Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదితొమ్మిదవ అధ్యాయము - గ్రహనక్షత్ర దేయాదేయవిధి

మార్కండేయ ఉవాచ :

ధ్రువస్థాన నివిష్టానాం దేవతానాం నరాధిప! | దధ్యోదనం పాయసంచ ప్రత్యేకం వినివేదయేత్‌ || 1

గుడౌదనం గుడాపూపాః ఫలాని గుడపాయసమ్‌ | నివేదనం తు సూర్యాయ ధాన్యలాజే మధూత్కలే || 2

సర్పి ర్దధ్యోదనం చైవ ఫలాని వివిధాని చ | మోదకాని చ ముఖ్యాని పాయసం శశిన స్తథా || 3

గుడౌదనం గుడాపూపా యావకం గుడ పాయసమ్‌ | కృసరం చ తధా దేయం భూమిపుత్రాయ పార్థివ! 4

క్షీరౌదనం స సర్పిష్కం క్షీర వృక్ష ఫలానిచ | క్షీరిణ్య శ్చ తధౌషధ్యో సోమ పుత్రాయ దాపయేత్‌ || 5

శింబిధాన్య వికారాణి బిల్వా న్యామలకాని చ | ఘృతౌదనం చ జీవాయ దాతవ్యం భూతి మిచ్ఛతా || 6

దధ్యోదనం పాయసం చ మధునా సర్పిషాయుతమ్‌ | ఉత్పారికం మోదకాంశ్చ భార్గవాయ నివేదయేత్‌ || 7

మాషౌదనం సనర్పిష్కం కృసరం దధి యావకమ్‌ | నివేదయేత్తు సౌరాయ కులుత్థం చణకైస్సహ || 8

ప్లక్షం దథిత్థంచ తధా పలలం చైవ రాహవే | మాషౌదనం తధా దేయం యవాపూపాం స్తధైవచ || 9

తల్లోపికా స్తధా మత్స్యాః కేతవే కృసరం తధా | వసా నర్పీంషి చ తధా దేయాని మనుజేశ్వర! || 10

మధులాజే కృత్తికానాం కుల్పాసం దధి సర్పిషీ | రోహిణీనాంచ బీజాని దధి పిష్ట వృషాణి చ || 11

దధ్యోదకం చేల్వలానాం మృగ మాంసం తధైవచ | రుధిరం కృసరం చోభౌ రౌద్రస్య వినివేదయేత్‌ || 12

పునర్వసోః ప్రదాతవ్యం పలలం సలిలాయనమ్‌ | పాయసంచ ససర్పిష్కల తిష్యాయ వినివేదయేత్‌ || 13

పిష్ట సర్పాణి సార్పస్య క్షౌద్రం దధియుతం తధా | తిలౌదనం స పలలం పెత్ర్యస్య వినివేదయేత్‌ || 14

షష్టికాన్నంచ భాగ్యస్య మధు సర్పీంషి చాప్యథ | ఆర్యవ్ణూయ తిలా పూపాన్‌ షష్టికాన్నం తధై వచ || 15

ప్రియంగు తండులై స్సిద్ధం సావిత్రాయచ పాయసమ్‌ |

త్వాష్ట్రస్య చైవ పీయూషం ద్విజా చిత్రాండజా స్తధా || 16

వాయప్యస్యచ ఫల్గూని మూలకాని శుభాని చ | కులత్థాని విశాఖాసు యవాపూపా స్తధైవచ || 17

కులత్థ భక్తం మిత్రాయ దధి క్షౌద్రాన్వితం తధా | ఘృతౌదనం చ శాక్రాయ ఫలాని వినిధాని చ || 18

మూలాని చ విచిత్రాణి తధా మూల ఫలాని చ | ఆప్యస్య సక్తవో దేయాః మధు మిశ్రోదకై స్సహ || 19

సక్తవో పైశ్వదేవాయ మధులాజే తధైవ చ | బ్రాహ్మాయ పాయసం దేయం సగుడం భూతి మిచ్ఛతా || 20

దధ్యోదనం పాయసం చ వైష్ణ వాయ నివేదయేత్‌ | ఘృతోదకంచ శాకాని వాసవాయ నివేదయేత్‌ || 21

పైష్టం బిడాలం శాకాంశ్చ వారుణాయ తధా దధి |

ఆదాయ మాంస మాజం తు వ్యాఘ్రం పిష్టకృతం దధి || 22

ఆహిర్బుధ్న్యాయ మాంసాని తధై వచ రసౌదనమ్‌ | పౌష్ణాయ సక్తవో మాషా మాసయుక్తాశ్చస క్తవః || 23

అశ్వం పిష్టకృతం మాషాన్‌ యావకంచ తధా దక్షి | ఆశ్వినస్యాథ యామ్యస్య తండులాని తిలాని చ || 24

రాజన్‌! పైష్టాశ్చ పశవో మాంసం పక్వామకం తధా |

పాయసం సఘృతం క్షౌద్రం పూర్వస్యాం వినివేదయేత్‌ || 25

ఆగ్నేయ్యాం దిశి రాజేన్ద్ర! కృసరం క్షీర మిశ్రితమ్‌ | దక్షిణస్యాంచ దాతవ్యం కృసరం తైల మిశ్రితమ్‌ ||

నైరృత్యాంచ ప్రదాతవ్యం కృసరం మత్స్య సంయుతమ్‌ |

కుల్మాషాంశ్చైవ మత్స్యాంశ్చ పశ్చిమస్యాం నివేదయేత్‌ || 27

వాయవ్యాయాశ్చ మత్స్యాని తధా క్షిరోదనాని చ | ఐశాన్యాయాః ప్రదాతవ్యౌ ఘృతక్షిరోదనా పుభౌ || 28

మోదకోల్లోపికా మిశ్రాః సాగరాణాం బిలిర్భవేత్‌ || 29

యద్యద్రహస్యాభిహితం మయాత్ర ఋక్షస్యవా భూమిపతిప్రధాన!

తద్దేవతాయాశ్చ తదేవందేయం దిశ స్తధా నాత్ర విచారణాస్తి || 30

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహర్ష్య నైవేద్య దేయాదేయ విధిర్నామ నవసవతి తమోధ్యాయః

మార్కండేయుడనియె. ధ్రువస్థానమందున్న దేవతలకు దధ్యోదనము పాయసము ప్రత్యేకముగ నివేదింపవలెను. గుడాన్నము (బెల్లపు అన్నము) బెల్లపు అప్పాలు పండ్లు బెల్లపు పాయసము సూర్యునికి నివేదనీయములు. తేనెతో తడిపిన ధాన్యపు పేలాలు నెయ్యి దధ్యోదనము పండ్లు పలురకములు మోరకములు పాయసము చంద్రునికి నివేదనీయములు. గుడాన్నము గూడా పూపములు యవబియ్యముతోడి బెల్లపు పాయసము క్పసరము = పిలగము భూమిసుతసకుచితము. క్షీరాన్నము ఆవునేతితో క్షీరపృక్షఫలములు పాలుగల ఓషధులు బుధునికి నివేదనయములు శించిధాన్న వికృతులు బిల్యములు(మారేడు పండ్లు) ఉసిరీపండ్డు నేయన్నముగురునికి అర్హము. భూతిప్రదము. శుక్రునికి దధ్యోదనము తేనెతో ఆవునేతితోడి పాయసము ఉత్కారికము =బిళ్లమడుము మోదకములు శుక్రునికి నివేదింప నగును. మాషౌదనము (మినపన్నము) ఆవునేతితో క్పసరముపెఱుగుయావకాన్నము శనికి దగినది. సెనగలతో ఉలవలయన్నము ప్లక్షము పెఱుగులోని పలలము రాహువునకు దగును. మాషాన్నమూ యవలపిండితోజేసిన అప్పములు లోవికలు మత్స్యములు కృసరము కేతువున కర్హములు.

వస నెయ్య తేనె పేలాలు కృత్తికలకు. భరణికి కుల్సాషము =కాలుమినుముపెఱుగునెయ్యి రోహిణికి బీజములు పెఱుగు పిండి వృషములు =మూషికములు మ్భగశిరకు దధ్మోదకము మృగమాంసము రుధిరము (రక్తము, క్పసరము అర్ద్రకు పునర్వసువునకు=మాంసము తిష్యమునకు (పుష్టమికి) నేతితో పరమాన్నము ఆశ్లేషకు పిష్టసర్పములు (పిండితోజేసిన పాములు) పెఱుగుతో తేనె మృఘకు మాంసముతోగూడ తిలాన్నము పుబ్బకు షష్టికాన్నము తేనె నెయ్యి (షష్టికలను భియ్యము) ఉత్తరఫల్గుణ అర్యవ్ణుడునకు తిలాపూపములు షష్టికాన్నము హస్తకు ప్రియంగు తండులతోడి పాయసము త్వాష్ట్రమునకు (చిత్రకు) పీయూషమూ (మీగడ) చిత్రాండజములు వాయువ్యమునకు (స్వాతికి) ఫల్గువులు = బొమ్మమేడి మూలకమలు = =ముల్లంగివిశాఖకు కులుత్ధములు. ఉలవలు యవాపూపములు. అణూరాధకు కులత్థాన్నము తేనె పెఱుగుతో జ్యేష్ఠకు ఘృతాన్నమూ వివిధ ఫలములు మూలకు విచిత్రములైన దుంపలు పండ్లు సక్తువు తేనెతోడి యుదకముతో పూర్యాషామ సక్తువు తేనె పేలాలు ఉత్తరాషాడకు పాయసము బెల్లముతో, శ్రవణమునకు బెల్లపు పాయసము ధనష్టదకుధ్యోదనము పాయసము శతభిషమునకు ఘృతోదనము కూరలు పూర్వాబాద్రనుపైష్ట బిడాలము శాకములు పెరుగు ఉత్తరాభాద్రకు మేకమాంసముపిండతో జేలస్ధ పులి ఉత్తరాభాద్రకు మాంసము రసౌదనము రేవతికి సక్తువు మినుముతోడి సక్తువు గారెలు పిండితో జేసిన అశ్వము మినప వడలు యావకము పెఱుగు అశ్విని, భరణికి బియ్యము, నువ్వులు; పిష్జపశూవులు మాంసము పక్వామకము -- పాయ ము నెయ్యి తేనె తూర్పుదిశకు. ఆగ్రేయమునకు పాలుతోడి కుల్మాసములు చేపలు వాయవ్యమునకు చేపలు క్షీరాన్నము ఘృతక్షిరోదనము మశాన్న దిశకూ సమర్పింపనగును ఉల్లోపికములతో మిశ్రములైన మోదకములు పాగరములకు బలి వేయవలెను. గ్రహమునకు నక్షత్రమునకేదేది నేను జెప్పితినో తత్తద్దేవతకు దిక్కులకునదే నివేదింపవలెను. ఇందు మఱి విమర్శింప పనిలేదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున గ్రహనక్షత్ర దేయాదేయవిధియను తొంబదితొమ్మిదవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters