Sri Koorma Mahapuranam
Chapters
అథద్వాత్రింశో7ధ్యాయః సూత ఉవాచ :- స శిషై#్యః సంవృతో ధీమానవ్ గురు ర్ద్వైపాయనో మునిః | జగామ విపులం లిఙ్గ మోఙ్కారం ముక్తిదాయకమ్ ||
|| 1 || తత్రా భ్యర్చ్య మహాదేవం శిషై#్యః సహ మహామునిః | ప్రోవాచ తస్య మాహాత్మ్యం మునీనాం భావితాత్మనామ్ ||
|| 2 || ముప్పది రెండవ అధ్యాయము బుద్ధిమంతుడైన ఆ వ్యాసముని శిష్యులతో కూడి మోక్షదాయకము, విశాలమునైన ఓంకార లింగ స్థలమును గూర్చి వెళ్ళెను. (1) అక్కడ ఆ మహాముని శిష్యులతో కూడి మహాదేవుని పూజించి, ఆ దేవుని గొప్పతనమును గూర్చి శ్రేష్ఠులైన మునులకు ఇట్లు చెప్పెను. (2) ఇదం త ద్విమలం లిఙ్గ మోఙ్కారం నామ శోభనమ్ | అస్య స్మరణ మాత్రేణ ముచ్యతే సర్వపాతకైః ||
|| 3 || అత్ర త త్పరమం జ్ఞానం పఞ్చాయతన ముత్తమమ్ | అర్చితం మునిభి ర్నిత్యం వారాణస్యాం విమోక్షదమ్ ||
|| 4 || అత్ర సాక్షా న్మహాదేవః పఞ్చాయతనవిగ్రహః | రమతే భగవా న్రుద్రో జన్తూనా మపవర్గదః || || 5 || యత్త త్పాశుపతం జ్ఞానం పఞ్చార్థ మితి కథ్యతే | తదేవ విమలం లిఙ్గ మోఙ్కారం సమవస్థితమ్ || || 6 || శాన్త్యతీతా పరాశాన్తి ర్విద్యా చైవ యథాక్రమమ్ | ప్రతిష్ఠా చ నివృత్తి శ్చ పఞ్చార్థం లిఙ్గ మైశ్వరమ్ || || 7 || ఈ నిర్మలమైన లింగము ఓంకార నామము కలది, మంగళకరమైనది. మనుష్యుడు దీనిని స్మరించిన మాత్రముచేత అన్ని పాపముల నుండి ముక్తుడగును. (3) వారాణసిలో ఈచోట పంచాయ తన స్వరూపము, ఉత్తమము, పరమ జ్ఞానరూపము మోక్షదాయకమగు లింగము మునులచేత ఎల్లప్పుడూ పూజింపబడుచుండును. (4) ఈచోట పంచాయ తన విగ్రహము కలవాడు, భగవంతుడు, మహాదేవుడు అగు రుద్రుడు ప్రాణులకు మోక్షము నిచ్చువాడుగా విహరించు చుండును. (5) పశుపతికి సంబంధించిన జ్ఞానము ఏది పంచార్థము అని చెప్పబడుచున్నదో, నిర్మలమైన ఆ లింగ స్వరూపమే ఓంకార లింగ రూపముగా నెలకొని యున్నది. (6) శాంతికి అతీతమైనది, పరమైన శాంతి, విద్య, ప్రతిష్ఠ, నివృత్తి అనుపేర్లతో క్రమముగా ఈశ్వర లింగము పంచార్థమని వ్యవహరింపబడును. (7) పఞ్చానా మపి దేవానాం బ్రహ్మాదీనాం య దాశ్రయమ్ | ఓఙ్చార బోధితం లిఙ్గం పఞ్చాయతన ముచ్యతే || || 8 || సంస్మరే దైశ్వరం లిఙ్గం పఞ్చాయతన ముత్తమమ్ | దేహాన్తే త త్పరం జ్యోతి రానన్దం విశ##తే పునః || || 9 || అత్ర దేవర్షయః పూర్వం సిద్ధా బ్రహ్మర్ష య స్తథా | ఉపాస్య దేవ మీశానం ప్రాప్తవన్తః పరం పదమ్ || || 10 || మత్స్యోదర్యాస్త టే పుణ్యం స్థానం గుహ్యతమం శుభమ్ | గోచర్మమాత్రం విప్రేన్ద్రా ఓఙ్కారేశ్వర ముత్తమమ్ || || 11 || కృత్తివాసేశ్వరం లిఙ్గం మధ్యమేశ్వర ముత్తమమ్ | విశ్వేశ్వరం తథోఙ్కార కపర్దీశ్వర ముత్తమమ్ || || 12 || బ్రహ్మదేవుడు మొదలైన అయిదుగురు దేవతలకు ఆశ్రయభూతమైనది, ఓంకారము చేత ప్రతిపాదింపబడునది అగు లింగము పంచాయతనమని చెప్పబడును. (8) ఈశ్వర సంబంధి, నాశరహితము అగు పంచాయ తన లింగమును దేహావ సాన కాలములో స్మరించవలెను. అప్పుడే తేజోరూపమైన ఆత్మ ఆనంద రూపములో లీనము కాగలదు. (9) ఇక్కడ పూర్వము దేవర్షులు, సిద్ధులు, బ్రహ్మర్షులు, ఈశాన దేవుడగు రుద్రుని పూజించి పరమగతిని పొందినారు. (10) మత్స్యోదరి అను నది యొడ్డున మిక్కిలి రహస్యము, శుభకరము, పుణ్యమగు స్థానము కలదు. బ్రాహ్మణోత్తములారా! అది గోచర్మ మాత్ర పరిమాణము కలదై ఉత్తమమైన ఓంకారేశ్వరముగా ప్రసిద్ధమైయున్నది. (11) కృత్తివాసేశ్వర నామము గల లింగమును, శ్రేష్ఠమైన మధ్యమేశ్వర క్షేత్రమును, విశ్వేశ్వరుని మరియు ఉత్తమమైన ఓంకార కపర్దీశ్వర స్థానమును (12) ఏతాని గుహ్యలిఙ్గాని వారాణస్యాం ద్విజోత్తమాః | న కశ్చి దిహ జానాతి వినా శమ్భో రను గ్రహాత్ || || 13 || ఏవ ముక్త్వా య¸° కృష్ణః పారాశర్యో మహామునిః | కృత్తివాసేశ్వరం లిఙ్గం ద్రష్టుం దేవస్య శూలినః || || 14 || సమభ్యర్చ్య సదా శిషై#్య ర్మాహాత్మ్యం కృత్తివాససః | కథయామాస విప్రేభ్యో భగవాన్ బ్రహ్మవిత్తమః || || 15 || అస్మిన్ స్థానే పురా దైత్యో హస్తీ భూత్వా భవాన్తికమ్ | బ్రాహ్మణా న్హన్తు మాయాతో యేః7 త్ర నిత్య ముపాసతే || || 16 || తేషాం లిఙ్గా న్మహాదేవః ప్రాదురాసీ త్త్రిలోచనః | రక్షణార్థం ద్విజశ్రేష్ఠా భక్తానాం భక్తవత్సలః || || 17 || బ్రాహ్మణోత్తములారా! వారాణసి యందు ఇవన్నియు రహస్యములైన శివలింగములు. శివుని అనుగ్రహము లేకుండా ఎవడును వీనిని తెలియ జాలడు. (13) ఈ విధముగా చెప్పి పరాశర పుత్రుడైన, గొప్పముని యగు వ్యాసుడు శంకరుని యొక్క కృత్తివాసేశ్వర నామకమైన లింగమును సందర్శించుటకు వెడలెను. (14) శిష్యులతో కూడ శివుని పూజించి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, పూజ్యుడునగు ఆ ముని శివుని యొక్క మాహాత్మ్యమును బ్రాహ్మణులకు తెలియజేసెను. (15) ఈ ప్రదేశము నందు పూర్వమొక రాక్షసుడు ఏనుగు రూపమును ధరించి, నిత్యము శివుని పూజించునట్టి బ్రాహ్మణులను చంపుటకు వచ్చెను. (16) అప్పుడు శివుడు ఆ బ్రాహ్మణులను రక్షించుటకు లింగమునుండి ఆవిర్భవించెను. విప్రవరులారా! భక్త వత్సలుడగు త్రిలోచనుడు తన భక్తులను కాపాడుకొనెను. (17) హత్వా గజాకృతిం దైత్యం శూలేనా వజ్ఞయా హరః | వాస స్తస్యాకరో త్కృత్తిం కృత్తివాసేశ్వర స్తతః || || 18 || అత్ర సిద్ధిం పరాం ప్రాప్తా మునయో మునిపుఙ్గవాః | తేనైవ చ శరీరేణ ప్రాప్తా స్తత్పరమం పదమ్ || || 19 || విద్యా విద్యేశ్వరా రుద్రాః శివాయే వః ప్రకీర్తితాః | కృత్తివాసేశ్వరం లిఙ్గం నిత్యమావృత్య సంస్థితాః || || 20 || జ్ఞాత్వా కలియుగం ఘోర మధర్మబహులం జనాః | కృత్తివాసం న ముఞ్చన్తి కృతార్థాస్తే న సంశయః || || 21 || జన్మాన్తరసహస్రేణ మోక్షో7 న్యత్రా ప్యతే నవా | ఏకేన జన్మనా మోక్షః కృత్తివాసే తు లభ్యతే || || 22 || గజరూపములోనున్న రాక్షసుని, శివుడు శూలముతో చులకనగా చంపి, ఆ యేనుగు చర్మమును వస్త్రముగా చేసికొనెను. అందువలన కృత్తి వాసేశ్వరుడాయెను. (18) ఇచ్చట పూర్వము, మునులు, మునిశ్రేష్ఠులు గొప్ప సిద్ధిని పొందిరి. తమ ఆ శరీరముతోనే పరమపదమును చేరుకొనిరి. (19) విద్యావిద్యలకు ఈశ్వరులైన శివరూపులగు ఏరుద్రులు మీకు తెలుపబడిరో, వారు కృత్తివాసేశ్వర నామక లింగమును ఎల్లప్పుడూ పరివేష్టించి యుందురు. (20) కలియుగము అధర్మముతో నిండినదని, ఘోరమైనదని తెలిసికొని జనులు కృత్తివాస తీర్థమును విడిచివెళ్ళరు. అట్టి వారు ధన్యులనుటలో సందేహములేదు. (21) ఇతర స్థలములలో వేల కొలది జన్మలెత్తుట ద్వారా మోక్షము లభించునో లేదో? ఈ కృత్తి వాస తీర్థమందు మాత్రము ఒక్క జన్మతోనే మోక్షము లభించును. (22) ఆలయః సర్వసిద్ధానా మేత త్థ్సానం వదన్తి హి | గోపితం దేవదేవేన మహాదేవేన శమ్బునా || || 23 || యుగే యుగే హ్యత్ర దాన్తా బ్రాహ్మణా వేదపారగాః | ఉపాసతే మహాదేవం జపన్తి శతరుద్రియమ్ || || 24 || స్తువన్తి సతతం దేవం మహాదేవం త్రియమ్బకమ్ | ధ్యాయన్తో హృదయే నిత్యం స్థాణుం సర్వాన్తరం శివమ్ || || 25 || గాయన్తి సిద్థాః కిల గీతకాని యే వారాణస్యాం నివసన్తి విప్రాః | తేషా మథైకేన భ##వేన ముక్తి రే కృత్తివాసం శరణం ప్రపన్నాః || || 26 || సమస్త సిద్ధులకు ఆలయము వంటిదని యీ స్థానమును గూర్చి చెప్పుదురు. ఇది దేవదేవుడు, మహాదేవుడు అగు శివునిచేత రక్షింపబడు స్థలము. (23) ప్రతి యుగము నందును ఇక్కడ ఇంద్రియ నిగ్రహము కలవారు, వేద పారగులు అయిన బ్రాహ్మణులు మహాదేవుని పూజింతురు. శతరుద్రియమును జపింతురు. (24) త్రియంబకుడు, మహాదేవుడునగు దేవుని, అంతట వ్యాపించియున్న స్థాణువగు శివుని హృదయములో ఎల్లప్పుడు ధ్యానించుచూ స్తోత్రము చేయుదురు. (25) సిద్ధులు ఇక్కడ గీతములను పాడుచుందురు. ఏ బ్రాహ్మణులు వారణాసి యందు నివసింతురో, ఎవరు కృత్తివాస దేవుని శరణు పొందుదురో, వారికి ఒక్క జన్మముతోనే మోక్షము లభించును. (26) సంప్రాప్య లోకే జగతా మభీష్టం సుదుర్లభం విప్రకులేషు జన్మ | ధ్యానం సమాదాయ జపన్తి రుద్రం ధ్యాయన్తి చిత్తే యతయో మహేశమ్ || 27 || ఆరాధయన్తి ప్రభు మీశితారం వారాణసీ మధ్యగతా మునీన్ద్రాః | యజన్తి యజ్ఞై రభి సన్థి హీనాః స్తువన్తి రుద్రం ప్రణమన్తి శమ్భుమ్ || || 28 || నమో భవాయా మలభావధామ్నే, స్థాణుం ప్రపద్యే గిరిశం పురాణమ్ | స్మరామి రుద్రం హృదయే నివిష్టం, జానే మహాదేవ మనేకరూపమ్ || || 29 || ఇతి శ్రీ కూర్మపురాణ వారాణసీ మాహాత్మ్యం నామ ద్వాత్రింశో7ధ్యాయః లోకములకు ఇష్టమైన, మిక్కిలి కష్టముతో పొందదగిన బ్రాహ్మణ కులములో జన్మను పొంది, ధ్యానమవలంబించి రుద్రుణ్ణి జపింతురు. సన్యాసులు మనస్సులో మహేశ్వరుని ధ్యానము చేయుదురు. (27) వారణాసి పట్టణములో నివసించే మునీశ్వరులు ప్రభువైన ఈశ్వరుని ఆరాధింతురు. కపటములేనివారై యజ్ఞములతో పూజింతురు. రుద్రుని స్తోత్రము చేయుదురు. శంభునికి నమస్కరింతురు. (28) స్వచ్ఛములైన భావములకు స్థానమైన భవునికి వందనము. పురాణ పురుషుడు, గిరిశయనుడైన శివుని శరణుపొందుతున్నాను. హృదయములో నివసించియున్న రుద్రుని స్మరించుచున్నాను. బహురూపధారియగు మహాదేవుని గుర్తించుచున్నాను. (29) శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యము అను ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.