Sri Koorma Mahapuranam
Chapters
ఏకోనచత్వారింశో೭ధ్యాయః మార్కణ్డయ ఉవాచ :- తపనస్య సుతా దేవీ త్రిషు లోకేషు విశ్రుతా | సమాగతా మహాభాగా యమునా తత్ర నిమ్నగా |
|| 1 || యేనైవ నిఃసృతా గఙ్గా తేనైవ యమునా గతా | యోజనానాం సహస్రేషు కీర్తనా త్పాపనాశినీ ||
|| 2 || తత్ర స్నాత్వా చ పీత్వా చ యమునా యత్ర నిమ్నగా | సర్వపాపవినిర్ముక్తః పునా త్యాసప్తమం కులమ్ ||
|| 3 || ప్రాణాం స్త్యజతి య స్తత్ర స యాతి పరమాం గతిమ్ | అగ్నితీర్థ మితి ఖ్యాతం యమునాదక్షిణ తటే ||
|| 4 || పశ్చిమే ధర్మరాజస్య తీర్థం త్వనరకం స్మృతమ్ | తత్ర స్నాత్వా దివం యాన్తి యే మృతాస్తే೭ పునర్భవాః ||
|| 5 || ముప్పది తొమ్మిదవ అధ్యాయము మార్కండేయముని యిట్లు చెప్పెను. సూర్య భగవానుని పుత్రిక, ముల్లోకముల యందు ప్రసిద్ధ అగు మహాత్మురాలైన యమునా నది ఆ ప్రయాగలో గంగా నదితో సమాగమము పొందుచున్నది. (1) ఏ మార్గము ద్వారా గంగానది ప్రవహించుచున్నదో, అదే మార్గములో వేల యోజనముల దూరము. యమునా నది ప్రవహించుచున్నది. ఆ నది కీర్తించిన వారికి పాపములను నశింపజేయును. (2) యమునా నది ఎక్కడ ప్రవహించునో, అక్కడ స్నానము చేసి, దాని జలమును త్రాగి మనుష్యుడు అన్ని పాపముల నుండి దూరుడై తన వంశము ఏడు తరముల వరకు పవిత్రము చేయును. (3) యమునా నది దక్షిణ తీరములో అగ్ని తీర్థమను పేరు కల పుణ్య స్థలము కలదు. అక్కడ ప్రాణములను విడిచిన మనుష్యుడు ఉత్తమ లోకములను పొందును. (4) యమునకు పడమటి దిశలో నరక నివారకమైన దర్మ రాజతీర్థము కలదు. అక్కడ స్నానము చేసిన స్వర్గమును పొందుదురు. మరణించిన వారికి పునర్జన్మలేదు. (5) కృష్ణపక్షే చతుర్దశ్యాం స్నాత్వా నన్తర్ప్య వై శుచిః | ధర్మరాజం మహాపాపై ర్ముచ్యతే నాత్ర సంశయః || || 6 || దశతీర్థసహస్రాణి దశకోట్య స్తథా పరాః | ప్రయాగసంస్థితాని స్యు రేవ మాహు ర్మనీషిణః || || 7 || తిస్రః కోట్యో೭ర్థ కోటిశ్చ తీర్థానాం వాయు రబ్రవీత్ | దివి భూమ్యన్తరిక్షే చ త త్సర్వం జాహ్నవీ స్మృతా || || 8 || యత్ర గఙ్గా మహాభాగా స దేశస్త త్తపోవనమ్ | సిద్ధక్షేత్రం తు తజ్ఞేయం గఙ్గాతీరం సమాశ్రితమ్ || || 9 || యత్ర దేవో మహాదేవో మాదవేన మహేశ్వరః | ఆస్తే దేవేశ్వరో నిత్యం తత్తీర్థం తత్తపోవనమ్ || || 10 || కృష్ణ పక్షములో చతుర్దశినాడు స్నానముచేసి, పరిశుద్ధుడై యమధర్మరాజును తృప్తి పొందించిన యెడల పెద్దపాపముల నుండి కూడ విడువబడుననుటలో సందేహము లేదు. (6) పదివేల పుణ్యతీర్థములు, ఇతరములైన పదికోట్ల సంఖ్యగల తీర్థములు ప్రయాగ క్షేత్రములో నిలిచి యున్నవని విద్వాంసులైన వారు చెప్పుదురు. (7) మూడున్నరకోట్ల తీర్థస్థానములిక్కడ కలవని వాయుదేవుడు చెప్పెను. స్వర్గమునందు, భూమిమీద, ఆకాశములో కూడా అంతటను జాహ్నవి గంగ వ్యాపించియున్నది. (8) ఎక్కడనైతే పవిత్రమైన గంగానది ప్రవహించుచున్నదో, ఆ ప్రదేశము తపోవనము వంటిది. గంగానది యొక్క తీరము నాశ్రయించియున్న స్థలమును సిద్ధ క్షేత్రముగా తెలియవలసియున్నది. (9) ఎక్కడనైతే మహాదేవుడగు మహేశ్వరుడు విష్ణుమూర్తితో కూడా కలిసి నివసించుచున్నాడో ఆ ప్రదేశము తీర్థ స్థలము, అది తపోవనమని తెలియవలెను. (10) ఇదం సత్యం ద్విజాతీనాం సాధూనా మాత్మజస్య చ | సుహృదా ఞ్చ జపే త్కర్ణే శిష్యస్యానుగతస్య చ || || 11 || ఇదం ధన్య మిదం స్వర్గ్య మిదం మేధ్యమిదం శుభమ్ | ఇదం పుణ్య మిదం రమ్యం పావనం ధర్మ్య ముత్తమమ్ || || 12 || మహర్షీణా మిదం గుహ్యం సర్వపాపప్రమోచనమ్ | అత్రా ధీత్య ద్విజో೭ధ్యాయం నిర్మలత్వ మవాప్నుయాత్ || || 13 || య శ్చేదం శృణుయా న్నిత్యం తీర్థం పుణ్యం సదాశుచిః | జాతిస్మరత్వం లభ##తే నా పకృష్టే చ మోదతే || || 14 || ప్రాప్యన్తే తాని తీర్థాని సద్భిః శిష్టానుదర్శిభిః | స్నాహి తీర్థేషు కౌరవ్య మా చ వక్రమతి ర్భవ || || 15 || ఈ యధార్థమైన విషయమును బ్రాహ్మణులకు, సజ్జనులకు తన కుమారునకు, మిత్రులకు, తన ననుసరించి వర్తించు శిష్యునికి గూడ చెవిలో ఉపదేశించవలెను. (11) ఈ క్షేత్రము ధన్యమైనది, ఇది స్వర్గమునకు సాధనమైనది. ఇది పవిత్రము మరియు మంగళకరమైనది. ఈ స్థలము పుణ్యదాయకము, మనోహరమైనది, తరిపంజేయునది, శ్రేష్ఠమైన ధర్మ సాధనోపాయము. (12) మహర్షులకు సంబంధించిన యీ క్షేత్ర రహస్యము అన్ని పాపముల నుండి విముక్తులను చేయును. ఇక్కడ బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేసి నిర్మలత్వమును పొందగలడు. (13) ఎవడు ఈ పుణ్యమైన తీర్థమును గూర్చి ఎల్లప్పుడు శుచియై వినునో, అతడు పూర్వజన్మస్మృతిని పొందును. నీచ విషయముల యందభిరుచిని కలిగియుండడు. (14) శిష్టుల నాశ్రయించి జ్ఞానమును పొందిన వారిచేత, ఉత్తములచేత ఆ తీర్థములు పొందబడును. ఓ యుధిష్ఠిరా! ఆ తీర్థములందు స్నానము చేయము. విపరీత బుద్ధి కలవాడవు కావలదు. (15) ఏవ ముక్త్వా స భగవా న్మార్కణ్డయో మహామునిః | తీర్థాని కథయామాస పృథివ్యాం యాని కానిచిత్ || || 16 || భూసముద్రాది సంస్థానం గ్రహాణాం జ్యోతిషాం స్థితిమ్ | పృష్టః ప్రోవాచ సకల ముక్త్వాథ ప్రయ¸° మునిః || || 17 || సూత ఉవాచ :- య ఇదం కల్య ముత్థాయ శృణోతి పఠతే೭థవా | ముచ్యతే సర్వపాపై స్తు రుద్రలోకం స గచ్ఛతి || || 18 || ఇతి శ్రీ కూర్మపురాణ ప్రయాగ మాహాత్మ్యం నామ ఏ కోనచత్వారింశో೭ధ్యాయః పరమ పూజ్యుడైన ఆ మార్కండేయ మహాముని, ఈ విధముగా పలికి, భూమి మీద ఉన్నటువంటి మరికొన్ని తీర్థ విశేషములను గూర్చి చెప్పెను. (16) భూమి, సముద్రము మొదలగు వాని ఉనికి, గ్రహముల, నక్షత్రముల యొక్క స్థితిని, అతినిచే అడుగబడి, సంపూర్ణముగా చెప్పి, మార్కండేయముని వెడలిపోయెను. (17) సూతుడిట్లు చెప్పెను. ఎవడు ఈ ప్రయాగ తీర్థ మాహాత్మ్యమును ప్రాతః కాలమున లేచి చదువునో లేదా వినునో వాడు అన్ని పాపముల నుండి విముక్తుడై రుద్ర లోకమును పొందును. (18) శ్రీ కూర్మపురాణములో ప్రయాగ మాహాత్మమను ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.