Sri Koorma Mahapuranam
Chapters
చతుర్వింశో7ధ్యాయః అథవంశకీర్తివర్ణనమ్ సూతఉవాచ:- క్రోష్టో రేకో7భవ త్పుత్రో వజ్రవా నితి విశ్రుతః | తస్య పుత్రో7భవ చ్ఛాన్తిః కుశిక స్తత్సుతో7భవత్ || || 1 || కుశికా దభవత్సుత్రో నామ్నా చిత్రరథో బలీ | అథ చైత్రరథి ర్లోకే శశబిన్దు రితి స్మృతః ||
|| 2 || ఇరువది నాల్గవ అధ్యాయము వంశకీర్తి వర్ణనము సూతుడిట్లు చెప్పెను :- క్రోష్టువునకు వజ్రవంతుడని ప్రసిద్ధుడైన ఒకకుమారుడు కలిగెను. అతనికి శాంతి అనుపుత్రుడు, వానికి కుశికుడను కుమారుడు కలిగెను. (1) ఆ కుశునివలన చిత్రరధుడనుపేరుగల బలవంతుడైన కుమారుడు పుట్టెను. తరువాత చిత్రరథుని పుత్రుడు శశబిందువు అనువాడు కలిగెను. (2) తస్య పుత్రః పృథుయశా రాజా భూ ద్ధర్మతత్పరః | పృథుకర్మా చ తత్పుత్ర స్తస్మా త్పృథుజయో7భవత్ || || 3 || పృథుకీర్తి రభూ త్తస్మా త్పృథుదాన స్తతో7భవత్ | పృథుశ్రవా స్తస్క పుత్ర స్తస్యాసీ త్పృథుసత్తమః || || 4 || ఉశనా స్తస్య పుత్రో7భూ చ్ఛతేషు స్తత్సుకో7భవత్ | తస్మా ద్వైరుక్మకవచః పరావృత్త శ్చ తత్సుతః || || 5 || పరావృత్తసుతో జజ్ఞే విదర్భాత్ర్కధ కౌశికౌ | తస్మాద్విదర్భః సఞ్జజ్ఞే యామఘోలోకవిశ్రుతః || || 6 || లోమపాద స్తృతీయ స్తు బభ్రు స్తస్యాత్మజో నృపః | ధృతి స్తస్యాభవ త్పుత్రః శ్వేత స్తస్యాప్యభూ త్సుతః || || 7 || శ్వేతస్య పుత్రో బలవా న్నామ్నా విశ్వసహః స్మృతః | తస్య పుత్రో మహావీర్యః ప్రభావా త్కౌశికః స్మృతః || || 8 || అతనికి పృథుయశుడను ధర్మమునందు శ్రద్దకలరాజు పుట్టెను. ఆరాజునకు పృథుకర్మఅనుపుత్రుడు, అతనివలన పృథుజయుడు కుమారుడుగా పుట్టెను.(3) వానివలన పృథుకీర్తి అనువాడు పుట్టెను. అతనికి పృథుదానుడను పుత్రుడు, అతనికి పృథుశ్రవుడు అనుకుమారుడు, అతనికి పృథుసత్తముడను పుత్రుడు కలిగిరి. (4) ఆపృథుసత్తమునకు ఉశనసుడు పుత్రుడాయెను. అతనికి శ##తేషువు, అతనికి రుక్మ కవచుడు అనువారు సంతానముగా కలిగిరి. రుక్మకవచు నికి పరావృత్తుడు పుత్రుడగా జన్మించెను. (5) పరావృత్తునకు యామఘుడనిలోకమందు ప్రఖ్యాతుడైన కుమారుడు కలిగెను. అతనివలన విదర్భుడు పుట్టెను. వానివలన క్రథకౌశికులను కుమారులు పుట్టిరి. (6) మూడవ వాడుగా అతనికి లోమపాదుడు కలిగెను. ఆ లోమపాదునకు బభ్రువనువాడు పుత్రుడాయెను. అతనికి ధృతి అనుకుమారుడు, శ్వేతుడను సుతుడు కలిగిరి. (7) శ్వేతునకు బలవంతుడు, విశ్వసహుడను పేరుతో ప్రసిద్ధుడగు కుమారుడు కలిగెను. అతనిపుత్రుడు గొప్పపరాక్రమము కలవాడు, ప్రభావము వలన కౌశికుడని చెప్పబడినాడు. (8) అభూత్తస్య సుతో ధీమాన్ సమన్తశ్చ తతో 7 నలః | అనలస్య సుతః శ్వేనిః శ్వేనే రన్యే 7 భవన్సుతాః | || 9 || తేషాం ప్రధానో ద్యుతిమా న్వపుష్మా న్తత్సుతో 7 భవత్ | వపుష్మతో బృహన్మేధాః శ్రీదేవ స్తత్సుతో 7 భవత్ || 10 || తస్య వీతరథో విప్రా రుద్రభక్తో మహాబలః | క్రథస్యా ప్యభవ త్కున్తి ర్వృష్ణిస్తస్యాభవ త్సుతః || || 11 || తస్మా న్నవరథో నామ బభూవ సుమహాబలః | కదాచి న్మృగయాం యాతో దృష్ట్వా రాక్షస మూర్జితమ్ || || 12 || దుద్రావ మహతా విష్టో భ##యేన మునిపుఙ్దగవాః | అన్వధావత సంక్రుద్ధో రాక్షసస్తం మహాబలః || || 13 || ఆ కౌశికునకు బుద్ధిమంతుడైన సుమంతుడను కొడుకు పుట్టెను అతనివలన అనలుడు, ఆ అనలునకు శ్వేని అనుకుమారుడు కలుగగా, శ్వేనికి కొందరు పుత్రులు పుట్టినారు. (9) వారిలో ముఖ్యుడైన వాడు ద్యుతిమంతుడనువాడు. అతనికి వపుష్మంతుడను పుత్రుడు జన్మించినాడు. ఆ వపుష్మంతునకు బృహన్మేధ అనుకుమారుడు, అతనికి శ్రీదేవుడు అనుకుమారుడు పుట్టెను. (10) బ్రాహ్మణులారా! ఆ శ్రీదేవునకు వీతరథుడను కుమారుడు, గొప్పబలముకలవాడు, శివునియందు భక్తికలవాడు జన్మించెను. క్రథుడను వానికి కున్తి అనువాడు జన్మించగా, అతనికి వృష్టి అనుకుమారుడు పుట్టెను (11) ఆ వృష్టికి మిక్కిలి బలవంతుడైన నవరథుడను పుత్రుడు కలిగినాడు. అతడొకమారు వేటమార్గముగా బయలుదేరినవాడై అక్కడ మహా బలవంతుడు, క్రూరుడైన ఒకరాక్షసుని చూచి (12) మిక్కిలి భయమును పొందినవాడై పలాయనము చేసెను. ఓ మునిశ్రేష్ఠులారా! అది చూచి గొప్పబలము కల ఆరాక్షసుడు కోపించినవాడై ఆ నవరథుని వెంబడించి తరుమసాగెను. (13) దుర్యోధనో 7గ్నిసఙ్కాశః శూలాసక్తమహాకరః | రాజా నవరథో భీతో నాతిదూరా దవస్థితమ్ || || 14 || అపశ్య త్పరమం స్థానం సరస్వత్యాః సుగోపితమ్ | స తద్వేగేన మహతా సంప్రాప్య మతిమా న్నృపః || || 15 || వవన్దే శిరసా దృష్ట్వా సాక్షా ద్దేవీం సరస్వతీమ్ | తుష్టాన వాగ్భి రిష్టాభి ర్బద్ధాఞ్జలి రమిత్రజిత్ || || 16 || పపాత దణ్డన ద్భూమౌ త్వా మహం శరణం ఙ్గతః | నమస్యామి మహాదేవీం సాక్షా ద్దేవీం సరస్వతీమ్ || || 17 || వాగ్దేవతా మనాద్యన్తా మీశ్వరీం బ్రహ్మచారిణీమ్ | నమస్యే జగతాం యోనిం యోగినీం పరమాం కలామ్ || || 18 || ఎదుర్కొనుటకు శక్యము కానివాడు, అగ్నితో సమానతేజముకలవాడు, తన పెద్దచేతియందు శూలమును ధరించినవాడై ఆరాక్షసుడుండెను. భయమునొందిన రాజు నవరథుడు అక్కడికి కొంతదూరములో ఉన్నటువంటి (14) సరస్వతియొక్క రహస్యముగా కాపాడిబడిన శ్రేష్ఠమైన ప్రదేశమును చూచెను. వెంటనే తెలివికల ఆరాజు వేగముగా నడిచి ఆరహస్య ప్రదేశమును చేరి, (15) సాక్షాత్తుగా అక్కడవెలసియున్న సరస్వతీదేవిని చూచి తలవంచి నమస్కరించెను. శత్రువులను జయించిన ఆరాజు దోసిలి జోడించి ప్రియుములైన వాక్కులతో ఆదేవిని స్తోత్రము చేసెను. (16) నేలమీద సాష్టాంగ నమస్కారము చేసి ''నిన్ను నేను శరణము పొందుచున్నాను'' అని పలికి గొప్పదేవతవు సాక్షాత్తు సరస్వతీ దేవివైన నిన్ను గూర్చి నమస్కరించుచున్నాను. (17) ఆద్యంతములు లేని, ఈశ్వరిని, బ్రహ్మచారిణి అగువాగ్దేవతను, లోకములకు కారణభూతురాలైన, యోగిని, పరమకలారూపయగుదేవికి నమస్కరింతును. (18) హిరణ్యగర్భసంభూతాం త్రినేత్రాం చంద్రశేఖరామ్ | నమస్యే పరమానన్దాం చిత్కలాం బ్రహ్మరూపిణీమ్ || || 19 || పాహి మాం పరమేశాని భీతం శరణ మాగతమ్ | ఏతస్మి న్నన్తరే క్రుద్ధో రాజానం రాక్షసేశ్వరః || || 20 || హన్తుం సమాగతః స్థానం యత్ర దేవీ సరస్వతీ | సముద్యమ్య తథా శూలం ప్రవిష్టో బలగర్వితః || || 21 || త్రిలోకమాతు ర్హి స్థానం శశాఙ్కాదిత్యసన్నిభమ్ | తదన్తరే మహద్భూతం యుగాన్తాదిత్యసన్నిభమ్ || || 22 || శూలేనోరసి నిర్భిద్య పాతయామాస తం భువి | గచ్ఛేత్యాహ మహారాజ న స్థాతవ్యం త్వయా పునః || || 23 || ఇదానీం నిర్భయ స్తూర్ణం స్థానే7స్మి న్రాక్షసో హతః | తతఃప్రణమ్య హృష్టాత్మా రాజా నవరథః పరమ్ || || 24 || ''హిరణ్యగర్భుని వలన పుట్టినది, మూడుకన్నులు కలది, చంద్రకళ శిరోభూషణముగా కలది, పరమానందస్వరూపురాలు, జ్ఞానకళారూపిణి, బ్రహ్మస్వరూపము కలదేవికి నమస్కరించుచున్నాను. (19) ఓ పరమేశ్వరీ! భయపడి నీశరణు గోరవచ్చిన నన్ను కాపాడుము'' అని ప్రార్థించెను. ఇంతలో కోపమును పొందిన ఆ రాక్షసరాజు రాజును (20) చంపుటకు, సరస్వతీదేవి నివసించియున్న స్ధానమునకు చేతిలో శూలమును పైకెత్తి పట్టుకొని బలగర్వముతో కూడినవాడై చేరెను. (21) చంద్రసూర్యుల కాంతితో సమానముగా ప్రకాశించుచున్నట్టి, మూడులోకములకు తల్లియగు దేవియొక్క స్థానమునకు రాక్షసుడుచేరగా, ఆ సమయమున ప్రళయకాలపు సూర్యునితో సమానమైన ఒకమహాభూతము (22) శూలముతో ఆరాక్షసుని వక్షమునందు పొడిచి వానిని క్రింద పడవైచెను. తరువాత రాజుతో, ''నీవిక ఇక్కడ ఉండవలదు, వెళ్లిపొమ్ము'' అని పలికెను. (23) ''ఈ ప్రదేశములోని రాక్షసుడిప్పుడు చంపబడినాడు. ఇక నీవు భయమువదలి తొందరగా వెళ్లుము'' అని పలుకగా సంతోషించినవాడై రాజు నవరథుడు నమస్కరించి, (24) పురీం జగామ విప్రేన్దాః పురన్దరపురోపమామ్ | స్థాపయామాస దేవేశీం తత్ర భక్తిసమన్వితః || || 25 || ఈజే చ వివిధై ర్యజ్ఞై ర్హోమై ర్దేవీం సరస్వతీమ్ | తస్య చాసీ ద్దశరథః పుత్రః పరమధార్మికః || || 26 || దేవ్యా భక్తో మహాతేజాః శకుని స్తస్య చాత్మజః | తస్మా త్కరమ్భః సమ్భూతో దేవరాతో 7 భవ త్తతః || || 27 || ఈజే స చాశ్వమేధేన దేవక్షత్రశ్చతత్సుతః | మధు స్తస్య తు దాయాద స్తస్మాత్కరు రజాయత || || 28 || పుత్రద్వయ మభూ త్తస్య సుత్రామా చాను రేవచ | అనోస్తుప్రియగోత్రో 7 భూ దం శుస్తస్యచ రిక్థభాక్ || || 29 || అథాంశో రన్థకో నామ విష్ణుభక్తః ప్రతాపవాన్ | మహాత్మా దాననిరతో ధనుర్వేదవిదాం వరః || || 30 || ఇంద్రుని పట్టణముతో సమానమైన తనపురమునకు వెళ్లెను. బ్రాహ్మణోత్తములారా! ఆ పట్టణములో భక్తితో కూడినవాడై ఈశ్వరియైన దేవిని ప్రతిష్ఠించినాడు. (25) అనేకములైన యజ్ఞములతో, హోమములతో సరస్వతీదేవిని ఆరాధించినాడు. ఆ నవరథునికి గొప్ప ధర్మస్వభావముకల దశరథుడను కుమారుడు కలిగినాడు. (26) అతనికి దేవియొక్క భక్తుడు, గొప్పతేజస్సుకలవాడును అగు శకుని పుత్రుడుగా పుట్టెను. అతనివలన కరంభుడు జన్మించెను. కరంభుని వలన దేవరాతుడను వాడు కలిగెను. (27) ఆరాజు అశ్వమేధయాగమును చేసినాడు. అతనికమారుడు దేవక్షత్రుడనువాడు. అతనికి మధువనువాడు పుత్రుడు కాగా, వానివలన కురువు జన్మించెను. (28) ఆ కురువునకు సుత్రాముడు, అనువు అను ఇరువురు కుమారులు కలిగిరి. వారిలో అనువుకు ప్రియగోత్రుడను పుత్రుడు, అతనికి అంశువు అనువాడు సంతతిగా కలిగిరి. (29) ఆ అంశువునకు ప్రతాపముకలవాడు, విష్ణుభక్తుడు అగు అంధకుడు అను దానశీలుడు, విలువిద్య యందు గొప్పనేర్పుకలవాడు, మహాత్ముడగు పుత్రుడు జన్మించినాడు. (30) స నారదస్య వచనా ద్వాసుదేవార్చనే రతః | శాస్త్రం ప్రవర్తయామాస కుణ్డగోలాదిభిః శ్రుతమ్ || || 31 || తస్య నామ్నా తు విఖ్యాతం సాత్వతానాం చ శోభనమ్ | ప్రవర్తతే మహ చ్ఛాస్త్రం కుణ్డాదీనాం హితావహమ్ || || 32 || సాత్వత స్తస్య పుత్రో7భూ త్సర్వశాస్త్రవిశారదః | పుణ్యశ్లోకో మహారాజ స్తేన చైత త్ర్పవర్తితమ్ || || 33 || సాత్వతా న్సత్త్వసమ్పన్నా న్కౌశల్యా సుషువే సుతాన్ | అన్ధకం వై మహాభోజం వృష్ణిం దేవావృధం నృపమ్ || || 34 || జ్యేష్ఠం చ భజమానాఖ్యం ధనుర్వేదవిదాం వరమ్ | తేషాం దేవావృధో రాజా చచార పరమం తపః || || 35 || అతడు నారదునిమాట వలన వాసుదేవుని పూజించుట యందాసక్తుడాయెను. కుండుడు, గోలుడు మొదలగు వారిచేత ప్రసిద్ధమైన శాస్త్రము నతడు ప్రవర్తింపజేసెను. (31) అతనిపేరుతో ప్రసిద్ధమైనది, సాత్వతులకు శుభదాయకమైనది, కుండులు మొదలగువారికి శుభమును కలిగించునదియగు గొప్పశాస్త్రము వాడుకలోనున్నది. (32) అతినికి సాత్వతుడను కమారుడు కలిగెను. అతడు అన్నిశాస్త్రములయందు నైపుణ్యము కలవాడు. పుణ్యమైన మహారాజతడు. అతనిచేత ఆశాస్త్రము ప్రవర్తింపజేయబడినది. (33) సత్త్వగుణసంపన్నులైన సాత్వతులను కుమారులుగా కౌశల్య పొందెను అంధకుడు, మహాభోజుడు, వృష్ణి, దేవా వృధుడు, విలువిద్యనేర్చిన వారిలో శ్రేష్ఠుడగు వానిని జ్యేష్ఠుడుగా భజమానుడను వానిని పొందెను. వారిలో దేవావృధుడును రాజు గొప్ప తపస్సును చేసెను. (34, 35) పుత్రః సర్వగుణోపేతో మమ భూయా దితి ప్రభుః | తస్య బభ్రు రితి ఖ్యాతః పుణ్యశ్లోకో7 భవ న్నృపః || || 36 || ధార్మికో రూపసమ్పన్న స్తత్త్వజ్ఞానరతః సదా | భజమానాః శ్రియం దివ్యాం భజమానా ద్విజజ్ఞిరే || || 37 || తేషాం ప్రధానౌ విఖ్యాతౌ నిమిః కృకణ ఏవచ | మహాభోజకులే జాతా భోజా వై మాతృకా స్తథా || || 38 || వృష్ణేః సుమిత్రో బలవా ననమిత్ర స్తిమి స్తథా | అనమిత్రా దభూ న్నిఘ్నో నిఘ్నస్య ద్వౌ బభూవతుః || || 39 || ప్రసేనస్తు మహాభాగః సత్రాజి న్నామ చోత్తమః | అనమిత్రా త్సిని ర్జజ్ఞే కనిష్ఠో వృష్ణిదనన్దనాత్ || || 40 || సమస్తగుణములతో కూడిన కుమారుడు నాకు కలుగవలెనని ఆరాజుతపస్సు చేసెను. అతనికి బభ్రువు అనుపేరుతో ప్రసిద్ధుడైన పుణ్యశ్లోకుడగు రాజుపుట్టెను. (36) ఆ బభ్రువు ధర్మాత్ముడు, అందుముతోకూడినవాడు, తత్త్వజ్ఞాదనమునందాసక్తి కలవాడుగా నుండెను. భజమానునివలన దివ్యమైన సంపదను పొందిన కుమారులు జన్మించిరి. (37) వారిలోనిమి, కృకణుడు అనువారిద్దరు ముఖ్యులు, ప్రసిద్ధులుగా నుండిరి. మహాభోజుని వంశములో వైమాతృకులగు భోజులు పుట్టిరి. (38) వృష్ణివలన బలవంతుడగు సుమిత్రుడు, అనమిత్రుడు, తిమి అనువారు జన్మించిరి. అనమిత్రునివలన నిఘ్నుడు, నిఘ్నునకు ఇద్దరు కుమారులు కలిగిరి. (39) మహాభాగుడు ప్రసేనుడు, ఉత్తముడైన సత్రాజిత్తు అనువారు ఆ ఇద్దరు కుమారులు. వృష్ణికుమారుడైన అనమిత్రునివలన సిని అనువాడు కనిష్ఠుడుగా జన్మించెను. (40) సత్యవాక్సత్యసమ్పన్నః సత్యక స్తత్సుతో 7 భవత్ | సాత్యకి ర్యుయుధాన స్తు తస్యా సఙ్గో 7 భవ త్సుతః | || 41 || కుణి స్తస్య సుతో ధీమాం స్తస్య పుత్రోయుగన్ధరః | మాద్ర్యాం వృష్ణిః సుతో జజ్ఞే వృష్ణేర్వై యదునన్దనః || || 42 || జజ్ఞాతే తన¸° వృష్ణేః శ్వఫల్క శ్చిత్రకస్తు హి | శ్వఫల్కః కాశిరాజస్య సుతాం భార్యా మవిన్దత || || 43 || తస్యా మజనయ త్పుత్ర మక్రూరం నామ ధార్మికమ్ | ఉపమంగుం తథా మంగు మన్యే చ బహవః సుతాః || 44 || అక్రూరస్య స్మృతః పుత్రో దేవవా నితి విశ్రుతః | ఉపదేవ శ్చ దేవాత్మా తయో ర్విశ్వప్రమాథినౌ || |7 45 || సత్యమైన వాక్కులు కలవాడు, సత్యముతోకూడిన వాడు అగు సత్యకుడు అతనికి కుమారుడుగా పుట్టెను. సాత్యకి, యుయుధానుడు అనువారు కూడ కలిగిరి. యుయుధానునకు అసంగుడను పుత్రుడు పుట్టెను. (41) అతనికి బుద్ధిమంతుడైన కుణి అనుపుత్రుడు, అతనికి యుగంధరుడను కుమారుడు కలిగెను. అతనికి మాద్రియను భార్యయందు వృష్ణి పుట్టెను. వృష్ణివలన యదునందనుడు కలిగెను. (42) వృష్ణికి, శ్వఫల్కుడు, చిత్రకుడు అను ఇద్దరుకుమారులు పుట్టిరి. వారిలో శ్వఫల్కుడు కాశిరాజ పుత్రికను భార్యనుగా పొందెను. (43) ఆమె యందు శ్వఫల్కుడు అక్రూరుడను ధర్మస్వభావము కల కుమారుని కనెను. ఉపమంగుడు, మంగుడు, ఇంకను ఇతరులుచాలా మంది కొడుకులు కలిగిరి. (44 అక్రూరుని కుమారుడు దేవవంతుడని ప్రసిద్ధుడైనవాడు కలిగెను. ఉపదేవుడు అను దేవస్వభావము కలవాడు కూడా పుత్రుడాయెను. వారిద్దరికి విశ్వుడు, ప్రమాథి అనుకుమారులు కలిగిరి. (45) చిత్రకస్యా భవత్పుత్రః పృథు ర్విపృథు రేవచ | అశ్వగ్రీవః సుబాహుశ్చ సుధాశ్వకగవేక్షకౌ || || 46 || అన్ధకస్య సుతాయా న్తు లేభే చ చతురః సుతాన్ | కుకురం భజమానం చ శమీకం బలగర్వితమ్ || || 47 || కుకురస్య సుతో వృష్ణి ర్వృష్ణే తనయో 7భవత్ | కపోతరోమా విఖ్యాత స్తస్య పుత్రో విలోమకః || || 48 || తస్యాసీ త్తుమ్బురుసఖా విద్వాన్పుత్ర స్తమః కిల | తమస్యా ప్యభవ త్పుత్ర స్తథైవా నకదున్దుభిః || || 49 || స గోవర్థన మాసాద్య తతాప విపులం తపః | వరం తసై#్మ దదౌ దేవో బ్రహ్మా లోకమహేశ్వరః || || 50 || చిత్రకునకు పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, సుబాహుడు, సుధాశ్వకగవేక్షకులు అనువారు పుత్రులుగా జన్మించిరి. (46) అంధకుని పుత్రికయందు నలుగురు కుమారులను పొందెను. వారు కుకురుడు, భజమానుడు, శమీకుడు, బలగర్వితుడు అనువారు. (47) కుకురుని పుత్రుడు వృష్ణి అనువాడు. అతనికి కపోతరోముడని ప్రసిద్ధుడైన కుమారుడు కలిగెను. అతని కుమారుడు విలోమకుడు. (48) ఆ విలోమకునికి, తుంబురుని మిత్రుడు, పండితుడు అగు తముడు అను పుత్రుడు కలిగెను. ఆ తమునికి ఆనకదుందుభి అను పేరు కల పుత్రుడు పుట్టెను. (49) ఆ ఆనకదుందుభి గోవర్ధనపర్వతమును చేరుకొని చాలదీర్ఘమైన తపస్సును చేసెను. అతనికి లోకములకు ప్రభువైన బ్రహ్మదేవుడు వరము నిచ్చెను. (50) వంశ##స్తే చాక్షయా కీర్తి ర్జానయోగ స్తధోత్తమః | గురో రప్యధికం విప్రాః కామరూపిత్వ మేవచ || || 51 || స లబ్థ్వా వర మవ్యగ్రో వరేణ్యో వృషవాహనమ్ | పూజయామాస గానేన స్థాణుం త్రిదశపూజితమ్ || || 52 || తస్య గానరతస్యాథ భగవా నమ్బికాపతిః | కన్యారత్నం దదౌ దేవో దుర్లభం త్రిదశైరపి || ||| 53 || తయా స సఙ్గతో రాజా గానయోగ మనుత్తమమ్ | అశిక్షయ దమిత్రఘ్నః ప్రియాం తాం భ్రాన్తలోచనామ్ || || 54 || తస్యా ముత్పాదయామాస సుభుజం నామ శోభనమ్ | రూపలావణ్యసమ్పన్నాం హ్రీమతీ మతి కన్యకామ్ || || 55 || తత స్తం జననీ పుత్రం బాల్యేవయసి శోభనమ్ | శిక్షయామాస విధివ ద్గానవిద్యా ఞ్చ కన్యకామ్ || || 56 || నీ వంశమునకు నాశములేని కీర్తి, గురువుకంటె ఎక్కువగా శ్రేష్ఠమైన జ్ఞానయోగము, కామరూపము కలిగియుండుటను కూడ; (51) శ్రేష్ఠుడైన అతడు వరముగా పొంది సావధానుడై వృషభవాహనడు, దేవతలచేత పూజింపబడు వాడును అగు శివుని తనగానముతో పూజించెను. (52) గానములో నిమగ్నమైయున్న ఆనకదుందుభికి, భగవంతుడైన పార్వతీపతి దేవతలచేత గూడ పొందుటకు శక్యము కాని కన్యారత్నమును ఇచ్చెను. (53) శత్రునాశకుడైన ఆ రాజు ఆమెతో కలిసి, చంచలమైన కన్నులు గల ఆమెకు శ్రేష్ఠతమమైన గానవిద్యా తత్త్వమును ఉపదేశించెను. (54) అతడామెయందు సుభుజుడను పేరుగల మంచికుమారుని, సౌందర్య విలాసముతో కూడిన హ్రీమతి అను కన్యకను గూడ సంతానముగా పొందెను. (55) తరువాత వారితల్లి కుమారునికి, కూతురికి గూడ బాల్యదశలో సంగీత విద్యను చక్కగా శాస్త్రపద్ధతి ప్రకారము నేర్పెను. (56) కృతోపనయనో వేదా నధీత్య విధివ ద్గురోః | ఉద్వవా హాత్మజాం కన్యాం గన్థర్వాణాం తు మానసీమ్ || || 57 || తస్యా ముత్పాదయామాస పఞ్చ పుత్రా ననుత్తమాన్ | వీణావాదనతత్త్వజ్ఞాన్ గానశాస్త్రవిశారదాన్ || || 58 || పుత్రైః పౌత్రైః సపత్నీకో రాజా గానవిశారదః | పూజయామాస గానేన దేవం త్రిపురనాశనమ్ || || 59 || హ్రీమతీం చారుసర్వాఙ్గీం శ్రీ మివాయతలోచనామ్ | సుబాహునామా గన్థర్వ స్తా మాదాయ య¸° పురీమ్ || || 60 || తస్యా మప్యభవవ న్పుత్రా గన్ధర్వస్య సుతేజసః | సుషేణధీరసుగ్రీవ సుభోజనరవాహనాః || || 61 || ఆ కుమారుడు తండ్రిచేత ఉపనయనము చేయబడి వేదములను విధానము ప్రకారము అధ్యయనము చేసి, గంధర్వులయొక్క మానస సంభవఅగు కన్యకను వివాహమాడెను. (57) ఆ సుభుజుడా గంధర్వపుత్రియగు భార్యయందు, వీణావాదన మర్మము తెలిసినవారు, సంగీతశాస్త్రమునందు నైపుణ్యము కలవారును అగు అయిదుగురు సత్పుత్రులను పొందెను. (58) గానమందు నైపుణ్యము కల ఆ రాజు, తనభార్యతో, కుమారులతో, మనుమలతో గూడ తనగానవిద్యతో త్రిపురాసురసంహారకుడైన శివుని పూజించెను. (59) సుందరమైన సమస్తావయవములు కలిగినది, లక్ష్మీదేవివలె విశాలమైన కన్నులు కలది అగు హ్రీమతి అను కన్యను, సుబాహుడను పేరుగల గంధర్వుడు తీసుకొని తన పట్టణమునకు వెళ్లెను. (60) మంచితేజస్సుగల ఆ గంధర్వునికి ఆమెయందు, సుషేణుడు, ధీరుడు, సుగ్రీవుడు, సుభోజుడు, నరవాహనుడు అనుపేర్లు కలిగిన అయిదుగురు పుత్రులు కలిగిరి. (61) అథా సీ దభిజి త్పుత్ర శ్చన్దనోదకదున్దుభేః | పునర్వసు శ్చాభిజితః సమ్బభూవా హుక స్తతః || || 62 || ఆహుకస్యో గ్రసేన శ్చ దేవకశ్చ ద్విజోత్తమాః | దేవకస్యసుతా వీరా జజ్ఞిరే త్రిదశోపమాః || || 63 || దేవవా నుపదేవశ్చ సుదేవో దేవరక్షితః | తేషాం స్వసారః సప్తాస న్వసుదేవాయ తా దదౌ || || 64 || ధృతదేవో పదేవా చ తథాన్యా దేవరక్షితా | శ్రీదేవా శాన్తిదేవా చ సహదేవా చ సువ్రతా || || 65 || దేవకీ చాపి తాసాం తు వరిష్ఠాభూ త్సుమధ్యమా | ఉగ్రసేనస్య పుత్రో 7 భూ న్న్యగ్రోధః కంస ఏవచ || || 66 || సుభూమీ రాష్ట్రపాల శ్చ తుష్టిమా ఞ్ఛజ్కు రేవచ | భజమా నాద భూ త్పుత్రః ప్రఖ్యాతో 7 సౌ విదూరధః || || 67 || తరువాత చందనోదకదుందుభికి అభిజిత్తు అనుకుమారుడు పుట్టెను. అభిజిత్తుకు పునర్వసు అనువాడు, అతనికి ఆహుకుడనువాడు పుత్రులుగా పుట్టిరి. (62) బ్రాహ్మణోత్తములారా! ఆహుకునికి ఉగ్రసేనుడు, దేవకుడు అనుకుమారులు పుట్టిరి. దేవకునికి దేవతలతోసమానులైన వీరులగు పుత్రులు జన్మించిరి. (63) దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవరక్షితుడు అని ఆ పుత్రుల పేర్లు. వారితోడ బుట్టిన స్త్రీలు ఏడుగురు ఉండిరి. వారందరిని వసుదేవునికి భార్యలుగా ఇచ్చెను. (64) ఆ కన్యలపేర్లు వరుసగా ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ, సువ్రత అగుదేవకి, (65) వారందరిలో చక్కని నడుము కల దేవకి శ్రేష్ఠురాలైయుండెను. ఉగ్రసేనునికి న్యగ్రోధుడు, కంసుడు అను కుమారులు కలిగిరి. (66) సుభూమి, రాష్ట్రపాలుడు, తుష్టిమంతుడు, శంకువు అనువారు కూడ అతని కుమారులుగా పుట్టిరి. భజమానుని వలన ప్రసిద్ధుడైన విదూరథుడను పుత్రుడు జన్మించెను. (67) తస్య సూరసమస్త స్మాత్ర్పతిక్ష త్రశ్చ తత్సుతః | స్వయంభోజ స్త తస్తస్మా ద్థాత్రీకః శత్రుతాపనః || || 68 || కృతవర్మాథ తత్పుత్రః శూరసేనః సుతో 7 భవత్ | వసుదేవో 7 థ తత్పుత్రో నిత్యం ధర్మపరాయణః || || 69 || వసుదేవా న్మహాబాహు ర్వాసుదేవో జగద్గురుః | బభూవ దేవకీపుత్రో దేవై రభ్యర్థితో హరిః || || 70 || రోహిణీ చ మహాభాగా వసుదేవస్య శోభనా | అసూత పత్నీ సంకర్షం రామం జ్యేష్ఠం హలాయుధమ్ || || 71 || స ఏవ పరమాత్మా సౌ వాసుదేవో జగన్మయః | హలాయుధః స్వయం సాక్షా చ్ఛేషః సఙ్కర్షణః ప్రభుః || || 72 || అతనికి సూరసముడనువాడు, అతనివలన ప్రతిక్షత్రుడనువాడు కుమారులుగా జన్మించిరి. ప్రతిక్షత్రునివలన స్వయంభోజుడను కుమారుడు, అతనికి శత్రువులను తపింపజేయు ధాత్రీకుడు జన్మించిరి. (68) ఆ ధాత్రీకునికి కృతవర్మ, అతనికి శూరసేనుడు కుమారులుగా పుట్టిరి. ఆ శూరసేనుని పుత్రుడు వసుదేవుడు. అతడెల్లప్పుడు ధర్మమునందు శ్రద్ధ కలిగి యుండువాడు. (69) వసుదేవుని వలన గొప్ప భుజములు కలిగిన లోకమునకు గురువైన నారాయణుడు, దేవతల చేత ప్రార్థింపబడి దేవకీ దేవి యందు పుత్రుడుగా పుట్టెను. (70) వసుదేవుని మరియొకభార్య, శ్రేష్ఠురాలైన రోహిణి, నాగలి ఆయుధముగా ధరించు సంకర్షణుడను రాముని పెద్దకుమారునిగా ప్రసవించెను. (71) ఆ వసుదేవుని కుమారుడైన కృష్ణుడే విశ్వము ఆత్మగా కల పరమాత్మ స్వరూపుడు. హలాయుధుడు, సంకర్షణుడు అగురాముడు స్వయముగా శ్రీవిష్ణు శయ్యారూపుడైన శేషుని అవతారమే. (72) భృగుశాపచ్ఛలేనైవ మానయ న్మానుషీం తనుమ్ | బభూవ తస్యాం దేవక్యాం రోహిణ్యా మపి మాధవః || || 73 || ఉమాదేహసముద్భూతా యోగనిద్రా చ కౌశికీ | నియోగా ద్వాసుదేవస్య యశోదాతనయా త్వభూత్ || || 74 || యే చాన్యే వసుదేవస్య వాసుదేవాగ్రజాః సుతాః | ప్రాగేవ కంస స్తాన్‌సర్వా ఞ్జఘాన మునిసత్తమాః || || 75 || సుషేణ శ్చ తతోదాయీ భద్రసేనో మహాబలః | వజ్రదమ్భో భద్రసేనః కీర్తిమా నపి పూజితః || || 76 || హతే ష్వేతేషు సర్వేషు రోహణీ వసుదేవతః | అసూత రామం లోకేశం బలభద్రం హలాయుధమ్ || || 77 || జాతే 7 థ రామే దేవానా మాది మాత్మాన మచ్యుతమ్ | అసూత దేవకీ కృష్ణం శ్రీవత్సాఙ్కితవక్షసమ్ || || 78 || భృగుమహాముని శాపమను వ్యాజముతో మానవశరీరమును ధరించి లక్ష్మీపతియగు నారాయణుడు దేవకీ దేవియందు, రోహిణి యందు కూడ భూమిపై అవతరించెను. (73) పార్వతీదేవి శరీరము నుండి పుట్టిన కౌశికి అనబడు యోగనిద్రకూడ వాసుదేవుని ఆదేశముననుసరించి యశోదకు పుత్రికగా జన్మించెను. (74) ఓ మునీంద్రులారా! కృష్ణుని కంటె ముందు పుట్టిన వసుదేవుని కుమారు లెవరుండిరో, వారందరిని కంసుడు పూర్వమే చంపివైచెను. (75) సుషేణుడు, భద్రసేనుడు, మహాబలుడు, వజ్రదంభుడు, భద్రసేనుడు, కీర్తిమంతుడు, పూజితుడు అను ఏడుగురు కృష్ణునికంటె ముందు జన్మించిన కుమారులు. (76) ఈ కుమారులందరు కంసునిచే చంపబడగా, రోహిణీదేవి వసుదేవునివలన హలాయుధుడు, లోకప్రభువు అగురాముని పుత్రునిగా పొందెను. (77) దేవతలకు మొదటి ఆత్మస్వరూపుడైన, అచ్యుతుడైనరాముడు పుట్టినతరువాత దేవకీదేవి శ్రీవత్సచిహ్నముతో కూడిన వక్షముకల కృష్ణుని పుత్రునిగా కనెను. (78) రేవతీ నామ రామస్య భార్యాసీ త్సుగుణాన్వితా | తస్యా ముత్పాదయామాస పుత్రౌ ద్వౌ నిశితోల్ముకౌ || || 79 || షోడశస్త్రీసహస్రాణి కృష్ణస్యా క్లిష్టకర్మణః | బభూవు శ్చాత్మజా స్తాసు శతశో 7 థ సహస్రశః || || 80 || చారుదేష్ణః సుచారు శ్చ చారువేషో యశోధరః | చారుశ్రవా శ్చారుయశాః ప్రద్యుమ్నః సామ్బఏవచ || || 81 || రుక్మిణ్యాం వాసుదేవస్య మహాబలపరాక్రమాః | విశిష్టాః సర్వపుత్రాణాం సంబభూవు రిమే సుతాః || || 82 || తా న్దృష్ట్వా తనయా న్వీరా న్రౌక్మిణయా ఞ్జనార్దనాత్ | జామ్బవ త్యబ్రవీ త్కృష్ణం భార్యా తస్యశుచిస్మితా || || 83 || మంచి గుణములతో కూడిన రేవతి అను కన్యబలరామునికి భార్య ఆయెను. ఆమె యందు బలరామునకి నిశితుడు, ఉల్ముకుడు అను ఇద్దరు పుత్రులు కలిగిరి. (79) దుష్టముకాని కర్మలు కల కృష్ణునికి పదునారువేల మంది స్త్రీలు భార్యలుగా ఉండిరి. వారియందతనికి వందల, వేలకొలదిగా కుమారులు జన్మించిరి. (80) చారుదేష్ణుడు, సుబాహువు, చారువేషుడు, యశోధరుడు, చారుశ్రవుడు, చారుయశుడు, ప్రద్యుమ్నుడు మరియు సాంబుడను వాడును; (81) కృష్ణునికి రుక్మిణీదేవియందు గొప్పబలప్రరాక్రమములు కలపుత్రులుగా ఉదయించిరి. ఈకుమారులు అతనిపుత్రులందరిలో విశిష్టులైన వారుగా పరిగణింపబడినారు. (82) కృష్ణునియందు రుక్మిణీదేవికి కలిగిన వీరులైన ఆకుమారులనుచూచి, కృష్ణుని మరియొకభార్య, స్వచ్ఛమైన నవ్వు కలిగిన జాంబవతి కృష్ణునితో ఇట్లు పలికెను. (83) మమ త్వం పుణ్డరీకాక్ష విశిష్టగుణవత్తరమ్ | సురేశసమ్మితం పుత్రం దేహి దానవసూదన || || 84 || జామ్బవత్యా వచః శ్రుత్వా జగన్నాథః స్వయం హరిః | సమారేభే తపః కర్తుం తపోనిధి రరిన్దమః || || 85 || త చ్ఛృణుధ్వం మునిశ్రేష్ఠా యథాసౌ దేవకీసుతః | దృష్ట్వా లేభే సుతం రుద్రం తప్త్వా తీవ్రం మహ త్తపః || || 86 || ఇతి శ్రీకూర్మపురాణ యదువంశానుకీర్తనం నామ చతుర్వింశో7ధ్యాయః పద్మములవంటి కన్నులుకల ఓస్వామీ! రాక్షససంహారకా! నీవు నాకు శ్రేష్ఠములైన గుణములు కలవాడు, దేవేంద్రునితో పోల్చదగినవాడు అగు కుమారునొకనిని అనుగ్రహించుము. (84) విశ్వమునకు ప్రభువగు శ్రీకృష్ణుడు జాంబవతి మాటనువిని, శత్రువులను నిగ్రహింపగలవాడు, తపస్సులకు స్థానమైన వాడైనను స్వయముగా తపస్సుచేయుటకు ప్రారంభించెను. (85) ఓమునిసత్తములారా! దేవకి పుత్రుడైన ఆకృష్ణుడు, తీవ్రమైన గొప్పతపస్సునుచేసి, శివుని సాక్షాత్రారమును పొంది ఏ విధముగా కుమారుని పొందెనో మీరు వినుడు. (86) శ్రీ కూర్మపురాణములో యదువంశాను కీర్తనమను ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.