Sri Koorma Mahapuranam    Chapters   

షడ్వింశో7ధ్యాయః

శఙ్కర కీర్తివర్ణనమ్‌

సూత ఉవాచ :-

ప్రవిశ్య మేరుశిఖరం కైలాసం కనకప్రభమ్‌ | రరామ భగవాన్సోమః కేశ##వేన మహేశ్వరః || || 1 ||

అపశ్యం స్తే మహాత్మానం కైలాసగిరివాసినః | పూజయాంచక్రిరే కృష్ణం దేవదేవ మివా చ్యుతమ్‌ || || 2 ||

చతుర్బాహు ముదారాఙ్గం కాలమేఘసమప్రభమ్‌ | కిరీటినం శార్‌ఙ్గపాణిం శ్రీవత్సాఙ్కితవక్షసమ్‌ || || 3 ||

దీర్ఘబాహుం విశాలాక్షం పీతవాసస మచ్యుతమ్‌ | దధాన మురసా మాలాం వైజయన్తీ మనుత్తమామ్‌ || || 4 ||

భ్రాజమానం శ్రియా దేవ్యా యువాన మతికోమలమ్‌ | పద్మాంఘ్రిం పద్మనయనం సస్మితం సద్గతిప్రదమ్‌ || || 5 ||

ఇరువదియారవ అధ్యాయము

శంకరకీర్తి వర్ణనము

సూతుడు చెప్పెను :-

భగవంతుడగు మహేశ్వరుడు, మేరుపర్వతశిఖరమైన, బంగారు కాంతులుకల కైలాసమును ప్రవేశించి కేశవునితోకూడి విహరించెను. (1)

కైలాస పర్వతమునందు నివసించువారు, మహాత్ముడు, అచ్యుతుడునగు కృష్ణునిచూచిరి. దేవదేవుడగు శంకరునివలె అతనిని గూడ పూజించిరి. (2)

నాలుగు భుజములకలవాడు, శ్రేష్ఠమైన శరీరముకలవాడు, నీలమేఘమువంటి కాంతికలవాడు, కిరీటము శార్‌ఙ్గమును ధరించి, వక్షమున శ్రీవత్స చిహ్నము కలవాడుగా కేశవుడుండెను. (3)

పొడవుభుజములుకలవాడు, విశాలమైన కన్నులుకలవాడు, పచ్చని వస్త్రము ధరించినవాడు, నాశములేనవాడు, లక్ష్మీదేవితోప్రకాశించు చున్నవాడు, తరుణవయస్కుడు, సుకుమారుడు, కమలములవంటి పాదుమలు, కన్నులుకలవాడు, చిరునవ్వుతోకూడినవాడు, పుణ్యగతినిచ్చు వాడునగు కేశవుని వారు పూజించిరి. (4, 5)

కదాచి త్తత్ర లీలార్ధం దేవక్యానన్దవర్ధనః | భ్రాజమానః శ్రియా కృష్ణ శ్చచార గిరికన్దరమ్‌ || || 6 ||

గన్ధర్వాప్సరసాం ముఖ్యా నాగకన్యాశ్చ కృత్స్నశః | సిద్ధా యక్షాశ్చ గన్ధర్వా దేవా స్తంచ జగన్మయమ్‌ || || 7 ||

దృష్ట్వా శ్చర్యం పరం గత్వా హర్షా దుత్ఫుల్లలోచనాః | ముముచుః పుష్పవర్షాణి తస్య మూర్ధ్ని మహాత్మనః || || 8 ||

గన్ధర్వకన్యకా దివ్యాస్తద్వ దప్సరసో వరాః | దృష్ట్వా చకమిరే కృష్ణం సుస్తుతం శుచిభూషణాః || || 9 ||

కాశ్చి ద్గాయన్తి వివిధం గానం గీతవిశారదాః | సంప్రేక్ష్యే దేకీసూనుం సున్దరం కామమోహితాః || || 10 ||

దేవకీదేవికి సంతోషమును పెంచు శ్రీకృష్ణుడు ఒకానొకప్పుడు తేజస్సుతో ప్రకాశించువాడై విలాసము కొరకు అక్కడ పర్వతగుహప్రాంతములో సంచరించెను. (6)

గంధర్వులలో, అప్సరసలలో ముఖ్యులైనవారు, నాగకన్యలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, సమస్తదేవతలుకూడ విశ్వాత్మకుడైన ఆ కృష్ణుని (7) చూచి మిక్కిలి ఆశ్చర్యమును పొంది సంతోషముతో వికసించిన కన్నులు కలవారై ఆ మహాత్ముడైన కృష్ణునియొక్క శిరస్సుపైన పూలవానలను కురిపించిరి. (8)

శ్రేష్ఠులైన గంధర్వకన్యలు, ఉత్తములైన అప్సరలుకూడ శుభ్రములైన ఆభరణములను ధరించినవారై కొనియాడదగిన కృష్ణుని చూచి కామమును పొందిరి. (9)

పాటలయందు నైపుణ్యముకల కొందరు అందమైన దేవకీ కుమారుడగు కృష్ఱుని చూచి కోరికతో మోహమును పొందినవారై, వివిధములైన పాటలను పాడిరి. (10)

కాశ్చి ద్విలాసబహులా నృత్యన్తి స్మ తదగ్రతః | సంప్రేక్ష్య సస్మితం కాశ్చి త్పపు స్తద్వదనామృతమ్‌ || || 11 ||

కాశ్చి ద్భూషణవర్యాణి స్వాఙ్గా దాదాయ సాదరమ్‌ | భూషయాంచక్రిరే కృష్ణం కన్యా లోకవిభూషణమ్‌ || || 12 ||

కాశ్చి ద్భూషణవర్యాణి సమాదాయ తదఙ్గతః | స్వాత్మానం భూషయామాసుః స్మాత్మకై రపి మాధవమ్‌ || || 13 ||

కాచి దాగత్య కృష్ణస్య సమీపం కామమోహితా | చుచుమ్బ వదనామ్భోజం హరే ర్ముగ్ధమృగేక్షణా || || 14 ||

ప్రగృహ్యకాచి ద్గోవిన్దం కరేణ భవనం స్వకమ్‌ | ప్రాపయామాస లోకాదింమాయయా తస్య మోహితా || || 15 ||

తాసాంస భగవాన్‌ కృష్ణః కామా న్కమలలోచనః | బహూని కృత్వా రూపాణి పూరయామాస లీలయా || || 16 ||

అధికమైన విలాసములు కలకొందరు స్త్రీలు ఆయన ఎదురుగా నాట్యము చేసిరి. మరికొందరా కృష్ణుని చూచి చిరునవ్వుతో కూడ అతనిని చుంబించి అధరామృతమును పానముచేసిరి. (11)

మరికొందరు కన్యలు తమశరీరములనుండి ఆభరణములనుతీసి, లోకమునకే అలంకారప్రాయుడైన ఆకృష్ణునికి ఆదరపూర్వకముగా అలంకరింపజేసిరి. (12)

కొంతమంది అంగనలు కృష్ణుని శరీరము మీదినుండి శ్రేష్ఠములైన నగలను తీసుకొని తమనుతాము అలంకరించుకొనిరి. తమనగలతో అతనిని గూడ అలంకరించిరి. (13)

అమాయకమైన జింకకన్నులవంటి కన్నులుకల ఒకవనిత కృష్ణుని దగ్గరగా వచ్చి, కామముతో మోహితురాలై కృష్ణుని పద్మమువంటి ముఖమును చుంబించెను. (14)

మరియొక తరుణి కృష్ణునిమాయచేత మోహమును పొంది తన చేతితో గ్రహించి తనభవనములోనికి తీసుకొని వెళ్లెను. (15).

తామరలవంటి కన్నులుకల భగవంతుడగు కృష్ణుడు ఆ స్త్రీలయొక్కకోరికలను, తన లీలతో అనేక రూపములను ధరించి పూరించెను. (16)

ఏవం వై సుచిరం కాలం దేవదేవపురే హరిః | రేమేనారాయణః శ్రీమాన్‌ మాయయా మో

హయ ఞ్జగత్‌ || || 17 ||

గతే బహుతిథే కాలే ద్వారవత్యా నివాసినః | బభూవు ర్వికలా భీతా గోవిన్దవిరహే జనాః || || 18 ||

తతః సుపర్ణో బలవా న్పూర్వ మేవ విసర్జితః | స కృష్ణం మార్గమాణస్తు హిమవన్తం య¸° గిరిమ్‌ || || 19 ||

అదృష్ట్వా తత్ర గోవిన్దం ప్రణమ్య శిరసా మునిమ్‌ | ఆజగామోపమన్యుం తం పురీం ద్వారవతీం పునః || || 20 ||

తదన్తరే మహాదైత్యా రాక్షసా శ్చాతిభీషణాః | ఆజగ్ము ర్ద్వారకాం శుభ్రాం భీషయన్తః సహస్రశః || || 21 ||

స తా న్సుపర్ణో బలవాన్‌ కృష్ణతుల్యపరాక్రమః | హత్వా యుద్ధేన మహతా రక్షతి స్మ పురీం శుభామ్‌ || || 22 ||

ఈ విధముగా చాలకాలము వరకు దేవదేవుడైన శివుని పట్టణములో శ్రీమంతుడు, నారాయణుడు అగు కృష్ణుడు తన మాయతో ప్రపంచమును మోహింపజేయుచు విహరించెను. (17)

చాలదినముల కాలము గడచిపోగా, కృష్ణుని ఎడబాటు వలన ద్వారకా నగరమునందు నివసించుప్రజలు భయముతో కలత చెందినవారైరి. (18)

తరువాత బలవంతుడైన గరుత్మంతుడు అంతకుముందే పంపించబడినవాడై శ్రీకృష్ణునిజాడను వెదకుచు హిమాలయ పర్వతమునకు వెళ్లెను. (19)

అక్కడ శ్రీకృష్ణుడు కన్పించక అక్కడనున్న ఉపమన్యుమునికి నమస్కరించి తిరిగి ద్వారకాపురమునకు మరలివచ్చెను. (20)

ఈలోపల మిక్కిలి భయంకరులైన పెద్ద రాక్షసులునిర్మలమైన ద్వారకాపట్టణమును భయ పెట్టుచు వేలకొలదిగా అక్కడికివచ్చిరి. (21)

అప్పుడు బలవంతుడు, కృష్ణునితో సమానమైన పరాక్రమముకలవాడును అగు గరుడుడు గొప్పయుద్ధము చేసి ఆరాక్షసులను చంపి ద్వారకను కాపాడెను. (22)

ఏతస్మి న్నేవ కాలేతు నారదో భగవా నృషిః | దృష్ట్వా కైలాస శిఖరే కృష్ణం ద్వారవతీం గతః || || 23 ||

తే దృష్ట్వా నారద మృషిం సర్వే తత్రనివాసినః | ప్రోచు ర్నారాయణో నాధః కుత్రాస్తే భగవా న్హరిః || || 24 ||

స తా నువాచ భగవా న్కైలాసశిఖరే హరిః | రమతే7ద్య మహాయోగీ తం దృష్ట్వాహ మిహాగతః || || 25 ||

తస్యోపశ్రుత్య వచనం సుపర్ణః పతతాం వరః | జగామా కాశగో విప్రాః కైలాసం గిరి ముత్తమమ్‌ || || 26 ||

దదర్శ దేవకీసూనుం భవనే రత్నమణ్డితే | తత్రాసనస్థం గోవిన్దం దేవదేవాన్తికే హరిమ్‌ || || 27 ||

ఈసమయములోనే పూజ్యుడైన నారదఋషి కైలాస పర్వతశిఖరమునందు శ్రీకృష్ణునిచూచి ద్వారకానగరమునకు వెళ్లెన. (23)

అప్పుడుద్వారకలోనివసించు జనులందరు ఆ నారదునిచూచి, ''భగవంతుడు, మాకు రక్షకుడు అయిన కృష్ణుడు ఎక్కడున్నాడు'' అని ప్రశ్నించిరి. (24)

ఆనారదుడు వారితో ఇట్లుచెప్పెను. ''భగవంతుడైన కృష్ణుడు గొప్పయోగిగా ఇప్పుడుకైలాసపర్వతశిఖరమందు విహరించుచున్నాడు. నేనాయనను చూచి ఇక్కడకు వచ్చితిని'' అని. (25)

ద్విజులారా! ఆ నారదుని మాటను విని పక్షులలో శ్రేష్ఠుడైన గరుత్మంతుడు వెంటనే ఆకాశమార్గమును చేరి శ్రేష్ఠమైన కైలాసపర్వతమునకు వెళ్లెను. (26)

అక్కడ గరుత్మంతుడు, రత్నములతో అలంకరింపబడిన భవనములో, దేవదేవుడైన శివుని సమీపములో ఆసనమందు కూర్చుండి యున్న కృష్ణుని చూచెను. (27)

ఉపాస్యమాన మమరై ర్దివ్యస్త్రీభిః సమన్తతః | మహాదేవగణౖః సిద్ధై ర్యోగిభిః పరివారితమ్‌ || || 28 ||

ప్రణమ్య దణ్డన ద్భూమౌ సుపర్ణః శఙ్కరం శివమ్‌ | నివేదయామాస హరిం ప్రవృత్తం ద్వారకాపురే || || 29 ||

తతః ప్రణమ్య శిరసా శఙ్కరం నీలలోహితమ్‌ | ఆజగామ పురీం కృష్ణః సో7నుజ్ఞాతో హరేణతు || || 30 ||

ఆరుహ్య కశ్యపసుతం స్త్రీగణౖ రభిపూజితః | వచోభి రమృతాస్వాదై ర్మానితో మధుసూదనః || || 31 ||

వీక్ష్యయాన్త మమిత్రఘ్నం గన్ధర్వాప్సరసాం వరాః | అన్వగచ్ఛ న్మహాయోగం శంఖచక్రగదాధరమ్‌ || || 32 ||

ఆకృష్ణుడక్కడ దేవతలచేత, దేవతాస్త్రీలచేత అంతట సేవింపబడుచు, దేవతాగణములచేత, సిద్ధులచేత, యోగులచేత చుట్టబడి యుండెను. (28)

అప్పుడు గరుడుడు మంగళకరుడైన శివునకు భూమిపై సాష్టాంగదండ ప్రణామముచేసి, ద్వారకాపురములో జరిగిన ప్రజల వ్యాకులతను కృష్ణునకు తెలిపెను. (29)

తరువాత శ్రీకృష్ణుడు శిరస్సుతో నీలలోహితుడైన శంకరునకు నమస్కరించి, ఆయనతో అనుమతిని పొంది తనద్వారకకు తిరిగి వచ్చెను. (30)

అక్కడి స్త్రీలచేత పూజింపబడి, అమృతమువంటి మధురమైన మాటలచేత సత్కరింపబడినవాడు కశ్యప ప్రజాపతి పుత్రుడైన గరుత్మంతునిపైనెక్కి (31) వెళ్లిపోవుచున్న, శత్రునాశకుడైన, గొప్పయోగీశ్వరుడు, శంఖచక్ర గదాధరుడు అయిన కృష్ణుని చూచి గంధర్వులు, అప్సరసలుకూడ అనుసరించినడచిరి. (32)

విసర్జయిత్వా విశ్వాత్మా సర్వా ఏవాఙ్గనా హరిః | య¸° స తూర్ణం గోవిన్దో దివ్యాం ద్వారవతీం పురీమ్‌ || || 33 ||

గతే దేవే7 సురరిపౌ న కామిన్యో మునీశ్వరాః | నిశేవ చన్ద్రరహితా వినా తేన చకాశిరే || || 34 ||

శ్రుత్వా పౌరజనా స్తూర్ణం కృష్ణాగమన ముత్తమమ్‌ | మణ్డయాంచక్రిరే దివ్యాం పురీం ద్వారవతీం శుభామ్‌ || || 35 ||

పతాకాభి ర్విశాలాభి ర్ధ్వజై రన్తర్బహిః కృతైః | మాలాదిభిః పురీం రమ్యాం భూషయఞ్చక్రిరే జనాః || || 36 ||

అవాదయన్త వివిధా న్వాదిత్రా న్మధురస్వనాన్‌ | శంఖాన్‌ సహస్రశో దధ్ము ర్వీణావాదా న్వితేనిరే || || 37 ||

ప్రపంచస్వరూపుడైన కృష్ణుడు ఆ స్త్రీలందరిని వీడ్కొని, శీఘ్రముగా తన శ్రేష్ఠమైన ద్వారకా పట్టణమునకు వెళ్లెను. (33)

రాక్షసులకు శత్రువైన ఆశ్రీకృష్ణుడు అక్కడినుండి వెళ్లిపోగా, చంద్రుడులేని రాత్రివలె అక్కడి మునీశ్వరులు, స్త్రీలుకూడ ఆయన లేకుండా ప్రకాశించరైరి. (34)

ద్వారవతీ పట్టణములోని జనులు తమకిష్టమైన కృష్ణునిరాకనుగూర్చివిని, మంగళకరము, దివ్యము అయిన ద్వారకా పట్టణమును చక్కగా అలంకరించిరి. (35)

విశాలములైన పతాకములతో, లోపల బయటకూడ నెలకొల్పబడిన ధ్వజములతో, పూలహారములు మొదలగువానితో అందమైన ఆ పట్టణమును ప్రజలు అలంకరించిరి. (36)

కమ్మని శ్రావ్యమైన ధ్వనికలిగిన వివిధములగు వాద్యములను కూడ జనులు మ్రోగించిరి. వేలకొలదిగా శంఖములనూదిరి. వీణా వాదనలను చేసిరి. (37)

ప్రవిష్టమాత్రే గోవిన్దే పురీం ద్వారవతీం శుభామ్‌ | అగాయ న్మధురం గానం స్త్రియో ¸°వనశోభితాః || || 38 ||

దృష్ట్వా ననృతు రీశానం స్థితాః ప్రాసాదమూర్ధసు | ముముచుః పుష్పవర్షాణి వసుదేవసుతోపరి || || 39 ||

ప్రవిశ్య భగవా న్కృష్ణ స్త్వాశీర్వాదాభివర్ధితః | వరాసనే మహాయోగీ భాతి దేవీభి రన్వితః || || 40 ||

సురమ్యే మణ్డపే శుభ్రే శంఖాద్యైః పరివారితః | ఆత్మజై రభితో ముఖ్యైః స్త్రీసహసై#్త్రశ్చ సంవృతః || || 41 ||

తత్రా సనవరే రమ్యే జామ్బవత్యా సహాచ్యుతః | భ్రాజతే చోమయా దేవో యథా దేవ్యా సమన్వితః || || 42 ||

ఆజగ్ము ర్దేవగన్థర్వా ద్రష్టుం లోకాది మవ్యయమ్‌ | మహర్షయః పూర్వజాతా మార్కణ్డయాదయో ద్విజాః || || 43 ||

గోవిందుడగు శ్రీకృష్ణుడు మంగళకరమైన ద్వారకా నగరమును ప్రవేశించగానే, ¸°వనముతో ప్రకాశించువనితలు మధురమైన పాటలను పాడిరి. (38)

తమ ప్రభువైన ఆ కృష్ణుని చూచి, స్త్రీలు మేడల పైభాగములందు నిలిచిన వారై నృత్యముచేసిరి. వసుదేవుని కుమారుడైన అతనిమీద పుష్పవర్షములను కురియించిరి. (39)

భగవంతుడైన కృష్ణుడు పట్టణమును ప్రవేశించి, ఆశీర్వాదములచే అభినందింపబడుచు తన భార్యలతోగూడ గొప్పయోగి యగునతడు శ్రేష్ఠమైన ఆసనముపై కూర్చొని శోభించెను. (40)

మిక్కిలి అందమైన మంటపములో శంఖుడు మొదలు తనకుమారులతో పరివేష్టింపబడి, ముఖ్యులైన వేలకొలది స్త్రీలతో కూడి యుండెను. (41)

అక్కడ మనోహరమైన ఆసనముమీద జాంబవతితో కలిసి కూర్చున్న కృష్ణుడు, పార్వతీదేవితో కూడియున్న మహాదేవుడగు శివునివలె ప్రకాశించెను. (42)

లోకములకాది పురుషుడు, నాశరహితుడు అగు ఆ కృష్ణుని చూచుటకు దేవతలు, గంధర్వులు, ప్రాచీనులైన మార్కండేయాది మునులు అక్కడికి వచ్చిరి. (43)

తతః స భగవాన్‌ కృష్ణో మార్కణ్డయం సమాగతమ్‌ | ననామో త్థాయ శిరసా స్వాసనం చ దదౌ హరిః || || 44 ||

సంపూజ్య తా నృషిగణాన్‌ ప్రణామేన సహానుగః | విసర్జయామాస హరి ర్దత్వా తదభివాంఛితాన్‌ || || 45 ||

తదా మధ్యాహ్నసమయే దేవదేవః స్వయం హరిః | స్నాతః శుక్లామ్బరో భాను ముపతిష్ఠ న్కృతాఞ్జలిః || || 46 ||

జజాప జాప్యం విధివత్‌ ప్రేక్షమాణో దివాకరమ్‌ | తర్పయామాస దేవేశో దేవా న్పితృణాన్మునీన్‌ || || 47 ||

ప్రవిశ్య దేవభవనం మార్కణ్డయేన చైవహి | పూజయామాస లిఙ్గస్థం భూతేశం భూతిభూషణమ్‌ || || 48 ||

సమాప్య నియమం సర్వం నియన్తా స స్వయం నృణామ్‌ | భోజయిత్వా మునివరం బ్రాహ్మణా నభిపూజ్య చ || || 49 ||

తరువాత మహాత్ముడైన కృష్ణుడు తన వద్దకు వచ్చిన మార్కండేయుని చూచి లేచి శిరసువంచి నమస్కరించి, శ్రేష్ఠమైన ఆసనమునిచ్చెను. (44)

కృష్ణుడు తన అనుచరులతో గూడ ఆ ఋషుల సమూహమును నమస్కారములతో పూజించి, వారు కోరిన వస్తువులను సమర్పించి సెలవు పొంది వెళ్లెను. (45)

అప్పుడు మధ్యాహ్న సమయము కాగా దేవదేవుడైన కృష్ణుడు స్నానము చేసి నిర్మల వస్త్రములను ధరించిన వాడై స్వయముగా సూర్యోపస్థానము చేయుచు దోసిలిపట్టిన వాడై; (46)

సూర్యుని వైపు చూచుచు జపించవలసిన సూర్యమంత్రమును విధానము ప్రకారము జపించెను. దేవతలకు ప్రభువుఐన కృష్ణుడు దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణములు విడిచెను. (47)

తరువాత మార్కండేయమునితో గూడ దేవతామందిరమును ప్రవేశించి, భూతపతి, భస్మము నలంకారముగా ధరించు లింగరూపియగు శివుని పూజించెను. (48)

మనుష్యులందరిని స్వయముగా శాసించువాడైన ఆ కృష్ణుడు సమస్త నియమమును పాటించి, ఆ మునీశ్వరునికి భోజనము పెట్టించి బ్రాహ్మణులను గౌరవించి; (49)

కృత్వా త్మయోగం విప్రేన్ద్రా మార్కణ్డయేన చాచ్యుతః | కథాం పౌరాణికీం పుణ్యాం చక్రే పుత్రాదిభి ర్వృతః || || 50 ||

అధైత త్సర్వ మఖిలం దృష్ట్వా కర్మ మహామునిః | మార్కణ్డయో హస న్కృష్ణం బభాషే మధురం వచః || || 51 ||

మార్కణ్డయఉవాచః-

కః సమారాధ్యతే దేవో భవతా కర్మభిః శుభైః | (బూహి త్వం కర్మభిః పూజ్యో యోగినాం ధ్యేయ ఏవచ || || 52 ||

త్వం హి తత్పరమం బ్రహ్మ నిర్వాణ మమలం పదమ్‌ | భారావతరణార్థాయ జాతో వృష్ణికులే ప్రభుః || || 53 ||

త మబ్రవీన్మహాబాహుః కృష్ణో బ్రహ్మవిదాం వరః | శ్రుణ్వతా మేవ పుత్రాణాం సర్వేషాం ప్రహసన్నివ || || 54 ||

బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఆత్మయోగము నవలంబించి కృష్ణుడు, కుమారులతో కూడుకున్న వాడై మార్కండేయమునితో పురాణ సంబంధమైన పుణ్యకథా ప్రసంగమును చేసెను. (50)

ఇది యంతయు చూచి గొప్ప మునియగు మార్కండేయుడు నవ్వుచు కృష్ణుని గూర్చి మధురమైన వాక్కులనిట్లు పలికెను. (51)

మార్కండేయుడిట్లనెను :-

కర్మల చేత పూజింపదగిన వాడవు, యోగులకు ధ్యానింప దగినవాడవునగు నీవు చెప్పుము. నీచేత శుభములైన కర్మల చేత ఎవడు ఆరాధింపబడుచున్నాడు? (52)

శ్రేష్ఠమైన బ్రహ్మ స్వరూపమునీవే. నిర్మలమైన మోక్షస్థాన రూపమైన గమ్యమునీవే. ప్రపంచము యొక్క భారమును తొలించుట కొరకు వృష్ణివంశములో జన్మించిన భగవంతుడవు నీవు. (53)

బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన కృష్ణుడు ఆ మాటలు విని మార్కండేయునితో, తన కుమారులందరు వినుచుండగా నవ్వుచున్న వాని వలె ఇట్లనెను. (54)

శ్రీభగవానువాచ -

భవతా కథితం సర్వం తథ్యమేవ న సంశయః | తథాపి దేవ మీశానం పూజయామి సనాతనమ్‌ || || 55 ||

న మే విప్రాస్తి కర్తవ్యం నానవాప్తం కథఞ్చన | పూజయామి తథాపీశం జానన్వై పరమం శివమ్‌ || || 56 ||

న వై పశ్యన్తి తే దేవం మాయయా మోహితా జనాః | తత శ్చైవాత్మనోమూలం జ్ఞాపయన్‌ పూజయామి తమ్‌ || || 57 ||

న చ లిజ్గార్చనా త్పుణ్యం లోకే దుర్గతినాశనమ్‌ | తథా లిజ్గే హితాయైషాం లోకానాం పూజయే చ్ఛివమ్‌ || || 58 ||

యోహం తల్లిఙ్గ మిత్యాహు ర్వేదవాదవిదో జనాః | తతో హ మాత్మ మీశానం పూజయామ్యాత్మనైవ తత్‌ || |7 59 ||

భగవంతుడైన కృష్ణుడు పలికెను -

మీ చేత చెప్పబడినదంతయు యథార్థమే. అందులో సందేహము లేదు. అయినప్పటికి నేను సనాతనుడు, భగవంతుడును అగు ఈశ్వరుని పూజించుచున్నాను. (55)

ఓ ద్విజుడా! నాకు చేయదగిన విధి అనునది ఏది లేద. నాచే పొందబడనిది కూడా ఏదియు లేదు. అయినను ఈశ్వరుడు పరమదైవతమని తెలిసికొని ఆయనను పూజించుచున్నాను. (56)

మాయచేత మోహమును పొందిన ప్రజలు ఆ దేవుని తత్త్వమును గుర్తించలేరు. అందువలన ఆత్మకు కారణభూతుడైన వాడని తెలియజేయుచు ఆ యీశ్వరుని అర్చించుచున్నాను. (57)

ఈ లోకములో దుర్గతిని నశింప జేయువానిలో లింగార్చన కంటే శ్రేష్ఠము మరొకటి లేదు. అందువలన లోకముల మేలు కొరకు లింగరూపములో నున్న శివుని పూజించవలెను. (58)

వేదములందలి సిద్ధాంతములను తెలిసిన పండితులు ఆ లింగ స్వరూపుడను నేనని చెప్పుచుందురు. ఆ కారణము వలన నా ఆత్మ స్వరూపుడైన ఈశానుని నా ఆత్మతోనే పూజించుచున్నాను. మా ఇద్దరికి ఏకాత్మతా స్వరూపము కలదు. (59)

తసై#్యవ పరమా మూర్తి స్తన్మయోహం న సంశయః | నావయో ర్విద్యతే భేదో వేదేష్వేత న్న సంశయః || || 60 ||

ఏష దేవో మహాదేవః సదా సంసారభీరుభిః యాజ్యః పూజ్యశ్చ వన్ద్యశ్చ జ్ఞేయో లిజ్గే మహేశ్వరః || || 61 ||

మార్కణ్డయ ఉవాచ -

కిం తల్లిజ్గం సురశ్రేష్ఠ లిజ్గే సంపూజ్యతే చ కః | బ్రూహి కృష్ణ విశాలాక్ష గహనం హ్యేత దుత్తమమ్‌ || || 62 ||

శ్రీ భగవానువాచ -

అవ్యక్తం లిజ్గ మిత్యాహు రానన్డం జ్యోతి రక్షయమ్‌ | వేదా మహేశ్వరం దేవ మాహు ర్లిఙ్గిన మవ్యయమ్‌ || || 63 ||

పురా చైకార్ణవే ఘోరే నష్టే స్థావరజఙ్గమే | ప్రబోధార్థం బ్రహ్మణో మే ప్రాదుర్భూతో మహాశివః || || 64 ||

ఆ యీశ్వరుని యొక్క శ్రేష్ఠమైన రూపాంతరమగు నేను, ఆతని స్వరూపమైన వాడనే. ఇందులో సంశయము లేదు. మా ఇద్దరికి భేదములేదు. వేదముల యందీ విషయము అసందిగ్ధముగా చెప్పబడినది. (60)

మహాదేవుడైన యీ శివుడు సంసారబంధము వలన భయపడుచున్న జనుల చేత ఎల్లప్పుడు పూజింపదగిన వాడు, యజ్ఞముచే అర్చింపదగిన వాడు, నమస్కరింప దగినవాడు, లింగమునందు తెలియదగిన మహేశ్వరుడై యున్నాడు. (61)

మార్కండేయుడు పలికెను -

ఓ దేవతా శ్రేష్ఠుడా ! ఆ లింగమేమిటి? లింగాకారములో పూజింపబడువాడెవ్వడు? విశాలమైన కన్నులు గల ఓ కృష్ణా! శ్రేష్ఠము, సులభముగా తెలియరానిదగు ఈ విషయమును మాకు తెలుపుము. (62)

శ్రీకృష్ణుడిట్లుచెప్పెను -

పరమేశ్వరుని యొక్క అవ్యక్త రూపమును లింగమని అందురు. ఆ లింగరూపము ఆనంద స్వరూపము, నాశరహితమైన జ్యోతి అనబడును. వేదములు భగవంతుడైన మహేశ్వరుని నాశరహితుడైన లింగరూపునిగా పేర్కొనుచున్నవి. (63)

పురాతన కాలములో ప్రపంచములోని స్థావరజంగమములన్నియు భయంకరమైన, ప్రపంచవ్యాప్తమైన, సముద్రములో నాశము చెందగా బ్రహ్మను మేలు కొలుపుట కొరకు మహాశివుడు నాకు సాక్షాత్కరించినాడు. (69)

తస్మా త్కాలా త్సమారభ్య బ్రహ్మా చాహం సదైవ హి | పూజయావో మహదేవం లోకానాం హితకామ్యయా | || 65 ||

మార్కణ్డయ ఉవాచ -

కథం లిజ్గ మభూ తూర్వ మైశ్వరం పరమం పదమ్‌ | ప్రబోధార్థం స్వయం కృష్ణ వక్తు మర్హసి సాంప్రతమ్‌ || || 66 ||

శ్రీభగవానువాచ -

ఆసీ దేకార్ణవం ఘోర మవిభాగం తమోమయమ్‌ | సహస్రబాహుః పురుషః శయితో హంసనాతనః || || 67 ||

ఆ కాలమునుండి ఆరంభించి బ్రహ్మదేవుడు మరియు నేను లోకముల మేలును కోరినవారమై మహాదేవుడగు శివుని ఎల్లప్పుడు పూజించుచున్నాము. (65)

మార్కండేయుడు పలికెను -

ఓ కృష్ణా! ప్రాచీన కాలములో ఈశ్వర సంబంధి సర్వోత్తమ స్థానమగు లింగము మేలు కొలుపుట కొరకు స్వయముగా ఎట్లు ఆవిర్భవించినదో నీవిప్పుడు చెప్పుట ఉచితముగా నుండును. (66)

శ్రీకృష్ణుడిట్లు చెప్పెను -

పూర్వము ఈ ప్రపంచమంతయు ఏకసముద్రరూపము, విభాగములు లేనిది, భయంకరమైనది, చీకటితో నిండినదిగా ఉండెను. ఆ అఖండ సముద్రమధ్యములో శంఖము, చక్రము గద అను ఆయుధములను ధరించినవాడు; (67)

వేయి తలలు, మేయి కన్నులు, వేయి పాదములు వేయి భుజములు కల పురుషుడుగా నేను ఆవిర్భవించి, సనాతనుడగు రూపముతో సముద్రము నందు శయనించితిని. (68)

ఏతస్మి న్నన్తరే దూరే పశ్యామి స్మామితప్రభమ్‌ | కోటిసూర్యప్రతీకాశం భ్రాజమానం శ్రియా వృతమ్‌ || || 69 ||

చతుర్వక్త్రం మహాయోగం పురుషం కారణం ప్రభుమ్‌ | కృష్ణాజినధరం దేవ మృగ్యజుస్సామభిః స్తుతమ్‌ || || 70 ||

నిమేషమాత్రేణ స మాం ప్రాప్తో యోగవిదాం వరః | వ్యాజహార స్వయం బ్రహ్మా స్మయమానో మహాద్యుతి || || 71 ||

కస్త్వం కుతో వా కిఞ్చేహ తిష్ఠసే వద మే ప్రభో | అహం కర్తా హి లోకానాం స్వయంభూః ప్రపితామహః || || 72 ||

ఏవ ముక్త స్తదా తేన బ్రహ్మణాహ మువాచ హ | అహం కర్తాస్మి లోకానాం సంహర్తా చ పునః పునః || || 73 ||

ఈ మధ్య అవకాశములో దూర ప్రదేశమున అపరిమితమైన కాంతి కలది, కోటి మంది సూర్యుల తేజస్సుతో సమానమైనది, సంపదతో కూడి ప్రకాశించుచున్నది అగు ఒక తేజస్సును చూచితిని. (69)

నాలుగు ముఖములు కలిగి, గొప్ప యోగశక్తి కలవాడు, ప్రభువు, నల్లని జింక చర్మను ధరించిన వాడు, ఋగ్యజుస్సామవేదముల మంత్రముల చేత కొని యాడబడుచున్న కారణభూతుడైన పరమేశ్వరుడే ఆ తేజోరాశి. (70)

యోగవేత్తలలో శ్రేష్ఠుడైన ఆ పరమేశ్వరుడు ఒక్క నిమేష కాలములో నన్ను చేరుకొనెను. గొప్ప తెజస్సుతో కూడిన ఆ బ్రహ్మ చిరునవ్వుతో స్వయముగా ఇట్లు పలికెను. (71)

ఓ ప్రభూ! నీవు ఎవరవు? ఎక్కడి నుండి వచ్చితివి? ఎందువలన ఇక్కడ నిలిచి ఉన్నావు? నాకు తెలుపుము. నేను స్వయముగా అవతరించినవాడను, ప్రపితామహుడను, లోకములన్నింటికి సృష్టికర్తనై యున్నాను. (72)

ఈ విధముగా అప్పుడా బ్రహ్మ చేత ప్రశ్నించబడిన నేను అతనితో ఇట్లంటిని. ఈ లోకములన్నింటిని మాటి మాటికి సృష్టించి మరల నశింప జేయువాడను నేను. (73)

ఏవం వివాదే వితతే మాయయా పరమేష్ఠినః | ప్రబోధార్థం పరం లిజ్గం ప్రాదుర్భూతం శివాత్మకమ్‌ || || 74 ||

కాలానలసమప్రఖ్యం జ్వాలామాలా సమాకులమ్‌ | క్షయవృద్ధివినిర్ముక్త మాదిమధ్యాన్తవర్జితమ్‌ || || 75 ||

తతో మా మాహ భగవా నథో గచ్ఛ త్వ మాశు వై | అన్త మస్య విజానీష్వ ఊర్థ్వం గచ్ఛేహమి త్యజః || || 76 ||

తదా శు సమయం కృత్వా గతా వూర్ధ్వ మధ శ్చతౌ | పితామహో ప్యహం నాన్తం జ్ఞాతవన్తౌ సమేత్య తౌ || || 77 ||

తతో విస్మయ మాపన్నౌ భీతౌ దేవస్య శూలినః | మాయయా మోహితౌ తస్య ధ్యాయన్తౌ విశ్వ మీశ్వరమ్‌ || || 78 ||

ప్రోచ్చరన్తౌ మహానాద మోఙ్కారం పరమం పదమ్‌ | తం ప్రాఞ్జలిపుటౌ భుత్వా శవ్ఖుం తుష్టువుతుః పరమ్‌ || || 79 ||

ఆ పరమేష్ఠి యొక్క మాయచేత మా యిద్దరి మధ్య ఇట్లు వివాదము వ్యాపించగా మమ్ములను జ్ఞానవంతులను చేయుటకు శివ స్వరూపమైన గొప్ప లింగాకారము అక్కడ సాక్షాత్కరించెను. (74)

ఆ లింగమూర్తి ప్రళయకాములోని అగ్నితో సమానతేజస్సు కలిగి యుండెను. జ్వాలల వరుసలతో కూడియున్నది, పెరుగదల నాశము అనునవి లేనిది, మొదలు, మధ్య, అంతము అనువిభాగములు లేనిదై యుండెను. (75)

అప్పుడా భగవంతుడు బ్రహ్మ, నీవు తొందరగా క్రింది భాగమునకు వెళ్లుమని. దీని చివర ఎక్కడ కలదో తెలిసి కొనుమని నాతో అనెను. నేను పై భాగమునకు వెళ్లుదునని కూడా పలికెను. (76)

అప్పుడు నియమము చేసికొని శీఘ్రముగా బ్రహ్మ, నేను కూడా ఊర్ధ్వ, అథోభాగములకు వెళ్లి ఆ లింగాకారపు అంతమును కనుగొన జాలమైతిమి. (77)

తరువాత ఆశ్చర్యమును పొందిన వారమై, భయమంది, భగవంతుడగు శివుని మాయ చేత మోహమును పొంది, విశ్వాత్మకుడైన యీశ్వరుని ధ్యానించుచు; (78)

ఓంకార రూపమైన మహానాదమును బిగ్గరగా పలుకుచు, దోసిలి జోడించి పరమ పదస్థానమైన ఆ శివుని స్తోత్రము చేసితిమి (79)

బ్రహ్మవిష్ణూ ఊచతుః -

అనాదిమూలసంసారరోగవైద్యాయ శమ్భవే | నమః శివాయ శాన్తాయ బ్రహ్మణ లిఙ్గమూర్తయే || || 80 ||

ప్రలయార్ణవసంస్థాయ ప్రలయోద్భూతిహేతవే | నమః శివాయ శాన్తాయ బ్రహ్మణ లిఙ్గమూర్తయే || || 81 ||

జ్వాలామాలప్రతీకాయ జ్వలనస్తమ్భరూపిణ | నమః శివాయ శాన్తాయ బ్రహ్మణ లిఙ్గమూర్తయే || || 82 ||

ఆదిమధ్యాన్తహీనాయ స్వభావామలదీప్తయే | నమః శివాయానన్తాయ బ్రహ్మణ లిఙ్గమూర్తయే || || 83 ||

ప్రధానపురుషేశాయ వ్యోమరూపాయ వేధసే| నమః శివాయ శాన్తాయ బ్రహ్మణ లిఙ్ఞమూర్తయే || || 84 ||

నిర్వికారాయ సత్యాయ నిత్యాయా తులతేజసే | వేదాన్తసారరూపాయ కాలరూపాయ తే నమః || || 85 ||

మొదలు లేని, వేరు లేని సంసార మను రోగమునకు వైద్యుడైన శంభుదేవునకు, శాంతుడైన శివునికి, లింగరూపు డైన బ్రహ్మయగు ఈశ్వరునికి నమస్కారము. (80)

ప్రళయమను సముద్రములో నివసించువాడు, ప్రళయమునకు, సృష్టికి కారణభూతుడు, శాంతరూపుడు, లింగ స్వరూపియగు బ్రహ్మము అయిన శివునకు వందనము (81).

అగ్నిజ్వాలల పరంపర చిహ్నము కలవాడు, అగ్ని స్తంభ స్వరూపుడు, శాంతుడు, లింగరూపుడు, బ్రహ్మము నగు శివునకు నమస్కారము. (82)

మొదలు, మధ్యము అంతము అనుదశలు లేనివాడు, సహజమైన, స్వచ్ఛమైన ప్రకాశము కలవాడు, నాశము లేనివాడు, లింగరూపియగు బ్రహ్మమైన శివునకు ప్రణామము. (83)

ప్రధాన పురుషుడగు ఈశ్వరుడు, ఆకాశ స్వరూపుడగు బ్రహ్మ, శాంతుడు, లింగాకారుడు, బ్రహ్మమునకు శివునకు నమస్కారము. (84)

వికారములు లేని వాడు, సత్యరూపుడు, శాశ్వతుడు, సాటి లేని తేజస్సు కల వాడు, వేదాంతముల సారమైన స్వరూపము కలవాడు, కాల స్వరూపుడవగు శివునకు నీకు ప్రణామము. (85).

నమః శివాయ శాన్తాయ బ్రహ్మణ లిఙ్గ మూర్తయే | ఏవం సంస్తూయమాన స్తు వ్యక్తో భూత్వా మహేశ్వరః || || 86 ||

భాతి దేవో మహాయోగీ సూర్యకోటిసమప్రభః | వక్త్రకోటిసహస్రేణ గ్రసమాన ఇవామ్బరమ్‌ || || 87 ||

సహస్రహస్తచరణః సూర్యసోమాగ్నిలోచనః | పినాకపాణి ర్భగవాన్‌ కృత్తివాసా స్త్రిశూలధృక్‌ || || 88 ||

వ్యాలయజ్ఞోపవీతశ్చ మేఘదున్దుభినిః స్వనః | అథోవాచ మహాదేవః ప్రీతో హం సురసత్తమౌ || || 89 ||

పశ్యేతం మాం మహాదేవం భయం సర్వం ప్రముచ్యతామ్‌ | యువాం ప్రసూతౌ గోత్రేభ్యో మమ పూర్వం సనాతనౌ || || 90 ||

శాంతుడు, లింగ స్వరూపుడు, బ్రహ్మము అగు శివునకు వందనము. అని యీ విధముగా కొనియాడబడుచున్న మహేశ్వరుడు సాక్షాత్కరించి, (86) గొప్పయోగీశ్వరుడు, కోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు, వేల కొలది ముఖముల సమూహములతో ఆకాశమును మ్రింగుచున్న వానివలె ప్రకాశించెను. (87)

అనంతములైన పాదములు, చేతులు కలవాడు, సూర్యుడు చంద్రుడు అగ్ని అను ముగ్గురు కన్నులుగా కలవాడు, పినాకమను ధనుస్సు చేతిలో ధరించిన వాడు, చర్మము వస్త్రముగా కలవాడు, త్రిశూలమును ధరించిన వాడై భగవంతుడు కాన్పించెను. (88)

సర్పములే యజ్ఞోపవీతముగా కలవాడు, మేఘమువంటి, దుందుభి వంటినాదము కలవాడు అగు మహాదేవుడు సాక్షాత్కరించి ఇట్లనెను. ''ఓ దేవతా శ్రేష్ఠులారా! నేను సంతోషించినాను'' (89)

మహాదేవుడనైన నన్నుచూడుడు. మీ భయము నంతటిని విడువుడు. మీరిద్దరు అనాదిగా, నాకంటే పూర్వము వంశముల వలన జన్మించియున్నారు. (90).

అయం మే దక్షిణి పార్శ్వే బ్రహ్మా లోకపితామహః | వామపార్శ్వే చ మే విష్ణుః పాలకో హృదయే హరః || || 91 ||

ప్రీతో 7హం యువయోః సమ్య గ్వరం దద్మి యథేప్సితమ్‌ | ఏవ ముక్త్వాథ మాం దేవో మహాదేవః స్వయం శివః || || 92 ||

ఆలింగ్య దేవం బ్రహ్మాణం ప్రసాదాభిముఖో 7భవత్‌ | తతః ప్రహృష్టమనసౌ ప్రణిపత్య మహేశ్వరమ్‌ || || 93 ||

ఊచతుః ప్రేక్ష్య తద్వక్త్రం నారాయణపితమహౌ | యది ప్రీతిః సముత్పన్నా యది దేయో వరో హి నః || || 94 ||

భక్తి ర్భవతు నౌ నిత్యం త్వయి దేవ మహేశ్వరే | తతః స భగవా నీశఃప్రహస న్పరమేశ్వరః || || 95 ||

ఉవాచ మాం మహాదేవః ప్రీతం ప్రేతేన చేతసా | || 96 ||

దేవదేవ ఉవాచ.

ప్రలయస్థితిసర్గాణాం కర్తా త్వం ధరణీపతే ||

లోకములకు పితామహుడైన యీ బ్రహ్మ నాకు కుడిభాగముననున్నాడు. నా ఎడమ భాగములో లోకరక్షకుడైన విష్ణు వున్నాడు. నా మనస్సులో శివుడున్నాడు. (91)

నేను మీ ఇరువురి విషయంలో సంతోషించినాను. మీకు మీ ఇష్ట ప్రకారముగా మంచివరము నిత్తును. అని నన్ను గూర్చి యిట్లు పలికి మహాదేవుడగు శివుడు స్వయముగా (92) బ్రహ్మదేవుని కౌగిలించుకొని అనుగ్రహముతో కూడిన ముఖము కలవాడాయెను. తరువాత బ్రహ్మ విష్ణువులు సంతోషించిన మనస్సు కలవారై మహేశ్వరునికి నమస్కరించి; ఆయన ముఖమును చూచి, ''మీరు మా యందు ప్రీతి కలిగిన యెడల, మాకు నీవు వరము నీ దలచినచో, ఓ దేవా! మాకు మహేశ్వరుడవయిన నీ యందు ఎల్లప్పుడు భక్తి కలుగుగాక'' అని పలుకగా భగవంతుడగు పరమేశ్వరుడు నవ్వుచు, ప్రీతి కలమనస్సుతో, సంతోషించిన నాతో ఇట్లనెను. ఓ రాజా! ప్రళయము, స్థితి, సృష్టి అను కార్యములకు నీవు కర్తవు కదా! (93, 94, 95, 96)

వత్స వత్స హరే విశ్వం పాలయైత చ్చరాచరమ్‌ | త్రిధా భిన్నో స్మృహం విష్ణో బ్రహ్మవిష్ణుహరాఖ్యయా || || 97 ||

సర్గరక్షాలయగుణౖ ర్నిర్గుణో పి నిరఞ్జనః | సంమోహం త్యజ భోవిష్ణో పాలయైనం పితామహమ్‌ || || 98 ||

భవిష్య త్యేవ భగవాం స్తవ పుత్రః సనాతనః | అహం చ భవతో వక్త్రా త్కల్పాదౌ సురరూపధృక్‌ || || 99 ||

శూలపాణి ర్భవిష్యామి క్రోధజ స్తవ పుత్రకః | ఏవ ముక్త్వా మహాదేవో బ్రహ్మాణం మునిసత్తమ || || 100 ||

అనుగృహ్య చ మాం దేవ స్త త్రైవార్త రధీయత | తతః ప్రభృతి లోకేషు లిజ్గార్చా సుప్రతిష్టితా || || 101 ||

కుమారా! విష్ణూ! ఈచరాచర రూపమైన విశ్వమును పాలించుము. ఓ హరే! నేను బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపములతో మూడు విధముల భిన్న రూపుడనైయున్నాను. (97)

సర్గము, రక్షణ, నాశము అనుగుణాలతో ఆ మూడు రూపములను ధరించినాను. గుణ రహితుడను, వికారము లేని వాడనైనను ఆయా రూపములను స్వీకరించినాను. ఓ విష్ణూ! మోహమును విడిచి పెట్టి ఈ పితామహుని కాపాడుము. (98)

పూజనీయుడగు ఈ బ్రహ్మ సనాతనుడైనను నీకు పుత్రుడుగా జన్మించగలడు. నేను కూడా కల్పాది కాలములో దేవతా రూపమును ధరించి నీ ముఖము నుండి శూలహస్తుడుగా జన్మింతును. క్రోధగుణము నుండి పుట్టిన నీ పుత్రుడనగుదును. ఓ మునీశ్వరా! మహాదేవుడగు శివుడు బ్రహ్మను గూర్చి ఇట్లు పలికి, నన్నను గ్రహించి వెంటనే అక్కడనే అంతర్థానము చెందెను. అప్పటి నుంచి లోకముల యందు లింగార్చన అనునది చక్కగా నెలకొని స్థిరపడినది. (99, 100, 101)

లిజ్గం తత్తు యతో బ్రహ్మన్‌ బ్రహ్మణః పరమం వపుః | ఏత ల్లిఙ్గస్య మాహాత్య్మం భాషితం తే మయానఘ || || 102 ||

ఏత ద్బుధ్యన్తి యోగజ్ఞా న దేవా నచ దానవాః | ఏతద్ధి పరమం జ్ఞాన మవ్యక్తం శివసంజ్ఞితమ్‌ || || 103 ||

యేన సూక్ష్మ మచిన్త్యం త త్పశ్యన్తి జ్ఞానచక్షుషః | తసై#్మ భగవతే నిత్యం నమస్కారం ప్రకుర్మహే || || 104 ||

మహాదేవాయ దేవాయ దేవదేవాయ భృంగిణ | నమో వేద రహస్యాయ నీలకణ్ఠాయ తే నమః || || 105 ||

విభీషణాయ శాన్తాయ స్థాణవే హేతవే నమః | బ్రహ్మణ వామదేవాయ త్రినేత్రాయ మహీయసే || || 106 ||

శంకరాయ మహేశాయ గిరీశాయ శివాయ చ | నమః కురుష్వ సతతం ధ్యాయస్వ చ మహేశ్వరమ్‌ || || 107 ||

ఓ బ్రహ్మదేవుడా! ఆ లింగము పరబ్రహ్మము యొక్క శ్రేష్ఠమైన శరీరము. ఓ పుణ్యాత్ముడా! ఇది ఆ లింగము యొక్క మాహాత్మ్యము, నీ కొరకు నాచే తెలుపబడినది. (102)

దీని మహిమను యోగము తెలిసిన వారు మాత్రము తెలిసికొందురు. దేవతలు కాని, దానవులు కాని తెలియజాలరు. ఇది అవ్యక్త రూపము, శివనామకము అగు ఉత్తమమైన జ్ఞానము. (103)

దేని ద్వారా జ్ఞానదృష్టి కలవారు సూక్ష్మము, ఆలోచింపశక్యము కానిది అగు ఆ తత్త్వమును దర్శింతురో అటువంటి భగవంతునకు ఎల్లప్పుడు నమస్కారమును చేయుదుము. (104)

మహాదేవుడవు, దేవుడవు, దేవతలకు దేవుడవు, వేద రహస్యభూతుడవు, నల్లని కంఠము కలవాడవు. భృంగీశ్వరుడవు అగు నీకు నమస్కారము. (105)

భయంకరమైన రూపము కలవాడవు, శాంతుడవు, స్థాణురూపుడవు, కారణభూతుడవు, బ్రహ్మవు, వామదేవుడవు, మూడు కన్నులు కలవాడవు, గొప్పవాడవు నగు నీకు వందనము. (106)

శుభముల నిచ్చువాడు, మహేశుడు, గిరీశుడు, శివుడు అగు ఆ భగవంతునకు ఎల్లప్పుడు నమస్కరించుము. ఆ మహేశ్వరుని ధ్యానింపుము. (107)

సంసారసాగరా దస్మా దచిరా దుద్ధరిష్యసి | ఏవం స వాసుదేవేన వ్యాహృతో మునిపుఙ్గవః || || 108 ||

జగామ మనసా దేవ మీశానం విశ్వతోముఖమ్‌ | ప్రణమ్య శిరసా కృష్ణ మనుజ్ఞాతొ మహామునిః || || 109 ||

జగామ చేప్సితం శమ్భుం దేవదేవం త్రిశూలినమ్‌ | య ఇమం శ్రావయే న్నిత్యం లిఙ్గాధ్యాయ మనుత్తమమ్‌ || || 110 ||

శృణుయా ద్వా పఠే ద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే | శ్రుత్వా సకృదపి హ్యేత త్తపశ్చరణ ముత్తమమ్‌ || || 111 ||

వాసుదేవస్య విప్రేన్ద్రాః పాపం ముఞ్చతి మానవః | జపే ద్వాహరహ ర్నిత్యం బ్రహ్మలోకే మహీయతే || || 112 ||

ఏవ మాహ మహాయోగీ కృష్ణద్వైపాయనః ప్రభుః ||

ఇతి శ్రీకూర్మపురాణ యదువంశాను కీర్తనే లింగోత్పత్తిర్నామ షడ్విం శో ధ్యాయః

ఈ సంసార సముద్రము నుండి శీఘ్రముగా ఉద్ధరించగలవు. ఈ రీతిగా ఆ మునిశ్రేష్ఠుడు కృష్ణుని చేత పలుకబడినాడు. (108)

తరువాత అతడు అంతట వ్యాపించి యున్న ఈశ్వరుణ్ణి మనస్సులో ధ్యానించెను. శిరసుతో కృష్ణునికి నమస్కరించి ఆజ్ఞ పొంది ఆ మహాముని, (109) తన కిష్టుడైన, త్రిశూలధారియై, దేవదేవుడైన శివుని పొందెను. శ్రేష్ఠమైన యీ లింగాధ్యాయాన్ని ఎల్లప్పుడు ఎవడు వినిపించునో, వినునో, చదువునో, ఈతపశ్చరణ వృత్తాంతాన్ని ఒక్కసారైనా విన్నప్పటికి అన్ని పాపములచేత విడువబడుతాడు. (110, 111)

బ్రాహ్మణ ముఖ్యులారా! ఈ వాసుదేవ తపస్సు వృత్తాంతమును మనుష్యుడు ప్రతి దినము జపించితే పాపము తొలగించుకుంటాడు. బ్రహ్మలోకంలో ప్రకాశిస్తాడు. అని ఈ విధంగా పూజ్యుడైన మహాయోగి వ్యాసుడు చెప్పెను. (112)

శ్రీ కూర్మమహాపురాణములో యదువంశాను కీర్తనం లో లింగోత్పత్తి అను ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము

Sri Koorma Mahapuranam    Chapters