Sri Koorma Mahapuranam
Chapters
తృతీయోధ్యాయః అథ వర్ణాశ్రమ క్రమవర్ణనమ్ ఋషయ ఊచుః || వర్ణా భగవతో ద్దిష్టా శ్చత్వారో೭ప్యాశ్రమా స్తథా | ఇదానీం క్రమ మస్మాక మాశ్రమాణాం వద ప్రభో ||
|| 1 || కూర్మ ఉవాచ || బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థో యతిస్తథా | క్రమేణౖవా శ్రమాః ప్రోక్తాః కారణా దన్యథా భ##వేత్ ||
|| 2 || ఉత్పన్నజ్ఞానవిజ్ఞానీవైరాగ్యం పరమం గతః | ప్రవ్రజే ద్బ్రహ్మచర్యాత్తు యదీచ్ఛే త్పరమాం గతిమ్ ||
|| 3 || దారా నాహృత్య విధివ దన్యథా వివిధై ర్మఖైః | యజే దుత్పాదయే త్పుత్రాన్ విరక్తోయది సంన్యసేత్ ||
|| 4 || అనిష్ట్వా విధివ ద్యజ్ఞై రనుత్పాద్య తథాత్మజాన్ | న గార్హస్థ్యం గృహీ త్యక్త్వా సంన్యసే ద్బుద్ధిమాన్ ద్విజః ||
|| 5 || తృతీయాధ్యాయము ఋషులిట్లు పలికిరి :- భగవంతునిచేత ఏర్పరచబడిన నాలుగు వర్ణాలు, ఆశ్రమాలు వివరించడ్డాయి. మహాత్మా! ఇప్పుడు మాకు ఆశ్రమాల క్రమాన్ని గురించి చెప్పుము. (1) కూర్మస్వామి ఇట్లనెను. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనినాలుగు ఆశ్రమభేదాలు చెప్పబడ్డాయి. అవి క్రమంగా ఒకదాని తరువాత మరొకటి ప్రవర్తిస్తాయి. ప్రత్యేకకారణమున్నప్పుడు క్రమంలో భంగం రావచ్చును. (2) ఉత్కృష్టమైన జ్ఞాన విజ్ఞానములు కలిగి, గొప్ప వైరాగ్యమును పొందిన యెడల బ్రహ్మచర్యాశ్రమం నుండి మోక్షకామనతో సన్న్యాసాన్ని స్వీకరించవచ్చును. (3) శాస్త్రప్రకారము వివాహమాడి వివిధములైన యజ్ఞములతో దేవతలను పూజించి సంతానమును పొందవలెను. వైరాగ్యము కలిగినచో సన్న్యసించవలెను. విధి ప్రకారము యజ్ఞములు చేయక, పుత్రులను పొందక గృహస్థుడు తన ఆశ్రమాన్ని వదలి సన్యసించకూడదు. (4, 5) అథ వైరాగ్యవేగేన స్థాతుం నోత్సహతే గృహే | తత్రైవ సంన్యసే ద్విద్వా ననిష్ట్వాపి ద్విజోత్తమః || || 6 || తథాపి వివిధై ర్యజ్ఞై రిష్ట్వా వన మథాశ్రయన్ | తప స్తప్త్వా తపోయోగా ద్విరక్తః సంన్యసే ద్బహిః || || 7 || వానప్రస్థాశ్రమం గత్వా న గృహం ప్రవిశే త్పునః | న సంన్యాసీ వనఞ్చాథ బ్రహ్మచర్యఞ్చ సాధకః || || 8 || ప్రాజాపత్యా న్నిరూప్యేష్టి మాగ్నేయా మథవా ద్విజః | ప్రవ్రజేత్తు గృహీ విద్వాన్ వనాద్వా శ్రుతి చోదనాత్ || || 9 || ప్రకర్తు మసమర్థో೭పి జుహోతి యజతి క్రియాః | అన్ధః పఙ్గుర్దరిద్రో వా విరక్తః సంన్యసే ద్ద్విజః || || 10 || ఒకవేళ వైరాగ్యబలముచేత గృమస్థుడుగా ఉండదలచనట్లయితే యాగాదులు చేయకున్నప్పటికి బ్రాహ్మణశ్రేష్ఠుడు కుటుంబ జీవనము నుండి సన్యసించవచ్చును. (6) అదే విధంగా వివిధములైన యజ్ఞాలనుచేసి, తరువాత వానప్రస్థాన్ని స్వీకరించి, తపస్సుచేసి దానివలన వైరాగ్యాన్ని పొంది తరువాత సన్న్యాసాశ్రమము స్వీకరించవచ్చును (7) వానప్రస్థానికి వెళ్లిన తరువాత మరల తన పూర్వపు ఇంటిలో ప్రవేశించకూడదు. సన్న్యాసి మరల వానప్రస్థాన్నికాని, సాధకుడు తిరగి బ్రహ్మచర్యాన్ని కాని స్వీకరించరాదు. (8) విద్వాంసుడైన గృహస్థుడు ప్రాజాపత్యము లేక ఆగ్నేయి అనే ఇష్టిని ఆచరించి కుటుంబము నుండి సన్న్యసించవచ్చును. వేద వాక్యము ననుసరించి వాన ప్రస్థాశ్రమం నుండి కాని సన్న్యాసి కాదగును. (9) యజ్ఞాది కర్మలను చేయుటకు శక్తి చాలనివాడు కూడ, హూమము చేయుచు క్రియలనాచరించును. గ్రుడ్డివాడు, కుంటివాడు, దరిద్రుడైనను బ్రాహ్మణుడు విరక్తుడైన సన్యసించవలెను. (10) సర్వేషా మేవ వైరాగ్యం సంన్యాసేతు విధీయతే | పతత్యే వా విరక్తో యః సంన్యాసం కర్తు మిచ్ఛతి || || 11 || ఏకస్మి న్నథవా సమ్య గ్వర్తేతామరణాన్తికమ్ | శ్రద్ధావా నాశ్రమే యుక్తః సో೭మృతత్వాయ కల్పతే || || 12 || న్యాయాగతధనః శాంతో బ్రహ్మవిద్యాపరాయణః | స్వధర్మపాలకో నిత్యం బ్రహ్మభూయాయ కల్పతే || || 13 || బ్రహ్మణ్యాధాయ కర్మాణి నిఃసఙ్గః కామవర్జితః | ప్రసన్నేనైవ మనసా కుర్వాణో యాతి తత్పదమ్ || || 14 || బ్రహ్మణా దీయతే దేయం బ్రహ్మణ సంప్రదీయతే | బ్రహ్మైవ దీయతే చేతి బ్రహ్మార్పణ మిదం పరమ్ || || 15 || అందరికి కూడ వైరాగ్యమే సన్న్యసించటానికి ముఖ్యకారణముగా చెప్పబడినది. విరక్తుడు కాకుండా ఎవడు సన్యసించునో వాడు తప్పక పతనము చెందును. (11) అట్లు కానిచో ఒక ఆశ్రమమునందే జీవితకాలపర్యంతము ఉండదగును. ఆశ్రమమునందు శ్రద్ధకలిగి వర్తించువాడు అమృతత్వమును పొందజాలును. (12) న్యాయమార్గంలో ధనము సంపాదించువాడు, శాంతుడు, వేదాంత విద్యయందాసక్తి కలవాడు, ఎల్లప్పుడు స్వధర్మానుష్ఠానము చేయువాడు, పరమాత్మసాయుజ్యానికి తగి ఉంటాడు. (13) తానుచేసిన కర్మలను బ్రహ్మమునందు అర్పించి, కోరికలను, ఆశలను తెంపుకొని నిర్మలమైన మనస్సుతో కర్మలనాచరించి పరమాత్మ పదమును చెందును. (14) ఇవ్వదగినది బ్రహ్మచేత ఈయబడును. అది మరల బ్రహ్మకు అర్పించబడును. ఆ బ్రహ్మమే ఈయబడుచున్నది. ఇదియే గొప్పబ్రహ్మార్పణమని చెప్పదగును. (15) నాహం కర్తా సర్వమేత ద్బ్రహ్మైవ కురుతే తథా | ఏత ద్ర్బహ్మార్పణం ప్రోక్తం మృషిభి స్తత్త్వ దర్శిభిః || || 16 || ప్రీణాతు భగవా నీశః కర్మణానేన శాశ్వతః | కరోతి సతతం బుద్ధ్యా బ్రహ్మార్పణ మిదం పరమ్ || || 17 || యద్వా ఫలానాం సంన్యాసం ప్రకుర్యా త్పరమేశ్వరే | కర్మణా మేత దప్యాహు ర్బ్రహ్మార్పణ మనుత్తమమ్ || || 18 || కార్య మిత్యేవ యత్కర్మ నియతం సఙ్గవర్జితమ్ | క్రియతే విదుషా కర్మ తద్భవే దపి మోక్షదమ్ || || 19 || అథవా యది కర్మాణి కుర్యాన్నిత్యా న్యపి ద్విజః | అకృత్వా ఫలసంన్యాసం బధ్యతే తత్ఫలేన తు || || 20 || నేను కర్తను కాను. ఈ సమస్తమును పరబ్రహ్మమే ఆవిధముగా చేయును. తత్త్వదర్శనులైన ఋషులచేత ఈ విధానము బ్రహ్మార్పణమని చెప్పబడినది. (16) శాశ్వతుడైన, భగవంతుడగు ఈశ్వరుడు ఈ కర్మచేత సంతోషించును గాక. అని ఎల్లప్పుడు బుద్ధిపూర్వకముగా శ్రేష్ఠమైన యీ బ్రహ్మార్పణమును చేయవలెను. లేదా పరమేశ్వరుని యందు కర్మలఫలముల నర్పించవలెను. ఈ పద్ధతినిగూడ శ్రేష్ఠమైన బ్రహ్మార్పణమని చెప్పుదురు. (18) ఫలాపేక్ష లేకుండ, కేవలకర్తవ్యతాబుద్ధితో ఏ కర్మ నియతముగా పండితునిచేత చేయబడునో, అదికూడ మోక్షదాయక మగును. (19) అట్లుకాక ద్విజుడు నిత్యములైన కర్మలను గూడ ఫలత్యాగము చేయక ఆచరించినచో, దాని ఫలముతో అతడు బంధింపబడుచున్నాడు. (20) తస్మా త్సర్వప్రయత్నేన త్యక్త్వా కర్మాశ్రితం ఫలమ్ | అవిద్వానపి కుర్వీత కర్మా ప్నోతి చిరా త్పదమ్ || || 21 || కర్మణా క్షీయతే పాప మైహికం పౌర్వికం తథా | మనః ప్రసాద మన్వేతి బ్రహ్మని జ్జాయతే నరః || || 22 || కర్మణా సహితాత్ జ్ఞానాత్ సమ్య గ్యోగో೭ భిజాయతే | జ్ఞానం చ కర్మసహితం జాయతే దోషవర్జితమ్ || || 23 || తస్మా త్సర్వప్రయత్నేన యత్ర తత్రాశ్రమే రతః | కర్మాణీశ్వరతుష్ట్యర్థం కుర్యా న్నైష్కర్మ్య మాప్నుయాత్ || || 24 || సంప్రాప్య పరమం జ్ఞానం నైష్కర్మ్యం తత్ప్రసాదతః | ఏకాకీ నిర్మమః శాన్తో జీవన్నేవ విముచ్యతే || || 25 || అందువలన సమస్తప్రయత్నముతో, కర్మకు సంబంధించిన ఫలమును విడిచి పెట్టి పండితుడుకాని వాడు కూడ కర్మను చేయవలెను. చాలా కాలమునకు పుణ్యపదమును పొందగలడు. (21) కర్మచేత ఇహలోకమునకు సంబంధించినది, పూర్వజన్మకు సంబంధించినది అగు పాపము నశించును. మనస్సు నిర్మలమై మనుష్యడు బ్రహ్మజ్ఞానము కలవాడగుచున్నాడు. (22) కర్మయోగముతో కూడినజ్ఞానముచేత చక్కని యోగము సిద్ధించును. కర్మతో కూడిన జ్ఞానము దోషములు లేని శుద్ధమైనదగును. (23) అందువలన ఏ ఆశ్రమమందున్నప్పటికి అన్ని విధముల ప్రయత్నముచేత ఈశ్వరుని సంతోషముకొరకు కర్మలను చేయవలెను. అట్లయినచో కర్మరాహిత్యమును పొందగలడు నరుడు. (24) ఉత్తమమైన జ్ఞానమును, కర్మరాహిత్యమును ఆయీశ్వరుని అనుగ్రహమువలన పొంది, ఒంటరివాడై, మమకారముక్తుడు, శాంతుడును అయి జీవితకాలములో ముక్తుడగును (జీవన్ముక్తుడు) (25) వీక్షతే పరమాత్మానం పరం బ్రహ్మ మహేశ్వరమ్ | నిత్యానన్దీ నిరాభాస స్తస్మిన్నేవ లయం వ్రజేత్ || || 26 || తస్మా త్సేవేత సతతం కర్మయోగం ప్రసన్నధీః | తృప్తయే పరమేశస్య తత్పదం యాతి శాశ్వతమ్ || || 27 || ఏత ద్వః కథితం సర్వం చాతురాశ్రమ్యముత్తమమ్ | న హ్యేత త్సమతిక్ర్యమ్య సిద్ధిం విన్దతి మానవః || || 28 || ఇతి శ్రీ కూర్మపురాణ చాతురాశ్రమ్యకథనం నామ తృతీయోధ్యాయః అటువంటివాడు పరమాత్మను దర్శించును. మహేశ్వరరూపియైన పరబ్రహ్మనుచూచి, శాశ్వతానందముకలవాడై, మాయ తొలగినవాడై ఆపరమాత్మయందే లీనమగును. (26) అందువలన నిర్మలబుద్ధికలవాడై, పరమేశ్వరుని తృప్తికొరకు ఎల్లప్పుడు కర్మయోగమును సేవించవలెను. దాని వలన శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుచున్నాడు. (27) నాలుగు ఆశ్రమములకు సంబంధించిన, శ్రేష్ఠమైన యీ విషయమంతయు మీ కొరకు నాచేత చెప్పబడినది. మనుష్యుడు ఈ ధర్మమునతి క్రమించి మోక్షమును పొందజాలడు. (28) శ్రీ కూర్మపురాణములో చాతురాశ్రమ్యకధనము అనబడు తృతీయాధ్యాయము సమాప్తము.