Sri Koorma Mahapuranam
Chapters
సప్తవింశో7ధ్యాయః అథరాజ వంశాను కీర్తనమ్ సూత ఉవాచ :- తతో లబ్ధవరః కృష్ణో జామ్బవత్యాం మహేశ్వరాత్ | అజీజన న్మహాత్మానం సామ్బ మాత్మజ ముత్తమమ్ ||
|| 1 || ప్రద్యుమ్నస్య హ్యభూ త్పుత్రో హ్యనిరుద్ధో మహాబలః | తా వుభౌ గుణసమ్పన్నౌ కృష్ణ సై#్య వా పరే తనూ ||
|| 2 || హత్వా చ కంసం నరక మన్యాంశ్చ శతశో7 సురాన్ | విజిత్య లీలయా శక్రం జిత్వా బాణం మహాసురమ్ ||
|| 3 || స్థాపయిత్వా జగత్కృత్స్నం లోకే ధర్మాంశ్చ శాశ్వతాన్ | చక్రే నారాయణో గన్తుం స్వస్థానం బుద్ధి ముత్తమామ్ || || 4 || ఇరవైయేడవ అధ్యాయము రాజవంశాను కీర్తనము సూతుడిలా చెప్పెను తరువాత మహేశ్వరుని వలన వరము పొంది కృష్ణుడు జాంబవతి యందు ఉత్తముడైన సాంబుడనే కొడుకును పొందెను. (1) ప్రద్యుమ్నునికి గొప్ప బలవంతుడైన అనిరుద్ధుడనే కుమారుడు కలిగినాడు. వారిద్దరూ గుణవంతులు, కృష్ణుని మారు శరీరాల వలె ఉండిరి. (2) కంసుణ్ణి, నరకాసురుణ్ణి, ఇంకా వందల కొలది రాక్షసులను చంపి, విలాసముగా ఇంద్రుని గెలిచి, బాణుడనే గొప్ప రాక్షసుణ్ణి జయించి, ప్రపంచాన్ని చక్కగా నెలకొల్పి, శాశ్వత ధర్మాలను లోకంలో కాపాడి, నారాయణుడు తన నివాసమైన వైకుంఠానికి వెళ్లాలని సంకల్పము చేసికొనెను. (3, 4) ఏతస్మి న్నన్తరే విప్రా భృగ్వాద్యాః కృష్ణ మీశ్వరమ్ | ఆజగ్ము ర్ద్వారకాం ద్రష్టుం కృతకార్యం సనాతనమ్ || || 5 || స తా నువాచ విశ్వాత్మా ప్రణిపత్యా భిపూజ్యచ | ఆసనే షూ పవిష్టాన్వై సహ రామేణ ధీమతా || || 6 || గమిష్యామి పరం స్థానం స్వకీయం విష్ణుసంజ్ఞితమ్ | కృతాని సర్వకార్యాణి ప్రసీదధ్వం మునీశ్వరాః || || 7 || ఇదం కలియుగం ఘోరం సంప్రాప్త మధునా7 శుభమ్ | భవిష్యన్తి జనాః సర్వే హ్యస్మి న్పాపానువర్తినః || || 8 || ప్రవర్తయధ్వం విజ్ఞాన మజ్ఞానాం చ హితావహమ్ | యే నేమే కలిజైః పాపైః ముచ్యన్తే హి ద్విజోత్తమాః || || 9 || యే మాం జనాః సంస్మరన్తి కలౌ సకృదపి ప్రభుమ్ | తేషాం నశ్యతి తత్పాపం భక్తానాం పురుషోత్తమే || || 10 || బ్రాహ్మణులారా ! ఈ మధ్యలో భృగువు మొదలగు మునులు కార్యము నెరవేర్చిన సనాతనుడు, ఈశ్వరుడు అయిన కృష్ణుణ్ణి చూడటానికి ద్వారకాపట్టణానికి వచ్చిరి (5) విశ్వాత్ముడైన కృష్ణుడు, బుద్ధిమంతుడైన బలరాముణితో కూడి వారికి నమస్కరించి, పూజించి, ఆసనాలలో కూర్చున్న తరువాత వారితో ఇట్లు పలికినాడు. (6) మునీశ్వరులారా! నా కర్తవ్యాలన్నిటినీ పూర్తి చేసినాను. ఇక విష్ణులోకనామం కల నా స్వకీయపరమపదానికి వెళ్లుదును. మీరు ప్రసన్నులు కండు (7) ఇప్పుడు ఘోరము, అశుభకరము అయిన కలియుగము వచ్చినది. ఈ యుగంలో ప్రజలందరు పాప మార్గంలో సంచరించే వారవుతారు. (8) ద్విజులారా! అజ్ఞానులకు హితాన్ని కలిగించే విజ్ఞానాన్ని వ్యాపింప చేయండి. దాని చేత వీరు కలియుగ పాపాల నుండి విముక్తులవుతారు. (9) కలియుగంలో ఎవరైతే ప్రభువైన నన్ను ఒక్కమారైనా స్మరింతురో అట్టి పురుషోత్తముని యందు భక్తి కల వారికి పాపం నశిస్తుంది. (10). యే7 ర్చయిష్యన్తి మాం భక్త్యా నిత్యం కలియుగే ద్విజాః | విధినా వేదదృష్టేన తే గమిష్యన్తి తత్పదమ్ || || 11 || యే బ్రాహ్మణా వంశజాతా యుష్మాకం వై సహస్రశః | తేషాం నారాయణ భక్తి ర్భవిష్యతి కలౌయుగే || || 12 || పరా త్పరతరం యాన్తి నారాయణపరా జనాః | న తే తత్ర గమిష్యన్తి యే ద్విషన్తి మహేశ్వరమ్ || || 13 || ధ్యానం యోగ స్తప స్తప్తం జ్ఞానం యజ్ఞాదికో విధిః | తేషాం వినశ్యతి క్షిప్రం యే నిన్దన్తి మహేశ్వరమ్ || || 14 || యో మాం సమర్చయే న్నిత్య మేకాన్తం భావ మాశ్రితః | వినిన్ద న్దేవ మీశానం స యాతి నరకాయుతమ్ || || 15 || ఎవరైతే కలియుగములో వేదములందు ప్రతిపాదించబడిన విధానముతో ఎల్లప్పుడు భక్తితో నన్ను పూజింతురో అట్టివారు ఆ పరమపదమును పొందుదురు. (11) నారాయణునియందు భక్తిశ్రద్ధలు కల జనులు ఉత్తములలోకెల్ల ఉత్తమమైన సద్గతిని పొందుదురు. ఎవరైతే మహేశ్వరుడైన శివుని ద్వేషింతురో వారు అట్టి స్థానమును పొందజాలరు. (13) ఎవరైతే మహేశ్వరుని దూషింతురో, వారి యొక్క ధ్యానము, యోగము చేయబడినతపస్సు, జ్ఞానము, యజ్ఞములు మొదలుగా గల ధార్మిక కార్యములు - అన్నియును శీఘ్రముగా నిష్ఫలములగును. (14) ఎవడు ఎల్లప్పుడు ఏకాగ్రత కల మనస్సుతోకూడి నన్ను పూజించునో, అట్టివాడు భగవంతుడగు శివునినిందిచిన యెడల వేలకొలది నరకలోకములను పొందగలడు. (15) తస్మా త్సంపరిహర్తవ్యా నిన్దా పశుపతే ర్ద్విజాః | కర్మణా మనసా వాచా మద్భక్తే ష్వపి యత్నతః || || 16 || యే చ దక్షాధ్వరే శప్తా దధీచేన ద్విజోత్తమాః | భవిష్యన్తి కలౌ భ##క్తైః పరిహార్యాః ప్రయత్నతః || || 17 || ద్విషన్తో దేవ మీశానం యుష్మాకం వంశసమ్భవాః | శప్తాశ్చ గౌతమే నోర్య్వాం న సమ్భాష్యా ద్విజోత్తమైః || || 18 || ఏవ ముక్తాశ్చ కృష్ణేన సర్వే తే వై మహర్షయః | ఓ మిత్యుక్త్వా యయు స్తూర్ణం స్వాని స్థానాని సత్తమాః || || 19 || తతో నారాయణః కృష్ణో లీలయైన జగన్మయః | సంహృత్య స్వకులం సర్వం య¸° తత్పరమం పదమ్ || || 20 || ఇత్యేష వః సమాసేన రాజ్ఞాం వంశః సుకీర్తితః | న శక్యో విస్తరా ద్వక్తుం కిం భూయః శ్రోతు మిచ్ఛథ || || 21 || అందువలన ఓ విప్రులారా! పశుపతియగు శివుని యొక్క నిందను పనుల చేతగాని, మనస్సు చేతగాని, మాట చేతగాని పూర్తిగా విడువ వలెను. అట్లే నా భక్తుల విషయంలో కూడా నిందను ప్రయత్నపూర్వకముగా పరిహరించవలెను. (16) దక్షయజ్ఞములో దధీచ మహామునిచేత శపించబడిన ఏ బ్రాహ్మణశ్రేష్ఠులు కలరో వారు కలియుగములో భక్తులచేత ప్రయత్నముతో దూరముగా విడువదగిన వారై యున్నారు. (17) మీ వంశములో జన్మించి ప్రభువైన శంకరుని ద్వేషించిన వారు, గౌతముని చేత శపించబడిన వారు, భూమి యందు బ్రాహ్మణ శ్రేష్ఠుల చేత మాట్లాడదగని వారు. (18) ఈ విధముగా కృష్ణుని చేత పలుకబడిన ఆ మహర్షులందరు తమ అంగీకారమును తెలిపి శీఘ్రముగా తమ తమ స్థానములకు వెళ్లిరి. (19) తరువాత విష్ణువు రూపాంతరమైన కృష్ణుడు లోకాత్ముకుడు కావున తన లీలావినోదముతో యాదవవంశము నంతయు సంహరించి, తన పరమపదమునకు వెళ్లెను. (20). ఈ విధముగా రాజుల యొక్క వంశ చరిత్ర సంగ్రహముగా మీకు వివరించబడినది. ఇంతకంటే విపులముగా చెప్పుటకు సాధ్యము కాదు. మీరింకను ఏమి వినగోరుచున్నారు? (21) యః పఠే చ్ఛృణుయా ద్వాపి వంశానాం కథనం శుభమ్ | సర్వపాపవినిర్ముక్తః స్వర్గలోకే మహీయతే || || 22 || ఇతి శ్రీ కూర్మ పురాణ రాజవంశాను కీర్తనం నామ సప్తవింశో ధ్యాయః మంగళకరమైన యీ రాజవంశముల చరిత్రను ఎవడు పఠించునో, లేదా వినునో అట్టివాడు అన్ని పాపముల నుండి విడుదల పొందిన వాడై స్వర్గ లోకములో ప్రకాశించును. (22) శ్రీకూర్మ పురాణములో రాజవంశాను కీర్తనమను ఇరువది యేడవ అధ్యాయము సమాప్తము