Sri Koorma Mahapuranam
Chapters
అథద్విచత్వారింశో೭ధ్యాయః సూత ఉవాచ :- స రథో೭ధి ష్ఠితో దేవై రాదిత్యై ర్మునిభి స్తథా | గన్థర్వై రప్సరోభి శ్చ గ్రామణీసర్పరాక్షసైః ||
|| 1 || ధాతా ర్యమా చ మిత్ర శ్చ వరుణః శక్ర ఏవ చ | వివస్వా నథ పూషా చ పర్జన్య శ్చాంశు రేవ చ ||
|| 2 || భగ స్త్వష్టా చ విష్ణుశ్చ ద్వాదశైతే దివాకరాః | ఆప్యాయయతి వై భాను ర్వసన్తాదిషు వై క్రమాత్ ||
|| 3 || పులస్త్యః పులహ శ్చాత్రి ర్వసిష్ఠ శ్చాఙ్గి రా భృగుః | భరద్వాజో గౌతమశ్చ కశ్యపః క్రతు రేవ చ || || 4 || జమదగ్నిః కౌశికశ్చ మునయో బ్రహ్మవాదినః | స్తువన్తి దేవం వివిధై శ్ఛన్దోభి స్తే యథాక్రమమ్ ||
|| 5 || నలుబదిరెండవ అధ్యాయము దేవతలచేత, ఆదిత్యులచేత, మనులచేత, గంధర్వులు, మరియు అప్సరసలచేత శ్రేష్ఠులైన రాక్షసులందరి చేత ఆరథము అధిష్ఠింపబడినది (1) ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, శక్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, అంశువు అనియు, (2) భగుడు, త్వష్ట, విష్ణువు అనియును ద్వాదశాదిత్యుల పేర్లు క్రమముగా తెలియవలెను. సూర్యుడు వసంతాది ఋతువుల యందు వరసగా తన కిరణములచేత లోకములదను సంతోషపరచును. (3) పులస్త్యుడు, పులహుడు, అత్రి, వసిష్ఠుడు, అంగిరసుడు, భృగువు, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు మరియు క్రతువు (4) జమదగ్ని మరియు కౌశికుడు అనుబ్రహ్మవాదులైన మునులు ఆ సూర్యభగవానుని వివిధములైన ఛందోరచనలతో క్రమముగా స్తోత్రము చేయుదురు. (5) రథకృ చ్చ రథౌజాశ్చ రథచిత్రః సుబాహుకః | రథస్వనో೭థ వరుణః సుషేణః సేనజి త్తథా ||
|| 6 || తార్‌క్ష్య శ్చారిష్టనేమి శ్చ కృతజి త్సత్యజి త్తథా | గ్రామణ్యో దేవదేవస్య కుర్వతే೭భీషు సంగ్రహమ్ || || 7 || అథ హేతిః ప్రహేతి శ్చ పౌరుషేయో వధ స్తథా | సర్పో వ్యాఘ్ర స్తథాపశ్చ వాతో విద్యు ద్దివాకరః || || 8 || బ్రహ్మోపేతశ్చ విప్రేన్ద్రా యజ్ఞోపేత స్తథైవ చ | రాక్షసప్రవరా హ్యేతే ప్రయాన్తి పురతః క్రమాత్ || || 9 || వాసుకిః కఙ్కనీలశ్చ తక్షకః సర్పపుఙ్గవః | ఏలాపుత్రః శఙ్ఖపాల స్తథైరావతసంఙ్ఞితః || || 10 || ధనంజయో మహాపద్మ స్తథా కర్కోటకో ద్విజాః | కమ్బలో శ్వతర శ్చైవ వహన్త్యేనం యథాక్రమమ్ || || 11 || రథకృత్తు, రథౌజుడు, సుబాహుకుడు, రథస్వనుడు మరియు వరుణుడు, సుషేణుడు, సేనజిత్తు, (6) మరియు తార్ష్యుడు, అరిష్టనేమి, కృతజిత్తు, సత్యజితుడు అను నీ ముఖ్యులందరు దేవదేవుడైన సూర్యభగవానుని కిరణములను సంగ్రహింతురు. (7) ఇక హేతి, ప్రహేతి, పౌరుషేయుడు, వధుడు మరియు సర్పుడు, వ్యాఘ్రుడు, ఆపుడు, వాతుడు, విద్యుత్తు, దివాకరుడు (8) బ్రహ్మోపేతుడు మరియు యజ్ఞోపేతుడును, ఓ బ్రాహ్మణవరులారా! వీరందరు రాక్షసప్రవరులు క్రమముగా భాస్కరునికి ముందు భాగమున పయనింతురు. (9) వాసుకి, కంకనీలుడు, సర్పశ్రేష్ఠమైన తక్షకుడు, ఏలాపుత్రుడు, శంఖపాలుడు మరియు ఐరావతనామధేయుడు; (10) ధనంజయుడు, మహాపద్ముడు మరియు కర్కోటకుడు, కమ్బలుడు, అశ్వతరుడు అనువీరందరు వరుసగా ఈసూర్యభగవానుని వహింతురు. (11) తుమ్బురు ర్నారదో హాహాహూహూ ర్విశ్వావసు స్తథా | ఉగ్రసేనో೭థ సురుచి రర్వావసు స్తథా పరః || || 12 || చిత్రసేన స్తథోర్ణాయు ర్ధృతరాష్ట్రో ద్విజోత్తమాః | సూర్యవర్చా ద్వాదశైతే గన్ధర్వా గాయనా వరాః || || 13 || గాయన్తి గానై ర్వివిధై ర్భానుం షడ్జాదిభిః క్రమాత్ | ఋతుస్థలా ప్సరోవర్యా తధాన్యా పుఞ్జిక స్థలా || || 14 || మేనకా సహజన్యా చ ప్రవ్లూెచా చ ద్విజోత్తమాః | అనువ్లూెచా చ విశ్వాచీ ఘృతాచీ చోర్వశీ తథా || || 15 || అన్యా చ పూర్వచిత్తిః స్యా ద్రమ్భా చైవ తిలోత్తమా | తాణ్డవై ర్వివిధై రేనం వసన్తాదిషు వై క్రమాత్ || || 16 || తోషయన్తి మహాదేవం భాను మాత్మాన మవ్యయమ్ | ఏవం దేవా వస న్త్యర్కే ద్వౌద్వౌ మాసౌ క్రమేణ తు || || 17 || తుంబురుడు, నారదుడు, హాహాహూహూ, మరియు విశ్వావసువు, ఉగ్రసేనుడు, సురుచి, అర్వావసువు, అపరుడు; (12) చిత్రసేనుడు మరియు ఊర్ణాయువు, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు అను ఈ పండ్రెండు మంది శ్రేష్ఠులైన గాయకులైన గంధర్వులు. (13) వీరు షడ్జము మొదలగు స్వరాలతో, వివిధములైన గానములతో క్రమముగా సూర్యునిగూర్చి పాడుచుందురు. అప్సరసలలో శ్రేష్ఠురాలైన ఋతుస్థల మరియు పుంజిక స్థల అను నామెయు; (14) మేనక, సహజన్య, ప్రవ్లూెచ అనుపేరుగల అప్సరస, అనువ్లూెచ, విశ్వాచి, ఘృతాచి మరియు ఊర్వశియును (15) పూర్వచిత్తియనునామె, రంభ, తిలోత్తమ అనువీరందరు వసంతాది ఋతువులందు క్రమముగా అనేక విధములైన నృత్యములతో సూర్యుని; (16) భగవంతుడైన, ఆత్మస్వరూపుడు, నాశరహితుడైన భాస్కరుని సంతోషింపజేయుదురు. ఇట్లు దేవతలు సూర్యునియందు రెండేసి నెలలు కాలము నివసింతురు. (17) సూర్య మాప్యాయయన్త్యేతే తేజసా తేజసాం నిధిమ్ | గ్రథితై సై#్త్వ ర్వచోభి స్తు స్తువన్తి మునయో రవిమ్ || || 18 || గన్ధర్వాప్సరస శ్చైనం నృత్యగేయై రుపాసతే | గ్రామణీయక్షభూతాని కుర్వతే೭ భీషుసంగ్రహమ్ || || 19 || సర్పా వహన్తి దేవేశం యాతుధానాః ప్రయాన్తి చ | వాలఖిల్యా నయ న్త్యస్తం పరివార్యోదయా ద్రవిమ్ || || 20 || ఏతే తపన్తి వర్షన్తి భాన్తి వాన్తి సృజన్తి తు | భూతానా మశుభం కర్మ వ్యపోహన్తీతి కీర్తితాః || || 21 || ఏతే సహైవ సూర్యేణ భ్రమన్తి దివి భానుగాః | విమానే చ స్థితా నిత్యం కామగే వాతరంహసి || || 22 || వర్షన్త శ్చ తపన్తశ్చ హ్లాదయన్త శ్చ వై క్రమాత్ | గోపాయన్తీహ భూతాని సర్వాణీ హ యుగక్రమాత్ || || 23 || తేజస్సులకుగని యైన సూర్యభగవానుని వీరందరు తమతేజస్సుతో తృప్తినొందింతురు. మునులు తమ ఛందోబద్ధములైన వాక్కులతో సూర్యుని స్తోత్రము చేయుదురు. (18) గంధర్వులు, అప్సరసలు తమ నృత్యములతో, పాటలతో సూర్యుని సేవింతురు. ముఖ్యులైన యక్షులు, భూతగణము కళ్లెపుత్రాడును ధరించుచున్నవి. (19) సర్పములు సూర్యభగవానుని ధరించుచున్నవి. రాక్షసగణములు నడుపుచున్నవి. వాలిఖిల్యులు రవికస్తమయము కల్గించుచున్నారు. వారు ఉదయకాలము నుండి సూర్యుని చుట్టుముట్టి యుందురు. (20) పూర్వము చెప్పబడిన వీరందరు తపింపజేయుదురు, వర్షము కురియింతురు, ప్రకాశింతురు, సంచరింతురు, సృజింతురు. ప్రాణుల యొక్క అశుభకర్మమును నశింపజేయుదురని చెప్పబడినారు. (21) వీరు సూర్యునితో కలిసి అనుచరులుగా ఆకాశమందు సంచరింతురు. వాయుసమానవేగముకల, స్వేచ్ఛాగమనముకల విమానమందు కూర్చుండి ఎల్లప్పుడు చరింతురు. (22) వర్షము కురిపించుచు, వేడిని ప్రసరించుచు, ఆహ్లాదమును కలిగించుచు క్రమముగా వీరు యుగముల యందు ప్రాణులను రక్షించుచుందురు. (23) ఏతేషా మేవ దేవానాం యథా వీర్యం యథా తపః | యథాయోగం యథాసత్త్వం స ఏష తపతి ప్రభుః || || 24 || అహోరాత్రవ్యవస్థాన కారణం స ప్రజాపతిః | పితృదేవమనుష్యాదీ న్స సదా ప్యాయ యద్రవిః || || 25 || తత్ర దేవో మహాదేవో భాస్వా న్సాక్షా న్మహేశ్వరః | భాసతే వేదవిదుషాం నీలగ్రీవః సనాతనః || || 26 || స ఏష దేవో భగవాన్ పరమేష్ఠీ ప్రజాపతిః | స్థానం తద్విదు రాదిత్యే వేదజ్ఞా వేదవిగ్రహాః || || 27 || ఇతి శ్రీ కూర్మపురాణ ద్విచత్వారింశో೭ధ్యాయః పూర్వముచెప్పబడిన యీదేవజాతుల వారియొక్క పరాక్రమము, తపస్సు, యోగబలము, ఆత్మలము అనువాని ఆధారముగా ప్రభువైన సూర్యుడు ప్రకాశించును. (24) పగలు, రాత్రి అనుకాలవ్యవస్థకు ఆప్రజాపతియే కారణభూతుడు. ఆ సూర్యుడు పితరులను, దేవతలను, మనుష్యులు మొద||వారిని ఎల్లప్పుడు ప్రీతిని పొందించును. (25) అక్కడ గొప్పదేవుడైన సూర్యుడు సాక్షాత్తు మహేశ్వరుడు. నల్లని కంఠముకలవాడు, సనాతనుడు అగు ఆ భగవంతుడు వేదవేత్తలగు విద్వాంసులకు సాక్షాత్కరించును. (26) ఆ యీభగవంతుడైన సూర్యదేవుడు, పరమేష్ఠి, ప్రజాపతికూడ. వేదముల నెరిగినవారు, వేద శరీరులగువారు సూర్యుని యందు పరమేష్ఠి, స్థానమును గుర్తింతురు. (27) శ్రీ కూర్మపురాణములో నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.