Sri Koorma Mahapuranam
Chapters
అష్టాదశో7ధ్యాయః అధవంశానుకీర్తనమ్ సూతఉవాచ :- బలేః పుత్రశతం త్వాసీ న్మహాబలపరాక్రమమ్ | తేషాం ప్రధానో ద్యుతిమాన్ బాణో నామ మహాబలః ||
|| 1 || సో7తీవ శంకరే భక్తో రాజా రాజ్య మపాలయత్ | త్రైలోక్యం వశ మానీయ బాధయామాస వాసవమ్ ||
|| 2 || తతః శక్రాదయో దేవా గత్వోచుః కృత్తివాససమ్ | త్వదీయో బాధతే హ్యస్మా న్బాణో నామ మహాసురః ||
|| 3 || వ్యాహృతో దైవతైః సర్వై ర్దేవదేవో మహేశ్వరః | దదాహ బాణస్య పురం శ##రేణౖకేన లీలయా ||
|| 4 || ఆ బలికి గొప్పబలపరాక్రమములుకల నూరుగురు కుమారులుండిరి. వారందరిలో ముఖ్యుడు తేజోవంతుడు, గొప్పబలవంతుడుఐన బాణుడనువాడు. (1) అతడు శంకరుని యందెక్కవ భక్తికలరాజుగా తనరాజ్యమును పాలించెను. మూడులోకములను తనవశముచేసికొని దేవరాజైన ఇంద్రుని బాధించెను. (2) తరువాత ఇంద్రుడు మొదలగు దేవతలందరు శంకరునివద్దకు వెళ్లి యిట్లు పలికిరి. ప్రభూ! మీ భక్తుడైన బాణుడను గొప్ప అసురుడు మమ్ములను బాధించుచున్నాడు. (3) దేవతలకు దేవుడైన ఆపరమేశ్వరుడు దేవతలందరిచేత అట్లు ప్రార్థింపబడినవాడై, ఒక్కబాణముచేతనే విలాసముగా బాణుని పట్టణమును కాల్చివేసెను. (4) దహ్యమానే పురే తస్మి న్బాణో రుద్రం త్రిశూలినమ్ | య¸° శరణ మీశానం గోపతిం నీలలోహితమ్ ||
|| 5 || మూర్థ న్యాధాయ తల్లిఙ్గం శామ్భవం రాగవర్జితః | నిర్గత్య తుపురాత్తస్మా త్తుష్టావ పరమేశ్వరమ్ ||
|| 6 || సంస్తుతో భగవా నీశః శంకరో నీలలోహితః | గాణపత్యేన బాణం తు యోజయామాస భావతః ||
|| 7 || అథైవం చ దనోః పుత్రా స్తారాద్యా శ్చాతిభీషణాః | తార స్తథా శమ్బరశ్చ కపిలః శంకర స్తథా ||
|| 8 || స్వర్భాను ర్వృషపర్వా చ ప్రాధాన్యేన ప్రకీర్తితాః | సురసాయాః సహస్రం తు సర్వాణా మభవ ద్ద్విజాః ||
|| 9 || తనపట్టణము కాల్చబడుచుండగా చూచి ఆ బాణుడు త్రిశూలధారి, నీలలోహితుడు, గోవులకు పతి, ఈశ్వరుడును అగురుద్రుని శరణము కోరెను. (5) కోరికలను వదలినవాడై బాణుడు, శివసంబంధియైన ఆ లింగమును తలపై ధరించి ఆపట్టణమునుండి వెలుపలికి వచ్చి పరమేశ్వరుని స్తోత్రము చేసెను. (6) అట్లుబాణునిచేత స్తుతింపబడిన భగవంతుడు, నీలలోహితుడు, ప్రభువు అగు శంకరుడు, గణపతిదేవతగా కల బాణమును సంకల్ప బలముతో ప్రయోగించెను. (7) తరువాత ఈవిధముగా మిక్కిలి భయంకరమైన తారుడు, శంబరుడు, కపిలుడు, శంకరుడు, (8) స్వర్భానువు, వృషపర్వుడు అనువారు దనువుకు కుమారులుగా ప్రధానులుగా చెప్పబడినారు. ఓ బ్రాహ్మణులారా! సురస అను నాగమాతకు వేయిసంఖ్యగల సర్పములు సంతతిగా కలిగెను. (9) అనేకశిరసాం తద్వ త్ఖేచరాణాం మహాత్మనామ్ | అరిష్టా జనయామాస గంధర్వాణాం సహస్రకమ్ || || 10 || అనన్తాద్యా మహానాగాః కాద్రవేయాః ప్రకీర్తితాః | తామ్రా చ జనయామాస షట్కన్యా ద్విజపుంగవాః || || 11 || శుకీం శ్యేనీంచ భాసీంచ సుగ్రీవాం గ్రన్థికాం శుచిమ్ | గా స్తథా జనయామాస సురభి ర్మహిషీ స్తథా || || 12 || ఇరా వృక్షలతావల్లీ తృణ జాతీశ్చ సర్వశః | తథావై యక్షరక్షాంసి ముని రప్సరసస్తథా || || 13 || రక్షోగణం క్రోదవశా జ్జనయామాస సత్తమాః | వినతాయా శ్చ పుత్రౌ ద్వైప్రఖ్యాతౌ గరుడారుణౌ || || 14 || అరిష్టఅనునామె అదేవిధముగా అనేక శిరస్సులు కలిగిన, ఆకాశసంచారులు, మహాత్ములును అగు వేయిమంది గంధర్వులను సంతానముగా పొందెను. (10) అనంతుడు మొదలగు గొప్పనాగులు కద్రువు సంతానముగా ప్రసిద్ధులు. బ్రాహ్మణవర్యులారా! తామ్ర అనువనిత ఆరుగురు కన్యలను పొందెను. (11) శుకి, శ్యేని, భాసి, సుగ్రీవ, గ్రంథిక, శుచి అని ఆ కన్యల పేర్లు. సురభి గోవులను, మహిషులను సంతతిగా పొందినది. (12) 'ఇర', వృక్షములను, తీగలను, తృణజాతిమొక్కలను అంతట ప్రసవించెను. 'ముని' యను స్త్రీ యక్షులను, రాక్షసులను, అప్సరసలను కనెను. (13) కోపకారణమునరాక్షస సమూహమును జన్మింపజేసెను. వినతాదేవి కుమారులు గరుడుడు, అరుణుడు అనువారు ప్రసిద్ధులు. (14) తయోశ్చ గరుడో ధీమాం స్తప స్తప్త్వా సుదుశ్చరమ్ | ప్రసాదా చ్ఛూలినః ప్రాప్తో వాహనత్వం హరేః స్వయమ్ || || 15 || ఆరాధ్య తపసా దేవం మహాదేవం తథారుణః | సారథ్యే కల్పితః పూర్వం ప్రీతేనా ర్కస్య శమ్భునా || || 16 || ఏతే కశ్యపదాయాదాం కీర్తితాః స్థాణుజఙ్గమాః | వైవస్వతే7న్తరే హ్యస్మిం ఛృణ్వతాం పాపనాశనమ్ || || 17 || సప్తవింశసుతాః ప్రోక్తాః సోమపత్న్యశ్చ సువ్రతాః | అరిష్టనేమిపత్నీనా మపత్యానాం హ్యనేకశః || || 18 || బహుపుత్రస్య విదుష శ్చతస్రో విద్యుతః స్మృతాః | తద్వ దంగిరసః శ్రేష్ఠా ఋషయో వృషసత్కృతాః || || 19 || వారిలో బుద్ధిమంతుడగు గరుడుడు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సునుచేసి శివునియొక్క అనుగ్రహము వలన విష్ణువునకు వాహనముగా పదవిని పొందినాడు. (15) అట్లే అరుణుడుకూడ తపస్సుతో మహాదేవుని పూజించి, పూర్వము సంతోషించిన అతనిచేత సూర్యునికి సారధి పదవిలో నియమించబడినాడు. (16) కశ్యప ప్రజాపతి వంశజాతులైనవీరు, స్థావర జంగమరూపులు నాచేత తెలుపబడినారు. ఈవైవస్వతమన్వంతరములో వినువారి పాపములను నశింపజేయునది ఈ వృత్తాంతము. (17) మంచి నియమము కలిగిన చంద్రుని భార్యలు ఇరువది యేడుమంది కూతుళ్లు చెప్పబడినారు. అరిష్టనేమి భార్యలయొక్క సంతానము యొక్క, చాలామంది పుత్రులు కలిగిన పండితునియొక్క నలుగురు విద్యుత్తులు, అదే విధముగా శ్రేష్ఠులు, ఇంద్రుని చేత సత్కరింపబడిన ఋషులు కూడ అంగిరసునికి కలిగిరి. (18, 19) కృశాశ్వస్య తు దేవర్షే ర్దేవః ప్రహరణః సుతః | ఏతే యుగసహస్రాన్తే జాయన్తే పున రేవ హి || మన్వన్తరేషు నియతం తుల్యకార్యైః స్వనామభిః || || 20 || ఇతి శ్రీ కూర్మపురాణ వంశానుకీర్తనం నామ అష్టాదశో7ధ్యాయః. దేవతల ఋషిఅయిన కృశాశ్వునికి ప్రహరణుడను దేవ కుమారుడు జన్మించినాడు. వీరు వేయి యుగాల తరువాత మరల కూడ జన్మిస్తారు. ఆయా మన్వంతరాలలో తమపేర్లతో, సమానమైన కార్యములతో నియతముగా జన్మింతురు. (20) శ్రీ కూర్మపురాణములో వంశానుకీర్తనమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.