Sri Koorma Mahapuranam    Chapters   

త్రింశోధ్యాయః

అధ వ్యాసార్జున సంవాదే యుగధర్మనిరూపణమ్‌

వ్యాస ఉవాచ :-

తిష్యే మాయా మసూయాఞ్చ వధం చైవత పస్వినామ్‌ | సాధయన్తి నరా నిత్యం తమసా వ్యాకులీకృతాః || || 1 ||

ముప్పదవ అధ్యాయము

వ్యాసుడుపలికెను :-

కలియుగంలో మనుష్యులు తమోగుణంచేత వ్యాకుల మనస్కులై, మాయను, అసూయను మునుల వధను ఎల్లప్పుడు జరుపుతుంటారు. (1)

కలౌప్రమారకో రోగః సన్తతం క్షుద్భవం తథా | అనావృష్టిభయం ఘోరం దేశానాం చ విపర్యయః || || 2 ||

అధార్మికా నిరాహారా మహాకోపాల్పతేజసః | అనృతం ఋవతే లుబ్ధా స్తిష్యే జాతాః సుదుష్ప్రజాః || || 3 ||

దురిష్టై ర్దురధీతైశ్చ దురాచారై ర్దురాగమైః | విప్రాణాం కర్మదోషైశ్చ ప్రజానాం జాయతే భయమ్‌ || || 4 ||

నాధీయతే తదా వేదాన్‌ న యజన్తి ద్విజాతయః | యజన్తి యజ్ఞేన్వాదాంశ్చ పఠన్తే చాల్పబుద్ధయః || || 5 ||

శూద్రాణాం మన్త్రయోగైశ్చ సమ్బన్ధో బ్రాహ్మణౖః సహ | భవిష్యతి కలౌ తస్మి ఞ్ఛయనాసనభోజనైః || || 6 ||

రాజానః శూద్రభూయిష్ఠా బ్రాహ్మణా న్బాధయన్తి చ | భ్రూణహత్యా వీరహత్యా ప్రజాయేత నరేశ్వరే || || 7 ||

కలియుగంలో ప్రజలను మృత్యువశం చేసే రోగము, ఎల్లప్పుడు ఆకలిభయము, ఘోరమైన అనావృష్టిభయము, దేశాలు తారుమారగుట కలుగును. (2)

కలియుగంలో జన్మించిన ప్రజలు అధర్మవర్తనులు, ఆహారం లభించనివారు, ఎక్కువ కోపము తక్కువతేజస్సుకలవారు, ఎల్లప్పుడు అసత్యాలాడే వారు, లోభగుణం కలవారుగా ఉంటారు. (3)

బ్రాహ్మణుల లోపభూయిష్ఠమైన అధ్యయనంచేత, యాగకర్మలచేత, చెడు నడవడులచేత, క్షుద్రతంత్రాలచే, కర్మదోషాలచేత కూడ ప్రజలకు భయము కలుగుతుంది. (4)

విప్రులు వేదాలు చదువరు, యజ్ఞాలు చేయరు. అల్పబుద్ధికల వారు వేదాలను చదివి యాగాలు చేయుదురు. (5)

ఆ కలియుగంలో శూద్రులకు బ్రాహ్మణులతో, మంత్రాలతో కూడ సంబంధము కలుగుతుంది. వారికి పరస్పరము శయనము, ఆసనము, భోజనము అనేకర్మలతో సంబంధమేర్పడుతుంది. (6)

ఎక్కువగా శూద్రజాతీయులైన ప్రభువులు బ్రాహ్మణులను బాధిస్తారు. రాజులందు భ్రూణహత్య, వీరహత్యవంటి దోసాలు కలుగుతాయి. (7)

స్నానం హోమం జపం దానం దేవతానాం తథార్చనమ్‌ | తథా న్యాని చ కర్మాణి న కుర్వన్తి ద్విజాతయః || || 8 ||

వినిన్దన్తి మహాదేవం బ్రాహ్మణాన్‌ పురుషోత్తమమ్‌ | ఆమ్నాయధర్మాశాస్త్రాణి పురాణాని కలౌ యుగే ||9||

కుర్వ న్త్వవేదదృష్టాని కర్మాణి వివిధాని తు | స్వధర్మేతు రుచి ర్త్నెవ బ్రాహ్మణానాం ప్రజాయతే || 10||

కుశీలచర్యాః పాషణ్డౖః వృథారూపైః సమావృతాః | బహుయాచనకా లోకా భవిష్యన్తి పరస్పరమ్‌ || || 11 ||

అట్టశూలా జనపదాః శివశూలా శ్చతుష్పథాః | ప్రమదాః కేశశూలాశ్చ భవిష్యన్తి కలౌ

కలౌ యుగే || || 12 ||

కలియుగములో బ్రాహ్మణాది ద్విజులు స్నానమును, హోమమును, జపమును, దానమును, దేవతల పూజను, అటువంటి ఇతర ధార్మిక కార్యములను చేయరు. (8)

కలియుగము నందు మహాదేవుడైన శంకరుని, బ్రాహ్మణులను, పురుషోత్తముడగు విష్ణువును, వేదములను, ధర్మశాస్త్రములను, పురాణములను గూడ దూషింతురు. (9)

వేదములయందు ప్రతిపాదింపబడని అనేకవిధములైన కర్మలను చేయుదురు. బ్రాహ్మణులకు తమకులోచిత ధర్మమునందు ఆసక్తి కలుగనే కలుగదు. (10).

చెడుస్వభావముతో కూడిన ఆచరణము కలవారై, నిరర్ధక రూపులైన పాషండులతో కూడియుండి. జనులు, వివిధములైన పరస్పర యాచనలు కలవారుగా అగుదురు. (11)

కలియుగములో గ్రామసీములు అన్నమును విక్రయించునవిగా, నాలుగు మార్గముల కూడళ్లు నీటిని అమ్ముకునేవిగాను, స్త్రీలు తమ శిరోజాలను విక్రయించువారుగా కాగలరు. (12)

శుక్లదన్తా జినాఖ్యాశ్చ ముణ్డాః కాషాయవాససః | శూద్రా ధర్మం చరిష్యన్తి యుగాన్తే సముపస్థితే || || 13 ||

సస్యచౌరా భవిష్యన్తి తథా చేలాభిమర్శినః | చౌరా చ్చౌరాశ్చ హర్తారో హర్తు ర్హన్తా తథా పరః || || 14 ||

దుఃఖప్రచుర మల్పాయు ర్దేహోత్సాదః సరోగతా | అధర్మాభినివేశత్వా త్తమోవృత్తం కలౌ స్మృతమ్‌ || || 15 ||

కాషాయిణో7 థ నిర్గ్రన్థా స్తథా కాపాలికా శ్చయే | వేదవిక్రయిణ శ్చాన్యే తీర్థ విక్రయిణః పరే || || 16 ||

ఆసనస్థా న్ద్విజా న్దృష్ట్వా చాలయ న్త్యల్పబుద్ధయః | తాడయన్తి ద్విజేన్ద్రాంశ్చ శూద్రా రాజోపజీవినః || || 17 ||

తెల్లని దంతములు కలిగి, శిరోముండనము చేయించుకొని, కాషాయ వస్త్రములు ధరించిన జిననామధేయముతో శూద్రులు, కలియుగాంతము సమీపించినప్పుడు ధర్మమును ఆచరింతురు. (13)

జనులు పైర్లను దొంగిలించువారుగా, వస్త్రములను హరించువారుగాను, దొంగలనుండి దొంగతనము చేయువారు, దొంగను చంపువాడు మరొకడు గను జీవింతురు. (14)

కలియుగములో దుఃఖములెక్కువగా కలిగిన తక్కువ ఆయుర్దాయము, వ్యాధులతో బాధపడుట శరీరము క్షీణించుట, అనునవి అధర్మమునందు పూనిక కలిగి యున్నందున తమోగుణ ప్రభావము వలన సంభవించును. (15)

కాషాయము కలవారు, కాపాలికులు, గ్రంధశూన్యులుగా ఉండువారు కొందరు, వేదములను అమ్ముకొనువారు ఇతరులు, తీర్ధములను విక్రయించువారు మరికొందరు గాను ఉందురు. (16)

అల్పబుద్ధి కలజనులు బ్రాహ్మణులు ఆసనములపై కూర్చుని యుండగా చూచి, వారిని తొలగింతురు. రాజులనాశ్రయించి బ్రతుకుచున్న శూద్రులు బ్రాహ్మణశ్రేష్ఠులను దెబ్బలతో బాధింతురు. (17)

ఉచ్చాసనస్థాః శూద్రా శ్చ ద్విజమధ్యే పరన్తప | ద్విజామానకరో రాజా కలౌ కాలబలేన తు || || 18 ||

పుషై#్పశ్చ భూషణౖశ్చవ తథాన్యై ర్మఙ్గలై ర్ద్విజాః | శూద్రా న్పరిచరన్త్యల్పశ్రుతభాగ్యబలాన్వితాః || || 19 ||

న ప్రేక్షన్తే7ర్చి తాం శ్చాపి శూద్రా న్ద్విజవరా న్నృప | సేవావసర మాలోక్య ద్వారే తిష్ఠన్తి చ ద్విజాః || || 20 ||

వాహనస్థా న్సమావృత్య శూద్రాఞ్ఛూద్రోపజీవినః | సేవన్తే బ్రాహ్మణా స్తాంస్తు స్తువన్తి స్తుతిభిః కలౌ || || 21 ||

అధ్యాపయన్తి వేదాన్‌ శూద్రా ఞ్చూద్రోపజీవినః | ఏవం నిర్వేదకా నర్ధా న్నాస్తిక్యం ఘోర మాశ్రితాః || || 22 ||

శత్రువులను తపింపజేయు అర్జునా ! బ్రాహ్మణుల మధ్యలో శూద్రులు ఉన్నతమైన ఆసనములో కూర్చుని యుందురు. కలియుగమున కాలము యొక్క బలముచేత రాజు ద్విజులను అగౌరవపరచువాడుగా నుండును (18)

బ్రాహ్మణులు తక్కువవిద్య, అదృష్టము, బలము కలవారై, పూవులతో, నగలతో, ఇతరములైన మంగళద్రవ్యములతో శూద్రులను సేవింతురు. (19)

ఓ రాజా! పూజింపదగిన బ్రాహ్మణశ్రేష్ఠులను శూద్రులు గమనింపరు. సేవించుటకు తగిన సమయమును ప్రతీక్షించుచు విప్రులు శూద్రుల ద్వారములందు నిలిచి యుందురు. (20)

కలియుగమందు శూద్రులపై ఆధారపడి జీవించు బ్రాహ్మణులు వాహనములందున్న శూద్రులు సమీపమందుచేరి సేవింతురు. వారిని స్తోత్ర వాక్యములతో కొనియాడుదురు. (21)

శూద్రుల వలన జీవనము సాగించు వారై శూద్రులతో వేదములను చదివింతురు. ఇట్లు వేద విరుద్ధములైన అనర్ధములను, భయంకరమైన నాస్తికత్వము నవలంబించినవారగుదురు. (22)

తపోయజ్ఞకలానాన్తు విక్రేతారో ద్విజోత్తమాః | యతయశ్చ భవిష్యన్తి శతశో7థ సహస్రశః || || 23 ||

నాశయన్తః స్వకా న్ధర్మా నధిగచ్ఛన్తి తత్పదమ్‌ | గాయన్తి లైకికై ర్గానైర్దైవతాని నరాధిప || || 24 ||

వామపాశుపతాచారా స్తథా వై పాఞ్చరాత్రికాః | భవిష్యన్తి కలౌ తస్మిన్‌ బ్రాహ్మణాః క్షత్రియా స్తథా || || 25 ||

జ్ఞానే కర్మణ్యపగతే లోకే నిష్క్రియతాంగతే | కీటమూషికసర్పాశ్చ ధర్షయిష్యన్తి మానుషాన్‌ || || 26 ||

కుర్వన్తి చావతారాణి బ్రాహ్మణానాం కులేషువై | దేవీశాపవినిర్దగ్థాః పురా దక్షాధ్వరే ద్విజాః || || 27 ||

బ్రాహ్మణోత్తములైనవారు తమ తపస్సును, యజ్ఞములను, కళలను అమ్ముకొని జీవింతురు. కలియుగములో వందల, వేలకొలదిగా సన్న్యాసులు కూడ సిద్ధమగుదురు. (23)

తమతమ ధర్మములను నశింపజేయుచు ఆస్ధానమును పొందుదురు. ఓ రాజా! దేవతలను గూర్చి లౌకికములైన గీతములు పాడుదురు. (24)

అటువంటి కలి యుగములో బ్రాహ్మణులు మరియు క్షత్రియులు కూడ వామాచారములు, పాశుపతాచారములు కలవారుగా, పాంచరాత్ర ధర్మము కలవారు గాను అగుదురు. (25)

జ్ఞానమార్గము, కర్మయోగము తొలగిపోయి, లోకమంతయుక్రియాశూన్యముకాగా పురుగులు, ఎలుకలు, పాములు మనుష్యులను భయపెట్టిబాధించును. (26)

పూర్వము దక్షునియజ్ఞములో సతీదేవి శాపముచేత కాల్చబడిన బ్రాహ్మణులు, బ్రాహ్మణుల వంశములలో భూమిపై జన్మింతురు. (27)

నిన్దన్తి చ మహాదేవం తమసా విష్టచేతసః | వృథా ధర్మం చరిష్యన్తి కలౌ తస్మి న్యుగాన్తికే || || 28 ||

సర్వే వీరా భవిష్యన్తి బ్రాహ్మణాద్యాః స్వజాతిషు | యే చాన్యే శాపనిర్దగ్థా గౌతమస్య మహాత్మనః || || 29 ||

సర్వే తే7 వతరిష్యన్తి బ్రాహ్మణా స్తాసు యోనిషు | వినిన్దన్తి హృషీకేశం బ్రాహ్మణా బ్రహ్మవాదినః || || 30 ||

వేదబాహ్యవ్రతాచారా దురాచారా వృథాశ్రమాః | మోహయన్తి జనా న్సర్వాన్‌ దర్శయిత్వా ఫలాని చ || || 31 ||

తమసావిష్టమనసో బైడాలవ్రతికాధమాః | కలౌ రుద్రో మహాదేవో లోకానా మీశ్వర ః పరః || || 32 ||

తమోగుణముచేత ఆక్రమింపబడిన మనస్సు కలవారై మహాదేవుడగు శివుని నిందింతురు. ఆ కలియుగపు చివరి కాలములో నిరర్ధకమైన ధర్మము నాచరింతురు. 928)

బ్రాహ్మణులు మొదలగు జాతులవారు అందరు తమతమజాతులయందు వీరులుగా ఉందురు. మహాత్ముడైన గౌతమముని యొక్క శాపమునకు గురియైన ఇతరులెవరు కలరో (29)

ఆబ్రాహ్మణులందరుకూడ ఆయాజాతులయందు భూమిపై జన్మింతురు. వేదాంతమును గూర్చి చర్చించు బ్రాహ్మణులు విష్ణువును నిందింతురు. (30)

వేదములకు వ్యతిరిక్తమైన నియమముల, ఆచారములు కలవారు, చెడునడతకలారు, అనవసరశ్రమచేయువారు, జనులందరిని ఆయాఫలములను చూపించి మోహింపజేయుదురు. (31)

తమోగుణముచే ఆక్రమింపబడిన మనస్సుకలవారై, పిల్లి వ్రతమువంటి ప్రవర్తనకల అధములై ప్రవర్తింతురు. కలియుగములో లోకములకు రుద్రుడే గొప్పప్రభువు, మహాదేవుడై యున్నాడు. (32)

తదేవ సాధయే న్నౄణాం దేవతానాం చ దైవతమ్‌ | కరిష్య త్యవతారాణి శంకరో నీలలోహితః || || 33 ||

శ్రౌతస్మార్తప్రతిష్ఠార్ధం భక్తానాం హితకామ్యయా | ఉపదేక్ష్యన్తి తజ్ఞానం శిష్యాణాం బ్రహ్మసంజ్ఞితమ్‌ || || 34 ||

సర్వవేదాన్తసారం హి ధర్మా న్వేదనిదర్శితాన్‌ | సర్వవర్ణాన్సముద్దిశ్య స్వధర్మా యే నిదర్శితాః || || 35 ||

యే తం ప్రీతా నిషేవన్తే యేన కేనో పచారతః | విజిత్య కలిజా న్దోషాన్‌ యాన్తి తే పరమంపదమ్‌ || || 36 ||

అనాయాసేన సుమహ త్పుణ్య మాప్నోతి మానవః | అనేకదోషదుష్టస్య కలే రేకో మహా న్గుణః || || 37 ||

తస్మా త్సర్వప్రయత్నేన ప్రాప్య మాహేశ్వరం యుగమ్‌ | విశేషా ద్బ్రాహ్మణో రుద్ర మీశానం శరణం వ్రజేత్‌ || || 38 ||

దేవతలందరికి పరమదైవతమైన ఆ శివుడే మనుష్యులకు ఫలసిద్ధిని కలిగించును. నీలలోహితుడైన ఆ శంకరుడు అవతారములను ధరించగలడు. (33)

శ్రౌతములు, స్మార్తములు అగు కర్మలను నెలకొల్పుట కొరకు, భక్తులకు హితముచేయు కోరకితో శిష్యులకు గురువులు బ్రహ్మసంజ్ఞకమైన ఆ జ్ఞానమునుపదేశించగలరు. (34)

అన్ని వేదాంతముల సారాంశమును, వేదములయందు ప్రతిపాదించడిన ధర్మములను, బ్రాహ్మణాది వర్ణముల నుద్దేశించి ఏవైతే స్వధర్మములుగా బోధింపబడినవో, (35) (వానినుపదేశింతురు).

ఎవరు ఆ శివుని ప్రీతి కలవారై ఏదో ఒక పద్ధతిననుసరించి సేవింతురో, అట్టివారు కలివలన కలిగిన దోషములను జయించి పరమపదమును పొందుదురు. (36)

మనుష్యుడు ఎక్కువశ్రమలేకుండా శివుని సేవవలన చాల గొప్పపుణ్యమును పొందును. ఎక్కువ దోషములతో కూడియున్న కలియుగమునకు ఇది ఒక్కటే గొప్పగుణము. (37)

అందువలన పూర్ణ ప్రయత్నముతో మహేశ్వరసంబంధి యుగమును పొంది, ప్రత్యేకముగా బ్రాహ్మణుడైనవాడు ఈశ్వరుడైన రుద్రుని శరణము పొందవలెను. (38)

యే నమన్తి విరూపాక్ష మీశానం కృత్తివాససమ్‌ | ప్రసన్నచేతసో రుద్రం తే యాన్తి పరమంపదమ్‌ || || 39 ||

యథా రుద్రనమస్కారః సర్వకామఫలో ధ్రువః | అన్యదేవనమస్కారా న్న తత్ఫల మవాప్నుయాత్‌ || || 40 ||

ఏవం విధే కలియుగే దోషాణా మేవ శోధనమ్‌ | మహాదేవనమస్కారో ధ్యానం దాన మితి శ్రుతిః || || 41 ||

తస్మా దనీశ్వరా నన్యాన్‌ త్యక్త్వా దేవం మహేశ్వరమ్‌ | సమాశ్రయే ద్విరూపాక్షం యదీచ్ఛే త్పరమంపదమ్‌ || || 42 ||

నార్చయన్తీ హ యే రుద్రం శివం త్రిదశవన్దితమ్‌ | తేషాం దానం తపో యజ్ఞో వృథా జీవిత మేవచ || || 43 ||

ఎవరైతే విషమములైన కన్నులు కలవాడు, చర్మమును వస్త్రముగా ధరించువాడు, ఈశ్వరుడును అగు శివుని, నిర్మలమైన మనస్సుకలవారై నమస్కరింతురో వారు పరమపదమును పొందుదురు. (39)

రుద్రునికి చేయునమస్కారము ఎట్లు అన్నికోరికలను ఫలవంతముగా చేయునో, ఇతరదేవతలకు చేయునమస్కారమువలన అటువంటి ఫలమును నిశ్చయముగా పొందజాలడు. (40)

ఈ విధమైన కలియుగములో దోషములను నివారించు మార్గము, మహాదేవునకు చేయు ప్రణామము, శివుని ధ్యానము, దానము అని వేదము చెప్పుచున్నది. (41)

అందువలన ఈశ్వరునికంటె భిన్నులైన దేవతలను వదలి, పరమపదమును పొందవలెనను కోరిక కలవాడై తే విరూపాక్షుడు, మహేశ్వరుడును అగు దేవుని ఆశ్రయింవలెను. (42)

ఎవరైతే దేవతలచే పూజింపబడుచున్న శివునిపూజింపరో, అట్టివారు చేయుదానము, తపస్సు, యజ్ఞము, మరియు వారి జీవితముకూడ నిష్ఫలమేఅని తెలియవలెను. (43)

నమో రుద్రాయ మహతే దేవదేవాయ శూలినే | త్ర్యమ్బకాయ త్రినేత్రాయ యోగినాం గురవే నమః || || 44 ||

నమో7స్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే | శమ్భవే స్థాణవే నిత్యం శివాయ పరమేష్ఠినే || || 45 ||

నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే | ప్రపద్యే7 హం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్‌ || || 46 ||

మహాదేవం మహాయోగ మీశానం చామ్బికాపతిమ్‌ | యోగినాం యోగదాతారం యోగమాయాసమావృతమ్‌ || || 47 ||

యోగినాం గురు మాచార్యం యోగిగమ్యం పినాకినమ్‌ | సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో7ధిపమ్‌ || || 48 ||

దేవతలకు దేవుడు, శూలమును ధరించినవాడు, గొప్పవాడును అగు రుద్రునకు నమస్కారము. మూడుకన్నులు కలవాడు, యోగులకు గురువును అగు శివునకు ప్రణామము. (44)

అమరులందరికి దేవుడు, మహాదేవుడు, బ్రహ్మరూపుడును స్థాణువు, మంగళకరుడు, పరమేష్ఠి, ఎల్లప్పుడు మంగళరూపుడు అగు శివునకు నమస్కారము. (45)

సోముడు, రుద్రరూపుడు, ప్రళయకారకుడు, కారణభూతుడు అగు దేవునకు వందనము. విషమలోచనములు కలవాడు, బ్రహ్మచారి, శరణు పొందదగినవాడును అగు ఆ దేవుని నేను ఆశ్రయించుచున్నాను. (46)

మహాదేవుడు, గొప్పయోగము కలవాడు, పార్వతీదేవికి భర్త, ఈశ్వరుడు, యోగులకు యోగమునుపదేశించువాడు, యోగమాయచేత ఆవరింపబడినవాడును, (47)

యోగులకు గురువు, ఆచార్యస్థానీయుడు, యోగీశ్వరులకుపొందదగినవాడు, పినాకమను ధనువును ధరించినవాడు, సంసారమును తరింపజేయువాడు, బ్రహ్మరూపుడు, బ్రహ్మకు అధిపతియైనవాడు, రుద్రుడును అగు అతనిని (శరణుపొందుచున్నాడు.) (48)

శాశ్వతం సర్వగం శాన్తం బ్రహ్మణ్యం బ్రాహ్మణ ప్రియమ్‌ | కపర్దినం కాలమూర్తి మమూర్తిం పరమేశ్వరమ్‌ || || 49 ||

ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం దివస్పతిమ్‌ | నీలకణ్ఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్‌ || || 50 ||

కాలాగ్నిం కాలదహనం కామదం కామనాశనమ్‌ | నమస్యే గిరిశం దేవం చన్ద్రావయవభూషణమ్‌ || || 51 ||

విలోహితం లేలిహాన మాదిత్యం పరమేష్ఠినమ్‌ | ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం పరమం తపః || || 52 ||

ఇత్యేత ల్లక్షణం ప్రోక్తం యుగానాం వై సమాసతః | అతీతానాగతానాం వై యావ న్మన్వన్తరక్షయః || || 53 ||

సర్వకాలములయందుండువాడు, అన్నింటిని నిండియున్నవాడు, శాంతుడు, బ్రాహ్మణులకు ప్రియమైనవాడు, వేదరహస్యములు తెలిసినవాడు, కపర్దమను జటాజూటముధరించినవాడు, కాలస్వరూపుడు, మూర్తిరహితుడు, పరమేశ్వరుడును, (49)

అఖండరూపుడు, గొప్పరూపము ధరించినవాడు, వేదములచే తెలియదగినవాడు, స్వర్గమునకు ప్రభువు, నల్లని కంఠము కలవాడు, విశ్వమే ఆకారముగా కలవాడు, అంతట వ్యాపించినవాడు, సృష్టికి మూలమైనవాడు (50)

ప్రళయకాలపు అగ్నిరూపుడు, కాలుని దహించినవాడు, కోరికలనిచ్చువాడు, మన్మథుని సంహరించినవాడు, చంద్రకళను అలంకారముగా ధరించినవాడు, కైలాస పర్వతమందు శయనించువాడును అగు దేవునికి నమస్కరింతును. (51)

ఎరుపురంగు కలవాడు, నాలుకనుచాచి ఆస్వాదించువాడు, ఆదిత్యరూపుడు, పరమేష్ఠి, భయంకరుడు, పశుపతి, తీక్షణరూపుడు సూర్యరూపుడు, గొప్పతపోమూర్తి యగుదేవునకు నమస్కరింతును. (52)

ఇది యుగములయొక్క లక్షణము, గడచిన వాటివి, రాబోవు యుగములయొక్కయు మన్వంతర సమాప్తికాలము వరకు వర్తించునది, సంగ్రహరూపముగా చెప్పబడినది. (53)

మన్వన్తరేణ చైకేన సర్వా ణ్యవాన్తరాణి వై | వ్యాఖ్యాతాని న సన్దేహః కల్పః కల్పేన చైవ హి || || 54 ||

మన్వన్తరేషు చైతేషు అతీతానాగతేషు వై | తుల్యాభిమానినః సర్వే నామరూపై ర్భవన్త్యుత || || 55 ||

ఏవ ముక్తో భగవతా కిరీటీ శ్వేతవాహనః | బభార పరమాం భక్తి మీశానే7వ్యభిచారిణీమ్‌ || || 56 ||

నమ శ్చకార త మృషిం కృష్ణ ద్వైపాయనం ప్రభుమ్‌ | సర్వజ్ఞం సర్వకర్తారం సాక్షాద్విష్ణుం వ్యవస్థితమ్‌ || || 57 ||

త మువాచ పున ర్వ్యాసః పార్ధం పరపురఞ్జయమ్‌ | కరాభ్యాం సుశుభాభ్యాం చ సంస్పృశ్య ప్రణతం మునిః || |7 58 ||

ఒకమన్వంతరమును వివరించుట చేత అన్ని మన్వంతరములు వ్యాఖ్యానింపబడినట్లేఅగును. దానిలో సందేహములేదు. అట్లే ఒక కల్పముచేత ఇతరకల్పము కూడ వ్యాఖ్యాతమే. (54)

ఈ మన్వంతరములలో, గడచిన, రానున్న మన్వంతరాలలో అందరును నామరూపములతో సమానమై అభిమానము కలవారుగా అగుదురు. (55)

ఈ విధముగా మహాత్ముడగు వ్యాసునిచేత చెప్పబడిన, తెల్లని గుఱ్ఱములు కల అర్జునుడు ఈశ్వరుడగు శివునియందు నిశ్చలమైన, గొప్ప భక్తిని కలవాడాయెను. (56)

కృష్ణద్వైపాయనుడు, సమర్ధుడు అగు ఆ వ్యాసమహర్షికి ప్రణామము చేసెను. ఆ వ్యాసుడు సర్వజ్ఞుడు, అన్నిటిని చేయువాడు, స్వయముగా శ్రీవిష్ణుస్వరూపుడై అవతరించి ఉన్నాడు. (57)

శత్రుసంహారకుడయిన ఆ అర్జునుని తనకు నమస్కరించుచున్న వానిని గూర్చి వ్యాసముని, మంగళకరము లైన తనచేతులతో అతనిని తాకుచు మరల ఇట్లు ఉపదేశించెను. (58)

ధన్యో7స్యనుగృహీతో7సి త్వాదృశో7న్యో న విద్యతే | త్త్రైలోక్యే శఙ్కరే నూనం భక్తః పరపురఞ్చజయ || || 59 ||

దృష్టవానసి తం దేవం విశ్వాక్షం విశ్వతోముఖమ్‌ | ప్రత్యక్ష మేవ సర్వేషాం రుద్రం సర్వజగన్మయమ్‌ || || 60 ||

జ్ఞానం తదైశ్వరం దివ్యం యథావ ద్విదితం త్వయా | స్వయమేవ హృషీకేశః ప్రీత్యోవాచ సనాతనః || || 61 ||

గచ్ఛ గచ్ఛ స్వకం స్థానం న శోకం కర్తు మర్హసి | వ్రజస్వ పరయా భక్త్యా శరణ్యం శరణం శివమ్‌ || || 62 ||

ఏవ ముక్త్వా స భగవా ననుగృహ్యార్జునం ప్రభుః | జగామ శాఙ్కరపురీం సమారాధయితుం భవమ్‌ || || 63 ||

శత్రు పట్టణములను జయించు ఓ అర్జునా ! నీవు ధన్యుడవైనావు, అనుగ్రహింపబడినావు. మూడులోకముల యందు గూడ., శంకరుని యందుభక్తి కలవాడు నీతో సమానుడు మరియొకడులేడు. (59)

ప్రపంచము కన్నులుగాకల, ప్రపంచమంతట వ్యాపించి యున్న, సమస్తలోకాత్ముకుడైన ఆ రుద్రదేవుని నీవు ప్రత్యక్షముగా చూచియున్నావు. (60)

ఈశ్వరసంబంధియైన ఆ దివ్యజ్ఞానము నీచేత నిజతత్త్వ రూపముతో తెలియబడినది. సనాతనుడైన నారాయణుడు సంతోషముతో స్వయముగా ఇట్లనెను. (61)

నీస్ధానమును గూర్చి వెంటనే వెళ్లుము. దుఃఖపడుట నీకు తగదు. గొప్పభక్తితో శరణుకోరదగిన శివుని శరణుగోరుము. (62)

భగవంతుడగు ఆ వ్యాసుడు ఇట్లు పలికి అర్జునుని అనుగ్రహించి, శివుని ఆరాధించుటకుగాను శివుని సంబంధియగు కాశీపట్టణమునకు వెళ్లెను. (63)

పాండవేయో7 పి తద్వాక్యా త్సంప్రాప్య శరణం శివమ్‌ | సన్త్యజ్య సర్వకర్మాణి జ్ఞాత్వా తత్పరమో 7 భవత్‌ || || 64 ||

నా ర్చనేన సమః శమ్భో ర్భక్త్యా భూతో భవిష్యతి | ముక్త్వా సత్యవతీసూనుం కృష్ణం వా దేవకీసుతమ్‌ || || 65 ||

తసై#్మ భగవతే నిత్యం నమః శాన్తాయ ధీమతే | పారాశర్యాయ మునయే వ్యాసాయా మితతేజసే || || 66 ||

కృష్ణద్వైపాయనః సాక్షా ద్విష్ణు రేవ సనాతనః | కో హ్యన్య స్తత్త్వతో రుద్రం వేత్తి తం పరమేశ్వరమ్‌ || || 67 ||

నమః కురుధ్వం తమృషిం కృష్ణం సత్యవతీసుతమ్‌ | పారాశర్యం మహాత్మానం యోగినం విష్ణు మవ్యయమ్‌ || || 68 ||

పాండు కుమారుడగు అర్జునుడు కూడ ఆ వ్యాసుని వాక్యము వలన శివుని శరణు పొందినవాడై, అన్ని కర్మములను వదలి, శివ తత్త్వము తెలిసికొని అతని యందు శ్రద్ధకలవాడాయెను. (64)

భక్తితో శివుని పూజించుటతో సమానమైనది ఇంతకు పూర్వములేదు. ఇకముందుండబోదు. సత్యవతి కుమారుడైన వ్యాసుని, దేవకి కుమారుడైన కృష్ణుని విడిచిన అతనితో సమానుడు ఇతరుడు లేడు. (65)

శాంతరూపుడు, బుద్ధిమంతుడు, పూజనీయుడు, పరాశరుని కుమారుడు, అమితమైన తేజస్సు కల వ్యాసమహామునికి ఎల్లప్పుడు నమస్కరింతును. (66)

కృష్ణద్వైపాయనుడగు వ్యాసముని సాక్షాత్తుగా సనాతనుడైన విష్ణుమూర్తియే - పరమేశ్వరుడైప రుద్రుని తత్త్వమును ఆయన కాక ఇతరుడెవ్వడు తెలిసికొనగలడు ? (67)

సత్యవతి కుమారుడు, కష్ణవర్ణుడు, పరాశరముని పుత్రుడు, యోగీశ్వరుడు, మహాత్ముడు, నాశరహితుడైన విష్ణుస్వరూపుడైన ఆ వ్యాస ఋషికి నమస్కరించుడు. (68)

ఏవ ముక్త్వాతు మునయః సర్వఏవ సమాహితాః | ప్రణముస్తం మహాత్మానం వ్యాసం సత్యవతీసుతమ్‌ || || 69 ||

ఇతి శ్రీకూర్మ పురాణ వ్యాసార్జున సంవాదే యుగధర్మ నిరూపణం నామ త్రింశో7ధ్యాయః.

ఆ మునులందరు ఇట్లుపలికి సావధానులై మహాత్ముడు, సత్యవతికుమారుడునగు వ్యాసమునికి నమస్కరించిరి. (69)

శ్రీకూర్మ పురాణములో వ్యాసార్జున సంవామునందు యుగధర్మ నిరూపణ మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters