Sri Koorma Mahapuranam    Chapters   

సప్తత్రింశోధ్యాయః

మార్కణ్డయ ఉవాచ :-

కథయిష్యామి తే వత్స తీర్థయాత్రావిధిక్రమమ్‌ | ఆర్షేణ తు విధానేన యథాదృష్టం యధాశ్రుతమ్‌ || || 1 ||

ప్రయాగతీర్థయాత్రార్థీ యః ప్రయాతి నరః క్వచిత్‌ | బలీవర్దం సమారూఢః శృణు తస్యాపి య త్ఫలమ్‌ || || 2 ||

నరకే వసతే ఘోరే సమాః కల్పశతాయుతమ్‌ | తతో నివర్తితో ఘోరే గవాం క్రోధః సుదారుణః || || 3 ||

సలిల ఞ్చ న గృహ్ణన్తి పితర స్తస్య దేహినః | యస్తు పుత్రాం స్తథా బాలా నన్నహీనా న్ర్పముఞ్చతి || || 4 ||

యథా త్మానం తదా సర్వం దానం విప్రేషు దాపయేత్‌ | ఐశ్వర్యా ల్లోభమోహాద్వా గచ్ఛే ద్యానేన యోనరః || || 5 ||

ముప్పది ఏడవ అధ్యాయము

మార్కండేయుడిట్లు చెప్పెను :-

కుమారా! తీర్థ యాత్రల విధానమును, క్రమమును ఋషులచేత చెప్పబడిన పద్ధతితో నేను చూచినంతవరకు, విన్నంతవరకు నీకు చెప్పబోవుచున్నాను. (1)

ఏ మనుష్యుడు ప్రయాగక్షేత్రమునకు యాత్ర చేయగోరినవాడై, వాహనముగా ఎద్దును ఎక్కినవాడై ప్రయాణముచేయునో, వానికి కూడా ఎటువంటి ఫలము కలుగునో వినుము. (2)

అటువంటి మనుష్యుడు భయంకరమైన నరకలోకములో వేలకొలది కల్పముల పర్యంతము ఎన్నో సంవత్సరాలు నివసించును. అక్కడి నుండి మరలినవాడై భయంకరమైన క్రోధము కల వృషభముగా జనించును. (30

ఎవడు తన పుత్రులను బాలురుగా ఉన్నప్పుడే జీవనాధారము కల్పించక విడిచిపెట్టి వెళ్ళునో అటువంటి ప్రాణి యొక్క పితృదేవతలు తమ కొడుకు వదలిన తర్పణ జలమును కూడా స్వీకరించరు. (4)

తనను తాను అర్పించుకొనుటతోపాటు, తనకున్న సర్వస్వమును బ్రాహ్మణులు కర్పించవలెను. ఐశ్వర్యమదము వలన, లోభ మోహముల వలన గాని ఎవడు వాహనముతో ప్రయాణించునో (5)

నిష్ఫలం తస్య తత్తీర్థం తస్మా ద్యానం విసర్జయేత్‌ | గఙ్గాయమునయో ర్మధ్యే యస్తు కన్యాం ప్రయచ్ఛతి || || 6 ||

ఆర్షేణ తు విధానేన యథావిభవవిస్తరమ్‌ | న స పశ్యతి తం ఘోరం నరకం తేన కర్మణా || || 7 ||

ఉత్తరాన్‌ స కురూ న్గత్వా మోదతే కాల మవ్యయమ్‌ | వటమూలం సమాశ్రిత్య యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌ || || 8 ||

స్వర్గలోకా నతిక్రమ్య రుద్రలోకం స గచ్ఛతి | యత్ర బ్రహ్మాదయో దేవా దిశశ్చ సదిగీశ్వరాః || || 9 ||

లోకపాలా శ్చ పితరః సర్వే తే లోకసంస్థితాః | సనత్కుమారప్రముఖా స్తథా బ్రహ్మర్షయో పరే || || 10 ||

అతని ఆ యాత్ర వ్యర్థమగును. అందువలన తీర్థయాత్రకు వాహనమును ఉపయోగించకూడదు. గంగాయమునా నదుల మధ్య ప్రదేశములో ఎవడు కన్యాదానము జరుపునో, (6)

అతడు ఋషి ప్రోక్తమైన క్రమముతో, తనకున్న వసతులకు, శక్తికి తగినట్లుగా దానిని చేసినట్లైతే, ఆ పని ద్వారా అతడు భయంకరమైన నరకమును చూడబోడు. (7)

అట్టివాడు ఉత్తర కురుదేశములను చేరి చిరకాలము అచ్చట సంతోషముతో గడుపును. ఎవడైతే ప్రయాగ తీర్థము వద్ద వటవృక్షపు మొదలు ప్రదేశంలో తన ప్రాణములను విడిచిపెట్టునో, (8)

వాడు స్వర్గలోకములను దాటి శివలోకమును పొందగలడు. ఆ లోకములో బ్రహ్మ మొదలగు దేవతలు, దిక్కులు, దిక్పాలకులు సన్నిహితులై యుందురు. (9)

ఇంకను ఇంద్రాది లోకపాలకులు, పితృదేవతలు, సనత్కుమారుడు మొదలుగా గలవారు, ఇతరులైన బ్రహ్మర్షులు కూడా అందరు ఆ లోకమందు నివసించి యుందురు. (10)

నాగాః సుపర్ణాః సిద్ధా శ్చ తథా నిత్యం సమాసతే | హరి శ్చ భగవా నాస్తే ప్రజాపతిపురస్కృతః || || 11 ||

గంగాయమునయో ర్మధ్యే పృథివ్యా జఘనం స్మృతమ్‌ | ప్రయాగం రాజశార్దూల త్రిషు లోకేషు విశ్రుతమ్‌ || || 12 ||

తత్రా భిషేకం యః కుర్యా త్సఙ్గమే శంసితవ్రతః | తుల్యం ఫల మవాప్నోతి రాజసూయాశ్వమేధయోః || || 13 ||

న మాతీవచనా త్తాత న లోకవచనా దపి | మతి రుత్ర్కమణీయా తే ప్రయాగగమనం ప్రతి || || 14 ||

షష్టి తీర్థసహస్రాణి షష్టి కోట్య స్తథా పరాః | తేషాం సాన్నిధ్య మత్రైవ తీర్థానాం కురునన్దన || || 15 ||

యా గతి ర్యోగయుక్తస్య సన్న్య స్తస్య మనీషిణః | సా గతి స్త్యజతః ప్రాణాన్‌ గఙ్గాయమునసఙ్గమే || || 16 ||

నాగజాతికి చెందినవారు, గరుడులు, సిద్ధులు కూడా అక్కడ ఎల్లప్పుడు నివసింతురు. భగవంతుడైన శ్రీ విష్ణువు బ్రహ్మదేవునితో కూడినవాడై అక్కడ నెలకొని యుండును. (11)

గంగా యమునా నదుల మధ్య ప్రదేశము భూమి యొక్క నడుము ప్రదేశముగా తలచబడుచున్నది. ఓ రాజశ్రేష్ఠుడా! ఈ ప్రయాగ క్షేత్రము మూడులోకముల యందు చాలా ప్రసిద్ధమై ఉన్నది. (12)

208 పేజీ మిస్సింగ్‌

విశాలమైన మనోహరమైన, హంసవలె తెల్లనైన ఊర్వశి నామకమైన ఇసుకతిన్నె మీద ఎవడు తన ప్రాణములను విడుచునో, దాని ఫలమును చెప్పుదును వినుము. (26)

ఓ రాజా! అట్టి పురుషుడు అరువదివేల అరువది వందల సంవత్సరాల కాలము తన పితృదేవతలతో కూడి స్వర్గలోకములో నివసించి యుండును. (27)

అందమైన సంధ్యావటమను ప్రదేశములో బ్రహ్మచారిగా, ఏకాగ్రచిత్తుడై శుచిగా ధ్యానించిన మనుష్యుడు బ్రహ్మలోకమును పొందును. (28)

కోటితీర్థం సమాసాద్య యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌ | కోటివర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే || || 29 ||

యత్ర గఙ్గా మహాభాగా బహుతీర్ధతపోవనా | సిద్ధం క్షేత్రం హి తజ్ఞేయం నాత్ర కార్యా విచారణా || || 30 ||

క్షితౌ తారయతే మర్త్యా న్నాగాం స్తారయతే ప్యధః | దివి తారయతే దేవాం స్తేన సా త్రిపథా స్మృతా || || 31 ||

యావ దస్థీని గఙ్గాయాం తిష్ఠని పురుషస్య తు | తావ ద్వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే || || 32 ||

తీర్థానాం పరమం తీర్థం నదీనాం పరమా నదీ | మోక్షదా సర్వ భూతానాం మహాపాతకినా మపి || || 33 ||

సర్వత్ర సులభా గఙ్గా త్రిషు స్థానేషు దుర్లభా | గఙ్గాద్వారే ప్రయాగే చ గఙ్గాసాగరసంగమే || || 34 ||

ఎవడైతే కోటితీర్థమును చేరుకొని తన ప్రాణములను విడుచునో, అతడు వేయికోట్ల సంవత్సరాల కాలము వరకు స్వర్గలోకములో పూజింపబడును. (29)

అనేక పుణ్యతీర్థములతో, తపోవనములతో కూడియున్న ప్రశస్తమైన గంగానది ఎక్కడ ప్రవహించుచుండునో, ఆ ప్రదేశము సిద్ధక్షేత్రము గా పరిగణింపదగినది. ఈ విషయములో విచారణ చేయదగదు. (30)

ఆ గంగ, భూమి, మీద మనుష్యులను, పాతాళ లోకములో నాగ జాతీయులను, ఆకాశములో దేవతలను తరింపజేయుచున్నది. అందు వలననే త్రిపథగ అని పేర్కొనబడుచున్నది. (31)

ఎంతకాలము మనుష్యుని అస్థులు గంగానదిలో నిలిచియుండునో, అన్నివేల సంవత్సరముల కాలము ఆ పురుషుడు స్వర్గలోకములో సుఖించును. (32)

తీర్థములలో శ్రేష్ఠమైనది, నదులలో ఉత్తమమైన నది, గొప్ప పాపములు చేసినవారైనను సమస్త ప్రాణులకు మోక్షము నిచ్చునది ఆ గంగా నది. (33)

గంగ అన్ని చోట్ల సులభముగా లభించును. గంగాద్వారము, ప్రయాగ, గంగాసాగర సంగమము అను మూడు చోట్ల మాత్రము అభించుట కష్ట సాధ్యము. (34)

సర్వేషా మేవ భూతానాం పాపోపహతచేతసామ్‌ | గతి మన్వేషమాణానాం నాస్తి గఙ్గాసమా గతిః || || 35 ||

పవిత్రాణాం పవిత్రం య న్మఙ్గళానాం చ మఙ్గలమ్‌ | మహేశ్వరా త్పరిభ్రష్టా సర్వపాపహరా శుభా || || 36 ||

కృతే తు నైమిషం తీర్థం త్రేతాయాం పుష్కరం వరమ్‌ | ద్వాపరే తు కురుక్షేత్రం కలౌ గఙ్గా విశిష్యతే || || 37 ||

గఙ్గా మేవ నిషేవన్తే ప్రయాగే తు వివేషతః | నాన్య త్కలియుగే రౌద్రే భేషజం నృప విద్యతే || || 38 ||

అకామో వా సకామో వా గంగాయాం యో విపద్యతే | స మృతో జాయతే స్వర్గే నరకం చ న పశ్యతి || || 39 ||

ఇతి శ్రీ కూర్మ పురాణ ప్రయాగ మాహాత్మ్యే సప్తత్రింశోధ్మాయః

పాపముచేత పీడింపబడు మనస్సులు కల అందరు ప్రాణులకు, ఉత్తమ లోక ప్రాప్తిని గూర్చి వెదకు వారికి గంగానదితో సమానమైన మరియొక ప్రాప్యము లేదు. (35)

పవిత్రములైన వాటిలో మిక్కిలి పవిత్రము, శుభకరములలో మిక్కిలి శుభ##మైనది, మహేశ్వరుని శిరస్సు నుండి జారిపడునది, అన్ని పాపములను తొలగించునది, మంగళరూప గంగానది. (36)

కృతయుగములో నైమిశారణ్యము పుణ్యతీర్థము. త్రేతాయుగములో పుష్కరక్షేత్రము, ద్వాపరములో కురుక్షేత్రము మిక్కిలి పవిత్రమైనవి. కలియుగములో గంగానది విశిష్టమైనది. (37)

ప్రయాగ క్షేత్రములో ప్రత్యేకముగా గంగానదినే సేవింతురు. ఓ రాజా! క్రూరమైన కలియుగములో దానికంటె ఇతరమైన మరియొక ఔషధము లేదు. (38)

కోరికతోగాని, కోరిక లేకుండాకాని ఎవడైతే గంగానది యందు తన ప్రాణములను విడుచునో, అట్టివాడు స్వర్గలోకమున జీవించును. నరకమును చూడడు. (39)

శ్రీ కూర్మ పురాణములో ప్రయాగ మాహాత్మ్యము నందు ముప్పది యేడవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters