Sri Koorma Mahapuranam
Chapters
ద్వితీయో೭ధ్యాయః అధవర్ణాశ్రమ వర్ణనమ్ :- కూర్మ ఉవాచ :- శృణుధ్వ మృషయః సర్వే య త్పృష్టో೭ హం జగద్ధితమ్ | వక్ష్యమాణం మయా సర్వ మిన్ద్రద్యుమ్నాయ భాషితమ్ ||
|| 1 || భూతై ర్భవ్యై ర్భవద్భిశ్ఛ చరితై రుపబృంహితమ్ | పురాణం పుణ్యదం నౄణాం మోక్షధర్మానుకీర్తనమ్ ||
|| 2 || అహం నారాయణో దేవః పూర్వమాసీ న్నమే పరమ్ | ఉపాస్య విపులాం నిద్రాం భోగిశయ్యాం సమాశ్రితః ||
|| 3 || చిన్తయామి పునః సృష్టిం నిశాన్తే ప్రతిబుధ్య తు | తతో మే సహసోత్పన్నః ప్రసాదో మునిపుంగవాః ||
|| 4 || చతుర్ముఖ స్తతో జాతో బ్రహ్మాలోక పితామహః | తదన్తరే೭భవ త్క్రోధః కస్మా చ్చిత్కారణాత్తదా | || 5 || ద్వితీయాధ్యాయము వర్ణాశ్రమ వర్ణనము :- కూర్మస్వామి ఇట్లు చెప్పెను :- ఓ ఋషులారా ! లోకహితకరమైన దేనిని గూర్చి నేను అడుగబడితినో, పూర్వము నాచే ఇంద్రద్యుమ్నునికి చెప్పబడినదగు దానిని చెప్పబోవుచున్నాను మీరందరు వినుడు. (1). గడచినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి అగు చరిత్రలతో విస్తరింపబడినది, మనుష్యులకు పుణ్యము నిచ్చునది, మోక్ష ధర్మమును వర్ణించునది ఈ పురాణము. (2). నేను నారాయణుడనబడు దేవుడను. నాకు ముందుగాని, తరువాత గాని ఏమియు లేకుండెను. సర్పశయనము నధిష్ఠించి దీర్ఘకాలికమైన నిద్ర నవలంబించి ఉంటిని. (3) రాత్రి గడచిన తరువాత మేలుకొని, మరల సృష్టిని గురించి ఆలోచించుచుంటిని. ఓ మునిశ్రేష్ఠులారా! అప్పుడు నాకు అకస్మాత్తుగా అనుగ్రహబుద్ధి కలిగినది. (4) తరువాత చతుర్ముఖుడైన బ్రహ్మ, లోకమునకు పితామహుడైనవాడు జనించెను. అప్పుడొకానొక కారణమువలన, నాకు క్రోధము జనించినది. (5) ఆత్మనో మునిశార్దూలా స్తత్ర దేవో మహేశ్వరః | రుద్రఃక్రోధాత్మకో జజ్ఞే శూపాలణి స్త్రిలోచనః || || 6 || తేజసా సూర్యసఙ్కాశ##స్త్రెలోక్యం సందహ న్నివ | తదా శ్రీ రభవ ద్దేవీ కమలాయతలోచనా || || 7 || సురూపా సౌమ్యవదనా మోహినీ సర్వదేహినామ్ | శుచిస్మితా సుప్రసన్నా ముఙ్గళా మహిమాస్పదా || || 8 || దివ్యకాన్తిసమాయుక్తా దివ్యమాల్యోపశోభితా | నారాయణీ మహామాయా మూలప్రకృతి రవ్యయా || || 9 || స్వధామ్నా పూరయన్తీదం మత్పార్శ్వం సముపావిశత్ | తాం దృష్ట్వా భగవాన్ బ్రహ్మా మామువాచ జగత్పతిమ్ || 10 || మోహాయా శేషభూతానాం నియోజయ సురూపిణీమ్ | యేనేయం విపులా సృష్టి ర్వర్థతే మమ మాధవ || || 11 || ఓ మునిశ్రేష్ఠులారా ! అప్పుడక్కడ మహేశ్వరుడు, శూలము చేతియందుకలవాడు, త్రినేత్రుడు, క్రోధస్వరూపుడు అయిన రుద్రుడు తనంతట తాను జన్మించినాడు. (6) అతడు తేజస్సుతో సూర్యునికి సమానుడై, ముల్లోకాలను దహించుచున్నట్లుండెను. అప్పుడు పద్మములవలె విశాలములైన కన్నులు గల లక్ష్మీదేవి జన్మించెను (7) ఆమె చక్కని రూపముకలది, ప్రశాంతమైన ముఖముకలది, సమస్త ప్రాణులను మోహింపజేయునది, స్వచ్ఛమైన నవ్వుకలది, ప్రసన్నురాలు, మహిమలకు స్థానమైనది, మంగళరూపముకలదిగా ఉండెను. (8) శ్రేష్ఠమైన కాంతితో కూడినది, దివ్యమైన హారముతో ప్రకాశించునది, గొప్పమాయారూపిణి, మూలప్రకృతి అయినది, నాశములేనిది, నారాయణసంబంధము కలది ఆదేవి. (9) తన కాంతితో ఈ ప్రాంతాన్నినింపుచు నా ప్రక్కన కూర్చుండును. ఆమెను చూచి భగవంతుడైన బ్రహ్మ, లోకపతినైన నాతో ఇట్లనెను. (10) ''ఓ మాధవా! సమస్త ప్రాణులను మోహింప జేయుటకు చక్కనిరూపము కల యీమెను నియమించుము. దానిచేత నాయీసృష్టి పెంపొందును. (11) తథోక్తో೭హం శ్రియం దేవీ మబ్రవం ప్రహసన్నివ | దేవీద మఖిలం విశ్వం సదేవాసురమానుషమ్ || || 12 || మోహయిత్వా మమాదేశా త్సంసారే వినిపాతయ | జ్ఞానయోగరతా న్దాన్తాన్ బ్రహ్మిష్ఠాన్ బ్రహ్మవాదినః || || 13 || అక్రోధనా న్సత్యపరాన్ దూరతః పరివర్జయ | ధ్యాయినో నిర్మమా న్శాన్తా న్ధార్మికా న్వేదపారగాన్ || || 14 || యాజిన స్తాపసా న్విప్రాన్ దూరతః పరివర్జయ | వేదవేదాన్తవిజ్ఞానసంఛిన్నాశేషసంశయాన్ || || 15 || మహాయజ్ఞపరా న్విప్రా న్దూరతః పరివర్జయ | యే యజన్తి జపై ర్హోమైః దేవదేవం మహేశ్వరమ్ || || 16 || స్వాధ్యాయే నేజ్యయా దూరా త్తాన్ ప్రయత్నేన వర్జయ | భక్తియోగసమాయుక్తా నీశ్వరార్పితమానసాన్ || || 17 || ఆవిధముగా చెప్పబడినేను లక్ష్మీదేవిని చూచి నవ్వుచున్నట్లుగా ఇట్లు పలికితిని. ఓదేవీ! దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన యీసమస్త ప్రపంచమును (12) మోహింపజేసి నా ఆజ్ఞప్రకారము సంసారములో పడవేయుము. జ్ఞాన యోగములో ఆసక్తికలవారిని, ఇంద్రియ నిగ్రహముకలవారిని, పరబ్రహ్మమందునిష్ఠ కలిగి బ్రహ్మమును గూర్చి బోధించువారిని (13) కోపములేని వారిని, సత్యమందు అభినివేశమున్న వారిని దూరమునుండి విడిచిపెట్టుము. ధ్యానమగ్నులైనవారిని, మమకారములేనివారిని, శమస్వభావము కలవారిని, ధర్మప్రవృత్తి కలవారిని, వేదములసారము తెలిసినవారిని. (14) యజ్ఞము, తపస్సు చేయు బ్రాహ్మణులను దూరము నుండియే వదులుము. వేదములు, వేదాంతముల యొక్క విజ్ఞానముచేత నశింపజేయబడిన సమస్త సందేహములు కలవారిని (15) గొప్పయజ్ఞములు చేయుటయందు శ్రద్ధకల బ్రాహ్మణులను దూరము నుండి యే పరిహరించుము. ఎవరైతే జపములతో, హోమములతో దేవదేవుడైన మహేశ్వరుని పూజింతురో (16) వేదాధ్యయనముతో, యాగముతో పూజించువారిని ప్రయత్నపూర్వకముగా విడువుము. భక్తి యోగముతోకూడి, ఈశ్వరుని యందర్పించబడిన మనస్సుకలవారిని, (17) ప్రాణాయామాదిషు రతాన్ దూరా త్పరిహరా మలాన్ | ప్రణవాసక్త మనసో రుద్రజప్య పరాయణాన్ || || 18 || అధ్వర్వశిరసో వేత్తౄన్ ధర్మజ్ఞా న్పరివర్జయ | బహునాత్ర కిముక్తేన స్వధర్మపరిపాలకాన్ || || 19 || ఈశ్వరారాధనరతాన్ మన్నియోగా న్నమోహయ | ఏవం మయా మహామాయా ప్రేరితా హరివల్లభా | || 20 || యథాదేశం చకారాసౌ తస్మా ల్లక్ష్మీం సమర్చయేత్ | శ్రియం దదాతి విపులాం పుష్టిం మేధాం యశో బలమ్ || || 21 || అర్చితా భగవత్పత్నీ తస్మా ల్లక్ష్మీం సమర్చయేత్ | తతో೭సృజ త్స భగవాన్ బ్రహ్మా లోకపితామహః || || 22 || చరా చరాణి భూతాని యథాపూర్వం మమాజ్ఞయా | మరీచిభృగ్వంగిరసం పులస్త్యం పులహం క్రతుమ్ || || 23 || ప్రాణాయామము మొదలగు వానియందాసక్తులైనవారిని దూరము నుండి వదిలిపెట్టుము. వారిని మోహింపజేయవద్దని భావము. వేదార్థ మందు ఆసక్తికల మనస్సున్నవారిని, రుద్రజపము చేయుటలో శ్రద్ధకలవారిని, (18) అధర్వశిరమును గూర్చి తెలిసినవారిని, ధర్మము నెరిగిన వారిని విడిచిపెట్టుము. ఎక్కువ మాటలు చెప్పుట ఎందుకు? తమ ధర్మమును చక్కగా పాలించువారిని, (19) ఈశ్వరుని పూజించుటలో శ్రద్ధ కలవారిని నా ఆజ్ఞవలన మోహింపజేయకుము. ఈ విధముగా మహామాయాస్వరూపిణి, విష్ణువునకు ఇష్టురాలు అగు లక్ష్మీదేవి ప్రేరేపించబడినది. (20) ఆమె నా ఆజ్ఞ ప్రకార మాచరించినది. అందువలన లక్ష్మిని పూజించవలెను. ఆమె అధికమైన సంపదను, బలమును, తెలివిని, కీర్తిని, స్వాస్థ్యమును కలిగించును. (21) పూజింపబడిన ఆభగవంతుని భార్య పైన తెలిపిన ఫలములనిచ్చును కనుక ఆ లక్ష్మిని బాగుగా పూజించవలెను. తరువాత లోకపితామహుడైన బ్రహ్మ తనసృష్టిని కొనసాగించినాడు. (22) చరాచరములైన భూతములను నాఆజ్ఞచేత బ్రహ్మ సృష్టించినాడు. భృగువు అంగిరసులను, పులస్త్యుని, పులహుని, క్రతువును, (23) దక్ష మత్రిం వసిష్ఠంచ సో೭ సృజ ద్యోగవిద్యయా | నవైతే బ్రహ్మణః పుత్రాః బ్రాహ్మణా బ్రాహ్మణోత్తమాః || || 24 || బ్రహ్మవాదిన ఏవైతే మరీచ్యాద్యా స్తు సాధకాః | ససర్జ బ్రాహ్మణా న్వక్త్రాత్ క్షత్రియాంశ్చ భుజా ద్విభుః || || 25 || వైశ్యా నూరుద్వయా ద్వేవః పద్భ్యాం శూద్రా న్పితామహః | యజ్ఞనిష్పత్తయే బ్రహ్మా శూద్రవర్జం ససర్జహ || || 26 || గుప్తయే సర్వదేవానాం తేభ్యో యజ్ఞోహి నిర్బభౌ | ఋచోయజూంషి సామాని తథైవా ధర్వణానిచ || || 27 || బ్రహ్మణః సహజం రూపం నిత్యైషా శక్తి రవ్యయా | అనాదినిధనా దివ్యా వాగుత్సృష్టా స్వయమ్భువా || || 28 || దక్షుని, అత్రి వసిష్ఠులను కూడ అతడు యోగవిద్యచేత సృజించినాడు. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఈ తొమ్మిది మంది బ్రహ్మయొక్క కుమారులు కనుక బ్రాహ్మణులుగా చెప్పబడుదురు. (24) వీరందరు బ్రహ్మవాదులే. మరీచిమొదలగు వారైతే సాధనదశలో ఉన్నవారు. ఆ బ్రహ్మ, ముఖము నుండి బ్రాహ్మణులను, భుజముల నుండి క్షత్రియులను సృజించినాడు. (25) తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను పితామహుడైన బ్రహ్మసృష్టించినాడు. అతడు యజ్ఞకర్మ నిర్వహణకొరకు, శూద్రులు కాక తక్కిన వారిని సృజించెను. (26) సమస్తదేవతల రక్షణకొరకు వారి నుండి యజ్ఞము నిర్వహించబడి ప్రకాశించెను. ఋక్కులు, యజుస్సులు, సామములు, అధర్వణములు అను వేదభాగములు (27) బ్రహ్మయొక్క సహజమైన రూపము. ఈ శక్తి నిత్యమైనది, నాశరహితమైనది, ఆది, అంతములేనిది, దివ్యమైనది అగు వాక్కు పై వేదరూపములో బ్రహ్మచేత ఆవిష్కరింపజేయబడినది. (28) ఆదౌ దేవమయీ భూతా యతః సర్వాః ప్రవృత్తయః | అతోన్యాని హి శాస్త్రాణి పృథివ్యాం యానికానిచిత్ || || 29 || న తేషు రమతే ధీరః పాషణ్డీ రమేత బుధః | వేదార్థవిత్తమైః కార్యం యత్స్మృతం మునిభిః పురా || || 30 || స జ్ఞేయః పరమో ధర్మో నాన్యశాస్త్రేషు సంస్థితః | యా వేదబాహ్యాః స్మృతయో యాశ్చకాశ్చ కుదృష్టయః || || 31 || సర్వాస్తా నిష్కలాః ప్రేత్య తమోనిష్ఠాహి తాః స్మృతాః | పూర్వకల్పే ప్రజాజాతాః సర్వబాధావివర్జితాః || || 32 || శుద్ధాన్తఃకరణాః సర్వాః స్వధర్మపరిపాలకాః | తతః కాలవశా త్తాసాం రాగద్వేషాదికో೭భవత్ || 33 || ఆదికాలములో లోకములోని ప్రవృత్తులన్నియు వేదమయములుగా నుండెను. తరువాత భూమియందున్న ఏయేశాస్త్రములున్నవో అవి వేదములనుండి ఏర్పడినవి. (29) ధీరుడైనవాడు ఆశాస్త్రములయందు ఆసక్తితో ప్రవర్తించడు. పాషణ్డుడైనవాడు మాత్రమే వానియందు శ్రద్ధవహించును. వేదార్ధము చక్కగా తెలిసిన పూర్వమునులచేత ఏది స్మృతి రూపములో చెప్పబడినదో ఆకార్యము. (30) గొప్పధర్మముగా తెలియదగినది. ఇతరశాస్త్రములయందు చెప్పబడినది అట్టిదికాదు. ఏ స్మృతులు వేదములకు విరుద్ధములో, ఏవైతే విరుద్ధదృష్టి కలిగి ఉండునో (31) అని అన్నియు కలారహితములు. అవి తమోగుణము ప్రధానముగా కలవిగా చెప్పబడినవి. పూర్వకల్పములో ప్రజలు అన్ని విధముల బాధల నుండి దూరమైనవారుగా పుట్టియుండిరి. (32) అప్పటి జనులు నిర్మలమైన మనస్సుకలవారు, తమ ధర్మమును పరిపాలించు వారుగా ఉండిరి. తరువాత క్రమముగా వారిలో రాగము, ద్వేషము మొదలగునవి కలుగసాగినవి. (33) అధర్మో మునిశార్దూలాః స్వధర్మప్రతిబన్థకః | తతః సా సహజా సిద్ధి స్తాసాం నాతీవ జాయతే || || 34 || రజోమాత్రాత్మికా స్తాసాం సిద్ధయో೭న్యా స్తదాభవన్ | తాసు క్షీణాస్వశేషాసు కాలయోగేన తాః పునః || || 35 || వార్తోపాయం పునశ్చక్రు ర్హస్త సిద్ధించ కర్మజామ్ | తత స్తాసాం విభుర్బ్రహ్మా కర్మాజీవ మకల్పయత్ || || 36 || స్వాయంభువో మనుః పూర్వం ధర్మా న్ర్పోవాచ సర్వదృక్ | సాక్షా త్ర్పజాపతే ర్మూర్తి ర్నిసృష్టా బ్రహ్మణో ద్విజాః || || 37 || భృగ్వాదయ స్తద్వదనా చ్ఛృత్వా ధర్మా నధోచిరే | యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః || || 38 || ఓ మునిశ్రేష్ఠులారా ! అధర్మము తమ ధర్మమునకు విఘాతము కలిగించునది. అందువలన అధర్మపరులకు సహజమైన సిద్ధి అధికముగా కలుగజాలదు. (34) వారి సిద్ధులు రజోగుణము ప్రధానముగా కలిగిఉండును. అవి భిన్నరీతిలో ఉండును. కాలక్రమమున ఆసిద్ధులు సంపూర్ణముగా క్షీణించి పోగా, (35) జీవనోపాధిశాస్త్రమును, కర్మలవలన జనించుహస్తనైపుణ్య కళను తరువాత సృష్టించిరి. అప్పుడు ప్రభువైన బ్రహ్మ ఆసిద్ధులకు కర్మల వలన జీవనోపాయ పద్ధతిని కల్పించెను. (36) పూర్వము స్వాయంభువ మనువు సర్వదృష్టి కలవాడై ధర్మములను బోధించెను. ఓ బ్రాహ్మణులారా! ఆమనువు స్వయముగా ప్రజాపతి అగు బ్రహ్మయొక్క రూపాంతరముగా, అతనిచే సృష్టించబడినాడు. (37) అతని ముఖము ఉండి భృగువు మొదలగు వారు ధర్మములనువిని తరువాత ఇతరులకు చెప్పిరి. యాగములు చేయుట, చేయించుట, ఇతరులకు దానముచేయుట, దానమును స్వీకరించుట, (38) అధ్యాపనం చాధ్యయనం షట్కర్మాణి ద్విజోత్తమాః | దాన మధ్యయనం యజ్ఞో ధర్మః క్షత్రియ వైశ్యయోః || || 39 || దణ్డో యుద్ధం క్షత్రియస్య కృషి ర్వైశ్యస్య శస్యతే | శుశ్రూషైవ ద్విజాతీనాం శూద్రాణాం ధర్మసాధనమ్ || || 40 || కారుకర్మ తథాజీవః పాకయజ్ఞాదిధర్మతః | తతః స్థితేషు వర్ణేషు స్థాపయామాస చాశ్రమాన్ || 41 || గృహస్థం చ వనస్థం చ భిక్షుకం బ్రహ్మచారిణమ్ | అగ్నయో೭తిథిశుశ్రూషా యజ్ఞో దానం సురార్చనమ్ || || 42 || గృహస్థస్య సమాసేన ధర్మోయం మునిపుంగవాః | హోమో మూలఫలాశిత్వం స్వాధ్యాయ స్తప ఏవచ || || 43 || వేదములను చదువుట, ఇతరులకు బోధించుట అను ఈ ఆరుకర్మలు బ్రాహ్మణునికి కర్తవ్యములుగా విధించబడినవి. దానము చేయుట, వేదాధ్యయనము, యజ్ఞముచేయుట అనునవి క్షత్రియులకు, వైశ్యులకు ధర్మముగా చెప్పబడినవి. (39) క్షత్రియునకు, అపరాధిని దండించుట, శత్రువులతో యుద్ధముచేయుట ధర్మములు. వైశ్యునికి వ్యవసాయము ధర్మమని చెప్పబడినది. బ్రాహ్మణాది ద్విజులకు శుశ్రూషచేయుటే శూద్రులకు ధర్మాచరణమని తెలియవలెను. (40) శిల్పకర్మ, పాకయజ్ఞము మొదలగు ధర్మముతో జీవికనుగడుపుకొనుట కూడ శూద్రధర్మము. ఇట్లు వర్ణములను నియమించిన తరువాత ఆశ్రమాలను స్థాపించినాడు. (41) గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస, బ్రహ్మచర్యములనే నాలుగు ఆశ్రమాలను ఏర్పరచినాడు. అగ్నికార్యము, అతిథిపూజ, యజ్ఞాచరణము, దానము, దేవతాపూజ, (42) సంగ్రహముగా ఇది గృహస్థునికి ధర్మము, ఓ మునిశ్రేష్ఠులారా! హూమము, ఫలమూలాలనుభుజించుట, అధ్యయనము, తపస్సు. (43) సంవిభాగో యధాన్యాయం ధర్మో೭యం వనవాసినామ్ | భైక్షాశనంచ మౌనిత్వం తపో ధ్యానం విశేషతః || || 44 || సమ్యగ్ జ్ఞానం చ వైరాగ్యం ధర్మో೭యం భిక్షుకే మతః | భిక్షాచర్యం చ శుశ్రూషా గురోః స్వాధ్యాయ ఏవ చ || || 45 || సన్ధ్యాక్మా గ్నికార్యంచ ధర్మో೭యం బ్రహ్మచారిణామ్ | బ్రహ్మచారివనస్థానాం భిక్షుకాణాం ద్విజోత్తమాః || || 46 || సాధారణం బ్రహ్మచర్యం ప్రోవాచ కమలోద్భవః | ఋతుకాలాభిగామిత్వం స్వదారేషు నచాన్యతః || || 47 || పర్వవర్జం గృహస్థస్య బ్రహ్మచర్య ముదాహృతమ్ | ఆగర్భధారణా దాజ్ఞా కార్యా తేనాప్రమాదతః || || 48 || న్యాయముతప్పక సంవిభాగము అనునవి వానప్రస్థులకు ధర్మములు. భిక్షతో ఆహారసంపాదనము, మౌనమవలంబించుట, ఎక్కువగా ధ్యానము, తపస్సు (44) శ్రేష్ఠమైన జ్ఞానము, వైరాగ్యము అనునవి సన్యాసికి ధర్మములు. భిక్షచేయుట, గురువును సేవించుట, వేదాధ్యయనము. (45) సంధ్యావందనము, ఔపాసనము - ఇవి బ్రహ్మచారుల ధర్మములు. బ్రహ్మచారులకు, వాన ప్రస్థులకు, సన్యసించినవారికి ఈముగ్గురికి, (46) బ్రహ్మచర్యమనునది సాదారణధర్మమని బ్రహ్మదేవుడు చెప్పినాడు. ఋతుకాలములందు తనభార్యతో సంయోగముపొందుట, ఇతర స్త్రీలకు దూరముగానుండుట. (47) పర్వదినములయందు స్వపత్నీసంయోగముకూడా విడువదగును. తనభార్య గర్భము ధరించినప్పటి నుండి గృహస్థుడు బ్రహ్మచర్యము నవలంబించెవలెనని దేవునిఆజ్ఞ. పొరపాటు లేకదానిని పాటించవలయును. (48) అకుర్వాణస్తు విప్రేన్ద్రా భ్రూణహా తూపజాయతే | వేదాభ్యాసో೭న్వహం శక్త్యా శ్రాద్ధం చాతిథిపూజనమ్ || || 49 || గృహస్థస్య పరో ధర్మో దేవతాభ్యర్చనం తథా | వైవాహ్య మగ్ని మిన్థీత సాయం ప్రాత ర్యథావిధి || || 50 || దేశాన్తరగతో వాథ మృతపత్నీక ఏవచ | త్రయాణా మాశ్రమాణాంతు గృహస్థో యోనిరుచ్యతే || || 51 || అన్యే సముపజీవన్తి తస్మా చ్ఛ్రేయాన్ గృహాశ్రమీ | ఐకాశ్రమ్యం గృహస్థస్య చతుర్ణాం శ్రుతిదర్శనాత్ || || 52 || ఓ బ్రాహ్మణ వర్యులారా ! ఆవిధముగా ధర్మపాలనముచేయనివాడు భ్రూణ హత్యచేసినవాడగును. ప్రతిదినము వేదమునభ్యసించుట, శక్తిననుసరించి శ్రాద్ధము, అతిథిపూజ జరుపుట. (49) దేవతలను పూజించుట అనునవి గృహస్థునికి ముఖ్యమైన ధర్మకర్మకార్యములు. మరియు ప్రాతస్సాయంకాలములందు విధిప్రకారము గార్హపత్యాగ్నితో అగ్నికార్యము జరుపవలెను. (50) దేశాంతరమునకు వెళ్ళినప్పుడు కాని, లేక భార్చచనిపోయిన కాని గార్హపత్యాగ్నిలో హోమము జరుపవలెను. బ్రహ్మచారి మొదలగు మూడు ఆశ్రమాల వారికి గృహస్థుడు మూలభూతుడని చెప్పబడును. (51) అతని నాశ్రయించి తక్కిన వారు బ్రతుకుచున్నారు. అందువలన అతడుశ్రేష్టుడు, వేదములో చెప్పిన ప్రకారము గృహస్థుడు నాలుగాశ్రమాల సమాహార రూపుడని చెప్పవచ్చును. (52) అందువలన గృహస్థాశ్రమ మొక్కటే ప్రధానముగా ధర్మసాధనమని తెలియదగినది. ధర్మమును విడచిన అర్థకాముములను తప్పక పరిత్యజించ వలెను. (53) సర్వలోకవిరుద్ధం చ ధర్మమప్యాచరే న్నతు | ధర్మా త్సంజాయతే హ్యర్థో ధర్మా త్కా మోభిజాయతే || || 54 || ధర్మ ఏవాపవర్గాయ తస్మా ద్ధర్మం సమాశ్రయేత్ | ధర్మ శ్చార్థశ్చ కామశ్చ త్రివర్గ స్త్రిగుణో మతః || || 55 || సత్త్వం రజ స్తమ శ్చేతి తస్మా ద్ధర్మం సమాశ్రయేత్ | ఊర్థ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః || || 56 || జఘన్యగుణవృత్తిస్థా అథో గచ్ఛన్తి తామసాః | యస్మి న్థర్మసమాయుక్తౌ హ్యర్థకామౌ వ్యవస్థితౌ || || 57 || ఇహలోకే సుఖీ భూత్వా ప్రేత్వా నన్త్యాయ కల్పతే | ధర్మా త్సంజాయతే మోక్షో హ్యర్థా త్కామో೭భిజాయతే || || 58 || సమస్తలోకమునకు విరుద్ధముగా ఉన్న ధర్మమును కూడ ఆచరింపవద్దు. ధర్మము నుండి అర్థము కలుగును. ధర్మము నుండి కామము కూడ ఏర్పడును. (54) మోక్షము కొరకు గూడ ధర్మమే ఉపయుక్తమగును. అందువలన ధర్మము నాశ్రయించవలెను. ధర్మము, అర్థము, కామము అను మూడు త్రివర్గము, త్రిగుణాత్మకము అని చెప్పబడినది. (55) ఆ మూడు గుణములు సత్త్వము, రజస్సు, తమస్సు అనునవి. అందువలన ధర్మము నాశ్రయించవలెను. సత్త్వగుణము ధరించినవారు ఊర్ధ్వలోకములకేగుదురు. రజోగుణ వంతులు మధ్యలో నిలుతురు. (56) నీచమైన తమోగుణము ప్రధానముగా కలవారు అధోలోకములను పొందుదురు. ఎవనియందు ధర్మయుక్తమైన అర్థకామములు నిలిచి యుండునో (57) అతడు ఈ లోకములో సుఖముగా జీవించి, మరణానంతరము అనంతత్వరూపముక్తిని పొందును. ధర్మము వలన మోక్షము కలుగును. అర్థము వలన కామము సంభవించును. (58) ఏవం సాధన సాధ్యత్వం చాతుర్విధ్యే ప్రదర్శితమ్ | య ఏవం వేద ధర్మార్థకామమోక్షస్య మానవః || || 59 || మాహాత్మ్యం చానుతిష్ఠేత స చానన్త్యాయ కల్పతే | తస్మా దర్ధంచ కామంచ త్యక్త్వా ధర్మం సమాశ్రయేత్ || || 60 || ధర్మా త్సంజాయతే సర్వమిత్యాహు ర్బ్రహ్మవాదినః | ధర్మేణ ధార్యతే సర్వం జగత్ స్థావరజఙ్గమమ్ || || 61 || అనాదినిధినా శక్తిః సైషా బ్రాహ్మీ ద్విజోత్తమాః | కర్మణా ప్రాప్యతే ధర్మో జ్ఞానేన చ న సంశయః || || 62 || తస్మాద్ జ్ఞానేన సహితం కర్మయోగం సమాశ్రయేత్ | ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్ || || 63 || ఈ ప్రకారముగా సాధనసాధ్యభావము నాలుగు విధాలుగా చూపించబడినది. ఏమానవుడు ధర్మార్థకామమోక్షముల స్వరూపమును తెలుసు కొనునో, (59) వాని మాహాత్మ్యమును గుర్తించి అనుష్ఠించునో, వాడు మోక్షమును పొందును. అందువలన అర్థమును కామమును వదిలి ధర్మము నాశ్రయించవలెను. (60) ధర్మము వలన సమస్తము సిద్ధించునని బ్రహ్మజ్ఞానము కలవారు చెప్పుదురు. ధర్మముచేత స్థావర, జంగమరూపమైన సమస్త ప్రపంచము మోయబడుచున్నది. (61) బ్రాహ్మణ శ్రేష్ఠులారా ! ఇది బ్రాహ్మీశక్తి. దీనికి ఆది, అంతము లేవు. ఈ ధర్మము కర్మమార్గముచేత పొందబడును; జ్ఞానయోగముచేత గూడ లభించును. సందేహము లేదు. (62) అందువలన జ్ఞానముతో కూడిన కర్మయోగము నాశ్రయించవలెను. వైదిక కర్మజాతము ప్రవృత్తము, నివృత్తము అని రెండు విధములుగా ఉండును. (63) జ్ఞానపూర్వం నివృత్తం స్యాత్ ప్రవృత్తం య దతో೭న్యథా | నివృత్తం సేవమానస్తు యాతి తత్పరమం పదమ్ || || 64 || తస్మా న్నివృత్తం సంసేవ్య మన్యథా సంసరే త్పునః | క్షమా దమో దయా దాన మలోభ స్త్యాగ ఏవ చ || || 65 || ఆర్జవం చానసూయా చ తీర్థానుసరణం తథా | సత్యం సన్తోష మాస్తిక్యం శ్రద్ధా చేన్ద్రియనిగ్రహః || || 66 || దేవతాభ్యర్చనం పూజా బ్రాహ్మణానాం విశేషతః | అహింసా ప్రియవాదిత్వ మపైశున్య మకల్కతా || || 67 || సామాసిక మిమం ధర్మం చాతుర్వర్ణ్యే೭ బ్రవీ న్మనుః | ప్రాజాపత్యం బ్రాహ్మణానాం స్మృతం స్థానం క్రియావతామ్ || || 68 || జ్ఞానపూర్వకమైన కర్మ నివృత్తమనబడును. దానికంటె ఇతరమైనది ప్రవృత్తకర్మ. నివృత్తకర్మ ననుష్ఠించువాడు సర్వోన్నతమైన స్థానమును పొందును. (64) అందువలన నివృత్తకర్మ సేవించదగినది. లేనియెడల మరల సంసారములో పడిపోవును. ఓర్పు, ఇంద్రియనిగ్రహము, దయ, దానగుణము, దురాశ##లేకపోవుట, త్యాగము, (65) ఋజు స్వభావము, అసూయలేకుండుట, పుణ్యతీర్థములను అనుసరించుట, సత్యవాదిత్వము, సంతోషముగా ఉండుట, వేదములయందు, దైవమునందు నమ్మకము కలిగియుండుట, శ్రద్ధ, ఇంద్రియనిగ్రహము. (66) దేవతలను పూజించుట, బ్రాహ్మణులను విశేషముగా గౌరవించుట, హింసచేయకపోవుట, ప్రియముగా మాటలాడుట, పిసినారి తనములేకుండుట. (67) నాలుగు వర్ణముల వారికి, ఈ పైన తెలిపిన వన్నియు సామూహిక ధర్మముగా మనువు చెప్పినాడు. అనుష్ఠాన పరులైన బ్రాహ్మణులకు ప్రాజాపత్యము స్థానముగా తెలుపబడినది. (68) స్థాన మైన్ద్రం క్షత్రియాణాం సంగ్రామే ష్వపలాయినామ్ | వైశ్యానాం మారుతం స్థానం స్వధర్మ మనువర్తతామ్ || || 69 || గాన్ధర్వం శూద్రజాతీనాం పరిచారేణ వర్తతామ్ | అష్టాశీతిసహస్రాణా మృషీణా మూర్ధ్వరేతసామ్ || || 70 || స్మృతం తేషాం తు యత్ స్థానం తదేవ గురువాసినామ్ | సప్తర్షీణాంతు యత్‌స్థానం స్మృతం తద్వై వనౌకసామ్ || || 71 || ప్రాజాపత్యం గృహస్థానాం స్థాన ముక్తం స్వయమ్భువా | యతీనాం జితచిత్తానాం న్యాసినా మూర్ధ్వరేతసామ్ || || 72 || హైరణ్యగర్భం తత్థ్సానం యస్మా న్నావర్తతే పునః | యోగినా మమృతం స్థానం వ్యోమాఖ్యం పర మక్షరమ్ || || 73 || యుద్ధరంగమునుండి పలాయనము చేయని క్షత్రియులకు ఐంద్రమనుస్థానము, తమధర్మాన్ని అనుసరించి ప్రవర్తించు వైశ్యులకు మారుతస్థానము ఏర్పరచబడినది. (69) పరిచర్యాక్రియతో వర్తించే శూద్రజాతి వారికి గాంధర్వస్థానము నియమించబడినది. ఊర్ధ్వరేతస్కులైన పదునెనిమిది వేల ఋషులకు; (70) ఏ స్థానము చెప్పబడినదో అదే గురుకుల వాసముచేయు బ్రహ్మచారులకు గూడ వర్తించును. సప్తర్షులకు ఏ స్థానము నియమింపబడినదో అదే వానప్రస్థ్రులకు గూడ వర్తించును. (71) గృహస్థులకు ప్రాజాపత్యమను స్థానము బ్రహ్మచేత చెప్పబడినది. మనస్సును జయించినవారు, ఊర్థ్వరేతస్కులు అగు సన్న్యాసులకు, (72) దేని నుండి మరల వెనుకకు వచ్చుట ఉండదో అటువంటి హిరణ్యగర్భ సంబంధమైన స్థానము, యోగులకు వ్యోమమను పేరుగల నాశరహితమైన అమృతస్థానము కల్పించబడినది. (73) ఆనన్ద మైశ్వరం ధామ సా కాష్ఠా సా పరాగతిః | || 74 || ఋషయ ఊచుః :- భగవ న్దేవతారిఘ్న! హిరణ్యాక్షనిషూదన || చత్వారో హ్యాశ్రమాః ప్రోక్తాః యోగినా మేక ఉచ్యతే | || 75 || కూర్మఉవాచ:- సర్వకర్మాణి సన్న్యస్య సమాధి మచలం శ్రితః || య ఆస్తే నిశ్చలో యోగీ స సన్యాసీ చ పఞ్చమః | సర్వేషా మాశ్రమాణా న్తు ద్వైవిధ్యం శ్రుతిదర్శితమ్ || || 76 || బ్రహ్మచార్యు పకుర్వాణో నైష్ఠికో బ్రహ్మతత్పరః | యో೭ధీత్య విధివ ద్వేదాన్ గృహస్థాశ్రమ మావ్రజేత్ || || 77 || ఉపకుర్వాణకోజ్ఞేయా నైష్ఠికో మరణాన్తికః | ఉదాసీనః సాధకశ్చ గృహస్థో ద్వివిధో భ##వేత్ || || 78 || అది ఆనందరూపమైన ఈశ్వర సంబంధిస్థానము. ఋషులిట్లు పలికిరి :- దేవతలకు శత్రువులైన రాక్షసులను చంపినవాడా! హిరణ్యాక్షుని వధించిన భగవంతుడవగునారాయణా! (74) నాలుగు ఆశ్రమాలు చెప్పబడినవి. యోగులకు మాత్రం ఒక ఆశ్రమము చెప్పబడుచున్నది. కూర్మస్వామి చెప్పెను :- అన్ని కర్మలను విడిచిపెట్టి, నిశ్చలమైన ధ్యానయోగము నవలంబించినవాడు, (75) నిశ్చలమైన యోగనిష్ఠ కలవాడుగా ఎవడు ఉండునో, అతడు సన్యాసి, అయిదవవాడగును. అన్ని ఆశ్రమాలకు రెండు భేదములు వేదములయందు చెప్పబడినవి. (76) నిష్ఠకలవాడు, వేదమునందు శ్రద్ధకలవాడు అగు బ్రహ్మచారి, శాస్త్రప్రకారము వేదములనధ్యయనముచేసి గృహస్థాశ్రమము స్వీకరించ వలెను. (77) నైష్ఠికుడగు వాడు, మరణకాల పర్యంతము ఇతరాశ్రమాలవారి కుపకారము చేయువాడు గృహస్థుడు. అతడు ఉదాసీనుడు, సాధకుడు అని రెండు భేదములు కలిగియుండును. (78) కుటుమ్బభరణాయత్తః సాధకో೭సౌ గృహీ భ##వేత్ | ఋణాని త్రీణ్య పాకృత్య త్యక్త్వా భార్యాధనాదికమ్ || || 79 || ఏకాకీ యస్తు విచరే దుదాసీనః స మౌక్షికః | తపస్తప్యతి యో೭రణ్య యజే ద్దేవాన్ జుహోతి చ || || 80 || స్వాధ్యాయే చైవ నిరతో వనస్థ స్తాపసో మతః | తపసా కర్శితో೭త్యర్థం యస్తు ధ్యానపరో భ##వేత్ || || 81 || సాంన్యాసికః స విజ్ఞేయో వానప్రస్థాశ్రమే స్థితః | యోగాభ్యాసరతో నిత్య మారురుక్షు ర్జితేన్ద్రియః || || 82 || జ్ఞానాయ వర్తతే భిక్షుః ప్రోచ్యతే పారమేష్ఠికః | య స్త్వాత్మరతి రేవస్యా న్నిత్యతృప్తో మహామునిః || || 83 || కుటుంబపోషణ భారమునకు అధీనమైన గృహస్థుడు సాధకుడనబడును. మూడు ఋణములను (దేవ, ఋషి, పితృ) తొలగించుకొని భార్య, ధనము మొద|| వాని యందపేక్షవదలి; (79) ఒంటరివాడుగా ఎవడు సంచరించునో, అతడు మోక్షాపేక్షకల ఉదాసీనుడనబడును. ఎవడు అడవిలో తపస్సు చేయుచు, దేవతాపూజ, యాగముచేయునో; (80) వేదాధ్యయనమునందు గూడ ఆసక్తికలిగి ఉండునో, అతడు వాన ప్రస్థుడగుముని అని చెప్పబడును. తపస్సుచేత మిక్కిలి కృశించి, ధ్యాననిమగ్నుడుగా ఎవడుండునో. (81) అతడు వానప్రస్థములో ఉన్న సన్యాసిగా తెలియవలెను. ఎవడు ఎల్లప్పుడు యోగాభ్యాసము నందు శ్రద్ధకలిగి, ఇంద్రియములను జయించి, ఉన్నత పదమును పొందగోరుచుండునో; (82) జ్ఞానముకొరకు జీవించునో, అతడు పరమేష్ఠిసంబంధిఅగు సంన్యాసిగా చెప్పబడుచున్నాడు. ఎవడు ఎల్లప్పుడు తృప్తికలిగి ఆత్మసాక్షాత్కారమందే ఆసక్తికలిగి ఉండునో, (83) సమ్యగ్దర్శన సంపన్నః స యోగీ భిక్షు రుచ్యతే | జ్ఞానసన్న్యాసినః కేచి ద్వేదసన్యాసి೭నో పరే || || 84 || కర్మసన్న్యాసినః కేచి త్త్రివిధాః పారమేష్ఠికాః | యోగీ చ త్రివిధో జ్ఞేయో భౌతికః సాంఖ్య ఏవచ || || 85 || తృతీయో హ్యాశ్రమీ ప్రోక్తో యోగ ముత్తమ మాశ్రితః | ప్రథమా భావనా పూర్వే సాంఖ్యే త్వక్షర భావనా || || 86 || తృతీయే చాన్తిమా ప్రోక్తా భావనా పారమేశ్వరీ | తస్మాదే త ద్విజానీధ్వ మాశ్రమాణాం చతుష్టయమ్ || || 87 || సర్వేషు వేదశాస్త్రేషు పఞ్చమో నోపపద్యతే | ఏవం వర్ణాశ్రమాన్ సృష్ట్వా దేవదేవో నిరఞ్జనః || || 88 || శ్రేష్ఠమైన జ్ఞానముతో కూడిన అతడు యోగిఅగు సంన్యాసి అని చెప్పబడును. కొందరు జ్ఞానసంన్యాసులు, మరికొందరు వేదసంన్యాసులు ఉందురు. (84) మరికొందరు కర్మ సంన్యాసులు అని మొత్తము పారమేష్ఠిక సంన్యాసులు మూడు విధములు. యోగి కూడ మూడు విధములు కలవాడని తెలియవలెను. భౌతికయోగి, సాంఖ్యయోగి; (85) ఆశ్రమయోగి అని ఆమూడు భేదాలు చెప్పబడినవి. ఉత్తమమైన యోగము నాశ్రయించిన వాడు ఆశ్రమ యోగి అని తెలియదగును. మొదటి భౌతికయోగియందు ప్రథమభావన, రెండవ సాంఖ్యయోగియందు అక్షరభావన. (86) మూడవయోగి ఆశ్రమియందు అంతిమమైన పారమేశ్వరీభావన చెప్పబడినది. అందువలన ఈనాలుగు ఆశ్రమాలను గూర్చి మీరు తెలుసుకొనుడు. (87) సమస్తమైన వేదశాస్త్రముల యందు అయిదవ భేదము కనిపించదు. ఈప్రకారముగా వర్ణాలను, ఆశ్రమాలను సృష్టించి దేవతలకు దేవుడు, నిర్వికారుడు అయిన భగవంతుడు; (88) దక్షాదీ న్ర్పాహ విశ్వాత్మా సృజధ్వం వివిధాః ప్రజాః | బ్రహ్మణో వచనా త్పుత్రా దక్షాద్యా మునిసత్తమాః || || 89 || అసృజన్త ప్రజాః సర్వే దేవమానుషపూర్వకాః | ఇత్యేవం భగవాన్ బ్రహ్మా స్రష్టృత్వే సంవ్యవస్థితః || || 90 || అహం వై పాలయా మీదం సంహరిష్యతి శూలభృత్ | తిస్రస్తు మూర్తయః ప్రోక్తా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || || 91 || రజస్సత్త్వతమోయోగా త్పరస్య పరమాత్మనః | అన్యోన్య మనురక్తా స్తే హ్యన్యోన్య ముపజీవినః || || 92 || అన్యోన్యప్రణతా శ్చైవ లీలయా పరమేశ్వరాః | బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ తథైవా క్షరభావనా || || 93 || విశ్వరూపుడైన భగవంతుడు, వివిధ ప్రజలను సృజించుడని దక్షుడు మొదలగు వారితో చెప్పెను. ఓముని శ్రేష్ఠులారా! బ్రహ్మ మాటవలన అతని పుత్రులైన దక్షాదులు (89) దేవతలు, మనుష్యులు మొదలుగా గల ప్రజలను సృష్టించినారు. ఈ ప్రకారము భగవంతుడైన బ్రహ్మ లోక సృష్టికార్యములో నిమగ్నుడైనాడు. (90) నేను ఈ జగత్సమూహమును కాపాడుచున్నాను. శూలధారియగు శివుడు దీనిని లయకాలములో సంహరించగలడు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ముగ్గురు త్రిమూర్తులుగా చెప్పబడినారు. (91) పరమపురుషుడైన పరమాత్మకు రజస్సు, సత్త్వము, తమస్సు అను గుణముల సంబంధము వలన క్రమముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఏర్పడిరి. వీరు పరస్పరము అనురాగము కలవారు. ఒకరిపై ఒకరు ఆధారపడి ఉందురు. (92) పరమేశ్వరరూపులైన ఆ ముగ్గురు క్రీడా రూపముగా ఒకరి కొకరు నమస్కరింతురు. బ్రాహ్మీ, మాహేశ్వరీ, మరియు అక్షరభావన అని; (93) తిస్రస్తు భావనా రుద్రే వర్తన్తే సతతం ద్విజాః | ప్రవర్తతే మయ్య జస్ర మాద్యాత్వక్షరభావనా || || 94 || ద్వితీయా బ్రహ్మణః ప్రోక్తా దేవస్యాక్షరభావనా | అహం చైవ మహాదేవో న భిన్నః పరమార్థతః || || 95 || విభజ్య స్వేచ్ఛయా త్మానం సో೭న్తర్యామీ శ్వరః స్థితః | త్రైలోక్య మఖిలం స్రష్టుం సదేవాసురమానుషమ్ || || 96 || పురుషః పరతో೭వ్యక్తో బ్రహ్మత్వం సముపాగమత్ | తస్మా ద్ర్బహ్మా మహాదేవో విష్ణు ర్విశ్వేశ్వరఃపరః || || 97 || ఏకసై#్యవ స్మృతా స్తిస్ర స్తద్వ త్కార్యవశా త్ర్పభోః | తస్మా త్సర్వప్రయత్నేన వన్ద్యాః పూజ్యా విశేషతః || || 98 || ఈ మూడు భావనలు రుద్రునియందు ఎల్లప్పుడు ప్రవర్తించును. ఓ బ్రాహ్మణులారా! మొదటిదైన అక్షరభావన నాయందు సర్వదా నిలిచి ఉండును. (94) రెండవ అక్షరభావన బ్రహ్మదేవునికి వర్తించును. వాస్తవముగా చూచినచో, నేను, మహాదేవుడగు శివుడు భిన్నులముకాము. (95) సర్వాంతర్యామియైన పరమాత్మ తన యిచ్ఛతో తనను విభజించుకొని ఉన్నాడు. దేవ, రాక్షస, మనుష్యులతో కూడిన మూడులోకాలను సృజించుటకు; (96) ఆ అవ్యక్త పురుషుడు బ్రహ్మరూపమును ధరించినాడు. అందువలన సృష్టికర్త బ్రహ్మ, మహాదేవుడగు శివుడు, జగదీశ్వరుడైన విష్ణువు అనుభేదములు; (97) ఒకే ప్రభువైన పరమపురుషుని యొక్క మూడు మూర్తులు. వారివారి కార్యములను బట్టి రూపభేదము కలిగినది. అందువలన వారు ముగ్గురు సంపూర్ణ ప్రయత్నముతో అధికముగా పూజింపదగినదవారు, నమస్కరించదగినవారుకూడ. (98) యదీ చ్ఛేదచిరాత్ స్థానం యత్త న్మోక్షాఖ్య మవ్యయమ్ | వర్ణాశ్రమప్రయుక్తేన ధర్మేణ ప్రీతిసంయుతః | || 99 || పూజయే ద్భావయుక్తేన యావజ్జీవం ప్రతిజ్ఞయా | చతుర్ణా మాశ్రమాణా న్తు ప్రోక్తో೭యం విధివ ద్ద్విజాః || || 100 || ఆశ్రమో వైష్ణవో బ్రాహ్మో హరాశ్రమ ఇతి త్రయః | తల్లిఙ్గధారీ నియతం తద్భక్తజనవత్సలః || || 101 || ధ్యాయే దథార్చయే దేతాన్ బ్రహ్మవిద్యాపరాయణాః | సర్వేషా మేవ భక్తానాం శమ్భోర్లిఙ్గ మనుత్తమమ్ || || 102 || సితేన భస్మనా కార్యం లలాటేతు త్రిపుండ్రకమ్ | యస్తు నారాయణం దేవం ప్రపన్నః పరమంపదమ్ || || 103 || మోక్షనామకమైన, నాశరహితమైన స్థానమును శీఘ్రముగా పొందుటకు కోరినచో, వర్ణాశ్రమాలతో కూడిన ధర్మముతో ప్రీతి పూర్వకముగా; (99) జీవించినంతకాలము దీక్షతో హృదయపూర్వకముగా పూజించవలెను. విప్రులారా! నాలుగు ఆశ్రమములవారికి ఈ విధానము శాస్త్రప్రకారము చెప్పబడినది. (100) వైష్ణవము, బ్రాహ్మము, శైవము అని ఆశ్రమములు మూడు కలవు. ఆయాదేవుల చిహ్నములను ధరించుచు, వారిభక్తుల యందభిమానము కలవాడై నియతముగా; (101) ఆదేవతలను ధ్యానించవలెను, వేదాంత విద్యయందు శ్రద్ధకలవారై పూజించవలెను. అందరు భక్తులకు గూడ శివుని లింగము చాలా శ్రేష్ఠమైనది. (102) తెల్లని భస్మముతో నొసటియందు మూడురేఖలను ధరించవలెను. ఎవడు భగవంతుడగు నారాయణు నాశ్రయించిపరమపదమును కొరునో; (103) ధారయే త్సర్వదా శూలం లలాటే గన్దవారిభిః | ప్రపన్నా యే జగద్బీజం బ్రహ్మాణం పరమేష్ఠినమ్ || || 104 || తేషాం లలాటే తిలకం ధారణీయన్తు సర్వదా | యో೭సా వనాది ర్భూతాదిః కాలాత్మాసౌ ధృతో೭భవత్ || || 105 || ఉపర్యధోభావయోగా త్త్రిపుండస్ర్యతు ధారణాత్ | యత్త త్ప్రధానం త్రిగుణం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ || || 106 || ధృతన్తు శూలధరణా ద్భవత్యేవ న సంశయః | బ్రహ్మతేజోమయం శుక్లం యదేత న్మణ్డలం రవేః || || 107 || భవత్యేవ ధృతం స్థాన మైశ్వరం తిలకే కృతే | తస్మా త్కార్యం త్రిశూలాఙ్కం తధాచ తిలకం శుభమ్ || || 108 || అతడు ఎల్లప్పుడు నుదుటియందు గంధోదకముతో శూలమును ధరించవలెను. ఎవరైతే లోకసృష్టికి మూలభూతుడైన పరమేష్ఠియగు బ్రహ్మ నాశ్రయింతురో వారు తమలలాటము నందు ఎల్లప్పుడు తిలకము ధరించవలెను అప్పుడు సమస్త భూతములకాది భూతుడు, జన్మలేనివాడు, కాలస్వరూపుడు అగు ఈ భగవంతుడు ధరింపబడినవాడగును. (104, 105) పైభాగము, అధోభాగములయొక్క సంబంధమువలన, మూడు రేఖలను ధరించుటవలన, బ్రహ్మవిష్ణుశివస్వరూపము, త్రిగుణాత్మకమైన ఆ ప్రధాన తత్త్వము, శూలమును ధరించుటవలన ధరింపబడినదిగానే అగుచున్నది. సందేహములేదు. బ్రహ్మతేజస్సుతో నిండినది, తెల్లనిది అగు సూర్యునియొక్క ఈ మండలము ఏదికలదో, తిలకమును ధరించుటవలన, ఆ ఈశ్వర సంబంధిస్థానము ధరించబడినదిగానే అగుచున్నది. అందువలన త్రిశూలచిహ్నము, మంగళకరమైన తిలకముకూడ తప్పక ధరించవలెను. (106, 107, 108) ఆయుష్య ఞ్చాపి భక్తానాం త్రయాణాం విధిపూర్వకమ్ | యజేత జుహుయా దగ్నౌ జపే ద్దద్యా జ్జితేన్ద్రియః || || 109 || శాన్తో దాన్తో జితక్రోధో వర్ణాశ్రమవిధానవిత్ | ఏవం పరిచరే ద్దేవాన్ యావజ్జీవం సమాహితః || | 110 || తేషాం స్వస్థాన మచలం సో೭చిరా దధిగచ్ఛతి || || 111 || ఇతి శ్రీ కూర్మపురాణ వర్ణాశ్రమవర్ణనం నామ ద్వితీయో೭ధ్యాయః అదిభక్తుల కాయుష్యమును గూడ కలిగించును. పై మూడురకముల భక్తులకు కూడ శాస్త్రప్రకారము అగ్నియందు హోమము, జపము, దానము అవశ్యకర్తవ్యములు. (109) ఇంద్రియములను జయించినవాడై, శాంతుడై, మనోనిగ్రహము కలిగి, క్రోధమును జయించి, వర్ణాశ్రమముల పద్ధతిని తెలిసినవాడై, సావధానుడై దేవతలను జీవితాంతము వరకు సేవించవలెను. (110) అట్లు చేసినచో నిశ్చలమైన తన ప్రాప్యస్థానమును అచిరకాలములోనే పొందగలడు. (111) శ్రీ కూర్మపురాణములో వర్ణాశ్రమవర్ణనమను రెండవ అధ్యాయము సమాప్తము.