Sri Koorma Mahapuranam
Chapters
ఏకోనవింశోధ్యాయః అధ ఋషివంశకధనమ్ సూత ఉవాచ :- ఏతా నుత్పాద్య పుత్రాం స్తు ప్రజాసన్తానకారణాత్ | కశ్యపః పుత్రకామ స్తు చచార సుమహ త్తపః ||
|| 1 || తసై#్యవం తపతో7త్యర్థం ప్రాదుర్భూతౌ సుతావిమౌ | వత్సర శ్చాసిత శ్చైవ తావుభౌ బ్రహ్మవాదినౌ ||
|| 2 || వత్సరా న్నైధ్రువో జజ్ఞే రైభ్య శ్చ సుమహాయశాః | రైభ్యస్య జజ్ఞిరే శూద్రాః పుత్రాః శ్రుతిమతాం వరాః ||
|| 3 || చ్యవనస్య సుతా భార్యా నైధ్రువస్య మహాత్మనః | సుమేధా జనయామాస పుత్రాన్వై కుణ్డపాయినః ||
|| 4 || అసితసై#్య కపర్ణాయాం బ్రహ్మిష్ఠః సమపద్యత | నామ్నా వై దేవలః పుత్రో యోగాచార్యో మహాతపాః || || 5 || శాణ్డిల్యః పరమః శ్రీమాన్ సర్వతత్త్వార్థవి చ్ఛుచిః | ప్రసాదా త్పార్యతీశస్య యోగముక్తి మవాప్తవాన్ || || 6 || పందొమ్మిదవ అధ్యాయము ఋషివంశకధనము సూతుడిట్లు చెప్పెను :- పూర్వము చెప్పబడిన వీరికి ప్రజాసంతతి కొరకు జన్మనిచ్చి కశ్యపుడు, తరువాత పుత్రునికోరినవాడై చాలగొప్పతపస్సుచేసెను. (1) అతడీవిధముగా మిక్కిలి తీవ్రముగా తపస్సుచేయుచుండగా, వత్సరుడు, అసితుడు అను ఇద్దరు పుత్రులుగా సాక్షాత్కరించిరి. వారిద్దరు కూడ వేదాంత విద్యను తెలిసినవారు. (2) వత్సరుడను కుమారునివలన నైధ్రువుడు, గొప్పకీర్తి కలరైభ్యుడు అనువారు పుత్రులు కలిగిరి. రైభ్యునికి వేదవేత్తలలో శ్రేష్ఠులు, శూద్రులగు పుత్రులు జన్మించిరి. (3) చ్యవనముని యొక్క కూతురు సుమేధ మహాత్ముడగు నైధ్రువునికి భార్య అయి కుండపాయులగు కుమారులను కనెను. (4) కశ్యప పుత్రులలో రెండవవాడైన అసితునికి ఏకపర్ణ అను భార్యయందు బ్రహ్మజ్ఞానము కలవారిలో శ్రేష్ఠుడు, గొప్పతపశ్శక్తికలవాడు, యోగవిద్యాపండితుడు, దేవలుడను పేరుకల పుత్రుడు కలిగెను. (5) శాండిల్యుడనువాడు ఉత్తముడు, శ్రీమంతుడు, సమస్తతత్త్వరహస్యములు తెలిసినవాడు, పవిత్రుడు. అతడు పార్వతీపతియగు శివుని అనుగ్రహమువలన యోగముద్వారా మోక్షమును పొందినాడు. (6) శాణ్డిల్యో నైధ్రువో రైభ్యః త్రయః పుత్రాస్తు కాశ్యపాః | నరప్రకృతయో విప్రాః పులస్త్యస్య వదామి వః || || 7 || తృణబిన్దోః సుతా విప్రా నామ్నా ఐలబిలాః స్మృతాః | పులస్త్యాయ తు రాజర్షి స్తాం కన్యాం ప్రత్యపాదయత్ || || 8 || ఋషి సై#్త్వలబిల స్తస్యాం విశ్రవాః సమపద్యత | తస్య పత్న్య శ్చతస్రస్తు పౌలస్త్యకులవర్థికాః || || 9 || పుష్పోత్కటా చ వాకా చ కైకసీ దేవవర్ణినీ | రూపలావణ్యసమ్పన్నా స్తాసాంచ శ్రుణుత ప్రజాః || || 10 || జ్యేష్ఠం వైశ్రవణం తస్య సుషువే దేవ వర్ణినీ | కైకస్యజనయ త్పుత్రం రావణం రాక్షసాధిపమ్ || || 11 || కుమ్భకర్ణం శూర్పణఖాం తథైవ చ విభీషణమ్ | పుష్పోత్కటా ప్యజనయ త్పుత్రా న్విశ్రవసః శుభాన్ || || 12 || శాండిల్యుడు, నైధ్రువుడు, రైభ్యుడు అను ముగ్గురు మానవప్రకృతి కల కశ్యప ప్రజాపతి కుమారులు. ఓ బ్రాహ్మణులారా! ఇక పులస్త్యుని సంతతిని గూర్చి మీకు తెలుపుదును. (7) విప్రులారా! తృణబిందువు పుత్రులు ఐలబిలులు అనుపేరుతో ప్రసిద్ధులు. వారిలో రాజర్షియగు ఒకరు పులస్త్యునకు తనకన్యను భార్యగా ఇచ్చెను. (8) ఐలబిలుడైన ఋషి తన కన్యనీయగా ఆమెయందు విశ్రవసువు జన్మించెను. అతనికి పౌలస్త్యవంశమును వృద్ధిపొందించగల నలుగురు భార్యలుండిరి. (9) పుష్పోత్కట, వాక, కైకసి, దేవవర్ణిని అనివారిపేర్లు. ఆ నలుగురుకూడ సౌందర్యము, లావణ్యముతో కూడి యుండిరి. వారిసంతానమును గూర్చి వినుడు. (10) దేవవర్ణిని అనుభార్య పులస్త్యునికి పెద్ద కుమారునిగా కుబేరునకు జన్మనిచ్చెను. కైకైసి అనునామె రాక్షసరాజైన రావణుని ప్రసవించెను. (11) పుష్పోత్కట కూడ కుంభకర్ణుని, విభీషణుని పుత్రులుగాను, శూర్పణఖను కూతురుగాను పొందెను. (12) మహోదరం ప్రహస్త ఞ్చ మహాపార్శ్వం ఖర న్తథా | కుమ్భీనసీం తథా కన్యాం వాకాయాః సృజతే ప్రజాః || || 13 || త్రిశిరా దూషణ శ్చైవ విద్యుజ్జిహ్వో మహాబలః | ఇత్యేతే క్రూరకర్మాణః పౌలస్త్యా రాక్షసా దశ || || 14 || సర్వే తపోబలోత్కృష్టా రుద్రభక్తాః సుభీషణాః | పులహస్య మృగాః పుత్రాః సర్వే వ్యాలాశ్చ దంష్ట్రిణః || || 15 || భూతాః పిశాచా ఋక్షాశ్చ శూకరా హస్తిన స్తథా | అనపత్యః క్రతు స్తస్మిన్ స్మృతో వైవస్వతే7న్తరే || || 16 || మరీచేః కశ్యపః పుత్రః స్వయమేవ ప్రజాపతిః | భృగో రథాభవ చ్ఛుక్రో దైత్యాచార్యో మహాతపాః || || 17 || వాక అను భార్యయందు మహోదరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, ఖరుడు అనుకుమారులు, కుంభీనసి అను కన్య జననమందిరి. (13) త్రిశిరుడు, దూషణుడు, విద్యుజ్జిహ్వుడు, అనుగొప్పబలశాలి - వీరందరు పులస్త్యసంతతియగు పదిమంది క్రూరకార్యములు చేయు రాక్షసులైరి. (14) వీరందరు కూడ తపోబలముచేత మేటివారు, శివునియందు భక్తికలవారు, మిక్కిలి భయంకరులుగా నుండిరి. పులహుడనువానికి పుత్రులుగా మృగములు, కోరలు గల సమస్త క్రూర జంతువులు. (15) భూతములు, పిశాచములు, ఎలుగుబంట్లు, వరాహములు, ఏనుగులు జనించెను. ఆ వైవస్వత మన్వంతరములో క్రతువు అనువాడు సంతాన హీనుడుగా పేర్కొనబడినాడు. (16) మరీచికి కశ్యపుడు కుమారుడై అతడు స్వయముగా ప్రజాపతి పదమును పొందెను. భృగువునకు, రాక్షసులగురువు, గొప్పతపశ్శక్తి కలవాడును అగు శుక్రుడు పుత్రుడాయెను. (17) స్వాధ్యాయయోగనిరతో హరభక్తో మహాద్యుతిః | అత్రేః పుత్రో7భవ ద్వహ్నిః సోదర్య స్తస్య నైధ్రువః || || 18 || కృశాశ్వ స్య తు విప్రర్షిః ఘృతాచ్యా మితి నః శ్రుతమ్ | స తస్యాం జనయామాస స్వస్త్యా త్రేయా న్మహౌజసః || || 19 || వేదవేదాఙ్గనిరతా న్తపసా హతకిల్బిషామ్ | నారద స్తు వసిష్ఠాయ దదౌ దేవీ మరున్ధతీమ్ || || 20 || ఊర్థ్వరేతా స్తు తత్రైవ శాపా ద్దక్షస్య నారదః | హర్యశ్వేషు తు నష్టేషు మాయయా నారదస్య తు || || 21 || శశాప నారదం దక్షః క్రోధసంరక్తలోచనః | యస్మా న్మమ సుతాస్సర్వే భవతామాయయా ద్విజ || || 22 || వేదాధ్యయనము, యోగవిద్య అనువానియందాసక్తి కలిగి, శివునిభక్తుడు, గొప్పతేజస్సుకలవాడగు వహ్ని అత్రిమహామునికి పుత్రుడుగా పుట్టెను. నైధ్రువుడతనికి సోదరుడుగా పుట్టెను. (18) ఆ నైధ్రువుడు కృశాశ్వునకు ఘృతాచియందు కలిగినాడని మేము విన్నాము. అతడు ఆమెయందు గొప్పబలశాలులైన స్వస్త్వాత్రేయులను వారిని కుమారులుగా పొందెను. (19 వారు వేదములయందు, వేదాంగములయందు శ్రద్ధకలవారు, తపస్సుచేత నశింపజేయబడిన పాపములు కలవారు. నారదుడు అరుంధతీ దేవిని వసిష్ఠునకు భార్యగా అర్పించెను. (20) నారదుడు దక్షుని శాపమువలన అక్కడనే ఊర్థ్వరేతసుడుగా మారెను. నారదుని మాయచేత అశ్వములు నష్టములు అయినందున (21) కోపముతో ఎఱ్ఱబడిన కన్నులు గల దక్షుడు నారదుని శపించెను. ఓ విప్రుడా! ఏకారణమువలన నాపుత్రులందరు నీ మాయచేత, (22) క్షయం నీతా స్త్వశేషేణ నిరపత్యో భవిష్యసి | అరున్ధత్యాం వసిష్ఠ స్తు శక్తి ముత్పాదయత్సుతమ్ || || 23 || శ##క్తేః పరాశరః శ్రీమాన్ సర్వజ్ఞ స్తపసాంవరః | ఆరాధ్య దేవదేవేశ మీశానం త్రిపురాన్తకమ్ || || 24 || లేభే త్వప్రతిమం పుత్రం కృష్టంద్వైపాయనం ప్రభుమ్ | ద్వైపాయనా చ్ఛుకో జజ్ఞే భగవా నేవ శంకరః || || 25 || అంశాంశే నావతీర్యోర్న్యాం స్వం ప్రాప పరమం పదమ్ | శుకస్యా ప్యభవ న్పుత్రాః పఞ్చా త్యన్తతపస్వినః || || 26 || భూరిశ్రవాః ప్రభుః శమ్భుః కృష్ణో గౌరశ్చపఞ్చమః | కన్యా కీర్తిమతీచైవ యోగమాతా ధృతవ్రతా || || 27 || ఏతే7 త్రివంశాః కథితా బ్రహ్మణా బ్రహ్మవాదినామ్ | అత ఊర్థ్వం నిబోధధ్వం కశ్యపా ద్రాజసన్తితిమ్ | || 28 || ఇతి శ్రీకూర్మపురాణ ఋషివంశవర్ణనంనామ ఏకోనవింశో7ధ్యాయః. సంపూర్ణముగా నాశముపొందింపబడిరో, ఆకారణము వలన నీవు సంతానరహితుడవు కాగలవు అని శపించెను. వసిష్ఠుడు అరుంధతి యందు శక్తి అనుకుమారునికి జన్మనిచ్చెను. (23) ఆశక్తికి కుమారుడుగా అన్నియు తెలిసినవాడు, తపస్వులలో శ్రేష్ఠుడు, శ్రీమంతుడు అగు పరాశరుడు జన్మించెను. అతడు దేవతలకు దేవుడైన, త్రిపురాసురులను సంహరించిన యీశ్వరుని పూజించి, (24) సాటిలేని కుమారుడుగా ప్రభువైన వ్యాసుని పొందెను. ఆకృష్ణద్వైపాయనుడనబడు వ్యాసునివలన సాక్షాత్తు భగవంతుడగు శంకరుడే శుకుడుగా జన్మించెను. (25) ఆ శంకరుడు అంశరూపములో భూమియందు జన్మించి, తరువాత తన శ్రేష్ఠమైన స్థానానికి చేరుకున్నాడు. ఆశుకునికి అయిదుగురు కుమారులు మిక్కిలి తపోబలము కలవారు కలిగిరి. 926) భూరిశ్రవుడు, ప్రభువు, శంభువు, కృష్ణుడు, గౌరుడు అనువారుఆకుమారులు. కీర్తికలది, యోగసాధనచేసినది, వ్రతములను అవలంబించినది అగు ఒకపుత్రికకూడ కలిగెను. (27) అత్రిముని వంశానికి సంబంధించిన యీ వంశస్థులనుగూర్చి బ్రహ్మచేత బ్రహ్మవాదులకు చెప్పబడినది. దీని తరువాత కశ్యపుని వలన కలిగిన రాజసంతతిని గూర్చి వినుడు. (28) శ్రీ కూర్మపురాణములో పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము