దేవ! సహస్రాక్ష! దేవారి బలసూదన! | ఐరావతస్థ! ధర్మజ్ఞ! శచీ హృదయనందన! || 34

జీవ మావాహయిష్యామి దేవేశ్వర పురోహితమ్‌ |

బృహ స్పతిం బృహ ద్వాచం వేద వేదాంగ పారగమ్‌ || 35

ఏహి! జీవ! మహా భాగ! జీవభూత! మహీతలే | సస్య పృద్ధి స్తవాయత్తా సతతం భూమి వర్ధన! || 36

దేవీ మావాహ యిష్యామి పార్వతీం వరదా ముమాం |

హరస్య దయితాం భార్యాం చార్వంగీం భూతి వర్ధనీమ్‌ || 37

ఏహి! దేవి! జగన్నాధే! మేనా హృదయ నందిని! | పవిత్రే! వరదే! సౌమ్యే నిత్యం భక్తజన ప్రియే! || 38

శుక్ర మావాహయిష్యామి భార్గవం జగదీశ్వరమ్‌ | నిత్యం సర్వజనాధ్యక్షం తపసా ద్యోతిత ప్రభమ్‌ || 39

ఏహి! శుక్ర! మహాభాగ! షోడశార్చి ర్వరప్రద! | ప్రభుస్త్వం వరదాచింత్య! వర్షా వర్షస్య నిగ్రహే || 40

ఆవాహయా మ్యహం దేవం ప్రజాధ్యక్ష మకల్మషమ్‌ | భక్తానుకంపినం దేవం ప్రజానిర్మాణ కారకమ్‌ || 41

ఏహి! దేవ! ప్రజాధ్యక్ష! పూజానిర్మాణ కారక! | త్వయి దేవ! సమాయుక్తం ప్రజానామభవోద్భవమ్‌ || 42

ఏహి! మే భగవన్‌! బ్రహ్మన్‌! ప్రజాపతి మహాద్యుతే |

సౌరి మావాహయిష్యామి శ##నై శ్చారిణ మచ్యుతమ్‌ || 43

తపస్వింన మనాధృష్యం భక్తానా మభయ ప్రదమ్‌ | ఏహి! తీక్ష్నాంశుజాచిన్త! భావాభావ ప్రదర్శక! || 44

త్వయి సర్వం సమాయత్తం రాజ్ఞం భూమౌ శుభాశుభమ్‌ |

ఆవాహయా మ్యహం దేవం గజ వక్త్రం గణశ్వరమ్‌ || 45

విఘ్నేశం విఘ్నహర్తారం పార్వతీ హృదయప్రియమ్‌ | ఏహి! దేవ! గణాధ్యక్ష! లంబోదర! మహాభుజ! 46

కార్యసిద్ధి స్సమాయత్తా త్వయి సర్వేశ ! దేహినామ్‌ ||

రాహుమావాహయిష్యామి దైత్యేశం గ్రహతాం గతమ్‌ || 47

కేశవాప్త వరం వీర! తపసా దగ్ధ కిల్బిషమ్‌ | ఏహ్యేహి! దైత్య ప్రవర! వరదాచిన్త్య విక్రమ! || 48

తపోమూర్తే! దురాధర్ష ! విపరీత చరాంబరే | అవాహయా మ్యహం దేవం విశ్వ కర్మాణ మచ్యుతమ్‌ || 49

సర్వాసాం దేవతానాం తు సదా శిల్ప ప్రవర్తకమ్‌ | ఏహి! దేవవరాచిన్త్య! సర్వ శిల్ప ప్రవర్తక! || 50

త్వయి సర్వైవ సర్వేషాం కర్మణా మాశ్రితా గతిః | కేతు మావాహయిష్యామి కేతుం సర్వదివౌకసామ్‌ || 51

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం భక్తానా మభయ ప్రదమ్‌ | ధూమకేతో! ఇహాభ్యేహి! హుతాశన సమప్రభ! || 52

శిఖా కరాల! వికచ! పూజితాఘ వినాశన! వహ్నే రావాహనం ప్రోక్తం పూర్వ మేవ మయానఘ! || 53

అవాహయిష్యామి శుభాం త్తికాం దేవ పూజితామ్‌ | ఏహి సాధారణ దేవి! జ్యేష్ఠ దక్షసుతే! శుభే! || 54

ప్రజాపతేః తధాప్రోక్తం రోహిణ్యా, శృణు! పార్థివ! |

అవాహయామి వరదాం రోహిణీం చంద్ర వల్లభామ్‌ || 55

ఏహి! రోహాణి! ధర్మజ్ఞే! ధ్రువ కర్మసు శోభ##నే! | చంద్రస్యావాహనం ప్రోక్తమిల్వలాయాః నిబోధ! మే ||

ఆవాహయామి వరాదా మిల్వలాం శశి వల్లభామ్‌ | ఏహి! మే ఇల్వలే! దేవి! మృదు కర్మసు శోభ##నె! || 57

రుద్ర మావాహయిష్యామి త్రినేత్రం శూలపాణినమ్‌ | ఏహి! శంకర ! సర్వాత్మన్‌ ! మహాదేవ! గణశ్వర ! || 58

ఆర్ద్ర మావాహయిష్యామి నక్షత్రం బాహుసంజ్ఞకమ్‌ | ఏహ్యార్ద్రే చారు సర్వాంగి! దారుణ! రుద్రసమ్మతే! || 59

ఆవాహయిష్యా మ్యదితం తపసా దగ్ధ కిల్బిషాం | ఆదిత్యారణి! ధర్మజ్ఞే | ఏహి! దేవి! మహాప్రభే || 60

మార్కంటేయుడనియె. సర్వగ్రహ నక్షత్రావాహన విధానము తెల్పెద. సర్వావాహన పర్యవసానమం దీశ్లోకము కీర్తింపవలయును. తాత్పర్యము. ఈ మండలమందు బ్రవేశించి భక్తితో నేను సమర్పించు నీ అర్ఘ్యము పాగ్యము ధూపము గ్రహింపుము. వాయురజ్జువులచే నిరుద్ధమై (ఆగిపోయిన) భచక్రమును ద్రిప్పుచుండు సర్వగ్రహ గణశ్వరుని శ్రువుని అవాహనము సేయుచున్నాను ఓ ధ్రువ ! ఇటకు దయసేయుము. కేశవా ! సర్వగ్రహాద్యక్ష సర్వలోక వంద్య విచ్చేయుము. దేవదేవుని విష్ణువుయొక్క తృతీయ పాదమయిన విమాన శతాలంకృతమైన ఆకాశమును ఆవాహనము సేయుచున్నాను. సౌమ్యమూర్తి ! ఓనిరాలంబ అంబర రూపతేవతా ! అప్రమేయా ! అతిగంభీరా ! నక్షత్రాలంకృతా ! దయసేయుము. బ్రహ్మదేవుని జగత్పతిని బగత్సృష్టి స్థితి లయ కారకుని ఆవాహనము సేయుచున్నాను. ఓ సర్వప్రజాధ్యక్ష పద్మయోనీ పద్మమందుదయించినవాడా ! చతుర్ముఖ ! వేనమూర్తీ ! వేదాధార ! కాలనిర్మాణ తత్పరా! రమ్ము. అనంతమైన ఊర్థ్వదిక్కునావాహనము సేయుచున్నాను. అది అప్రమేయము నిరాలంబము చంద్ర సూర్యాదులు సంచరించినిది. ఓ మహాభాగా ! సిద్ధసేవితా !అంతులేనిదానా ! విపులా ! నిర్మలా ! హితకారిణీ ! ఓ ఊర్ధ్వదిశా రమ్ము. ధరా భూమ క్షమ వరద భూతధారిణి వసుధా వరాహావతార సముద్థృతా ! సర్వ బీజ ధరా ! భద్రా ! (కల్యాణి) సర్వభూతాపహారిణి ! ఓ పృథ్వీ అవాహనము సేసెద రమ్ము. మహీమండలధారి వణావళింగల రత్నావళీ కాంతిపుంజముచే మిగుల దీపించు శేషుని నిన్నావాహింతునో అనంతా ! ఆదికేశవ మహానుభావ ! విచ్చేయుము. నీవా విష్ణువు యొక్క ఆమేయామేర్తివి సర్పాకార మూర్తివి. అధోదిశను (పాతాళమును) శేషపావితమైన దానిని నాగదైత్య సర్ప గణములు నిరంతరము సేవించు దానిని ఆవాహనము సేయుదుచు. రత్న సమృద్ధా ! శేషపావితా ! గంభీర విపుల భయంకర మూర్తీ! బహుస్థానాలంకృతా ! రమ్ము. వరదుని జాతవేదసుని వేదమూర్తిని వేదాధారుని దేవదేవుని హుతాశనుని ఆవాహించుచున్నాను. సర్వ దేవతలకు ముఖ్యమయిన వాడా ! సర్వమందున్న వాడా ! సర్వ భూత హితా ! మహాభాగా ! సర్వ దేవేశ ! అగ్నే రమ్ము. సహస్ర కిరణుడగు సూర్యం బిలుతును. దివాకరతేజోమూర్తి దురాధర్షా భక్తాభయప్రద !బుగ్యజు స్సామాధిపతీ ! భగవంతుడా ! భక్తానుగ్రహ కరా! సర్వనక్షత్ర పూజిత : మణిప్రకాశుని త్రైలోక్యమండల ద్వీప ! సర్వవ్యాధి వినాశన ఆదిత్యుని దేవుని నిన్నావాహనము సేయుచున్నాను. ఉదకములందుండు వరుణుని స్నిగ్ధ వైడూర్య మణి ప్రకాశు నావాహించుచున్నాను. ఓ జరాధ్యక్ష యా దో గణశ్వర ! నాగ దైత్య సర్పగణ సేవితా దయసేయుము. శీతాంశుని జంద్రుని అమృత ప్రభామూర్తిని ఓషధీశ్వరుని ద్విజాధ్యక్షుని నయనా నంద కరుని నిన్ను ఆవాహనయు చేయుచున్నాను. చంద్ర భగవానుడా ! శశలాంఛన ! సర్వ నక్షత్ర పూజితా ! భక్తానుకంపీ ! దయసేయుము. షణ్ముఖుని వరదుని స్కందస్వామిని శిశువును (కుమారుని) దేవ శత్రుసేనా మథనుని పార్వత్యానంద వర్ధనుని ఆవాహించుచున్నాను. దేవ దేవారాధ్య మహిషాసుర తస్కర ! కార్తికేయ : జగన్నాథ మయూర వాహన రావోయి. భౌముని (కుజుని) తేజోమూర్తిని దురాసదుని (దరిజేర వలను గాని వానిని) రుద్రమూర్తి నిర్దేశింప వలను గానిముఖము గల వానిని రక్త ప్రభుని పిలుచుచున్నాను ఓ భౌమా ! భగవంతుడా ! అంగారక మహాప్రభూ! దయసేయుము. ఈ భూతల మందలి శుభాశుభ ఫలమంతయు నీ యందధీనమై యున్నది.

శంఖచక్రగధాధరుని అతసీకాసుమశ్యాముని బీతవానుని అచ్యుతునిఆహ్వానిచుచున్నాను. దేవదేవేశ! ప్రజానిర్మాణుకారకా! నారాయణ సుదుష్పార ! (అంతుగనరానివాడా) శాశార్జధరా ! దయసేయుము బుధావాహనము సేయుచున్నాను. బోధకుడు (జ్ఞాన ప్రదుడు) జగత్పతి చాంద్రి (చంద్రునికి బుట్టిన వాడు) గ్రహాధ్యక్షుడు తేజోమూర్తి దురాసదుడు. శీతాంశుప్రవవ ! అచింత్య జగమును జయించినవాడా ! జనార్దన ! మహాద్యుతీ ! రమ్ము - దేవగణాధీశ్వరుని నింద్రునావాహనము సేయుచున్నాను. వజ్రపాణి గోబ్రాహ్మణ హితానక్తుడు సహస్రాక్షుడు దేవారి బలమర్దనుడు ఐరావత వాహనుడు శచీహృదయానందనుడు ధర్మజ్ఞుడు నైన ఓ ఇంద్రా! రమ్ము. ఇంద్రపురోహితుని బృహస్పతి వేదవేదాంగ పారగుడు మంచి వక్త ఓజీవా ! మహాత్మా ఆ వనికిఅంతకు జీవమైన వాడ ! సస్యసమృద్ధి నీపై నాధారపడీయున్నది. భూమి వగ్ధన ! రమ్ము. పార్వతీదేవిని అవాహనముసేయు చున్నాను. వరదాత్రి ఉమ హరప్రియపత్ని సుందరాంగి భూతవర్థిని దేవీ ! జగన్నాథే ! మేనాహృదయ నందిని ! రావమ్మా పవిత్రురాల ! వరప్రద ! మంచిదాన ! భక్త జన వత్సల ! రారమ్ము భార్గవుని బిలుతును. సర్వజనాధ్యక్ష శుక్రాచార్య ! తపఃప్రభాభాసుర ; షోడశ జ్యోతిర్మూర్తీ ! వర్షము కురుయుటకు కురియకుcడుటకు నీవు స్వామివి. ప్రజాధ్యక్షుని పరమ నిర్మలుని నిన్ను బిలనుచున్నాను. ప్రజా నిర్మాణకారకుడవు భక్తాసుకంపి రావయ్యా ! ప్రజాపతి నాహ్వానింతునిదిగో ! ప్రజాధ్యక్ష ! రమ్ము. ప్రజానిర్మాణదక్ష ! సౌరిని సూర్య కుమారుని) శని నావాహనింతు. శుభాశుభములు నీయందాధార పడియున్నవి. భావాభావ ప్రదర్శకుడవు నీవు రమ్ము. గజముఖుని గణపతిని వరదుని పార్వతీ ప్రియనందనుని ఆవాహించునున్నాను. లంబోదర ! విచ్చేయుము. దేవుల కార్య సిద్ధి నీపై నాధార పడియున్నది రాహు గ్రహము నావాహింతును. దైత్యపతి గ్రహత్వమందిన వాడు- విష్ణువున కాప్తుడు తపస్సుచే పాపము హరింపచేసికొనినవాడనైన ఓరాహువా ! వరదా రమ్ము. ఆకాశమందు విపరీతముగా సంచరించు వాడవు నీవు. విశ్వకర్మ నావాహింతును. సర్వదేవతలకు శిల్ప విద్యాప్రవర్తకుడవగు నీవు రమ్ము. నీయందు సర్వుల కర్మగతి యాధార పడి యున్నది. సర్వదేవతలకు కేతువయినవాడు(జెండా వంటివాడు) బ్రహ్మణ్యుడు సర్వ ధర్మజ్ఞుడు భక్తాభయప్రదాతయునైన ఔ ధూమకేతువా! బ్రహ్మణ్మడు సర్వధర్మజ్ఞుడు భక్తాభయప్రదాతయునైన యో ధూమకేతువా అగ్ని సమప్రభతో నిలుక రమ్ము విరబోసికొన్న జుట్టుతో భయంకరుడవైన నీవు పూజించువారి పాపముల నశింపజేయువాడవు. అని కేతువుంబూజింపశ##లెను. అగ్ని అవాహన విధానమింతకు మున్ను తెలిపితిని. ఆమీద దేవపూజ్యయగు కృత్తికనావాహనము సేయుదురు. దక్షుని పెద్దకూతురా ! కల్యాణి ! రమ్ము. రోహిణీ నక్షత్రావాహనము ప్రజాపతి ప్రోక్తము, వినుము. చంద్రవల్లభ వరదాత్రి యైన రోహిణిం బిలుతును. ధర్మజ్ఞా ! రోహిణీ ధ్రువ కర్మములందు స్థిరముగా ప్రతిష్ఠింప వలసిన దేవాలయ గృహనిర్మాణాది కార్యములందు శోభనదేవతవు వీవు రమ్మని రోహిణి నావాహనముసేసి పూజింపవలెను. చంద్రుని ఆవాహన విధానమంతయు మున్ను జెప్పితిని. ఇల్వలా దేవి పిలుపు వినుము. వరద యు చంద్రప్రియయునైన యో ఇల్వలాదేవీ ! మృదుకార్యములందు (సంగీతాది కళలు మొదలయన షుకుమార విద్యలందు పనులందు) నీశు శోభన దేవత వని పిలిచి పూజింప వలెను. ఆ మీద రుద్రుని త్రినేత్రుని శూలపాణిని శంకరా ! సర్వాత్మ స్వరూపా ! మహాదేవ గణనాధా ! యని యాహ్వానించి పూజింప నగును. బాహువను పేరుగల అర్ధ్రా నక్షత్రమును ఓ సర్వాంగసుందరి ! రుద్రప్రియ ! దారుణ స్వరూప రమ్మని పిలిచి పూజిపంవలెను. అటుపై నదితిని తపసుచేసి సర్వపాపముల హరించి కొన్నదానవు ఆదిత్యులకు అరణిని నీవు (దేవతలకు దల్లియని భావము) దివ్యప్రభతో దేవీ రమ్మని పిలువ వలెను.

ఋక్షమావాహయిష్యామి ధర్మజ్ఞంతు పునర్వసుమ్‌ | పునర్వసో! ఇహాగచ్ఛ ! చర కర్మ ప్రసాదక ! || 61

జీవస్యావాహనం ప్రోక్తం పుష్యస్యాథ ప్రచక్షతే | పుష్యమావాహయిష్యామి నక్షత్రం క్షిప్ర సంజ్ఞితమ్‌ || 62

ఏహి! పుష్య! మహాభాగ! పోషం వర్ధయ! సర్వతః | సర్పా నావాహయిష్యామి త్రైలోక్యా న్తర గోచరాన్‌ || 63

అయాస్తు సర్వత స్సర్పాః సౌమ్యరూపా భవస్తు చ | ఆవాహయిష్యా మ్యాశ్లేషాం భక్తానాంశ్రీ వివర్ధనామ్‌ ||

అశ్లేషే! త్వ మిహాభ్యేహి! దారుణ! విజయప్రదే! |

పితౄ నావాహయిష్యామి మూర్త్య మూర్తిధరా సహమ్‌ || 65

ఆయాస్తు! పితరః శ్రీఘ్రం సుధా కవ్యభుజోవ్యయాః | మఘా మావాహయిష్యామి ఉగ్ర నక్షత్ర మంజసా ||

ఏహి! మే సుభ##గే! దేవి! మఘే! ఘ వినిషుదనే 7 భగమావాహయిష్యామి పూర్వపల్గున సంజ్ఞితమ్‌ || 67

ఏహి! భాగ్యే! మహాభాగ్యే! ఉగ్ర కర్మ ప్రసాదికే! | ఆవాహయిష్యామ్యర్యవ్ణు మాదిత్యం తేజసాం నిధిమ్‌ || 68

అర్యమం స్త్వం మభ్యేహి! భక్తపాతక నాశన! | ఋక్షమావాహయిష్యామి చోత్తరా ఫల్గునీం శుభామ్‌ || 69

ఏహిత్వం సుభ##గే! దేవి! ధ్రువే! సర్వాంగసుందరి! | అవాహనం మయాప్రోక్తం సవితు ద్దీప్త తేజసః || 70

హస్త మావాహయిష్యామి సావిత్రం క్షిప్ర మంజసా య| ఏహి! సావిత్ర! ధర్మజ్ఞ! భక్తానాం పాపనాశన! || 71

ఆవాహయామ్యహం దేవం త్వష్టారమమిత ద్యుతిమ్‌ | ఏహి! మే భగవన్‌! త్వష్ట్రః! ప్రజాపాలన తత్పర ! ||

చిత్రా మావాహయిష్యామి చిత్రరూపాం మనోహరామ్‌ | ఏహి! మే వరదే! చిత్రే! మృదుకర్మ ప్రసాధిని! || 73

వాయు మావాహయిష్యామి సర్వగం దీప్తతేజసమ్‌ | దేవ! వాయో! త్వ మభ్యేహి! సర్వభూత జగత్ర్పియ! ||

స్వాతి మావాహయిష్యామి నిత్య ముత్తర మార్గగామ్‌ | దేవి! స్వాతే! త్వ మభ్యేహి! చరకర్మసు శోభ##నే ||

ఆవాహయిష్యా మీంద్రాగ్నీ సహితౌ దీప్తతేజసౌ | ఇంద్రాభ్యేహి! జగన్నాధ! ఏహ్యగ్రేవిజయప్రద! || 76

ఋక్షమావాహయిష్యామి విశాఖాం దీప్త తేజసమ్‌ | విశాఖే! త్వ మిహాభ్యేహి! దేవి! సాధారణ శుభే! || 77

మిత్ర మావాహయిష్యామి దేవం దీప్తాంశు మూర్జితమ్‌ | ఏహి! మిత్ర మహాభాగ! భక్తాషు ప్రలయంకర! 78

ఋక్ష మావాహయిష్యామి హ్యనురాధాం వరప్రదామ్‌ | ఆనూరాధే! త్వ మభ్యేహి! మృదుకర్మసు శోభ##నే! 79

శక్రస్యావాహనం ప్రోక్తం జ్యేష్ఠాయాః శృణు పార్థివ! |

జేష్ఠా మావాహయిష్యామి నక్షత్రం శక్రదై వతమ్‌ || 80

జ్యేష్ఠే! దేవి! త్వ మభ్యేహి! దారుణ! చారులోచనే! | దేవ మావాహయిష్యామి దేవం నిరృతిజం ప్రభుమ్‌ ||

ఏహి! దేవ! విరూపాక్ష! మహాబల పరాక్రమ! | మూల మావాహయిష్యమి నక్షత్రం దారుణం మహత్‌ || 82

ఏహి! మూల! మహాభాగ! భక్తానా మభయప్రద! | అపస్త్వా వాహయిష్యామి సర్వగా వరదా శ్శివాః || 83

ఆపస్త్వాయా న్తు వరదాః పవిత్రాః మంగళావహాః | ఋక్ష మావాహయిష్యామి పూర్వాషాఢేతి సంజ్ఞితమ్‌ || 84

ఏహి! త్వముగ్రే! వరదే చాషాఢే పూర్వకే | విశ్వా నావాహయిష్యామి దేవా సధ్భుత తేజసః || 85

ఆయాన్తు వరధా స్సర్వే విశ్వేదేవా మహాబలాః | ఋక్ష మావాహయిష్యామి ఉత్తరాషాఢ సంజ్ఞితమ్‌ || 86

ఏహి! త్వ ముత్తరాషాఢే! సర్వ కర్మసుశోభ##నే! |

బ్రహ్మణ ఆవాహనం ప్రో క్తమభిజితి శృణు! హే ప్రభో! || 87

ఋక్ష మావాహయిష్యామి యత్త దభిజి దుచ్యతే | ఏహి! ధిష్ణ్య పరిష్ఠాద్య! క్షిప్రకర్మ ప్రసాధక ! || 88

విష్ణో రావాహనం ప్రోక్తం శ్రవణస్య నిబోధ మే | ఋక్షమావాహయిష్యామి శ్రవణం సర్వకామదమ్‌ || 89

అశ్వత్థ! త్వం సహభ్యేహి! చర కర్మ ప్రసాధక! | వసూ నావాహయిష్యామి దేవా నష్టౌ వర ప్రదాన్‌ || 90

అయాన్తు వరదా దేవా వసవః పాపనాశనాః | ధనిష్ఠా మావాహయిష్యామి నక్షత్రం రాశివల్లభమ్‌ || 91

ధనిష్ఠే! త్వ మిహాగచ్ఛ! చర కర్‌ ప్రసాధకే! | ఆవాహనం మయాప్రోక్తం వరుణస్య మహాత్మనః || 92

ఋక్షమావాహయిష్యామి నామ్నా శతభిషం శుభమ్‌ | అగచ్ఛ! త్వం శతభిషే! చరకర్మసు శోభ##నే! || 93

ఆజైకపాదం వరదం రుద్రమావాహయామ్యహమ్‌ | అహిర్బుధ్న్య! సమభ్యేహి! జటాజూటోప శోభిత! || 94

ధ్రుప మావాహయిష్యామి దేశే భాద్రపదో త్తరే |

ఏహి! త్వం సుమహాభాగే! మమ భాద్రపదోత్తరే | ఋక్షమావాహయిష్యామి రేవతీం చారుదర్శనామ్‌ || 95

ఏహి! రేవతి! ధర్మజ్ఞే! మృదుకర్మ ప్రాసాధకే! | అవాహయామ్యహం దేవం పూషణం పాపనాశనమ్‌ || 96

పూషన్‌ ! సమ్యగిహాభ్యేహి ! సర్వకర్మ ప్రసాదిత! ఆవాహయామ్యహం దేవౌ నా సత్యౌ సూర్యనందనౌ || 97

ఆగచ్ఛేతాం మహాభాగౌ వరదా వశ్వినా వుభౌ | ఋక్ష మావాహయిష్యామి చాశ్వినీం సర్వకామదమ్‌ || 98

యమ స్యావాహనం ప్రోక్తం భరణీ మధ వై శృణు! |

ఋక్షమావాహయిష్యామి చోగ్రం భరణీ సంజ్ఞకం || 99

అటుపై పునర్వసు నక్షత్రమును చరకర్మములకు సాధకురాల విటురమ్మని పిలువ వలెను. అటుపై గురుగ్రహావాహనము పుష్యమీ నక్షత్రావాహనము చెప్పబడినది. క్షప్రమనుపేరుగల పుష్యమిని ఆవాహింతునని పుష్యమీ! యిటకు విచ్చేసిపుష్టిని పెంపొందింపుమనవలెను. అటుపై సర్పదేవ తాకమయిన ఆశ్లేషను ముల్లోకములందును గానవచ్చు సర్పములను ఆవాహనముసేయుచున్నానని అన్ని తావులనుండి సర్పములు సౌమ్యరూపములయి యిటకు వచ్చుగాక భక్తులకు శ్రీవర్ధనమైన అశ్లేష ను ఆవాహించుచున్నానవి దారుణ మూర్తి మూర్తితోను మూర్తిలేకుండనుండు పితరుల నావాహనముసేయుచున్నానని ఉగ్రనక్షత్రమును (మఘానక్షత్ర మును) ఓ సౌభాగ్యవతి ! అఘవినాశినీ మఘా ! రమ్మని పిలువ వలెను పూర్వ ఫల్గుని యనుపేరుగల భగుని (భగదేవతను) పిలుతునని భాగ్యరూపిణి? మహాభాగా ! ఉగ్రకర్మ సాధకురాలా ! యని పిలువ వలెను. అర్యముని తేజోనిధీయైన ఆదిత్యుని పాపనాశన ! రమ్మని. ఉత్తర ఫల్గుని సర్వాంగసుందరి! రమ్మని పిలువ వలెను. సవిత ఆవాహనము నింతమున్నెరింగించితిని సవితృదేవతాకము (సావిత్రము) హస్తా నక్షత్రమును ఆహ్వానింపవలెను త్వష్టను బిలుచుచున్నానని ప్రజాపాలన తత్పరా! త్వష్ట భగవానుడా రమ్మని పిలువవలెను. సర్వవ్యాపకము తేజస్సంపన్నమునైన నాయువును దేవా ! సర్వ భూత జగత్ర్పియా !రమ్మని పిలువవలెను. నిత్యము నుత్తర దిశను సంచరించు స్వాతిని చరకర్మ సిద్ధినిచ్చు నీవు రమ్మని పిలువవలెను. ఇంద్రాగ్నులిద్దరి నొకరితో నొకడు కలిసిన వారిని తేజస్వులను బిలుచుచున్నానని ఇంద్రా! జగన్నాథ ! దయసేయుము విజయప్రదా ! యని విశాఖను మహాతేజస్వినివిశాఖను నీవిటకు రమ్మని పిలువ వలెను. మిత్ర దేవతను బిలుచుచున్నానని మంచి తేజస్సుతో నిండి భక్తపాపప్రలయంకరా ! రమ్మని మృదుకర్మ శోభనయైన మిత్రదేవతాకయైన యనూరాధ నాహ్వానింపవలెను జ్యేష్టానక్షత్రా వాహనమందు శక్రు నావాహనము సేయవలెను. ఇంద్ర దైవత్యమయిన జ్యేష్ఠను జేష్ఠా దేవి ! దారుణురాల ! సునేత్ర ! నీవురమ్మని పిలువ వలెను. నైరృతి ప్రభువును ఓ విరూపాక్ష ! మహాబల పరాక్రమ! రమ్మని మూలనాహ్వానింతునని కడుదారుణమైన భక్తాభయప్రదవని మూలా నక్షత్రమం బిలువవలెను. సర్వత్ర పరదలై మంగళ ప్రదలైన యబ్దేవతలు వత్తురు గాక యని పిలిచి పూర్వాషాఢా నక్షత్రమును నీవు ఉగ్రరూపిణివి వరప్రదాత్రివి రమ్మనవలెను. అద్భుత తేజశాలురైన విశ్వేదేవతలంబిలుతునని మహా బలశాలురు విశ్వేదేవులు వత్తురుగాక యని ఉత్తరాషాఢా నక్షత్రమును సర్వకర్మ శోభనవని పిలువవలెను. అభిజిత్తునందు బ్రహ్మను పిలువలెను. అభిజిన్నక్షత్రమా! నీవు(ధీష్ణ్య) భాగ్యపరిష్ఠవు శీఘ్రకార్యసిద్థిప్రదవని ఆవాహింపవలెను. శ్రవణమునకు విష్ణువుం బిలువవలెను సర్యకామప్రదయయిన శ్రవణమును బిలువవలెను. ఓ అశ్వత్థమా ! నీవు చరకర్మ ఫలసిద్ధిప్రదవు రమ్మనవలెను. అష్టవసువులు పరప్రదాతలు పాపనాశనులు దయచేయుదును గాక యని ధనిష్టానక్షత్రమందు రాశివలభ్దమైనదానిని ధనిష్టా ! చరకార్య సిద్ధిప్రదవీవిటు రమ్మనవలెను. వరుణుని యావాహన విధానము మునుపు చెప్పితిని. వరుణ దైవత్యమైన శతభిష నక్షత్రమును చరకర్మ సిద్ధిదవని ఆవాహనముసేయవలెను. అజైకపాదుని వరదుని రుద్రుని బిలుతునని చెప్పి అహిర్బుధ్న్య! జటాజూటోపశోభితా! అని పూర్వాభాడ్రనుబిలువ వలెను. ధ్రువుని బిలుతునని మహానుభావురాలా ! యని ఉత్తరాభాద్రను బిలువవలెను. చక్కనిదైనను రేవతిని మ్భదుకర్మ శోభన దేవతవు రమ్మని అమున్ను తదధి దైవతకు పూషణుని సర్వకర్మ సాధకుడవు రమ్మని పిలువవలెను. అవ్వలనానత్యులను (అశ్వనీదేవతలను) సూర్యకుబారులను మహాభాగులు మీరిద్దరును రండని పిలిచి సర్వకామప్రద యగు అశ్వినీ నక్షత్రమును ఆవాహనము సేయవలెను అటుపై యమదేవతాహ్వానము భరణి నక్షత్రావాహనమొనరింపవలెను. ఉగ్రనక్షత్రమైన భరణి ని నీవు అందగత్తెవు చక్కగ గనిపింతువని పిలువవలెను.

ఏహి! త్వందేవి! భరణి! సుభ##గే! చారుదర్శిని! | శక్రస్యావాహనంప్రోక్తంపూర్వ మేవ మయా నృప! || 100

ప్రాచీ మావాహయిష్యామి సూర్యోదయ విభూషితమ్‌ | ఏహి! త్వం వరదే! పూర్వే! శుభకర్మ ప్రసాధికే! ||

వహ్నే రావాహనం ప్రోక్తం పూర్వ మేవ మయా తవ |

దిశ మావాహయిష్యాసు వరదాం పూర్వ దక్షిణామ్‌ || 102

వహ్నిప్రియే! న మభ్యే హి! వరదే పూర్వదక్షిణ! |

యమ స్యావాహనం ప్రోక్తం యామ్యాయాశ్చ దిశ శ్శృణు || 103

అహమావాహయిష్యామి దక్షిణాం దిశమ్‌ | దక్షిణ! త్వంసమభ్యేహి సర్వకర్మసు శోభ##నే! || 104

పూర్వమావాహనం ప్రోక్తం విశ్వరూపస్య ధీమతః | దిశ మావాహయిష్యామి శుభాం దక్షిణ పశ్చిమామ్‌ ||

ఏహి! మే నైరృతీ దేవి! సతతం భూత వర్ధిని | ఆవాహనం మయా ప్రోక్తం వరుణస్య మహాత్మనః || 106

దిశమావాహయిష్యామి వారుణీం వరుణీం శుభామ్‌ | ఆగచ్ఛ పశ్చిమే దేవి! వరదే! వరుణప్రియే! || 107

ఆవాహనం మయా ప్రోక్తం వాయోశ్చైవ మహాత్మనః |

ఆవాహయామి విదిశం వాయవ్యాం పశ్చిమోత్తరామ్‌ || 108

వరదే! త్వం నమభ్యేహి! వాయవ్యే పశ్చిమోత్తరే | ఆవాహయామి ధనదం దేవం దైశ్రవణం ప్రభుమ్‌ ||

రాజ రాజ! స మభ్యేహి! సర్వయజ్ఞ! ధనాధిప! | దిశ మావాహ యిష్యామి సౌమ్యాం ధనద పాలితామ్‌ || 110

ఉత్తరే త్వం స మభ్యేహి! సర్వ కర్మసు శోభ##నే! |

దేవస్యావాహనం ప్రోక్తం త్ర్యంబకస్య మహాత్మనః || 111

దిశ మావాహయిష్యామి శుభాం ప్రాగుత్తరా మహమ్‌ | ఏహి త్వం సుభ##గే! దేవి! సతతం శివ పాలితే || 112

శక్రుని (ఇంద్రుని పిలువుమని దెల్పితిని. సూర్యోదయముచే విభూషితమైన తూర్పుదిగ్దేవతను నీవు వరదవు శుభకర్మ ప్రసాధకురాలవని పిలువవలెను. అగ్ని యొక్క ఆవాహన మింతకుమున్ను దెల్పితిని. పూర్వదక్షణ దిశను (ఆగ్నేయమును మూలను) అగ్ని ప్రియా! వరదా! పూర్వదక్షిణ దిశా! రమ్మని ఆవాహనము సేయవలెను. దక్షిణదిశకు యముని బిలువవలెను. నేనందరియందు దక్షిణ=సమప్రీతి దక్షిణదిశను సర్వకర్మ శోభన దేవతను బిలువవలెను. విరూపాక్ష దేవతావాహన మింతకుమున్ను జెప్పితిని. నిరంతరైశ్వర వర్ధిని రమ్మని నిరృతిని బిలువవలెను. వరుణు నాహ్వానము దెల్పియున్నాను. వరుణ దిక్కును (పడమటి దిశను) శుభ ప్రదవు వరుణుని ప్రయురాలవు రమ్మని పిలువవలెను మహాత్ముడగు వాయుదేవుని యావాహనము లోగడ జెప్పియున్నాను. వరదు రాలా! పశ్చిమోత్తర దిగ్దేవతా! వాయవ్యవి దిగ్దేవతా రమ్మని పిలువవలెను. ధనదుని వైశ్రవణుని (విశ్రవసుడనుప్రజాపతికొడుకును) ప్రభువును రాజరాజ! సర్వయజ్ఞ ధనములకును ప్రభువు వీవు రమ్మని కుబేరునింబిలిచి కుబేరపాలితయగు సౌమ్యదిశను (ఉత్తర దిక్కును) సర్వకర్మ సుశోభనవు రమ్మని పిలువవలెను. అవ్వల త్ర్యంబక దేవుని ఆవాహనము చెప్పబడినది. ప్రాగుత్తర దిశను (ఈశ్యాదిక్కును) శుభప్రదయైన దానిం బిలుతునని శివపాలిత దిగ్దేవతా! యని సంబోధింప వలెను.

సర్వా నావాహయిష్యామి పూర్వకుంభేషు సాగరాన్‌ | రత్నాధ్వక్షాః సమాయా న్తు చత్వార ఇహ సాగరాః ||

ఈశాన్యాం దిశి యః కుంభః పూర్వస్తస్య సాగరః | అగ్నేయ్యాంతు సమాయాతు దక్షిణ శ్శివః ||

పశ్చిమస్తు సమాయాతు కుంభే దక్షిణ పశ్చిమే | ఉత్తరశ్చ తదాభ్యేతు కుంభే వై పశ్చిమోత్తరే || 115

ఆవాహితానాం కర్తవ్యం భూమౌకృత్వా తతశ్శిరః | ప్రణామ మభివాద్యంచ తథో మంత్ర ముధీరయేత్‌ || 116

భవతాం హి ప్రసాదేన భవతాం ప్రతిపూజనైః |

ప్రయతిష్యే యథాశక్త్యా తన్మేసుజ్ఞాతు మర్హథ || 117

యుష్మాకం పూజనం కర్తుం కేన శక్యం యధా విధి|

యుష్మత్పూజావిహీనేన కుతో లభ్యం మహత్పదమ్‌ || 118

తతః కర్తుం యధా శక్త్యా భవతాం ప్రతిపూజనే |

వరదాః ప్రయతిష్యామి తన్మే నుజ్ఞాతు మర్హథ ! || 119

భవత్పూజావిధా వస్మిన్‌ బహువిజ్ఞం సదై వతు |

స్వాం స్వాం దిశ మధిష్ఠాయ దిక్పాలాః దీప్త తేజసః || 120

ఉత్పాదయన్తు సకలాన్‌ విఘ్నాన్మే సముపస్థితాన్‌ |

అస్మా ద్దేశాత్‌ ప్రణశ్యన్తు యజ్ఞఘ్నా బ్రహ్మరాక్షసాః || 121

వినాయకా విఘ్నకరా మహోగ్రా యజ్ఞద్విషో యే పిశితాశనాశ్చ |

సిద్ధార్థకై ర్వజ్రసమానికల్పై ర్మయా నిరస్తాః సృగృహం ప్రయాన్తు || 122

ఏతావ దుక్త్వా వికిరేత విద్వాన్‌ సిద్ధార్ధకా దిక్షు తధా విదిక్షు |

రక్షోగణం చాత్ర తధైవ మంత్రం వక్తవ్య ముచ్చైర్ద్విజ పుంగవేన || 123

సర్వ గ్రహాణాం యజనే ప్రదిష్టం సర్వౌషధై స్న్నాన మదీన సత్త్వ! |

బీజైస్సమగ్రైశ్చ తధైవ గంధైఃమృద్భిశ్చ రత్నెశ్చ తధా జలైశ్చ || 124

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహరావాహన మంత్రాధ్యాయో నామ పంచననతి తమోధ్యాయః

మండలము నలుమూలలందు నిలిపిన పూర్ణకుంభములందు సర్వ సాగరములను; అవాహనము సేయవలెను. ఈశాన్య దిశనున్న పూర్ణకుంభమున తూర్పు సముద్రము ఆగ్నేయదిశ కుంభమందు దక్షిణ సముద్రము నైరృతి మూల నున్న కుంభమందు పశ్చిమ సముద్రమును వాయవ్యమూల కుంభమందు ఉత్తర సముద్రమును వచ్చుగాక! యని సముద్రముల నావాహనముసేసి; మీ ప్రసాదముచే మీ మీ పూజలం యథాశక్తి ప్రయత్నించుచున్నాను. దాని ననుమతింపుము. మీపూజ యథావిధిగ జేయ నెవ్వని తరమగును? మీపూజసేయని వానికి మహాపదవి (స్థానము) ఎట్లు లభించును? అందువలన యథాశక్తి మీరు వరదులగునట్లు పూజింప యత్నించుచున్నాను. అందు నాకు మీరనుజ్ఞ దయసేయుడు. ఈ మీ పూజివిధి యందెల్ల వేళల పెక్కుమంది తెలిసిన పండితులున్న యీపూజయందు తమతమ దిక్కులందున్న దిక్పాలురు దీప్త తేజస్కులు, నాకుగల్గు విఘ్నములన్నిటిని దొలగింతురు గాక! యజ్ఞఘాతకలు బ్రహ్మరాక్షసు లీ ప్రదేశమునుండి తొలగిపోవుదుకుగాక! వినాయకులు విఘ్నుకరులు మహోగ్రులునయిన యజ్ఞద్వేషులు పిశితాళనులు (మాంసభక్షకులు రాక్షసులు) ప్రజాయుధముతో సమానమునైన యీ అవాలచేత (సిద్ధార్థము=అర్థసిద్ధదమ్ము) నాచేత నిరస్తులై తమ యింటికి పోవుదురు గాక! అని పలికి యజ్ఞ విధిజ్ఞుడైన యజమాను డావాలను ఎనిమిది మూలలం జల్లవలెను. బ్రహ్మణపుంగవుడు రక్ష్రోఘ్నమంత్రమును గూడ గట్టిగా పఠింపవలెను. సర్వగ్రహయజ్ఞములందు సర్వౌషధులతో స్నానము చెప్పపడినది. సర్వబీజములు గంధమును పుణ్యమృత్తికలు రత్నములు నింపిన జలములచే నదివివాతమైనది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున గ్రహనక్షత్రావాహన మంత్రాధ్యాయమను తొంబది యైదవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters