Sri Koorma Mahapuranam    Chapters   

అష్టత్రింశోధ్యాయః

మార్కణ్డయ ఉవాచ :-

షష్టి స్తీర్ధసహస్రాణి షష్టి స్తీర్ధశతాని చ | మాఘమాసే గమిష్యన్తి గఙ్గాయమునసఙ్గమే || || 1 ||

గవాం శతసహస్రస్య సమ్య గ్దత్తస్య య త్ఫలమ్‌ | ప్రయాగే మాఘమాసే తు త్ర్యహం స్నాతస్య తత్ఫలమ్‌ || || 2 ||

గఙ్గాయమునయోర్మధ్యే కరీషాగ్ని ఞ్చ సాధయేత్‌ | అహీనాఙ్గో హ్యరోగ శ్చ పఞ్చేన్ద్రియసమన్వితః || || 3 ||

యావన్తి రోమకూపాని తస్య గాత్రేషు భూమిప | తావద్వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే || || 4 ||

తతః స్వర్గా త్పరిభ్రష్టో జమ్బూద్వీపపతి ర్భవేత్‌ | భుక్త్వా స విపులా న్భోగాం స్త త్తీర్థం లభ##తే పునః || || 5 ||

ముప్పది ఎనిమిదవ అధ్యాయము

మార్కండేయుడు చెప్పెను -

అరువది వేల తీర్థ స్థలములు, అరువది వందల పుణ్య తీర్థములను గూర్చి గంగా యమునా నదుల సంగమ స్థలము నందు జనులు మాఘ మాసములో వెళ్ళుదురు. (1)

లక్ష గోవులను చక్కగా, విధి ప్రకారము దానము చేసిన దానికి ఏ ఫలము కలదో, మాఘ మాసములో ప్రయాగ క్షేత్రములో మూడు రోజులు స్నానము చేసిన వానికి ఆ ఫలము కలుగును. (2)

గంగా యమునా నదుల మధ్య భాగములో కరీషాగ్నిని సంపాదించవలెను. అంగవైకల్యము లేనివాడు, రోగము లేనివాడు, అయిదు ఇంద్రియములతో కూడియున్నవాడు (3)

అతని శరీరావయవములందు ఎన్ని రోమ కూపములు కలవో, అన్నివేల సంవత్సరాల కాలము ఆ మనుష్యుడు స్వర్గలోకములో సుఖముగా జీవించును. (4)

తరువాత స్వర్గమునుండి క్రిందికి వచ్చి జంబూద్వీపమునకు ప్రభువగును. అతడు అనేకములైన భోగములను చిరకాలమను భవించి మరల ఆ తీర్థ స్థలమును చేరుకొనును. (5)

జలప్రవేశం యః కుర్యా త్సఙ్గమే లోకవిశ్రుతే | రాహుగ్రస్తో యధా సోమో విముక్తః సర్వపాతకైః || || 6 ||

సోమలోక మవాప్నోతి సోమేన సహ మోదతే | షష్టి వర్షసహస్రాణి షష్టి వర్షశతాని చ | || 7 ||

స్వర్గతః శక్రలోకే సౌ మునిగన్ధర్వసేవితే | తతో భ్రష్ట స్తు రాజేన్ద్ర! సమృద్ధే జాయతే కులే || || 8 ||

అథఃశిరాస్తు యో ధారా మూర్ధ్వపాదః పిబే న్నరః | సప్త వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే || || 9 ||

తస్మా ద్భ్రష్ట స్తు రాజేన్ద్ర! అగ్నిహోత్రీ భ##వే న్నరః | భుక్త్వాథ విపులా న్భోగాం స్తత్తీర్థం భజతే పునః || || 10 ||

యః శరీరం వికర్తిత్వా శకునిభ్యః ప్రయచ్ఛతి | విహఙ్గై రుప భుక్తస్య శృణు తస్యాపి యత్ఫలమ్‌ || || 11 ||

లోకములో మిక్కిలి ప్రఖ్యాతమైన గంగా యమునల సంగమ ప్రదేశంలో ఎవడు మునిగి స్నానము చేయునో, వాడు చంద్రుడు రాహు గ్రహణము నుండి విముక్తుడైనట్లు అన్ని పాపముల చేత విడువబడును. (6)

అతడు మరణానంతరము సోమలోకమునుచేరి అక్కడ 60 వేల సంవత్సరాలు మరియు ఆరువేల సంవత్సరాల కాలము సోమునితో కూడా సంతోషముగా కాలము గడుపుము. (7)

తరువాత అతడు మునులచే, గంధర్వులచేత సేవింపడు స్వర్గలోకమును పొందును. అక్కడ కొంతకాలము ఉండి భూలోకములో మరల సమృద్ధమైన వంశములో జన్మించును. (8)

ఓ రాజా! అక్కడి నుండి తొలగిన మనుష్యుడు నిత్యాగ్నిహూత్రి కాగలడు. భూమిపై బహుళముమైన సుఖముల ననుభవించి మరల అదే తీర్థస్థలమును చేరుకొనును. (10)

ఎవడు తన శరీరమును ఖండించుకొని పక్షులకు ఆహారముగా ఇచ్చునో, పక్షులచేత భుజింపబడిన ఆ నరునికి ఏ ఫలము కలుగునో దానిని కూడా వినుము. (11)

శతం వర్షసహస్రాణాం సోమలోకే మహీయతే | తత స్తస్మా త్పరిభ్రష్టో రాజా భవి ధార్మికః || || 12 ||

గుణవా న్రూపసమ్పన్నో విద్వాం స్తు ప్రియవాక్యవాన్‌ | భోగా న్భుక్త్వా చ దత్త్వా చ తత్తీర్థం భజతే పునః || || 13 ||

ఉత్తరే యమునాతీరే ప్రయాగస్య చ దక్షిణ | ఋణప్రమోచనం నామ తీర్థన్తు పరమం స్మృతమ్‌ || || 14 ||

ఏకరాత్రోషితః స్నాత్వా ఋణా త్తత్ర ప్రముక్యతే | స్వర్గలోక మవాప్నోతి అనృణ శ్చ సదా భ##వేత్‌ || || 15 ||

ఇతి శ్రీ కూర్మపురాణ ప్రయాగ మాహాత్మ్యం నామ అష్టత్రింశోధ్యాయః

అట్టివాడు నూరువేల సంవత్సరాల కాలము సోమలోకములో పూజింపబడును. తరువాత అక్కడి నుండి విముక్తుడై ధర్మ స్వభావము గల రాజుగా జన్మించును. 912)

అతడు గుణవంతుడు, అందము కలవాడు, పండితుడు, ప్రియముగా మాట్లాడువాడుగా ఉండి, తానుభోగముల ననుభవించి ఇతరులకు దానముచేసి మరల ఆ తీర్థమునకు చేరును. (13)

యమునా నదికి ఉత్తర తీరములో, ప్రయాగక్షేత్రమునకు దక్షిణభాగములో ఋణ ప్రమోచనము అనుపేరు గల శ్రేష్ఠమైన తీర్థ స్థలము కలదు. (14)

అక్కడ స్నానము చేసి, ఒక్కరాత్రి నిద్రించినట్లైతే స్వర్గలోకమును పొందును. అన్ని విధముల ఋణముల నుండి విముక్తుడై శాశ్వతముగా ఋణ హీనుడగును. (15)

శ్రీ కూర్మ పురాణములో ప్రయాగ మాహాత్మ్యము అను ముప్పది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters