Sri Koorma Mahapuranam
Chapters
పఞ్చత్రింశో7ధ్యాయః సూత ఉవాచ :- తతః సర్వాణి గుహ్యాని తీర్థా న్యాయతనాని చ | జగామ భగవా న్వ్యాసో జైమినిప్రముఖై ర్వృతః ||
|| 1 || ప్రయాగం పరమం తీర్థం ప్రయాగా దధికం శుభమ్ | విశ్వరూపం తథా తీర్థం కాలతీర్థ మనుత్తమమ్ |
|| 2 || ఆకాశాఖ్యం మహాతీర్థం తీర్థం చైవా నుషం పరమ్ | స్వర్లీన ఞ్చ మహాతీర్థం గౌరీతీర్థ మనుత్తమమ్ |
|| 3 || ప్రాజాపత్యం పరం తీర్థం స్వర్గ ద్వారం తథైవ చ | జమ్బుకేశ్వర మిత్యుక్తం చర్మాఖ్యం తీర్థముత్తమమ్ ||
|| 4 || ముప్పది అయిదవ అధ్యాయము సూతుడిట్లు చెప్పెను. తరువాత పూజనీయుడైన వ్యాసుడు జైమిని మొదలగు శిష్యులతో కూడి రహస్యములు, పుణ్యకరములైన సమస్త తీర్థ స్థలములను చూచుటకు వెళ్ళెను. (1) గొప్ప పుణ్యస్థలమైన ప్రయాగమును, ప్రయాగకంటె ఎక్కువ శుభదాయకమైన విశ్వరూపమను తీర్థమును, అట్లే సాటిలేని కాల తీర్థమనుస్థలమును; (2) ఆకాశమనుపేరుగల గొప్ప తీర్థస్థలమును, శ్రేష్ఠమైన అనుషమను తీర్థమును, స్వర్లీనమను పేరు గల గొప్ప తీర్థమును, అద్వితీయమైన గౌరీతీర్థమనుదానిని కూడా, (3) గొప్పదైన ప్రాజాపత్యమను తీర్థస్థానమును. అట్లే స్వర్గద్వారమును స్థలమును, జంబుకేశ్వరమను పేరుతో వ్యవహరింపబడునది, చర్మాఖ్యమైన శ్రేష్ఠమైన తీర్థమును; (4) గయాతీర్థం మహాతీర్థం చైవ మహానదీ | నారాయణం పరం తీర్థం వాయుతీర్థ మనుత్తమమ్ || || 5 || జ్ఞాన తీర్థం పరం గుహ్యం వారాహం తీర్థ ముత్తమమ్ | యమతీర్థం మహాపుణ్యం తీర్థం సంవర్తకం పరమ్ || || 6 || అగ్నితీర్థం ద్విజశ్రేష్ఠాం కాలకేశ్వర ముత్తమమ్ | నాగతీర్థం సోమతీర్థం సూర్యతీర్థం తథైవ చ || || 7 || పర్వతాఖ్యం మహాపుణ్యం మనికర్ణ మనుత్తమమ్ | ఘటోత్కచం తీర్థవరం శ్రీతీర్థం చ పితామహమ్ || |7 8 || గఙ్గాతీర్థ న్తు దేవేశం తథా తత్తీర్థ ముత్తమమ్ | కాపిలం చైవ సోమేశం బ్రహ్మతీర్థ మనుత్తమమ్ || || 9 || గయాతీర్థమును, మహాతీర్థమును, మహానది అనుపేరుగల తీర్థమును, శ్రేష్ఠమైన నారాయణ తీర్థమును, అద్వితీయమగు వాయు తీర్థమును; (5) మిక్కిలి రహస్య తరమైన జ్ఞానతీర్థమును, ఉత్తమమైన వారాహ తీర్థమును, మిక్కలి పుణ్యదాయకమైన యమతీర్థమును, గొప్పదైన సంవర్తకమను తీర్థమును, (6) ఓ బ్రాహ్మణోత్తములారా! అగ్నితీర్థమును, శ్రేష్ఠమైన కాలకేశ్వర క్షేత్రమును, నాగతీర్థమును, సోమతీర్థమును అట్లే సూర్యతీర్థమును కూడ, (7) మిక్కిలి పుణ్యకరమైన పర్వతనామక తీర్థమును, సాటిలేని మణికర్ణ తీర్థమును, తీర్థములలో శ్రేష్ఠమైన ఘటోత్కచమును, శ్రీ తీర్థమును, పితామహాక్షేత్రమును కూడ, (8) గంగా తీర్థమును, దేవేశ స్థలమును, శ్రేష్ఠమైన ఆ కాపిల తీర్థమును, సోమేశ క్షేత్రమును, సాటిలేనిదైన బ్రహ్మతీర్థమును; (9) (యత్ర లిఙ్గం పూజనీయం స్నాతుం బ్రహ్మా యదాగతః | తదానీం స్థాపయామాస విష్ణు స్తల్లిఙ్గ మైశ్వరమ్ || తతః స్నాత్వా సమాగత్య బ్రహ్మా ప్రోవాచ తం హరిమ్ | మయా నీత మిదం లిఙ్గం కస్మాత్ స్థాపితవా నసి || త మాహ విష్ణుస్త్వత్తో೭పి రుద్రే భక్తి ర్దృఢా యతః | తస్మాత్ ప్రతిష్ఠితం లిఙ్గం నామ్నా తత్ర భవిష్యతి ||) భూతేశ్వరం తథా తీర్థం తీర్థం ధర్మసముద్భవమ్ | గన్ధర్వతీర్థం సుశుభం వాహ్నేయం తీర్థ ముత్తమమ్ || || 10 || దౌర్వాసికం హోమతీర్థం చన్ద్రతీర్థం ద్విజోత్తమాః | చిత్రాఙ్గదేశ్వరం పుణ్యం పుణ్యం విద్యాధరేశ్వరమ్ || || 11 || (ఎక్కడనైతే పూజింపదగిన లింగమును, బ్రహ్మదేవుడు స్నానము చేయుటకు వెళ్ళినప్పుడు విష్ణువు ఆ ఈశ్వర లింగమును అప్పుడు ప్రతిష్ఠించినాడో, తరువాత స్నానము చేసివచ్చిన బ్రహ్మ ''నాచేత తీసుకొని రాబడిన లింగమును నీవు ఎందువలన ప్రతిష్ఠించినావు' అని విష్ణువును ప్రశ్నించెను. విష్ణువు బ్రహ్మకు ఇట్లు బదులిచ్చెను. నీకంటె నాకు రుద్రుని యందు దృఢమైన భక్తి కలదు. అందువన నేనీ లింగమును ప్రతిష్ఠించినాను. ఇది నీపేరుతో ప్రసిద్ధమై యుండగలదు) మరియు భూతేశ్వరమను తీర్థము, ధర్మ సముద్భవమను తీర్థము, శుభకరమైన గంధర్వ తీర్థము, శ్రేష్ఠమయిన వాహ్నేయ తీర్థము, (10) బ్రాహ్మణోత్తములారా! దుర్వాసమునికి సంబంధించిన హోమ తీర్థము, చంద్రతీర్థము, పుణ్యదాయకమైన చిత్రాంగదేశ్వరము, అటువంటి యగు విద్యాధరేశ్వర తీర్థము; (11) కేదారం తీర్థముఖ్యాఖ్యం కాలఞ్జర మనుత్తమమ్ | సారస్వతం ప్రభాస ఞ్చ ఖేటకర్ణం హరం శుభమ్ || || 12 || లౌకికాఖ్యం మహాతీర్థం తీర్థం చైవ హిమాలయమ్ | హిరణ్యగర్భం గోప్రఖ్యం తీర్థం చైవ వృషధ్వజమ్ || || 13 || ఉపశాన్తం శివం చైవ వ్యాఘ్రేశ్వర మనుత్తమమ్ | త్రిలోచనం మహాతీర్థం లోలార్క ఞ్చోత్తరాహ్వయమ్ || || 14 || కపాలమోచనం తీర్థం బ్రహ్మహత్యావినాశనమ్ | శుక్రేశ్వరం మహాపుణ్య మానన్దపుర ముత్తమమ్ || || 15 || ఏవ మాదీని తీర్థాని ప్రాధాన్యా త్కధితాని తు || న శక్యా విస్తరా ద్వక్తుం తీర్థసంఖ్యా ద్విజోత్తమాః || || 16 || తీర్థముఖ్యమను పేరుగల కేదార క్షేత్రము, శ్రేష్ఠమైన కాలంజర తీర్థము, సారస్వతము, ప్రభాసతీర్థము, ఖేటకర్ణము, శుభకరమైన హర తీర్థము. (12) లౌకిక మనుపేరుగల గొప్పతీర్థము, హిమాలయతీర్థము, హిరణ్యగర్భము, గోప్రఖ్యము, వృషధ్వజము అను పేర్లు కల తీర్థములు; (13) ఉపశాంతము, శివము, శ్రేష్ఠమైన వ్యాఘ్రేశ్వర తీర్థము, త్రిలోచనమను గొప్ప తీర్థము, లోలార్కము, ఉత్తరమను పేరు కల తీర్థము; (14) 201 పేజీ మిస్సింగ్ సూత ఉవాచ :- యః పఠే దవిముక్తస్య మాహాత్మ్యం శృణుయా దథ | శ్రావయే ద్వా ద్విజా ఞ్ఛా న్తా న్స యాతి పరమాం గతిమ్ || || 6 || మానవరపము ధరించిన పార్వతీదేవి చేత ఇట్లు పలుకబడిన వేదవ్యాసమహాముని, తనధ్యానశక్తి వలన ఆమెను దేవిగా గుర్తించి నమస్కరించి ప్రశస్తములైన పొగడ్తలతో స్తుతించి ఇట్లనెను. (27) ''ఓ పార్వతీదేవీ! నాకు చతుర్దశినాడు, అష్టమినాడు వారాణసిలో ప్రవేశించుటకు అనుమతినిమ్ము''. అని వ్యాసుడు ప్రార్థించ అట్లేయగుగాక అని అనుగ్రహించి దేవి అదృశ్యమాయెను. (28) పూజనీయుడు, సనాతనుడు, గొప్పయోగీ అగు వ్యాసుడీ విధముగా కాశీక్షేత్రము యొక్క గుణములన్నింటిని తెలుసుకొని దానికి సమీపములో కొద్దిరూపములో నివసించెను. (29) ఇట్లు వ్యాసముని ఆ క్షేత్రములో చాలకాలమున్న విషయమును తెలుసుకొని, పండితులు ఆ క్షేత్రమును సేవించుచుండిరి. అందువలన మనుష్యుడు అన్ని విధముల ప్రయత్నముతో వారాణసియందు నివసించవలెను. (30) సూతుడు పలికెను :- ఈ అవిముక్త క్షేత్రము యొక్క మాహాత్మ్యమును ఎవడు చదువునో, లేక వినునో, అథవా శాంతులైన ద్విజులకు వినిపించునో, వాడు ఉత్తమగతిని పొందును. (31) శ్రాద్ధేవా దైవికే కార్యే రాత్రా వహని వా ద్విజాః | నదీనాం చైవ తీరేషు దేవతాయతనేషుచ || జ్ఞాత్వా సమాహితమనాః కామక్రోధవివర్జితః | జపే దీశం నమస్కృత్య స యాతి పరమాం గతిమ్ || ఇతి శ్రీ కూర్మపురాణ వారాణసీ మాహాత్మ్యే పఞ్చత్రింశో೭ధ్యాయః శ్రాద్ధములోగాని, దేవకార్యమునందుగాని, రాత్రికాలమున, లేక పగటియందుగాని, నదులతీరప్రదేశములందు, దేవతామందిరములందు కాని ఓ బ్రాహ్మణులారా! (32) జ్ఞానమును పొంది, సావధాన మనస్సు కలవాడై, కోరికలను కోపమును విడిచినవాడై ఈశ్వరునికి నమస్కరించి అతనిని గూర్చి జపము చేసినచో అట్టివాడు ఉత్తమగతిని పొందును. (33) శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యవర్ణన యందు ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.