Sri Koorma Mahapuranam    Chapters   

ఏకచత్వారింశోధ్యాయః

అథజ్యోతిః సన్నివేశవర్ణనమ్‌

సూత ఉవాచ :-

అతః పరం ప్రవక్ష్యామి సంక్షేపేణ ద్విజోత్తమాః | త్రైలోక్య స్యాస్య మానం వో న శక్యం విస్తరేణ తు || || 1 ||

భూర్లోకోథ భువర్లోకః స్వర్లోకోథ మహ స్తథా | జన స్తపశ్చ సత్యఞ్చ లోకా స్త్వణ్డో ద్భవా స్తథా || || 2 ||

సూర్యాచన్ద్రమసౌ యావ త్కిరణౖ రేవ భాసతః | తావ ద్భూర్లోక ఆఖ్యాతః పురాణ ద్విజపుంగవాః || || 3 ||

యావత్ర్పమాణో భూర్లోకో విస్తరా త్పరిమణ్డలాత్‌ | భువర్లోకోపి తావ త్స్యాత్‌ మణ్డలా ద్భాస్కరస్య తు || || 4 ||

నలుబది యొకటవ అధ్యాయము

సూతుడిట్లు చెప్పెను :-

ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఇకముందు మీకు ఈమూడు లోకముల పరిమాణమును సంగ్రహముగా చెప్పుదును. దానిని విపులముగా చెప్పుటకు శక్యము కాదు. (1)

భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అను నీయేడులోకములు బ్రహ్మండము నుండి జనించినవి. (2)

ఎంతవరకైతే సూర్యచంద్రులు తమకిరణములతో ప్రకాశించుచు కన్పింతురో, అంతవరకు భూలోకమని పురాణములయందు చెప్పబడినది. (3)

భూలోకము సూర్యుని పరిమండలము నుండి ఎంత ప్రమాణము కలదై విస్తరించియున్నదో, భువర్లోకము కూడ సూర్యమండలమునకు అంత ప్రమాణముతో వ్యాపించియుండును. (4)

ఊర్ధ్వం యన్మణ్డలం వ్యోమ్ని ధ్రువో యావ ద్వ్యవస్థితః | స్వర్గలోకః సమాఖ్యాత స్తత్ర వాయో స్తు నేమయః || || 5 ||

అవహః ప్రవహ శ్చైవ తతైవానువహః పునః | సంవహో వివహ శ్చైవ తదూర్ధ్వం స్యా త్పరావహః || || 6 ||

తథా పరివహ శ్చైవ వాయో ర్వై సప్త నేమయః | భూమే ర్యోజనలక్షే తు భానోర్వై మణ్డలం స్థితమ్‌ || || 7 ||

లక్షే దివాకరస్యాపి మణ్డలం శశినః స్మృతమ్‌ | నక్షత్రమణ్డలం కృత్స్నం తల్లక్షేణ ప్రకాశ##తే || || 8 ||

ద్విలక్షే హ్యన్తరే విప్రా బుధో నక్షత్ర మణ్డలాత్‌ | తావత్ర్పమాణభాగేతు బుధస్యా ప్యుశనాః స్థితః || || 9 ||

ఆకాశమునందు పైభాగమున ఏమండలముకలదో, ధ్రువుడు ఎంతమేర నిలిచియున్నాడో అది స్వర్గలోకమని చెప్పబడుచున్నది. అక్కడ వాయువు యొక్క నేములు కలవు. (5)

ఆవహము, ప్రవహము, అనువహము, సంవహము, వివహము దానికిపైన పరావహము; (6)

మరియు పరివాహము అనునవి ఆనేముల పేర్లు. భూమికి లక్ష యోజనముల దూరములో సూర్యునియొక్క మండలము నిలిచియున్నది. (7)

సూర్యునకు లక్ష యోజనముల దూరములో చంద్రుని మండలము కలదు. సమస్తమైన నక్షత్రముల మండలముకూడ దానికి లక్షయోజనముల దూరములో ప్రకాశించును. (8)

ద్విజవర్యులారా! నక్షత్రమండలానికి రెండు లక్షల యోజనముల దూరములో బుధుడు ప్రకాశించును. బుధునికి అంత ప్రమాణము కల దూరములో శుక్రుడు నిలిచియున్నాడు. (9)

అఙ్గారకోపి శుక్రస్య తత్ర్పమాణ వ్యవస్థితః | లక్షద్వయేన భౌమస్యస్థితో దేవపురోహితః || || 10 ||

సౌరి ర్ద్విలక్షేణ గురోః గ్రహాణా మథ మణ్డలాత్‌ | సప్తర్షిమణ్డలం తసప్మా ల్లక్షమాత్రే ప్రకాశ##తే || || 11 ||

ఋషీణాం మణ్డలా దూర్ధ్వం లక్షమాత్రే స్థితో ధ్రువః | తత్ర ధర్మః స భగవా న్విష్ణు ర్నారాయణః స్థితః || || 12 ||

నవయోజనసాహస్రో విష్కమ్భః సవితుః స్మృతః | త్రిగుణ స్తస్య విస్తారో మణ్డల స్య ప్రమాణతః || || 13 ||

ద్విగుణః సూర్యవిస్తారా ద్విస్తారః శశినః స్మృతః | తుల్య స్తయో స్తు స్వర్భాను ర్భూత్వా తావుప సర్పతి || || 14 ||

అంగారకుడు కూడ శుక్రునికి అంత దూరములో నిలిచి యున్నాడు. అంగారకునకు రెండులక్షల యోజనాల దూరములో శని నిలిచినాడు. ఈ గ్రహముల మండలము నుండి లక్షయోజనముల దూరములో సప్తర్షి మండలము ప్రకాశించును. (11)

సప్తర్షి మండలానికి పైభాగమున లక్షయోజనముల దూరములో ధ్రువుడు నిలిచియున్నాడు. అక్కడ ధర్మ స్వరూపుడైన, భగవంతుడగు నారాయణుడు ఉన్నాడు. (12)

సూర్యమండలముయొక్క విష్కంము తొమ్మిదివేల యోజనముల పరిమాణము కలది. దానియొక్క వైశాల్యము మండల ప్రమాణమునకు మూడురెట్లు ఎక్కువగా నుండును. (13)

సూర్యుని వ్యాప్తికంటె చంద్రుని విస్తారము రెండురెట్లు ఎక్కువగా నుండును. రాహుగ్రహము ఆ సూర్యచంద్రుల సమాన పరిమాణము కలదై వారిని సమీపించి అడ్డగించును. (14)

ఉద్ధృత్య పృధివీచ్ఛాయాం నిర్మితో మణ్డలాకృతిః | స్వర్భానో స్తు బృహత్‌ స్థానం తృతీయం యత్తమోమయమ్‌ || || 15 ||

చన్ద్రస్య షోడశో భాగో భార్గవస్య విధీయతే | భార్గవా త్పాదహీ నస్తు విజ్ఞేయో వై బృహస్పతిః || || 16 ||

బృహస్పతేః పాదహీనౌ భౌమసౌరా వు భౌ స్మృతౌ | విస్తారా న్మణ్డలా చ్చైవ పాదహీన స్త యో ర్బుధః || || 17 ||

తారానక్షత్రరూపాణి వపుష్మన్తీ హ యాని వై | బుధేన తాని తుల్యాని విస్తారా న్మణ్డలా త్తథా || || 18 ||

తారానక్షత్రరూపాణి హీనాని తు పరస్పరమ్‌ | శతాని పఞ్చ చత్వారి త్రీణి ద్వే చైవ యోజనే || || 19 ||

పూర్వాపరానుకృష్టాని తారకా మణ్డలానితు | యోజనాద్యర్ధమాత్రాణి తేభ్యో హ్రస్వం న విద్యతే || || 20 ||

భూమియొక్క నీడను పైకితెచ్చి వలయాకారముగా నిర్మించబడిన వాడు రాహువు. రాహువుయొక్క స్థానము పెద్దది, మూడవది. అది చీకటి మయముగా నుండును. (15)

చంద్రుని యొక్క పదునారవభాగము శుక్రునకు ప్రతిపాదించబడినది. శుక్రుని కంటె నాలుగవ వంతు తక్కువగా బృహస్పతిని తెలియవలెను. (16)

బృహస్పతికంటె నాలుగవభాగము తక్కువవారుగా అంగారకుడు, శని చెప్పబడినారు. విస్తారమును బట్టి, మండల పరిమాణమును బట్టి కూడ వారిద్దరికి నాలుగవవంతు తక్కువగా బుధుడు తెలుపబడినాడు. (17)

ఆకారము కలిగిన యే తారలు, నక్షత్రములు కలవో, అవి అన్నియు విస్తారమును, మండలమును బట్టి బుధునితో సమానములని తెలియవలెను. (18)

తారల, నక్షత్రముల రూపములు ఒకదానికొకటి అయిదు, నాలుగు, మూడు, రెండు వందల యోజనముల దూరములతో ఎక్కువ తక్కువ దూరములు కలిగియున్నవి. (19)

తారకామండలాలు ముందువెనుకలవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. యోజన పరిమాణంలో సగం కల్గి ఉంటాయి. అంతకంటె చిన్నగా ఉండదు. (20)

ఉపరిష్టాత్త్ర యస్తేషాం గ్రహా వై దూరసర్పిణః | సౌరోఙ్గిరా శ్చ వక్ర శ్చ జ్ఞేయో మన్దవిచారణః || || 21 ||

తేభ్యోధస్తా చ్చ చత్వారః పున రన్యే మహాగ్రహాః | సూర్యః సోమో బుధ శ్చైవ భార్గవశ్చైవ శీఘ్రాగాః || || 22 ||

దక్షిణాయనమార్గస్థో యదా చరతి రశ్మిమాన్‌ | తదా పూర్వగ్రహాణాం వై సూర్యోధస్తా త్ర్పసర్పతి || || 23 ||

విస్తీర్ణం మణ్డలం కృత్వా తస్యో ర్ద్వం చరతే శశీ | నక్షత్రమణ్డలం కృత్స్నం సోమా దూర్ధ్వం ప్రసర్పతి || || 24 ||

నక్షత్రేభ్యో బుధ శ్చోర్ధ్వం బుధా దూర్ధ్వం బృహస్పతిః | వక్ర స్తు భార్గవా దూర్ధ్వం వక్రా దూర్ధ్వం బృహస్పతిః || || 25 ||

తస్మా చ్ఛనైశ్చరోప్యూర్ధ్వం తస్మా త్సప్తర్షిమణ్డలమ్‌ | ఋషీణాం చైవ సప్తానాం ధ్రువ శ్చోర్ధ్వం వ్యవస్థితః || || 26 ||

వారిలో మూడు గ్రహములు పైభాగమున దూరముగా సంచరించును. సూర్యుని కుమారుడైన శని, బృహస్పతి, అంగారకుడు అనుమూడు గ్రహములు మందగమనము కలవని తెలియవలెను (21)

ఆ గ్రహములకు క్రింది భాగమున ఇతరములైన మరి నాలుగు పెద్దగ్రహములు సంచరించును. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు అను నాలుగు గ్రహములు శీఘ్రగమనము కలవి. (22)

ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయన మార్గములో సంచరించునో అప్పుడు పూర్వపు గ్రహములకు క్రింది భాగములో సూర్యుడు సంచరించను. (23)

చంద్రుడు విశాలమైన మండలము నేర్పురచుకొని, దానికి పైభాగములో సంచరించును. సమస్తమైన నక్షత్రమండలము కూడ చంద్రునికి పైభాగమున సంచరించును. (24)

నక్షత్రములకు పైభాగమున బుధుడు, బుధునికి పైభాగములో శుక్రుడు, అతనికి పైన అంగారకుడు, అంగారకుని పైభాగములో బృహస్పతి ఉండును. (25)

బృహస్పతికి పైభాగములో శని, శనికంటెపైన సప్తర్షిమండలము ఉండును. ఆ సప్తర్షులకు పైభాగములో ధ్రువుడు నిలిచి ఉన్నాడు. (26)

యోజనానాం సహస్రాణి భాస్కరస్య రధో నవ | ఈషాదణ్డ స్తథా తస్య ద్విగుణో ద్విజ సత్తమాః || || 27 ||

సార్దకోటి స్తథా సప్త నియుతా న్యధికాని తు | యోజనానాం తు తస్యాక్ష స్తత్ర చక్రం ప్రతిష్ఠితమ్‌ || || 28 ||

త్రినాభిసప్తే పఞ్చారే షణ్ణమి న్యక్షయాత్మకే | సంవత్సరమయం కృత్స్నం కాలచక్రం ప్రతిష్ఠితమ్‌ || || 29 ||

చత్వారింశ త్సహస్రాణి ద్వితీయాక్షో వ్యవస్థితః | పఞ్చాయుతాని సార్ధాని యోజనాని ద్విజోత్తమాః || || 30 ||

అక్షప్రమాణ ముభయోః ప్రమాణం తద్యుగార్ధయోః | హ్రస్వోక్ష స్తద్యుగార్ధేన ధ్రువాధారో రధస్య తు || || 31 ||

సూర్యుని యొక్క రథము తొమ్మిది వేల యోజనములు వ్యాపించి యుండును. బ్రాహ్మణోత్తములారా! దాని ఈషాదండము రెండు రెట్లు కలదై యుండును. (27)

ఆ రథము యొక్క ఇరుసు ఏడు నియతములు ఎక్కువగా కల కోటిన్నర యోజనముల పరిమాణము కలిగి యున్నది. దాని యందు చక్రము ప్రతిష్ఠింపబడియున్నది. (28)

మూడు నాభులు కలిగి, అయిదు ఆకులుండి, ఆరు అంచులు కల అక్షయరూపమైన చక్రము నందు సంవత్సరరూపమైన కాలచక్రము పూర్తిగా నెలకొల్పబడి యున్నది. (29)

రెండవ ఇరుసు నలుబదివేల యోజనముల పరిమాణము కలిగిఉన్నది. ఓ విప్రవరులారా! సార్థములైన ఏబదివేల యోజనములు ప్రమాణము ఆరెండిటి యొక్క అక్షముల కొలత, అర్ధయుగముల ప్రమాణము క్రమముగా తెలియవలెను. ఆయుగార్థముతో హ్రస్యమైన అక్షము, ధ్రువమైన ఆధారము రథమునకు కలదు. (30, 31)

ద్వితీయేక్షే తు తచ్చక్రం సంస్థితం మానసాచలే | హయా శ్చ సప్త చ్ఛందాంసి తన్నామాని నిబోధత || || 32 ||

గాయత్రీ చ బృహ త్యుష్ణిక్‌ జగతీ పంక్తి రేవ చ | అనుష్టుప్‌ త్రిష్టు బప్యుక్తా ఛన్దాం సి హరయో హరేః || || 33 ||

మానసోపరి మాహేన్ద్రీ ప్రాచ్యాం దిశి మహాపురీ | దక్షిణాయాం యమ స్యాథ వరుణస్య తు పశ్చిమే || || 34 ||

ఉత్తరేషు చ సోమస్య తన్నామాని నిబోధత | అమరావతీ సంయమనీ సుఖా చైవ విభావరీ || || 35 ||

కాష్ఠాగతో దక్షిణతః క్షిప్తేషురివ సర్పతి | జ్యోతిషాం చక్ర మాదాయ దేవదేవః పితామహః || || 36 ||

దివసస్య రవి ర్మధ్యే సర్వకాలం వ్యవస్థితః | సప్తద్వీపేషు విప్రేన్ద్రా విశార్ధస్య చ సమ్ముఖః || || 37 ||

రెండవ ఇరుసునందు మానసపర్వతములో ఆచక్రము నిలిచియున్నది. దానికి గుఱ్ఱములుగా ఏడు ఛందస్సులున్నవి. వానిపేర్లను తెలిసికొనుడు. (32)

గాయత్రి, బృహతి, ఉష్ణిక్‌, జగతి, పంక్తి, అనుష్టుప్‌, త్రిష్టువ్‌, అనుపేర్లు గల ఏడు ఛందస్సులు సూర్యుని రథమునకు అశ్వములు. (33)

తూర్పుదిక్కున మానసశైలముపైన మాహేంద్రి అనుపెద్ద పట్టణము కలదు. యముని ముఖ్యపట్టణము దక్షిణదిక్కున, వరుణుని పట్టణము పడమటి దిక్కున కలదు. (34)

సోముని పట్టణము ఉత్తరదిక్కునందు కలదు. ఆ పట్టణముల పేర్లను తెలిసికొనుడు. అమరావతి, సంయమని, సుఖ, విభావరి అని క్రమముగా వానిపేర్లు. (35)

దేవతలకు దేవుడైన పితామహుడు దక్షిణదిక్కును పొందినవాడై గ్రహనక్షత్రాదుల చక్రమును తీసికొని, ప్రయోగించబడిన బాణమువలె సంచరించును. (36)

సూర్యుడు అన్ని కాలములయందు పగటి భాగములో సప్తద్వీపములయందు నిలిచియుండును. రాత్రిమధ్యభాగమునకు సమ్ముఖములో గోచరించును.

ఉదయాస్తమనే చైవ సర్వకాలం తు సమ్ముఖే | దిశా స్వశేషాసు తథా విప్రేన్ద్రా విదిశా సు చ || || 38 ||

కులాలచక్రపర్యన్తం భ్రమ త్యేష యథేశ్వరః | కరో త్యేష యథారాత్రిం విముఞ్చ న్మే దినీం ద్విజాః || || 39 ||

దివాకరకరై రేత త్పూరితం భువనత్రయమ్‌ | త్రైలోక్యం కధితం సద్భి ర్లోకానాం మునిపుఙ్గవాః || || 40 ||

ఆదిత్యమూల మఖిలం త్రైలోక్యం నాత్ర సంశయః | భవ త్యస్మాజ్జగ త్సర్వం సదేవాసురమానుషమ్‌ || || 41 ||

రుద్రేన్ద్రోపేన్ద్రచన్ద్రాణాం విప్రేన్ద్రాణాం దివౌకసామ్‌ | ద్యుతిమా న్ద్యుతిమ త్కృత్స్న మజయ త్సార్వలౌకికమ్‌ || || 42 ||

ఉదయ, అస్తమయ కాలమందు, అన్నికాలములయందు, ఎదురుగాను, అన్నిదిక్కులయందును, మూలలయందును, ఓ బ్రాహ్మణులారా! కులాల చక్రము వరకు ఇతడు ఈశ్వరునివలె తిరుగుచుండును. ఈతడు భూమిని విడిచిపెట్టి ఏవిధముగా రాత్రిని కల్పించునో, (38, 39) అదే విధముగా సూర్యకిరణములచేత మూడు లోకములు నింపబడును. మునీశ్వరా! సత్పురుషులచేత ఇది త్రైలోక్యమని చెప్పబడినది. (40)

ఈ సమస్తలోకత్రయము కూడ ఆదిత్యమూలకమైనదే. ఇందులో సందేహము లేదు. ఈసూర్యుని వలననే దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన లోకమంతయు నిలుచుచున్నది. (41)

రుద్రుడు, ఉపేంద్రుడు, చంద్రుడు అనువారియొక్కయు, బ్రాహ్మణశ్రేష్ఠుల యొక్క స్వర్గవాసులగు దేవతలయొక్క సమస్తమైన తేజస్సును, అన్ని లోకములకు చెందిన దానిని ఈ తేజోవంతుడైన భాస్కరుడు జయించినాడు. (42)

సర్వాత్మా సర్వలోకేశో మహాదేవః ప్రజాపతిం | సూర్య ఏష తు లోకస్య మూలం పరమదైవతమ్‌ || || 43 ||

ద్వాదశాన్యే తథా దిత్యా దేవా స్తే యేధి కారిణః | నిర్వహన్తి వద న్త్యస్య తదంశా విష్ణుమూర్తయః || || 44 ||

సర్వే సమస్యన్తి సహస్రబాహుం గన్ధర్వయక్షోరగకిన్నరాద్యాః | యజన్తి యజ్ఞై ర్వివిధై ర్మునీన్ద్రా శ్ఛన్దో మయం బ్రహ్మమయం పురాణమ్‌ || || 45 ||

ఇతి శ్రీ కూర్మపురాణ జ్యోతిషాం సన్నివేశే ఏక చత్వారింశోధ్యాయః

సమస్తమునకాత్మయగువాడు, అన్ని లోకములకు ప్రభువు, మహాదేవుడు, ప్రజాపతియునగు ఈ సూర్యుడు లోకమునకు మూలకారణమైన గొప్పదైనము. (43)

అట్లే ఇతరులు పండ్రెండుమంది ఆదిత్యులు, అధికారముకల దేవులు ఎవరుకలరో, వారు ఆయాకార్యములను నిర్వహింతురు. ఆ సూర్యుని అంశభూతులు విష్ణుమూర్తులుగా చెప్పబడుచున్నారు. (44)

గంధర్వులు, యక్షులు, నాగులు, కిన్నరులు మొదలగు వారు అందరు సహస్రభుజములు కల ఆభగవంతునకు నమస్కరింతురు. ముని శ్రేష్ఠులు వేదమయుడు, పురాతన బ్రహ్మస్వరూపుడైన యీ సూర్యదేవుని, వివిధములైన యజ్ఞములతో పూజించుచున్నారు.

శ్రీ కూర్మపురాణములో జ్యోతిస్సులసన్నివేశమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters