Sri Koorma Mahapuranam    Chapters   

ఏకవింశో7ధ్యాయః

సూతఉవాచ:-

త్రిధన్వా రాజపుత్ర స్తు ధర్మేణా పాలయ న్మహీమ్‌ | తస్యపుత్రో7భవ ద్విద్వాం స్త్రయ్యారుణ ఇతి శ్రుతః || || 1 ||

తస్య సత్యవ్రతోనామ కుమారో7భూ న్మహాబలః | భార్యా సత్యధనా నామ హరిశ్చన్ద్ర మజీజనత్‌ || || 2 ||

హరిశ్చన్ద్రస్య పుత్రో7భూ ద్రోహితో నామ వీర్యవాన్‌ | రోహితస్య వృకః పుత్ర స్తస్మా ద్బాహు రజాయత || || 3 ||

హరితో రోహితస్యా థ ధన్ధు స్తస్య సుతో7భవత్‌ | విజయశ్చ సుదేవ శ్చ ధన్ధుపుత్రౌ బభూవతుః || || 4 ||

విజయస్యా భవత్పుత్రః కారుకో నామ వీర్యవాన్‌ | సగర స్తస్య పుత్రో7భూ ద్రాజా పరమధార్మికః || || 5 ||

ద్వే భార్యే సగరస్యాపి ప్రభా భానుమతీ తథా | తాభ్యా మారాధితో వహ్నిః ప్రదదౌ వర ముత్తమమ్‌ || || 6 ||

ఇరువది ఒకటవ అధ్యాయము

సూతుడిట్లు చెప్పెను.

రాజకుమారుడైన సుధన్వుడు ధర్మమార్గముతో భూమిని పాలించెను. అతనికి పండితుడు, త్రయ్యారుణుడను పేరుతో ప్రసిద్ధుడైన పుత్రుడు కలిగెను. (1)

అతనికి గొప్పబలము కలిగిన సత్యవ్రతుడను పుత్రుడు పుట్టెను. అతనిభార్య సత్యధన అనునామె హరిశ్చంద్రుని పుత్రునిగా పొందెను. (2)

ఆ హరిశ్చంద్రునికి పరాక్రమవంతుడైన రోహితుడను కుమారుడు కలిగెను. ఆ రోహితునికి వృకుడనుపుత్రుడు, అతనివలన బాహువు అనుకుమారుడు కలిగెను. (3)

రోహితునకు హరితుడను మరొకపుత్రుడు, అతనికి ధుంధువు అనుకుమారుడు కలిగెను. విజయుడు, సుదేవుడు అనువారు ధుంధువు పుత్రులుగా పుట్టిరి. (4)

విజయునకు కారుకుడను పేరుగల వీర్యవంతుడైన సుతుడు కలిగెను. అతనికి మిక్కిలి ధర్మస్వభావముకల సగరుడను రాజు కుమారుడుగా పుట్టెను. (5)

ఆ సగరునక ప్రభ, భానుమతి అను ఇద్దరు భార్యలుండిరి. వారిచేత పూజింపబడిన అగ్నిదేవుడు వారికి మంచి వరమిచ్చెను. (6)

ఏకం భానుమతీ పుత్ర మగృహ్ణా దసమఞ్జసమ్‌ | ప్రభా షష్టిసహస్ర న్తు పుత్రాణాం జగృహే శుభా || || 7 ||

అసమఞ్జసపుత్రో7 భూ దంశుమా న్నామ పార్థివః | తస్యపుత్రో దిలీపస్తు దిలీపాత్తు భగీరథః || || 8 ||

యేన భాగీరథీ గఙ్గా తపః కృత్వా వతారితా | ప్రసాదా ద్దేవదేవస్య మహాదేవస్య ధీమతః || || 9 ||

భగీరథస్య తపసా దేవః ప్రీతమనా హరః | బభార శిరసా గఙ్గాం సోమాన్తే సోమభూషణః || || 10 ||

భగీరథసుత శ్చాపి శ్రుతో నామ బభూవ హ | నాభాగ స్తస్య దాయాదః సిన్ధుద్వీప స్తతో7భవత్‌ || || 11 ||

అయుతాయుః సుత స్తస్య ఋతుపర్ణో మహాబలః | ఋతుపర్ణస్య పుత్రో7భూ త్సుదాసో నామ ధార్మికః || || 12 ||

ఆ వరముద్వారా భానుమతి అసమంజసుడను ఒకపుత్రుని పొందినది. మంగళరూపయగు ప్రభ అనుసగరుని భార్య అరువది వేల మంది కుమారులను స్వీకరించినది. (7)

అసమంజసునికి అంశుమంతుడను రాజు కుమారుడాయెను. అతని కుమారుడు దిలీపుడు. అతనివలన భగరీథుడను సుతుడు కలిగెను. (8)

ఏ భగీరథునిచేత తపస్సుచేసి దేవతలకు దేవుడైన శివుని అనుగ్రహమువలన గంగానది భూమికి తేబడి భాగీరథి అని పిలువబడినదో అతడే ఆ భగీరథుడు. (9)

భగీరథుని తపస్సుచేత సంతోషించిన మనస్సుకల, చంద్రుని భూషణముగా ధరించిన శివుడు గంగానదిని శిరస్సుపై చంద్రుని ప్రక్కన ధరించెను (10)

ఆ భగీరథుని పుత్రుడుగా శ్రుతుడనువాడు పుట్టెను. అతని సంతానముగా నాభాగుడు, అతనివలన సింధుద్వీపుడు అనువాడు జన్మించెను. (11)

సింధుద్వీపునికి గొప్పబలముకలవాడు, అయుతసంవత్సరముల ఆయుర్దాయము కలవాడును అగు ఋతుపర్ణుడను కుమారుడు కలిగెను. అతనికి ధర్మశీలముకల సుదాసుడను కొడుకు పుట్టెను. (12)

సౌదాస స్తస్య తనయః ఖ్యాతః కల్మాషపాదకః | వసిష్ఠస్తు మహాతేజాః క్షేత్రే కాల్మాషపాదకే || || 13 ||

అశ్మకం జనయామాస త మిక్ష్వాకుకులధ్వజమ్‌ | అశ్మక స్యోత్కలాయాన్తు నకులో నామ పార్థివః || || 14 ||

సహి రామభయా ద్రాజా వనం ప్రాప సుదుఃఖితః | దధ త్సనారీకవచం తస్మా చ్ఛరథో7భవత్‌ || || 15 ||

తస్మా ద్బిబిలః శ్రీమాన్‌ వృద్ధశర్మా చ తత్సుతః | తస్మా ద్విశ్వసహ స్తస్మా త్ఖట్వాఙ్గ ఇతి విశ్రుతః || || 16 ||

దీర్ఘబాహుః సుత స్తస్మా ద్రఘు స్తస్మా దజాయత | రఘో రజః సముత్పన్నో రాజా దశరథ స్తతః || || 17 ||

రామో దాశరథి ర్వీరో ధర్మజ్ఞో లోకవిశ్రుతః | భరతో లక్ష్మణ శ్చైవ శత్రుఘ్న శ్చ మహాబలః || || 18 ||

సుదాసుని పుత్రుడు కల్మాషపాదకుడని ప్రసిద్ధుడైన వాడుఉండెను. గొప్పతేజస్సుకలవసిష్ఠుడు, కల్మాషపాదుని క్షేత్రము నందు; (13)

ఇక్ష్వాకువంశమునకు పతాకము వంటి అశ్మకుడను కుమారునకు జన్మనిచ్చెను. అశ్మకునికి ఉత్కలయను భార్యయందు నకులుడను రాజుపుట్టెను. (14)

ఆ నకులుడు పరశురాముని భయమువలన మిక్కిలి దుఃఖముతో అడవికేగెను. అతడు స్త్రీల వస్త్రధారణముచేసి తప్పించుకొనెను. అతనివలన శతరధుడు పుట్టెను. (15)

శతరథునివలన శ్రీమంతుడగు బిలబిలుడు కలిగెను. అతని పుత్రుడు వృద్ధశర్మ, అతనికి విశ్వసహుడను పుత్రుడు, అతనికి ఖట్వాంగుడను వాడు తనయుడుగా జన్మించెను. (16)

ఖట్వాంగునకు దీర్ఘబాహువు కలిగెను. అతని వలన రఘువు జన్మించెను. రఘువువలన అజుడను పుత్రుడు, అతనికి దశరథుడను కుమారుడు జన్మించిరి. (17)

ఆ దశరథునివలన వీరుడు, ధర్మములు తెలిసినవాడు, లోకవిఖ్యాతుడు అగు రాముడు, భరతుడు, లక్ష్మణశత్రుఘ్నులు అనుబలవంతులు జన్మించిరి. (18)

సర్వే శక్రసమా యుద్ధే విష్ణుశక్తిసమన్వితాః | జజ్ఞే రావణనాశార్థం విష్ణు రంశేన విశ్వభుక్‌ || || 19 ||

రామస్య భార్యా సుభగా జనకస్యాత్మజా శుభా | సీతా త్రిలోకవిఖ్యాతా శీలౌదార్యగుణాన్వితా || || 20 ||

తపసా తోషితా దేవీ జనకేన గిరీన్ద్రజా | ప్రాయచ్ఛ జ్జానకీం సీతాం రామ మేవాశ్రితాం పతిమ్‌ || || 21 ||

ప్రీతశ్చ భగవా నీశ స్త్రిశూలీ నీలలోహితః | ప్రదదౌ శత్రునాశార్థం జనకాయా ద్భుతం ధనుః || || 22 ||

స రాజా జనకో ధీమాన్‌ దాతుకామః సుతా మిమామ్‌ | అఘోషయ దమిత్రఘ్నో లోకే7స్మి న్ద్విజపుఙ్గవాః || || 23 ||

వారందరుకూడ యుద్ధరంగుములో ఇంద్రునితో సమానబలము కలవారు, విష్ణువుయొక్క అంశలు ధరించినవారు. రావణుని సంహరించుట కొరకు నారాయణుడు అంశరూపములతో అవతరించెను. (19)

జనకుని కూతురు, మంగళరూప, ఉత్తమురాలు, మూడులోకములందు ప్రఖ్యాతి వహించినది, శీలము ఔదార్యము అనుగుణములు కలది అగుసీత రామునకు భార్య ఆయెను. (20)

పర్వతరాజు పుత్రియగు పార్వతి అనకుని తపస్సుచేత సంతోషము పొందినదై, రామునే భర్తగా ఆశ్రయించు సీతను జనకుని కూతురుగా అనుగ్రహించెను. (21)

భగవంతుడు, నీలలోహితుడు, త్రిశూలము ధరించిన వాడగు శంకరుడు కూడ సంతోషించినవాడై శత్రుసంహారము కొరకు జనకునకు ఆశ్చర్యకరమైన ధనుస్సును ఇచ్చినాడు. (22)

బుద్ధిమంతుడగు ఆజనకమహారాజు తనపుత్రికయగు సీతను యోగ్యుడైన వరునికిచ్చుటకుగాను, ఓ బ్రాహ్మణశ్రేష్ఠలారా! లోకములో ఈ విధముగా ప్రకటించినాడు. (23)

ఇదం ధనుః సమాదాతుం యః శక్నోతి జగత్త్రయే | దేవో వా దానవో వాపి స సీతాం లబ్ధు మర్హతి || || 24 ||

విజ్ఞాయ రామో బలవాన్‌ జనకస్య గృహం ప్రభుః | భఞ్జయామాస చాదాయ గత్వా సౌ లీలయైవహి || || 25||

ఉద్వవాహా థ తాం కన్యాం పార్వతీ మివ శంకరః | రామః పరమధర్మాత్మా సేనా మివ చ షణ్ముఖః || || 26 ||

తతో బహుతిథే కాలే రాజా దశరథః స్వయమ్‌ | రామం జ్యేష్ఠసుతం వీరం రాజానం కర్తు మారభత్‌ || || 27 ||

తస్యా థ పత్నీ సుభగా కైకేయీ చారుహాసినీ | నివారయామాస పతిం ప్రాహ సంభ్రాన్తమానసా || |7 28 ||

ఈ మూడు లోకములయందు దేవజాతీయుడు, దానవుడుకాని ఎవడైనను ఈ శివధనుస్సును ఎక్కుపెట్టుటకు సమర్థుడైనచో వాడు నాపుత్రిక సీతను భార్యగా పొందుటకర్హుడగును. (24)

ఆ విషయము తెలిసికొని బలవంతుడైన రాముడు జనకుని నివాసమునకువెళ్లి, ఆ చాపమును గ్రహించి సులభముగా దానిని విరిచెను. (25)

తరువాత మిక్కిలి ధర్మాత్ముడగు రాముడు, పార్వతిని శంకరుడు గ్రహించినట్లు, దేవసేన భారమును కుమారస్వామి వహించినట్లు ఆ సీతను వివాహమాడి భార్యగా స్వీకరించెను. (26)

తరువాత చాలాకాలము గడిచిన పిదప దశరథమహారాజు. తనజ్యేష్ఠపుత్రుడు, వీరుడును అగు రాముని రాజుగా చేయుటకు స్వయముగా పూనుకొనెను. (27)

అప్పుడు దశరథుని భార్య, అందమైనది, చక్కని నవ్వుకలది అగుకైకేయి అతనిని వారించినది. తత్తరపడిన మనస్సుకలదై భర్తతో ఇట్లనెను. (28)

మత్సుతం భరతం వీరం రాజానం కర్తు మర్హసి | పూర్వ మేవ వరౌ యస్మా ద్దత్తౌ మే భవతా యతః || || 29 ||

స తస్యా వచంన శ్రుత్వా రాజా దుఃఖితమానసః | బాఢ మిత్యబ్రవీ ద్వాక్యం తథా రామో7పి ధర్మవిత్‌ || || 30 ||

ప్రణమ్యాథ పితుః పాదౌ లక్ష్మణన సహాచ్యుతః | య¸° వనం సపత్నీకః కృత్వా సమయ మాత్మవాన్‌ || || 31 ||

సంవత్సరాణాం చత్వారి దశ చైవ మహాబలః | ఉవాస తత్ర భగవాన్‌ లక్ష్మణన సహ ప్రభుః || || 32 ||

కదాచి ద్వసతో7రణ్య రావణో నామ రాక్షసః | పరివ్రాజకవేషేణ సీతాం హృత్వా య¸° పురీమ్‌ || || 33 ||

నాకుమారుడు, వీరుడు అయిన భరతుని రాజుగా చేయదగియున్నది. ఎందుకనగా నీచేత నాకు పూర్వకాలమునందే రెండు వరములు వాగ్దానము చేయబడినవి కదా! (29)

ఆ దశరథుడు కైకేయి మాటనువిని మనస్సులో చాలాదుఃఖించినవాడై అట్లే యని అంగీకారవాక్యమను పలికెను. ధర్మమును తెలిసిన రాముడుకూడ అదేవిధముగా సమ్మతించెను. (30)

తరువాత ఆ రాముడు తండ్రిపాదములకు నమస్కరించి, తమ్ముడగు లక్ష్మణునితో, భార్యయగు సీతతోకూడి నియమప్రతిజ్ఞను చేసి అడవికి వెళ్లెను. (31)

గొప్పబలవంతుడైన ఆ రాముడు పదునాలుగు సంవత్సములపర్యంతము లక్ష్మణునితోగూడ ఆ అడవులలో నివసించెను. (32)

ఆ వనవాసకాలములో ఒకమారు రావణుడను పేరుగల రాక్షసరాజు సన్న్యాసి వేషముతో వచ్చి సీతనపహరించి తనపట్టణమునకు వెళ్లి పోయెను. (33)

అదృష్ట్వా లక్ష్మణో రామః సీతా మాకులితేన్ద్రియా | దుఃఖశోకాభిసన్తప్తౌ బభూవతు రరిన్దమౌ || || 34 ||

తతః కదాచి త్కపినా సుగ్రీవేణ ద్విజోత్తమాః | వానరాణా మభూత్సఖ్యం రామస్యా క్లిష్టకర్మణః || || 35 ||

సుగ్రీవస్యా నుగో వీరో హనుమా న్నామ వానరః | వాయుపుత్రో మహాతేజా రామస్యాసీ త్ర్పియః సదా || || 36 ||

స కృత్వా పరమం ధైర్యం రామాయ కృతనిశ్చయః | ఆనయిష్యామి తాం సీతా మిత్యుక్త్వా విచచార హ || || 37 ||

మహీం సాగరపర్యన్తాం సీతాదర్శనతత్పరః | జగామ రావణపురీం లంకాం సాగరసంస్థితామ్‌ || || 38 ||

తరువాత సీతకనుపించక రామలక్ష్మణులు కలతచెందినమనస్సుకలవారై దుఃఖముతో, శోకముతో పీడింపబడినవారైరి. (34)

విప్రులారా! తరువాత ఒకమారు వానరరాజైన సుగ్రీవునితో, నిర్మల చరిత్ర కలిగిన రామునకు స్నేహము కలిగెను. (35)

సుగ్రీవుని అనుచరుడగు హనుమంతుడను వానరుడు వాయుపుత్రుడు, గొప్పతేజస్సుకలవాడు. అతడు రామునకు ఎల్లప్పుడు ఇష్టమైనవాడుగా ఆయెను. (36)

ఆ హనుమంతుడు గొప్పధైర్యముచేసి, నిశ్చయముచేసికొన్నవాడై, సీతను తీసుకొనిరాగలనని పలికి ఆమెజాడకొరకు ప్రయాణమయ్యెను. (37)

సీతజాడను తెలిసికొనుట యందాసక్తికలహనుమంతుడు సముద్రము వరకుగలభూమిని సంచరించి, సముద్రమధ్యములో నుండి రావణునిచే పాలింపబడుచున్న లంకాపట్టణమును చేరెను. (38)

తత్రా థ నిర్జనే దేశే వృక్షమూలే శుచిస్మితామ్‌ | అపశ్యదమలాం సీతాం రాక్షసీభిః సమావృతామ్‌ || || 39 ||

అశ్రుపూర్ణేక్షణాం హృద్యాం సంస్మరన్తీ మనిన్దితామ్‌ | రామ మిన్దీవరశ్యామం లక్ష్మణం చాత్మసంస్థితమ్‌ || || 40 ||

నివేదయిత్వా చాత్మానం సీతాయై రహసి ప్రభుః | అసంశయాయ ప్రదదా వసై#్య రామాఙ్గుళీయకమ్‌ || || 41 ||

దృష్ట్వా ఙ్గులీయకం సీతా పత్యుః పరమశోభనమ్‌ | మేనే సమాగతం రామం ప్రీతివిస్పురితేక్షణా || || 42 ||

సమాశ్వాస్య తదా సీతాం దృష్టవా రామస్య చాన్తికమ్‌ | నయిష్యే త్వాం మహాబాహు ముక్త్వా రామం య¸° పునః || || 43 ||

తరువాత ఆలంకలో జనశూన్యమైన ప్రదేశములో ఒకచెట్టుమొదట రాక్షసస్త్రీలచేత చుట్టబడిన, స్వచ్ఛమైన చిరునవ్వుకలిగి నిర్మలరూపముతో నున్న సీతను హనుమంతుడు చూచెను. (39)

బాష్పబిందువులతోనిండిన కన్నులుకలిగి, మనోహరముగానున్నది, నల్లకలువల వంటి శరీరముకల రాముని, లక్ష్మణునితో కూడ తన హృదయమందున్నవానిని, స్మరించుచున్న, నిందితురాలు కాని సీతను చూచెను. (40)

సమర్థుడైనహనుమంతుడు ఏకాంతములో సీతకు తనను పరిచయము చేసికొని, ఆమెకు శంకలేకుండుకొరకు రాముడిచ్చిన ఉంగరమును ఆనవాలుగా ఆమెకిచ్చెను. (41)

ఆ సీత తనభర్తయొక్క మంగళకరమైన ఉంగరమును చూచి, సంతోషముతో వికసించిన కన్నులు కలదై, రాముడే తనవద్దకు వచ్చినట్లుగా తలచెను. (42)

అప్పుడాహనుమంతుడు సీతనూరడించి, గొప్పభుజములు కలరాముని దగ్గరకు నిన్ను తీసుకొని వెళ్లుదునని ఆమెతోచెప్పి మరల అక్కడి నుండి రామునిగూర్చి బయలుదేరెను. (43)

నివేదయిత్వా రామాయ సీతాదర్శన మాత్మవాన్‌ | తస్థౌ రామేణ పురతో లక్ష్మణన చ పూజితః || || 44 ||

తతః స రామో బలవాన్‌ సార్థం హనుమతా స్వయమ్‌ | లక్ష్మణన చ యుద్ధాయ బుద్ధిం చక్రేహి రక్షసా || || 45 ||

కృత్వా థ వానరశ##తై ర్లఙ్కామార్గం మహోదధేః | సేతుం పరమధర్మాత్మా రావణం హతవా న్ప్రభుః || || 46 ||

సపత్నీకం హి ససుతం సభ్రాతృక మరిన్దమః | ఆనయామాస తాం సీతాం వాయుపుత్రసహాయవాన్‌ || || 47 ||

సేతుమధ్యే మహాదేవ మీశానం కృత్తివాససమ్‌ | స్థాపయామాస లిఙ్గస్థం పూజయామాస రాఘవః || || 48 ||

రామునిచేరి ఆత్మవిశ్వాసము కలహనుమంతుడు, తానుసీతను దర్శించిన విషయమాయనకు తెలిపి, లక్ష్మణునిచేత గైరవింపబడినవాడై రాముని ఎదురుగా నిలుచుండెను. (44)

తరువాత బలవంతుడైన రాముడు హనుమంతునితో, లక్ష్మణునితో కూడ ఆలోచించి రాక్షసుడైన రావణునితో యుద్ధముచేయుటకు స్వయముగా నిశ్చయించెను. (45)

పిమ్మట వందల కొలది వానరులతో సముద్రముపైన లంకా నగరమునకు వెళ్లుటకు మార్గముగా వంతెనను నిర్మించి, మిక్కిలి ధర్మాత్ముడైన రాముడు రావణాసురుని చంపెను. (46)

భార్యాసహితుడైన రావణుని, అతని కుమారుడగు ఇంద్రజిత్తును, సోదరుడగు కుంభకర్ణుని సంహరించి శత్రువిజయియగు రాముడు, హనుమంతుని సహాయముతో సీతను తిరిగి తెచ్చెను. (47)

ఆ వంతెన మధ్యభాగములో రాముడు, చర్మము వస్త్రముగా ధరించిన ఈశానుడగు శంకరుని, లింగరూపములోనున్న వానినిగా ప్రతిష్ఠించి పూజించెను. (48)

తస్య దేవో మహాదేవః పార్వత్యా సహ శంకరః | ప్రత్యక్ష మేవ భగవా న్దత్తవా స్వర ముత్తమమ్‌ || || 49 ||

యత్త్వయా స్థాపితం లిఙ్గం ద్రక్ష్యన్తీదం ద్విజాతయః | మహాపాతకసంయుక్తా స్తేషాం పాపం వినంక్ష్యతి || || 50 ||

అన్యాని చైవ పాపాని స్నాతస్యా త్ర మహోదధౌ | దర్శనా దేవ లిఙ్గస్య నాశం యాన్తి న సంశయః || || 51 ||

యావత్‌ స్థాస్యన్తి గిరయో యావ దేషా చ మేదినీ | యావ త్సేతుశ్చ తావచ్చ స్థాస్యామ్యత్ర తిరోహితః || || 52 ||

స్నానం దానం తపః శ్రాద్ధం సర్వం భవతు చాక్షయమ్‌ | స్మరణా దేవ లిఙ్గస్య దినపాపం ప్రణశ్యతి || || 53 ||

ఆ రామునికి మహాదేవుడగు శంకరుడు పార్వతీదేవితో కూడ సాక్షాత్కరించి శ్రేష్ఠమైన ఒకవరమునిచ్చెను. (49)

నీచేత ఇక్కడ ప్రతిష్ఠించబడిన యీ లింగమును ద్విజాతివారగు మానవులు చూచినయెడల, మహాపాపములతో కూడినవారైనప్పటికి వారి పాపము తొలగిపోగలదు. (50)

ఇక్కడి సముద్రములో స్నానముచేసిన వానియొక్క ఇతరపాపములుకూడ, లింగదర్శనముచేతనే నశించిపోవును. సందేహములేదు. (51)

ప్రపంచములో ఎప్పటివరకు పర్వతములు నిలిచి ఉండునో, ఎంతవరకు ఈభూమి ఉండునో, ఈవంతెన ఎంతకాలముండునో, అంతకాలము నేనిక్కడ అదృశ్యరూపుడనై నిలిచిఉందును. (52)

ఈసేతువువద్ద స్నానము, దానము, తపస్సు, శ్రాద్ధము చేయబడిన దంతయు అక్షయముగా నుండును. ఇక్కడి లింగమును తలచుకొన్నంతనే ఏదినపు పాపము ఆదినముననే నశించిపోవును. (53)

ఇత్యుక్త్వా భగవా ఞ్ఛమ్భుః పరిష్వజ్య తు రాఘవమ్‌ | సనన్దీ సగణో రుద్ర స్తతైవా న్త రధీయత || || 54 ||

రామో7పి పాలయామాస రాజ్యం ధర్మపరాయణః | అభిషిక్తో మహాతేజా భరతేన మహాబలః || || 55 ||

విశేషా ద్బ్రాహ్మణా న్సర్వా న్పూజయామాస చేశ్వరమ్‌ | యజ్ఞేన యజ్ఞహన్తార మశ్వమేధేన శఙ్కరమ్‌ || || 56 ||

రామస్య తనయో జజ్ఞే కుశ ఇత్యభివిశ్రుతః | లవశ్చ సుమహాభాగః సర్వతత్త్వార్థవి త్సుధీః || || 57 ||

అతిథిస్తు కుశా జ్జజ్ఞే నిషధ స్తత్సుతో7భవత్‌ | నలశ్చ నిషధస్యా సీత్‌ నభా స్త స్మా దజాయత || || 58 ||

భగవంతుడైన శివుడు ఇట్లు పలికి శ్రీరాముని కౌగిలించుకొని, నందీశ్వరునితో, ప్రమధగణములతోకూడి అక్కడనే అదృశ్యమాయెను. (54)

ఆ రాముడుకూడ ధర్మమార్గ పరాయణుడై, పట్టాభిషిక్తుడై, భరతునితోగూడి మహాబలవంతుడుగా రాజ్యమును పరిపాలించెను. (58)

విశేషముగా బ్రాహ్మణులందరిని, ఈశ్వరునిగూడ పూజించెను. అశ్వమేథ యాగముతో, దక్షయజ్ఞధ్వంసము కావించిన శంకరుని పూజించెను. (56)

రామునకు కుశుడని ప్రసిద్ధుడైన కుమారుడు జన్మించెను. మహానుభావుడు, అన్ని తత్త్వముల సారము తెలిసిన బుద్ధిమంతుడైన లవుడు కూడ పుత్రుడుగా కలిగెను. (57)

కుశునివలన అతిథియను కుమారుడు కలుగగా, అతనికి నిషధుడను పుత్రుడు జనించెను. నిషధునకునలుడు, అతనికి నభుసుడు పుత్రులుగా జన్మించిరి. (58)

నభసః పుణ్డరీకాక్షో క్షేమధన్వా తు తత్సుతః | తస్య పుత్రో7భవ ద్వీరో దేవానీకః ప్రతాపవాన్‌ || || 59 ||

అహీనగు స్తస్య సుతో మహస్వాం స్తత్సుతో7భవత్‌ | తస్మా చ్చన్ద్రావలోకస్తు తారాధీశశ్చ తత్సుతః || || 60 ||

తారాధీశాచ్చ న్ద్రగిరి ర్భానువిత్త స్తతో7భవత్‌ | శ్రుతాయు రభవ త్తస్మా దేతే చేక్ష్వాకువంశజాః || || 61 ||

సర్వే ప్రాధాన్యతః ప్రోక్తాః సమాసేన ద్విజోత్తమాః | య ఇమం శ్రుణుయా న్నిత్య మి క్ష్వాకో ర్వంశ ముత్తమమ్‌ || || 62 ||

సర్వపాపవినిర్ముక్తో దేవలోకే మహీయతే ||

ఇతి శ్రీ కూర్మపురాణ ఇక్ష్వాకువంశవర్ణనం నామ ఏకవింశో7ధ్యాయః

నభస్సు అనువానికి పుండరీకాక్షుడు, అతనికి క్షేమధన్వ అనువాడు కుమారులుగా పుట్టిరి. ఆ క్షేమధన్వునికి ప్రతాపవంతుడగు దేవానీకుడను వీరుడు పుత్రుడుగా జన్మించెను. (59)

అతని పుత్రుడు అహీనగువు అనువాడు. అతనికి మహస్వంతుడు కుమారుడాయెను. అతనివలన చంద్రావలోకుడు పుట్టెను. అతని పుత్రుడు తారాధీశుడనువాడు కలిగెను. (60)

తారాధీశునివలన చంద్రగిరి అనుకుమారుడు, అతనివలన భానువిత్తుడను సుతుడు కలిగెను. అతనివలన శ్రుతాయువను పుత్రుడు జన్మించెను. వీరందరు ఇక్ష్వాకువంశములో జన్మించినవారు. (61)

బ్రాహ్మణశ్రేష్ఠులారా! అందరు వారి ప్రాధాన్యాన్నిబట్టి సంగ్రహముగా చెప్పబడినారు. శ్రేష్ఠమైన యీ ఇక్ష్వాకువంశమును గూర్చి ఎవడు వినునో, అతడు అన్నిపాపములనుండి విముక్తుడై దేవలోకములో ప్రకాశించును. (62)

ఇరువదొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters